innings victory
-
ధూమ్ ధామ్
హిమాలయాల చెంత భారత టెస్టు క్రికెట్ ప్రదర్శన మరింత ఉన్నతంగా శిఖరానికి చేరింది...ధర్మశాలలో అంచనాలకు అనుగుణంగా చెలరేగిన మన జట్టు ప్రత్యర్థిని చావుదెబ్బ కొట్టి టెస్టు సిరీస్‌ను 4–1తో సగర్వంగా గెలుచుకుంది... 259 పరుగుల ఆధిక్యం అంటేనే టీమిండియా గెలుపు లాంఛనం అనిపించింది... కానీ ఇంగ్లండ్ కనీస స్థాయి పోరాటపటిమ కూడా ప్రదర్శించలేక చేతులెత్తేసింది. బజ్‌బాల్ ముసుగులో అసలు టెస్టును ఎలా ఆడాలో మరచిపోయిన ఆ జట్టు ఆటగాళ్లు గుడ్డిగా బ్యాట్లు ఊపి పేలవ షాట్లతో వేగంగా తమ ఓటమిని ఆహ్వానించారు. తన వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో అశ్విన్ ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకోగా...విజయంతో తమ వంతు పాత్ర పోషించిన కుర్రాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. ఓటమితో మొదలైన ఈ ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌కు ఇన్నింగ్స్ విజయంతో భారత్ ఘనమైన ముగింపునిచ్చింది. ధర్మశాల: సొంతగడ్డపై టెస్టుల్లో భారత జట్టు తమ స్థాయి ఏమిటో మరోసారి చూపించింది. మూడో రోజే ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు వెనుకబడి శనివారం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. జో రూట్ (128 బంతుల్లో 84; 12 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, అశ్విన్ (5/77) ఐదు వికెట్లు పడగొట్టాడు. 7 వికెట్లతో పాటు కీలక పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్ తర్వాతి నాలుగు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. 2 డబుల్ సెంచరీలు సహా మొత్తం 712 పరుగులు సాధించిన యశస్వి జైస్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. రూట్ మినహా... వెన్నునొప్పితో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో కెపె్టన్ రోహిత్ మైదానంలోకి దిగలేదు. దాంతో బాధ్యతలు తీసుకున్న బుమ్రా ఆలస్యం చేయకుండా రెండో ఓవర్లోనే అశ్విన్ కు బౌలింగ్ బాధ్యత అప్పగించాడు. అంతే...ఐదో బంతికి డకెట్ (2) అవుట్‌తో మొదలైన ఇంగ్లండ్ పతనం వేగంగా సాగింది. కొద్ది సేపటికి క్రాలీ (0) కూడా వెనుదిరగ్గా, ఒలీ పోప్ (19) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో జానీ బెయిర్‌స్టో (31 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), రూట్ మాత్రమే 56 పరుగుల భాగస్వామ్యంతో కొద్దిసేపు ప్రతిఘటించారు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లోనే మూడు సిక్సర్లతో బెయిర్‌స్టో దూకుడు ప్రదర్శించాడు. అయితే కుల్దీప్ తన తొలి ఓవర్లోనే బెయిర్‌స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, స్టోక్స్ (2) పేలవ ఫామ్ కొనసాగింది. లంచ్ వరకే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. విరామం తర్వాత ఫోక్స్ (8)ను పడగొట్టి అశ్విన్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లతో దెబ్బ కొట్టగా...