infosys co-founder
-
Nandan Nilekani: ఎఎ నెట్‌వర్క్‌తో కోట్ల కొద్దీ ఉద్యోగాలకు ఊతం
న్యూఢిల్లీ: ఆర్థిక వివరాల డేటా షేరింగ్ ప్లాట్‌ఫాం అయిన అకౌంట్ అగ్రిగేటర్ (ఎఎ) నెట్‌వర్క్‌తో వ్యాపారాలను అనుసంధానించడం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు రుణలభ్యత సులభతరమవుతుందని ఐటీ సంస్థ ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తెలిపారు. దీనితో కోట్ల కొద్దీ ఉద్యోగాలకు కూడా ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ’జీఎస్వీ + ఎమెరిటస్ ఇండియా సదస్సు’లో పాల్గొన్న సందర్భంగా నీలేకని ఈ విషయాలు చెప్పారు. వ్యక్తులు .. ఒక ఆర్థిక సంస్థ దగ్గరున్న తమ వివరాలను వేరే సంస్థలతో సురక్షితంగా పంచుకునేందుకు ఎఎ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. ఇది ఆర్బీఐ నియంత్రణలో ఉంటుంది. (ఇదీ చదవండి: లిథియం బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.37,260 కోట్లు కావాలంట!) -
మన ఐటీ కంపెనీలను చూసి నేర్చుకోండి
న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలను చూసి దేశంలోని ఇతర కంపెనీలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్ సూచించారు. మన ఐటీ కంపెనీలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారాయన. దేశంలోని పలు కంపెనీలు రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, ఐటీ కంపెనీలు మాత్రం ఎలాంటి రుణభారం లేకుండా ఉన్నాయని తెలిపారు. కంపెనీలన్నీ పరిశోధన, అభివృద్ధిలపై అధికంగా పెట్టుబడులు పెట్టాలన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత కంపెనీలు విదేశీ స్టాక్ మార్కెట్లలో కూడా లిస్ట్ కావాలని ఆయన సూచించారు. ‘‘చాలా దేశీయ కంపెనీలకు పోటీ అంటే భయం’’ అన్నారాయన. కంపెనీలు కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరచుకోవాలని, అంతర్జాతీయంగా పోటీపడాలని సూచించారు. 1980లో 16,000 కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 2.8 లక్షల కోట్ల డాలర్లకు ఎగసిందని క్రిస్ తెలిపారు. 2025 కల్లా 5 లక్షల కోట్లడాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. 2025 లేదా 2030 నాటికి ఈలక్ష్యాన్ని సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. -
ఇపుడున్న ఉద్యోగాలు భవిష్యత్తులో ఉండవట..!
హైదరాబాద్: ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని యువకులకు షాకిచ్చే సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఉనికిలో ఉన్న ఉద్యోగాలు చాలా వరకు భవిష్యత్తులో ఉండకపోవచ్చని చెప్పారు. దీనికి పరిష్కారంగా ఏదో ఒకటి చేయాలని, విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. నిరుద్యోగుల్లో నైపుణ్యాల శిక్షణలోనూ, విద్యావ్యవస్థలో పూర్తి మరమ్మతుల అంశాల సమగ్ర పరిశీలనపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు. ఎడ్యుకేషన్ సిస్టంలో వినూత్నమైన మార్పులతోపాటు, సృజనాత్మకత ఆధారిత నైపుణ్యాలను పెంచుకోవాలని సోమవారం పీటీఐకి చెప్పారు. ఈ తరహా నైపుణ్యాల పెంపు ద్వారా భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఇండియా (యుఐడిఎఐ) మాజీ చైర్మన్ నీలేకని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలు జీవితాంతం నేర్చుకునే పనిలో ఉంటూనే, కొత్త కొత్త నైపుణ్యాలు, ఆలోచనలను పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు విద్యావ్యవస్థలో మార్పులు రావాలని కోరారు. ఈ విషయంలో ఒక పెద్ద మార్పు అవసరం ఉందని నీలేకని వ్యాఖ్యానించారు. ఆటోమేషన్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంజిలిజెన్స్ , బాట్స్ లాంటివి సాఫ్ట్ వేర్, బీపీఓ రంగంలో దూసుకొస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో మరిన్ని కొత్త ఉద్యోగావకాశాలు రాబోతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు పొందడం గతంలో ఉన్నంత తేలిక కాదన్నారు. ఆ వైపుగా దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. భారతదేశం యొక్క 7-8 శాతంగా జీడీపి వృద్ధి రేటు నిరుద్యోగానికి కారణమా అన్న ప్రశ్నకు దేశీయ సేవలపై దృష్టిపెట్టాలని నీలేకని చెప్పారు.