60 ఏళ్లు పూర్తయిన అసంఘటిత రంగం కార్మికులకు నెలకు 3 వేల రూపాయల పెన్షన్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకుగాను త్వరలోనే @ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మంధన్ పెన్షన్ పథకాన్ని తీసుకురాన్నట్లు తెలిపారు. ఇందుకు గాను నెలకు రూ. 100 జమ చేయాల్సి ఉంటుంది. అసంఘటిత కార్మికుల పెన్షన్ స్కీమ్‌కు గాను రూ. 500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా10 కోట్ల మంది లబ్ధి చేకూరుతుంది. ఈ పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సంర నుంచే అమలు చేయనున్నట్లు తెలిపారు.