తర్వాతి వికెట్ జడేజా ఖాతాలో చేరింది. మరో ఎండ్‌లో పోరాడుతున్న రూట్ ఇక లాభం లేదనుకొని ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కుల్దీప్ బౌలింగ్‌లో కొట్టిన షాట్‌కు లాంగాన్ వద్ద బుమ్రా క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది. టెస్టు క్రికెట్‌కు ప్రోత్సాహకాలు... యువ ఆటగాళ్లు టెస్టు ఫార్మాట్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు బీసీసీఐ కొత్త తరహా ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. టెస్టులు రెగ్యులర్‌గా ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుతో పాటు ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్’ పేరుతో భారీ మొత్తం అందించనుంది. 2022–23 సీజన్‌నుంచే దీనిని వర్తింపజేస్తారు. దీని ప్రకారం ఏడాదిలో భారత జట్టు ఆడే టెస్టుల్లో కనీసం సగానికి పైగా టెస్టులు ఆడితే రూ. 30 లక్షలు అందిస్తారు. 75 శాతం పైగా మ్యాచ్‌లు ఆడితే ఈ మొత్తం రూ.45 లక్షలు అవుతుంది. తుది జట్టులో లేని ప్లేయర్‌కు ఇందులో సగం లభిస్తుంది. ఉదాహరణకు భారత జట్టు ఏడాదిలో 10 టెస్టులో ఆడితే ఒక ఆటగాడు అన్ని మ్యాచ్‌లలోనూ బరిలోకి దిగితే అతనికి రూ.4.50 కోట్లు లభిస్తాయి. ఒక్కో మ్యాచ్ ఫీజు రూ.15 లక్షల ద్వారా వచ్చే రూ.1.50 కోట్లకు ఇది అదనం. సగంకంటే తక్కువ టెస్టులు ఆడితే ఇది వర్తించదు. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 218; భారత్ తొలి ఇన్నింగ్స్ 477; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (సి) సర్ఫరాజ్ (బి) అశ్విన్ 0; డకెట్ (బి) అశ్విన్ 2; పోప్ (సి) యశస్వి (బి) అశ్విన్ 19; రూట్ (సి) బుమ్రా (బి) కుల్దీప్ 84; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) కుల్దీప్ 39; స్టోక్స్ (బి) అశ్విన్ 2; ఫోక్స్ (బి) అశ్విన్ 8; హార్ట్లీ (ఎల్బీ) (బి) బుమ్రా 20; వుడ్ (ఎల్బీ) (బి) బుమ్రా 0; బషీర్ (బి) జడేజా 13; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (48.1 ఓవర్లలో ఆలౌట్) 195. వికెట్ల పతనం: 1–2, 2–21, 3–36, 4–92, 5–103, 6–113, 7–141, 8–141, 9–189, 10–195. బౌలింగ్: బుమ్రా 10–2–38–2, అశ్విన్ 14–0–77–5, జడేజా 9–1–25–1, కుల్దీప్ 14.1–0–40–2, సిరాజ్ 1–0–8–0. జిమ్మీ@ 700 ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 700 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా, తొలి పేసర్‌గా ఘనతకెక్కాడు. శనివారం కుల్దీప్ను అవుట్ చేయడంతో ఈ వికెట్ అతని ఖాతాలో చేరింది. అత్యధిక వికెట్ల జాబితాలో స్పిన్నర్లు మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) మాత్రమే అతనికంటే ముందున్నారు. 41 ఏళ్ల 7 నెలల వయసులో తన 187వ టెస్టులో అతను ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. మే 2003లో జింబాబ్వేపై అండర్సన్ తన తొలి టెస్టు ఆడాడు. 178 = 178 భారత జట్టు టెస్టు చరిత్రలో తొలి సారి విజయాలు, పరాజయాల సంఖ్య సమానంగా వచ్చింది. ఇప్పటివరకు మన విజయాలకంటే ఓటములే ఎక్కువగా ఉన్నాయి. భారత్ మొత్తం 579 టెస్టులు ఆడగా 222 మ్యాచ్‌లు ‘డ్రా’ గా ముగిసి మరో టెస్టు ‘టై’ అయింది. 