inherited wealth
-
వారసత్వంగా వచ్చిన మ్యూచువల్ ఫండ్స్‌పై పన్ను కట్టాల్సిందేనా?
నాకు వారసత్వంగా వచ్చిన ఫండ్స్ ప్రస్తుత విలువ రూ.10 లక్షలు. కానీ, వాటిని కొనుగోలు చేసిన సమయంలో చేసిన పెట్టుబడి రూ.5 లక్షలే. నేను విక్రయించే సమయంలో రూ.15 లక్షలు ఉంటే అప్పుడు మూలధన లాభాల పన్నును ఎలా లెక్కిస్తారు? వాస్తవంగా కొనుగోలు చేసిన ధర నుంచి చూసి పన్ను చెల్లించాలా..? లేక నాకు బదిలీ అయిన నాటి విలువనే పరిగణనలోకి తీసుకుంటారా? – తరుణ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారు మరణిస్తే ఆ యూనిట్లను నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు బదిలీ చేస్తారు. ఇలా ఒకసారి బదిలీ చేసిన తర్వాత పన్ను అంశంపై సందేహం ఏర్పడడం సహజమే. అదృష్టవశాత్తూ మనదేశంలో వారసత్వ పన్ను లేదు. మీ తల్లిదండ్రులు లేదా మరొకరి నుంచి మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు మీకు బదిలీ అయితే పన్ను చెల్లించక్కర్లేదు. కాకపోతే ఆ యూనిట్లను విక్రయించినప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించినప్పుడు ఉండే బాధ్యతలే మీకు వర్తిస్తాయి. మూలధన లాభాల పన్ను విషయానికొస్తే ఆ పెట్టుబడిని ఎంత కాలం కొనసాగించారు (అసలు కొనుగోలు నాటి నుంచి) అనే దాని ఆధారంగా నిర్ణయానికి రావాలి. ఇక్కడ అసలు మొదట కొనుగోలు చేసిన తేదీనే పన్ను కోసం పరిగణనలోకి తీసుకుంటారు. మీకు బదిలీ అయిన తేదీ లెక్కలోకి రాదు. ఉదాహరణకు రవి తండ్రి రూ.5 లక్షలను ఓ పథకంలో 2019లో ఇన్వెస్ట్ చేశాడని అనుకుందాం. అప్పుడు అతని తండ్రి యూనిట్దారు అయితే, రవి నామినీ అవుతారు. దురదృష్టవశాత్తూ రవి తండ్రి గతేడాది మరణించారు. ఆయన పేరిట ఉన్న యూనిట్లు రవికి బదిలీ అయ్యాయి. బదిలీ అయ్యే నాటికి ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ.7 లక్షలుగా ఉంది. ఇప్పుడు వాటి విలువ రూ.7.80 లక్షలు ఉంది. రవి ఆ పెట్టుబడులను విక్రయించాలని అనుకుంటున్నాడు. ఇక్కడ పెట్టుబడులను 2019 నుంచి కొనసాగించినట్టు చూస్తారు. ఈక్విటీ పథకంలో పెట్టుబడులు కనుక హోల్డింగ్ పీరియడ్ ఏడాదికిపైనే ఉంది. లాభం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. మొదటి రూ.లక్ష లాభాన్ని మినహాయించి మిగిలిన లాభంపై 10 శాతాన్ని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విక్రయించే నాటి విలువ రూ.7.80 లక్షల్లో పెట్టుబడి రూ.5 లక్షలు మినహాయిస్తే అప్పుడు లాభం రూ.2.80 లక్షలు అవుతుంది. రూ.లక్ష లాభం మినహాయిస్తే, మిగిలిన రూ.1.80 లక్షల లాభంపై 10 శాతం పన్ను చొప్పున రూ.18,000 చెల్లించాలి. ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) వల్ల లాభాలేంటి? – రవీంద్రనాథ్ గణేశ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే సమీకరించిన పెట్టుబడులను తీసుకెళ్లి మరో మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసేది. వాటి పెట్టుబడుల విధానానికి అనుగుణంగా డెట్ లేదా ఈక్విటీల్లో ఒకటి లేదా ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా ఎఫ్‌వోఎఫ్‌లను ఆయా ఫండ్స్ హౌస్‌లు వాటికి సంబంధించిన ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రారంభిస్తుంటాయి. ఎఫ్‌వోఎఫ్‌లు ఇతర మ్యూచువల్ ఫండ్స్ పథకాల మాదిరే పనిచేస్తాయి. వీటిల్లోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. విదేశీ సూచీలు, విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్‌వోఎఫ్‌లు కూడా ఉన్నాయి. ఇతర పథకాల మాదిరే ఎఫ్వోఎఫ్ల్లోనూ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎఫ్‌వోఎఫ్‌లు వేరే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక రెండంచెల్లో ఎక్స్పెన్స్ రేషియో భారాన్ని మోయాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఎఫ్‌వోఎఫ్‌లో 1 శాతం ఎక్స్పెన్స్ రేషియో ఉందనుకుంటే, అది ఇన్వెస్ట్ చేసే పథకం ఎక్స్పెన్స్ రేషియో 0.50 శాతం ఉంటే మొత్తం 1.5 శాతం ఎక్స్పెన్స్ రేషియో భరించాలని అర్థం చేసుకోవాలి. ఎఫ్‌వోఎఫ్ ఇన్వెస్ట్ చేసే పథకంలో నేరుగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశం లేనప్పుడు వీటిని పరిశీలించొచ్చు. ఎఫ్‌వోఎఫ్‌లు నాన్ ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. కనుక డెట్ పథకాలకు మాదిరే మూలధన లాభాలపై పన్ను అమలవుతుంది. ఒకవేళ ఎఫ్‌వోఎఫ్ దేశీయ ఈక్విటీ పథకాల్లోనే 90 శాతానికిపైగా పెట్టుబడి పెడితే ఈక్విటీకి మాదిరే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. -
ఎంత అదృష్టవంతులో.. రూ.55 కోట్లు కలిసొచ్చింది
బెర్లిన్: లాటరీ తగిలి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వారి గురించి విన్నాం.. విలువైన వజ్రాలు, సంపద దొరికి ధనవంతులు అయిన వారిని చూశాం. కానీ వారసులు లేకుండా మరణించడంతో ఆ సంపద మొత్తం ఇరుగుపొరుగు వారికి కలిసివచ్చి కోటీశ్వరులు అయిన వారి గురించి ఎప్పుడైనా విన్నారా లేదు కదా. కానీ ఈ సంఘటన వాస్తవంగా చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మధ్య జర్మనీకి చెందిన రెడెట్ వెడెల్ తన భర్త ఆల్ఫ్రెడ్ వెడెల్తో కలిసి 1975 నుంచి హెస్సీ ప్రాంతంలో నివసిస్తుంది. ఈ క్రమంలో 2014లో ఆల్ఫ్రేడ్ మరణించాడు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్లో రెడెట్ కూడా మరణించింది. ఈ దంపతుల పేరు మీద భారీగా బ్యాంక్ బాలెన్స్, విలువైన షేర్లు, వస్తువులు ఉన్నాయి. అయితే వీటన్నింటికి వారసురాలిగా రెడెట్ తన చెల్లిని నియమించింది. కానీ దురదృష్టం కొద్ది ఆమె కూడా మరణించింది. (చదవండి: ఉద్యోగులకు బంపర్ బోనస్.. అయితే..) దాంతో రెడెట్ ఆస్తికి వారసులు ఎవరూ లేకుండా పోయారు. ఇదే కాక వైపర్ఫెల్డెన్లో రెడెట్కి చెందిన ఓ ఇంటిని స్థానిక మున్సిపాలిటీ వారసత్వంగా పొందింది. కానీ ఆ బిల్డింగ్, దాని చుట్టు పరిసరాలను నిర్వహించడం కష్టంగా మారడంతో మున్సిపాలిటీ తన వారసత్వాన్ని వదిలేసుకుంది. ఈ క్రమంలో మొత్తం 7.5 మిలియన్ అమెరికన్ డాలర్ల సంపదకు(55,34,89,125 రూపాయలు) వారసులు ఎవరు లేకుండా పోయారు. దాంతో స్థానిక మున్సిపాలిటీ ఆ సంపదను ఇరుగుపొరుగు వారికి వారసత్వంగా ఇచ్చింది. ప్రస్తుతం దీన్ని వారు "కమ్యూనిటీ సౌకర్యాలు, మౌలిక సదుపాయాల" అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. -
ప్రత్యేకత ఉంటేనే వారసత్వ సంపద!
