insurence amount
-
'ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే' హత్య చేశారా..! అసలేం జరిగింది..??
మహబూబాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడిని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొట్టి చంపి కుంటలో పడవేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి కుంటలో పడి మృతి చెందినట్లు చిత్రీకరించారంటూ ఆరోపిస్తున్నారు. ఎస్సై నైనాల నగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేలకుంటకు చెందిన మూడు స్వామి(33)కి అదే గ్రామానికి జ్యోతితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా స్వామి మద్యానికి బానిసయ్యాడు. గత శుక్రవారం భార్య జ్యోతి ఆరోగ్యం బాగా లేకపోవడంతో తల్లి గారింటికి వెళ్లిపోయింది. అదేరోజు సాయంత్రం నుంచి అతను కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసిన వారికి ఫోన్ చేసి ఆచూకీ కోసం వెతికారు. కానీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం రేలకుంట శివారులోని పుల్లమ్మకుంటలో మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు చేరుకుని విలపించారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు స్వామికి ఇన్సూరెన్స్ చేయించి పథకం ప్రకారం హత్య చేసి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు గ్రామంలో వినిపిస్తున్నాయి. మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బీమా పాలసీని వెనక్కి ఇచ్చేస్తే..?
విష్ణు స్వరూప్ (30) పేరిట రెండు జీవిత బీమా ఎండోమెంట్ పాలసీలు ఉన్నాయి. ఆరేళ్ల క్రితం తనకు ఉద్యోగం వచి్చన కొత్తలో ఆ పాలసీలను విష్ణు పేరిట ఆయన తండ్రి ప్రారంభించారు. వీటి కోసం ఏటా రూ.50,000 ప్రీమియంను విష్ణు స్వయంగా చెల్లిస్తున్నారు. ఈ రెండింటి రూపంలో వస్తున్న బీమా రక్షణ రూ.10 లక్షలు. కాల వ్యవధి 20 ఏళ్లు. ఎందుకోగానీ తాను తీసుకున్న బీమా ఉత్పత్తులు తగినంత రక్షణ ఇవ్వడం లేదన్న అభిప్రాయం అతడిలో కలిగింది. దీంతో ఓ ఆరి్థక సలహాదారుడిని సంప్రదించాడు. పాలసీల పూర్తి వివరాలు, విష్ణు ఆదాయం, జీవిత లక్ష్యాలన్నింటినీ సమగ్రంగా విశ్లేíÙంచిన అనంతరం.. వెంటనే సదరు రెండు ఎండోమెంట్ పాలసీలను సరెండ్ చేసేయాలని ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచించారు. నిపుణుడిని సంప్రదిస్తే కానీ, ఆ పాలసీల వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న విషయం అతడికి బోధపడలేదు. విష్ణు మాదిరే ఎండోమెంట్ పాలసీలకు భారీ ప్రీమియం చెల్లించే వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరూ ఒక్కసారి తమ ప్లాన్‌ను సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిన్న మొన్నటి వరకు జీవిత బీమా అంటే ఎక్కువ మందికి తెలిసింది ఎండోమెంట్ పాలసీల గురించే. టర్మ్ ఇన్సూరెన్స్ ఇటీవలి కాలంలోనే ఆదరణను, ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. ఎండోమెంట్ పాలసీలు గతంలో ప్రజల సహజ పొదుపు మనస్తత్వం కోణం నుంచి అభివృద్ధి చేసినవి. అంతేకానీ, అచ్చమైన బీమా రక్షణ కోసం కావు. పెట్టుబడుల సాధనాలు, రాబడులపై అవగాహన విస్తృతమవుతున్న కొద్దీ, టర్మ్ పాలసీల ప్రాధాన్యం తెలిసి వస్తోంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. పాలసీ హోల్డర్ దురదృష్టవశాత్తూ మరణిస్తే కుటుంబానికి మెరుగైన పరిహారం ఇచ్చి ఆదుకునేవి టర్మ్ ప్లాన్లు. కాల వ్యవధి ముగిసే రోజు వరకు జీవించి ఉంటే రూపాయి తిరిగి రాదు. దీనికి భిన్నంగా.. పాలసీ కాల వ్యవధిలో మరణించినా లేక పాలసీ గడువు ముగిసే వరకు జీవించి ఉన్నా.. ఈ రెండు సందర్భాల్లోనూ ఎంతో కొంత ముట్టజెప్పేవి ఎండోమెంట్ ప్లాన్లు. ఇవి తక్కువ బీమా రక్షణ, తక్కువ రాబడితో కూడినవి. బీమా ఏజెంట్లు ఎండోమెంట్ ప్లాన్ల విక్రయానికే ఎక్కువగా మొగ్గు చూపిస్తుంటారు. దీనిపై వారికి లభించే కమీషన్ ఎక్కువగా ఉంటుంది. మొదటి ఏడాది ప్రీమియంలో 10–25 శాతం వరకు వారికి కమీషన్‌గా ముడుతుంది. అంతేకాదు రెండో సంవత్సరం నుంచి పాలసీ ముగిసే వరకు ఏటా ప్రీమియంపై 5–7 శాతం కమీషన్‌గా ఏజెంట్లకు ఆదాయం వస్తూనే ఉంటుంది. టర్మ్ ప్లాన్ల పైనే ఇదే స్థాయిలో కమీషన్ ఉంటుంది. కాకపోతే టర్మ్ పాలసీల ప్రీమియం తక్కువ కనుక కమీషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. దేశ వాసుల్లో చాలా మందికి ఎండోమెంట్ ప్లాన్లే ఉన్నాయి. తెలిసిన ఏజెంట్ బలవంతం పెట్టాడని, స్నేహితులు, బంధువులు సూచించారని చెప్పి వీటిని