36 అశ్విన్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 36వ సారి. రిచర్డ్ హ్యాడ్లీ (36)ని సమం చేశాడు. ‘ఒక టెస్టు గెలవాలంటే అన్నీ సరిగ్గా కుదరాలి. ఈ సారి మేం అలాగే చేయగలిగాం. కొందరు ఆటగాళ్లు ఏదో ఒక దశలో సిరీస్‌లో అందుబాటులో ఉండరని తెలుసు. టెస్టులు ఎక్కువగా ఆడకపోయినా ఈ కుర్రాళ్లందరికీ మంచి అనుభవం ఉంది. మ్యాచ్‌కు అనుగుణంగా వారిని వాడుకున్నాం. ఒత్తిడి ఎదురైనప్పుడు అంతా సరిగా స్పందించారు. ఇది సమష్టి విజయం. పరుగులు చేయడం గురించే చర్చిస్తాం కానీ టెస్టు గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. మా బౌలర్లు దానిని చేసి చూపించారు. కుల్దీప్, యశస్వి గొప్పగా ఆడారు’ –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ -
మూడు రోజుల్లోనే ముగించారు.. విండీస్‌పై ఇన్నింగ్స్ విజయం
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. అశ్విన్ స్పిన్ మాయాజాలానికి అసలు ఏ మాత్రం పోరాడకుండానే చేతులెత్తేసిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ గెలుపును అందుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించడం విశేషం. ఇక రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.అరంగేట్రంలోనే సెంచరీతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండో టెస్టు జూలై 20న మొదలు కానుంది. ఓవర్‌నైట్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులతో మూడోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు జైశ్వాల్, కోహ్లి మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 110 పరుగులు జోడించిన అనంతరం జైశ్వాల్ 171 పరుగుల వద్ద అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో వెనుదిరిగడంతో మారథాన్ ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడింది. ఈ దశలో కోహ్లి ఆటలో వేగం పెంచాడు. అయితే అజింక్యా రహానే మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం జడేజాతో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 182 బంతుల్లో 76 పరుగులు చేసిన కోహ్లి కార్న్‌వాల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో 421 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. 271 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో మెరిసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లతో విండీస్‌ను చావుదెబ్బ కొట్టాడు. అతనికి తోడు జడేజా కూడా రెండు వికెట్లు తీయడంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అశ్విన్ ఏడు వికెట్లు తీయగా.. జడేజా రెండు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ► ఉపఖండం అవతల టీమిండియాకు టెస్టుల్లో ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం. విండీస్‌పై టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇంతకముందు 1978లో ఆస్ట్రేలియాపై సిడ్నీ వేదికగా ఇన్నింగ్స్ రెండు పరుగుల తేడాతో, 2002లో హెడ్డింగ్లే వేదికగా ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో, 2005లో బులవాయో వేదికగా జింబాబ్వేపై ఇన్నింగ్స్ 90 పరుగుల తేడాతో, 2016లో నార్త్‌సౌండ్ వేదికగా వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ► వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది 23వ విజయం. టీమిండియాకు టెస్టుల్లో అత్యధిక విజయాలు ఆస్ట్రేలియాపై 32 ఉన్నాయి. తర్వాతి స్థానంలో ఇంగ్లండ్‌పై(31 విజయాలు), వెస్టిండీస్‌పై 23 విజయాలు, న్యూజిలాండ్‌పై 22 విజయాలు, శ్రీలంకపై 22 విజయాలు ఉన్నాయి WHAT. A. WIN! 