ఏది పడితే అది వారసత్వ సంపద కాదు: సీఎం కేసీఆర్ ► చారిత్రక ప్రాధాన్యం ఉండాలి ► వారసత్వ సంపద గుర్తింపు కోసం కమిటీ ► సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు.. ప్రతిపక్ష నేతకూ చోటు ► రాష్ట్రవ్యాప్తంగా కోటలు, ప్రాధాన్యమున్న గడీలను గుర్తిస్తాం ► ప్రాధాన్యమున్న వాటిని సంరక్షిస్తాం.. పనికిరాని వాటిని తొలగిస్తాం ► ప్రైవేటు కట్టడాలను హెరిటేజ్ జాబితాలో ఉంచబోం ► వాటిపై హక్కులను సంబంధీకులకే వదిలేస్తామని వెల్లడి ► తెలంగాణ వారసత్వ కట్టడాల బిల్లుకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: చారిత్రక ప్రాధాన్యత, ప్రత్యేకతలున్న వాటినే ఇక నుంచి వారసత్వ సంపదగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. దేనిని పడితే దానిని వారసత్వ సంపదగా పేర్కొనే విధానానికి స్వస్తి పలుకుతామని చెప్పారు. ఆదివారం శాసనసభలో ‘తెలంగాణ ప్రత్యక్ష, పరోక్ష వారసత్వ సంపద సంరక్షణ, పరిరక్షణ, పునరుద్ధరణ, నిర్వహణ బిల్లు’ను ప్రవేశపెట్టిన కేసీఆర్.. దాని ఉద్దేశాలను వివరించారు. ‘‘వారసత్వ సంపద అంటే అర్థం పర్థం ఉండాలె. గతంలో ఇష్టం వచ్చినట్టు చేశారు. వాటివల్ల ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు చెప్పిందన్న పేరుతో గతంలో కేంద్రం కొన్ని ఆదేశాలిస్తే... రాష్ట్రాలు కనిపించిన ఖాళీ భూములన్నింటినీ అటవీ భూములుగా మార్చాయి. ఇప్పుడు గజం స్థలం సేకరించాలంటే.. గ్రీన్ ట్రిబ్యునల్ అని, ఆ ట్రిబ్యునల్ అని, ఈ ట్రిబ్యునల్ అని తిరగాల్సి వస్తోంది. ఈ పద్ధతి మంచిది కాదు.. అందుకే ప్రత్యేక ప్రాధాన్యమున్న వాటినే వారసత్వ జాబితాలో చేరుస్తాం..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. అధ్యయనం చేసి నిర్ణయిస్తాం.. మనకంటూ ఉన్న చరిత్ర, ఇతర ప్రాధాన్యానికి గుర్తుగా ఉన్న కట్టడాలు, స్థలాలు, కళలను పరిరక్షించాలని.. అదే సమయంలో భావి అవసరాలకు తగ్గట్టు జరిగే అభివృద్ధికి నిరోధకంగా మారే విధానాలను మార్చుకోవాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన వారసత్వ చట్టంలో అనేక లొసుగులున్నాయన్నారు. హైదరాబాద్ పరిధిలో ఎన్నో చారిత్రక అవశేషాలు ఉన్నాయని, వాటిని విస్మరించారని చెప్పారు. మరోవైపు కొన్ని ప్రైవేటు భవనాలను వారసత్వ సంపద కిందకు తీసుకొచ్చారని.. గ్రీన్‌ల్యాండ్ గెస్ట్‌హౌస్‌ను కూడా అందులో చేర్చడమేమిటని పేర్కొన్నారు. వారసత్వ సంపద అంటే హైదరాబాద్‌కే పరిమితం కాకూడదని.. రాష్ట్రవ్యాప్తంగా కోటలు, చారిత్రక కట్టడాల వంటివాటిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు సీఎస్ నేతృత్వంలో కమిటీ వేశామని కేసీఆర్ వెల్లడించారు. ఆ కమిటీలో ప్రతిపక్ష నేతకు కూడా చోటు