Inkudu pit
-
ఇంటికో ఇంకుడు గుంత ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మహానగరం మరో మహోద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. కాంక్రీట్ మహారణ్యంలా మారిన రాజధాని గ్రేటర్హైదరాబాద్ నగరంలో వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలను ఉద్యమస్ఫూర్తితో ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ నెలలోనే ప్రతి ఇళ్లు, అపార్ట్మెంట్, కార్యాలయం, పరిశ్రమ, ఆవరణలో వీటిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇళ్లలో రీఛార్జింగ్ పిట్స్ (ఇంకుడు గుంత) ఇలా ఉండాలి.. మధ్యతరగతి వినియోగదారులు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీస్థలంలో ఇళ్లు ఉన్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో పిట్ను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి.1.5 మీటర్ల లోతున (డెప్త్) గుంత తీసి ఇందులో 50 శాతం మేర 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం మేర 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం బఠానీగింజ పరిమాణంలో ఉండే ఇసుకను నింపాలి.మరో పదిశాతం ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ పిట్పై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటుచేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీఛార్జీ సులువవుతుంది. మీ బోరుబావి పది కాలాలపాటు ఎండిపోకుండా ఉంటుందని భూగర్భ జలశాఖ నిపుణుడు సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి ఇళ్లు, కార్యాలయంలో విస్తీర్ణాన్ని బట్టి పిట్ సైజు పెరుగుతుందని తెలిపారు. చతుర్విధ జలప్రక్రియతో 80 శాతం వర్షపు నీటిని ఒడిసిపట్టండిలా.. 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటికి బోరుబావికి ఆనుకొని రెండు మీటర్ల వెడెల్పు,రెండు మీటర్ల పొడవు,రెండు మీటర్ల లోతున ఇంకుడు గుంత తవ్వాలి. గుంత పూడుకుపోకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండ రాళ్లు లేదా,ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలిని ఏర్పాటు చేయాలి. జాలికి ఉన్న పెద్ద రంధ్రాల గుండా వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి. ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు. సీజన్లో నిల్వ చేసిన ఈనీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి. లోతట్టుప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే వాటికి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీఛార్జీ అవుతాయి. (క్లిక్: 1996 నాటి ఘటన.. కలెక్టర్ నిర్బంధం ఉదంతం.. సందర్శకుల్లా వచ్చి) -
ఇంకుడు గుంతలో పడి చిన్నారి మృతి
కుల్కచర్ల : రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం బండవెలితిచర్లలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ ఇంకుడు గుంతలో పడి భీముడు(3) అనే చిన్నారి మృతి చెందాడు. తోటిపిల్లలతో ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ఇంకుడు కొంతే
{పచారం కొండంత... చేసింది గోరంత లక్ష ఇంకుడు గుంతల లక్ష్యం తవ్వింది 17,820 గుంతలే వాననీటిని ఒడిసిపట్టే ఉద్దేశంతో ప్రారంభించిన ఇంకుడుగుంతల తవ్వకం జిల్లాలో లక్ష్యాన్ని చేరుకోలేదు. కేవలం ప్రచారార్భాటానికే పరిమితమైన ఈ పథకం కేంద్రం సొమ్ముతో రాష్ట్రం పబ్లిసిటీ సోకుకు ఉపకరించింది. జిల్లాలో లక్ష గుంతలు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం రూ. 124.76 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక్క పైసా కూడా విదల్చకుండా అన్నింటికి ఒకటేమందు అన్నట్లుగా కల్పతరువులా మారిన ఉపాధి హామీ సొమ్మును ఇందుకు వినియోగించారు. సాక్షి, విశాఖపట్నం: ‘ఇంకుడు గుంతలు తవ్వండి..వర్షపు నీటిని ఒడిసిపట్టండి.. భూగర్భ జలాలను పరిరక్షించండి..’ ఇది రాష్ర్ట ప్రభుత్వం పిలుపు. ఈ కార్యక్రమం కోసం చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. ఊరూ..వాడా ఊదరగొట్టేలా ప్రచారం చేశారు. గునపం పట్టుకుని, నెత్తినతట్ట పెట్టుకుని ఫొటో దిగడం..పత్రికల్లో గొప్పగా ఏదో సాధించామంటూ ప్రచారం చేసుకోవడం వేసవిలో ఎక్కడ చూసినా ఇదే దృశ్యాలు. ఏ పేపర్ తిరగేసినా ఇవే ‘సిత్రాలు’. సొమ్మొకడిది..సోకు మరొకరిది అన్నట్టుగా సొమ్ము కేంద్రానిది సోకు రాష్ర్ట ప్రభుత్వానిది అన్నట్లుగా సాగింది. ఆచరణలోకి వచ్చి చూస్తే మాత్రం ప్రచారం కొండంత..సాధించింది గోరంత అన్నట్టుగా ఉంది ఇంకుడుగుంతల పథకం. గడిచిన వేసవి సీజన్లో జిల్లాలో ఈ గుంతల ఉద్యమం జోరుగా సాగింది. ఒక్క మన జిల్లాలోనే లక్ష గుంతలు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం రూ. 124.76 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక్క పైసా కూడా విదల్చకుండా అన్నింటికి ఒకటేమందు అన్నట్లుగా కల్పతరువులా మారిన ఉపాధి హామీ సొమ్మును ఇందుకు వినియోగించాలని నిర్ణయించారు. ఏప్రిల్లో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మే నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. జూన్లో పడే తొలకరి వర్షాలను వడిసిపట్టాలని..తద్వారా భూగర్భ జలాలను పెంపొందించాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. కానీ సాధించింది మాత్రం అంతంతమాత్రమే.