🙌 🙌 A cracking performance from #TeamIndia to win the first #WIvIND Test in Dominica 👏 👏 Scorecard ▶️ https://t.co/FWI05P4Bnd pic.twitter.com/lqXi8UyKf1 — BCCI (@BCCI) July 14, 2023 How good were these two in Dominica! 👏 👏#TeamIndia | #WIvIND pic.twitter.com/4D5LYcCmxB — BCCI (@BCCI) July 15, 2023 చదవండి: Yashasvi Jaiswal: అయ్యో యశస్వి! ఆ పేసర్ వదల్లేదు.. ఓపికగా ఎదురుచూసి! కోహ్లి ఫిఫ్టీతో.. -
175 కు నమో నమః
ఆ జ్ఞాపకాలన్నీ.... మిమ్మల్ని క్రికెట్ వీరాభిమానిగా మార్చిన ఒక్క మ్యాచ్‌కానీ ఇన్నింగ్స్‌కానీ గుర్తుందా...? మీరు గ్రాండ్‌స్లామ్‌కు సలామ్ కొట్టేందుకు కారణమైన సమరాలు గుర్తున్నాయా...? ఒలింపిక్ క్రీడలు, భారత విజయాలు, ఘనతలు ఏవైనా సరే మనం ఫ్యాన్లుగా భావోద్వేగాలు ప్రదర్శించిన క్షణాలు మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటే ఆ అనుభూతే వేరు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబసభ్యులంతా పాత ఆల్బమ్‌లు తిరగేస్తున్న వేళ... ఆపాత క్రీడా ఘట్టాలను రోజూ మీ ముందు ఉంచే ప్రయత్నమిది. దాదాపు 37 సంవత్సరాల సమయం ఆ ఇన్నింగ్స్ గొప్పతనాన్ని, అది చూపిన ప్రభావాన్ని ఏమాత్రం తగ్గించలేదు. వన్డే క్రికెట్లో వేయికి పైగా శతకాలు నమోదైనా అత్యుత్తమ ప్రదర్శనల్లో ఈ సెంచరీకి ఉండే ప్రత్యేకతే వేరు. ఇంకా చెప్పాలంటే ఆ మ్యాచ్‌లో ఉన్న క్లిష్ట పరిస్థితి, చేసిన పరుగులు, దూకుడైన షాట్లు, తుది ఫలితం... ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే దాని విలువ ఏమిటో తెలుస్తుంది. ఇదంతా 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్ గురించే. అసలు ఆ మ్యాచ్ లేకపోతే భారత క్రికెట్ భిన్నంగా కనిపించేదేమో. టన్బ్రిడ్జ్వెల్స్లోని నెవిల్ గ్రౌండ్ కపిల్ దేవ్ విధ్వంసానికి వేదిౖకైంది. టాస్ గెలిచిన కెప్టెన్ కపిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కొంత సమయం ఉందనుకొని షవర్ కోసం బాత్రూమ్కు వెళ్లిపోయాడు. అయితే సహచరుడు వచ్చి రెండు వికెట్లు పడ్డాయని చెప్పగా, ఆ వెంటనే మరొకరు వచ్చి మూడో వికెట్ కూడా పోయిందనడంతో హడావుడిగా బయటకు వచ్చి బ్యాటింగ్‌కు సిద్ధమయ్యాడు. 9 పరుగులకు నలుగురు ఆటగాళ్లు గావస్కర్, శ్రీకాంత్, మొహిందర్, సందీప్ పాటిల్ అవుట్ కాగా ఆరో నంబర్‌గా కపిల్ బరిలోకి దిగాడు. ఆ వెంటనే యశ్పాల్ శర్మ కూడా వెనుదిరగడంతో స్కోరు 17 పరుగులకు 5 వికెట్ల వద్ద నిలిచింది. ఈ దశలో ముందుగా నిలదొక్కుకొని ఆపై చెలరేగి ఆడిన కపిల్ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. చిన్న మైదానం కావడం కపిల్ ఇన్నింగ్స్ గొప్పతనాన్ని తగ్గించలేదు. ఒకవైపు బౌండరీ దగ్గరగా ఉండటంతో ఫోర్ల ద్వారా పరుగులు రాబట్టిన ‘పాజీ’... బౌండరీ దూరంగా ఉన్న వైపు నుంచి రెండు, మూడు పరుగులు తీసి తెలివిగా స్కోరును పరుగెత్తించాడు. బౌలర్ తల