కల్పించనున్నట్టు తెలిపారు. గందరగోళం తప్పేలా ఉండాలి పురావస్తు శాఖ పరిధిలో ఉన్న జోగు ళాంబ దేవాలయంలో కొత్తగా ఎక్కడైనా దీపం పెడదామంటే పంచాయితీ ఉందని.. ఢిల్లీలో ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురేసినట్టు మన గోల్కొండ కోటలో ఎగరే యాలంటే ప్రతిసారి కేంద్ర పురావస్తు శాఖ అనుమతి పొందాలని.. ఈ గందరగోళ మంతా ఎందుకని కేసీఆర్ పేర్కొన్నారు. సచివాలయంలో సమాధిలాగా మారిన పురా తన జీబ్లాక్ భవనాన్ని కూల్చి వేద్దామంటే దిక్కుమాలిన హెరిటేజ్ నిబంధన అడ్డం వస్తోందన్నారు. కోటలు, ప్రముఖ గడీలతో పాటు ముఖ్యమైన చారిత్రక కట్టడాలను సంరక్షించి, పునరుద్ధరించుకోవాల్సిన అవస రముందని.. పనికిరాని కట్టడాలను తొలగిం చాల్సిందేనని పేర్కొన్నారు. ‘‘బ్రెజిల్‌లోని ప్రముఖ నగరం రియో కు మేయర్‌గా వచ్చిన ఓ వ్యక్తి.. పట్టణ ప్రాంతాల భూవినియోగ ప్రాధాన్యాన్ని గుర్తించి తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఇప్పుడా నగరం ప్రపంచంలోనే ముఖ్యమైన హరిత నగరాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. జనం పెరుగుతున్న తరు ణంలో వారి అవసరాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది’’ అని చెప్పారు. కబ్జాలు, ఆక్రమణలు నిరోధించండి చారిత్రక ప్రాంతాల్లో కబ్జాలను నిరోధించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ఆక్రమణలు లేకుండా చూడాలన్నారు. తాను చిన్నప్పటి నుంచి చూస్తున్న బంజారాహిల్స్ రోడ్డు నం.14లోని ఓ హెరిటేజ్ ప్యాలెస్ ఉన్నట్టుండి కనుమరుగైందని, దానికి కారణమేమిటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఆ ప్యాలెస్ హెరిటేజ్ జాబితాలో లేదని సమాధానమిచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన కట్టడాలను వారసత్వ సంపద జాబితాలో ఉంచబోమని.. వాటిపై హక్కు వారికే వదిలేస్తామని, వాటి నిర్వహణను ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని చెప్పారు. అనంతరం బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. -
చేర్యాల మఖ్మల్ కోర్ చున్నీపై ఏఎస్పీ విచారణ
చేర్యాల: మండల కేంద్రంలో మొగల్ కాలంలోని సంపద తల్లిదండ్రులు వారసత్వంగా ఫాతిమున్నీసాబేగంకు ఇచ్చిన సుమారు 40 వేల వజ్రాలతో ఉన్న మఖ్‌మల్‌కోర్ చున్నీ వ్యవహారం గత ఏడాది వెలుగు చూసిన విషయం తెలిసిందే. చేర్యాలకు చెందిన ఫాతిమున్నీసాబేగంకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె ఇటీవల వారసత్వ సంపదలో తనకు భాగం ఉంటుందని పోలీసులను ఆశ్రరుుంచడంతో ఆదివారం రాత్రి వరంగల్ ఏఎస్పీ జాన్‌వెస్లి చేర్యాలలో విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. పలు విషయూలపై ఆరాతీశారు.