మీదుగా నేరుగా బాదిన సిక్సర్లు దీనికి అదనం. కపిల్ అద్భుత ప్రదర్శనలో రోజర్ బిన్నీ (22), సయ్యద్ కిర్మాణీ (24 నాటౌట్) అండగా నిలిచారు. చివరకు 181 నిమిషాల తన ఇన్నింగ్స్‌లో కపిల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 72 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. భారత్ 8 వికెట్లకు 266 పరుగులతో ముగించింది. అనంతరం జింబాబ్వే 235 పరుగులకు ఆలౌట్ కావడంతో కపిల్ సేనకు 31 పరుగుల విజయం దక్కింది. ఆపై ఇండియా సెమీస్ చేరడం, విశ్వవిజేతగా కూడా నిలవడంతో చరిత్ర మారిపోవడం తెలిసిందే. విశేషాలు... అప్పట్లో బ్యాట్స్‌మన్ ఇన్నింగ్స్ మధ్యలో బ్యాట్ మార్చడం కనిపించకపోయేది. సెంచరీ ముగిశాక కపిల్ బ్యాట్ మార్చి మరింత చెలరేగిపోయాడు. టేపులు చుట్టి ఉన్న ఆ బ్యాట్ బేస్‌బాల్ బ్యాట్‌ను తలపించిందని నాటి జింబాబ్వే ఆటగాళ్లు చెప్పుకునేవారు. ఆరంభంలో భారత స్కోరు చూసి నిర్వాహకులు మ్యాచ్ త్వరగా ముగిసిపోతుంది కాబట్టి లంచ్‌కి ఆర్డర్ ఇవ్వాలా వద్దా అని సంశయపడ్డారు. చివరకు 35 ఓవర్ల వద్దే లంచ్ తీసుకున్నాక భారత సహచరులు కపిల్ వద్దకు వచ్చే సాహసం కూడా చేయలేకపోయారు. అప్పట్లో కపిల్‌కు పోటీగా భావించిన గావస్కర్... ఒక గ్లాసు మంచి నీరు తీసుకొని అద్భుత ఇన్నింగ్స్ ఆడి వస్తున్న కెప్టెన్‌కు ఎదురెళ్లి అభినందించడం ప్రత్యేకంగా కనిపించింది. చివరి వికెట్ తీసి మ్యాచ్‌ను గెలిపించాక కపిల్ కిందకు వంగి మైదానాన్ని ముద్దాడటం విశేషం. అన్నట్లు ఈ మైదానంలో ఇదే, చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాతా మరే మ్యాచ్ జరగలేదు కానీ ఒక్క మ్యాచ్‌తోనే చరిత్రకు సాక్షిగా నిలిచింది. వీడియో లేదు... దురదృష్టవశాత్తూ ఇంత గొప్ప ఇన్నింగ్స్‌ను టీవీ ప్రేక్షకులు ప్రత్యక్ష ప్రసారంలోగానీ వీడియో రికార్డింగ్కానీ చూసే అవకాశం దక్కలేదు. వరల్డ్ కప్ నిర్వాహకులు ఆస్ట్రేలియా–వెస్టిండీస్ మధ్య మ్యాచ్ చూపించేందుకు మొత్తం ఎక్విప్మెంట్ తరలించగా... ప్రఖ్యాత బీబీసీ సంస్థ ఆ రోజు సమ్మెలో ఉండటంతో లైవ్ సాధ్యం కాలేదు. అయితే సమ్మెలో ఉన్నా ఒక దశలో బీబీసీ రిపోర్టర్ ఒకరు భారత్ ఇన్నింగ్స్ సమయంలోనే జింబాబ్వే గెలుస్తుందని భావించి మైదానానికి రావాలా అని జట్టు మేనేజర్ డేవ్ బ్రౌన్‌ను కోరగా... ఆయన తొందరపడవద్దని తిరస్కరించాడు. అయితే వీడియో రికార్డింగుకు సంబంధించి ఒక కథనం ప్రచారం ఉన్నా దానిపై సందేహాలున్నాయి. మ్యాచ్‌కు హాజరైన ఒక భారత అభిమాని తన వీడియో కెమెరాతో కపిల్ ఇన్నింగ్స్ షూట్ చేసి భారీ మొత్తాలకు చాలా మందికి అమ్ముకున్నాడని వినిపించింది. చివరకు కపిల్ దేవ్ కూడా పెద్ద మొత్తం అతనికే చెల్లించి సంతోషంగా ఆ టేపును తీసుకున్నాడని కూడా అన్నారు. అయితే యూట్యూబ్‌తో పాటు ఇంతగా సోషల్ మీడియా పెరిగిపోయిన కాలంలో కపిల్ సహా అభిమానులు ఎవరైనా ఇప్పటి వరకు దానిని పోస్ట్ చేయకుండా ఉంటారా...? -
ఆసీస్‌కు మళ్లీ ఇన్నింగ్స్ విజయం
అడిలైడ్: ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా పరిపూర్ణ పాయింట్లు (120) సాధించింది. ఆఖరి టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లయన్ (5/69) తన స్పిన్ మాయాజాలంతో పాకిస్తాన్‌ను తిప్పేశాడు. దీంతో ఒకరోజు ముందుగానే మ్యాచ్ ముగిసింది. ఫాలోఆన్‌లో 39/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 239 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ షాన్ మసూద్ (68; 8 ఫోర్లు, 1 సిక్స్), అసద్ షఫీక్ (57; 5 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. వీరు ఆడినంతసేపు బాగానే ఉన్నా... లయన్ వాళ్లిద్దర్నీ పెవిలియన్ చేర్చడంతో ఇన్నింగ్స్ ఇక ఎంతోసేపు సాగలేదు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు వార్నర్‌కే దక్కాయి. ఆసీస్ గడ్డపై పాక్ చెత్త రికార్డు... 1999 నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించిన పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ అయినా గెలవలేకపోయింది. ఇరు జట్ల మధ్య ఈ ఇరవై ఏళ్లలో ఆసీస్ గడ్డపై 14 టెస్టులు జరిగాయి. ఆ పద్నాలుగూ పాక్ ఓడింది. కనీసం ‘డ్రా’ అయినా చేసుకోలేకపోవడం గమనార్హం. -
చారిత్రాత్మక టెస్టులో చారిత్రక విజయం
ఎలాంటి అద్భుతాలు జరగలేదు.. రషీద్ ఖాన్ బంతి తిరగలేదు.. చారిత్రక టెస్టులో చెత్త రికార్డు ప్రత్యర్థి జట్టుకు.. ఘన చరిత్ర ఆతిథ్య జట్టుకు దక్కింది. ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. నెంబర్ వన్ జట్టు చాంపియన్ ఆటను ప్రదర్శించగా.. పసికూన పాఠాలు నేర్వాల్సి ఉంది. ఇక టెస్టు ఆరంభానికి ముందు నుంచే స్లెడ్జింగ్‌కు దిగిన అఫ్గాన్ జట్టుకు టీమిండియా షాకిచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో అసాధారణ ప్రదర్శన కనబరిచి భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండ్రోజుల్లోనే అఫ్గన్ కథను ముగించి చారిత్రక విజయం సాధించింది. సాక్షి, బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో తొలి రోజు భారత్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టగా, రెండో రోజు ప్రత్యర్థి బ్యాట్‌మెన్‌కు టీమిండియా బౌలర్లు దడ పుట్టించారు. ఓవర్‌నైట్ స్కోర్ 347/6తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా మరో 127 పరుగుల జోడించి 474 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ పరుగుల విషయం పక్కకు పెడితే క్రీజులో నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడ్డారు. అశ్విన్ (4/27), జడేజా(2/18), ఇషాంత్ శర్మ(2/28), ఉమేశ్(1/18) చెలరేగటంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో షహజాద్ రనౌట్ రూపంలో తొలి వికెట్‌గా వెనుదిరగగా.. ఆపై స్వల్ప విరామాల్లో జావేద్ అహ్మదీ(1), రహ్మత్ షా(14), అఫ్సర్ జజాయ్(6), అస్గార్ స్టానిక్జాయ్(11) వికెట్లను చేజార్చుకుంది. దీంతో 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. మహ్మద్ నబీ (24) కొంత పోరాటం చేసిన మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం చెందటంతో 27.5 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. అనంతరం టీమిండియా కెప్టెన్ రహానే ఏమాత్రం ఆలోచించకుండా అఫ్గాన్‌ను మరోసారి బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ కష్టాలు రెండో ఇన్నింగ్స్‌లోనూ కొనసాగాయి. తొలి ఇన్నింగ్స్‌ను స్పిన్‌తో దెబ్బకొట్టిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో పేస్ బౌలర్లు సత్తా చూపారు. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టడంతో అఫ్గాన్ ఏ దశలోను కోలుకోలేక పోయింది. టాప్ ఆర్డర్ మరోసారి విఫలమవ్వగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షాహిది(36), అస్గార్ స్టానిక్జాయ్(25) కొంత వరకు పోరాడినా మ్యాచ్‌ను మూడో రోజుకు తీసుకోని పోలేకపోయారు. దీంతో 38.4 ఓవర్లలో 103 పరుగులకు అఫ్గానిస్తాన్ ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్రజడేజా (4/17), ఉమేశ్(3/26), ఇషాంత్ శర్మ(2/17), అశ్విన్(1/32) మరోసారి ప్రత్యర్థి జట్టు పని పట్టారు. రెండో రోజు మొత్తం 24 వికెట్లు పడిపోయాయి. టీమిండియాకు టెస్ట్ మ్యాచ్‌ల్లో అతి పెద్ద ఇన్నింగ్స్ విజయం ఇదే కావడం విశేషం. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆంధ్రకు ఇన్నింగ్స్ విజయం
త్రిపురతో రంజీ మ్యాచ్ సాక్షి, ఒంగోలు: మీడియం పేసర్ దువ్వారపు శివ కుమార్ కెరీర్లోనే ఉత్తమ గణాంకాల (మ్యాచ్‌లో 11 వికెట్లు)ను నమోదు చేయడంతో... త్రిపురతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం మూడో రోజు జరిగిన ఆటలో త్రిపుర జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో శివకుమార్ (4/54) ధాటికి 58.1 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. నిరుపమ్ సేన్ చౌధరి (42) మాత్రమే రాణిం చాడు. స్టీఫెన్‌కు మూడు, విజయ్‌కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. శుక్రవారం 13/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన త్రిపుర... ఓ దశలో 47 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఎనిమిదో నంబర్ బ్యాట్స్‌మన్ నిరుపమ్ పోరాటంతో వంద పరుగులైనా దాటగలిగింది. హైదరాబాద్‌కు ఇన్నింగ్స్ ఓటమి అస్సాంతో రంజీ మ్యాచ్ సాక్షి, హైదరాబాద్: సొంత గడ్డపై హైదరాబాద్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. ఫలితం తేలే అవకాశాలు లేవనుకున్న మ్యాచ్‌ను స్పిన్నర్ స్వరూపం పుర్కయస్తా (మ్యాచ్‌లో 13 వికెట్లు) అద్భుత బౌలింగ్‌తో పూర్తిగా మార్చేశాడు. రెండు రోజుల పాటు పిచ్ మరీ నెమ్మదించినా చివరి రెండు రోజులు (గురు, శుక్ర) బంతి అనూహ్యంగా టర్న్ అయ్యింది. దీంతో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ 56 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గురువారం మూడో రోజు 35 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన హైదరాబాద్‌ను స్వరూపం (5/59) చావుదెబ్బ తీయడంతో 100.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ తన్మయ్ (205 బంతుల్లో 68; 7 ఫోర్లు), అహ్మద్ ఖాద్రి (98 బంతుల్లో 50; 5 ఫోర్లు), అక్షత్ (115 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణిం చారు. జమాలుద్దీన్‌కు మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం 178 పరుగులు వెనుకబడి ఫాలోఆన్ ఆడిన హైదరాబాద్... తమ రెండో ఇన్నింగ్స్‌లో 66.3 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటయింది. స్వరూపం (29-16-29-8)ఏకంగా 8 వికెట్లు తీశాడు.