తీసుకోవడం కనిపిస్తుంది. చెల్లిస్తున్న ప్రీమియానికి మెరుగైన బీమా రక్షణ ఇవ్వని, ప్రీమియం భారంతో కూడిన ఇలాంటి ఎండోమెంట్ ప్లాన్లను వదిలించుకునే మార్గం ఉంది. సరెండర్ చేసేయడమే.. ఎందుకు సరెండర్ చేయాలి..? తాము తీసుకున్న జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్‌లో తగినంత కవరేజీ లేదని, ప్రీమియం ఎక్కువగా ఉందని అనిపిస్తే దాన్ని నిలిపివేయడంలో ఎలాంటి తప్పు లేదు. జీవిత బీమా ప్లాన్ తీసుకునేది ఎందుకు..? తమకు ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలు కాకూడదనే. తమపై ఆధారపడిన వారు, అసాధారణ సందర్భాల్లో కష్టాలు పడకూడదంటే అందుకు తగినంత కవరేజీతో లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉండాల్సిందే. పిల్లల విద్య ఆగిపోకూడదు. వారి రోజువారీ జీవనం, ఇతర వ్యయాలు అన్నింటినీ జీవిత బీమా పరిహారం ఆదుకునే విధంగా ఉండాలి. అందుకే వార్షిక ఆదాయానికి ఎంతలేదన్నా కనీసం పది రెట్ల మేరకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. విష్ణు స్వరూప్నే ఉదాహరణగా తీసుకుందాం. అతడు రూ.10 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.50వేలు చెల్లిస్తున్నాడు. కానీ, కేవలం రూ.20 వేల వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా విష్ణు రూ.1.5 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాతో విష్ణు అదే పనిచేశాడు. ఉన్న ఎండోమెంట్ ప్లాన్లను సరెండ్ చేశాడు. రూ.1.5 కోట్ల టర్మ్‌ప్లాన్ తీసుకున్నాడు. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి రూ.కోటి సమ్ అష్యూరెన్స్‌తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే వార్షిక ప్రీమియం రూ.25,000. ఎండోమెంట్ పాలసీల్లో బీమా రక్షణతోపాటు, ఎంతో కొంత రాబడి ఉంటుందన్నది చాలా మంది అభిప్రాయం. కానీ, ఇందులో వాస్తవం ఏంటన్నది పాలసీదారులకు తప్పకుండా తెలిసి ఉండాలి. ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి 4.5–5.5 శాతం మించి ఉండదు. అరుదైన సందర్భాల్లోనే రాబడి 6 శాతం ఉంటుంది. కానీ ద్రవ్యోల్బణం కూడా దీర్ఘకాల సగటు అదే స్థాయిలో ఉంది. దీంతో నికరంగా వచ్చే రాబడి ఏమీ ఉండదు. ఉదాహరణకు రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్‌తో ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. సమ్ అష్యూర్డ్‌పై ఏటా 5 శాతం సింపుల్ గ్యారంటీడ్ అడిషన్ వస్తుంది. ఈ పాలసీలో మెచ్యూరిటీ కింద రూ.21 లక్షలు వస్తుంది. రాబడి రేటు 6.22 శాతం. ద్రవ్యోల్బణం 6 శాతం (సగటున) మినహాయిస్తే నికర రాబడి 0.22 శాతమే. అదే ఈక్విటీ పథకాల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తే రాబడి వార్షికంగా 10–12 శాతం లేదా అంతకంటే ఎక్కువే ఉంటుంది. డెట్ సాధనాల్లోనూ 7 శాతం మేర రాబడి వస్తుంది. పాలసీని నిలిపివేస్తే..? ఎండోమెంట్ ప్లాన్ గురించి ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత, ఇక వద్దనుకుంటే పాలసీదారుల ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అప్పటి నుంచి ప్రీమియం చెల్లించకుండా ఉండిపోవడం. లేదంటే పాలసీని సరెండర్ చేయడమే సరైనది. పాలసీలో కవరేజీ, రాబడి ఆకర్షణీయంగా లేదని అసంతృప్తిగా ఉంటే అప్పటి నుంచి ప్రీమియం చెల్లించకుండా ఆగిపోవచ్చు. కాల వ్యవధి తర్వాత ఫండ్ వెనక్కి వస్తుంది. దీన్నే పాలసీ పెయిడప్ అని అంటారు. మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుందన్నది బీమా సంస్థ చెబుతుంది. అంతేకాదు, జీవిత బీమా కవరేజీ కూడా కొనసాగుతుంది. కాకపోతే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు అనుగుణంగా జీవిత బీమా కవరేజీని తగ్గిస్తారు. ఉదాహరణకు రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకుని, ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లించారని అనుకుందాం. అప్పుడు రూ.10 లక్షలకు బదులు రూ.2.5 లక్షల జీవిత బీమా కవరేజీ కాల వ్యవధి ముగిసే వరకు లభిస్తుంది. పెయిడప్ చేసే నాటికి జమ అయిన గ్యారంటీడ్ అడిషన్స్, బోనస్‌లు కలిపి పెయిడప్ వ్యాల్యూని నిర్ణయిస్తారు. సరెండర్ ఎప్పుడు చేయాలి? బీమా పాలసీల్లో సరెండర్ పెనాల్టీ ఎంతో ఎక్కువగా ఉంటుందని భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ నితిన్ మెహతా తెలిపారు. పాలసీ సరెండర్ చేయడానికి ముందే, ఎదురయ్యే ఆరి్థక ప్రతికూలతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అందుకుని సరెండర్ చేసే ముందు ఎంత వస్తుందన్నది తెలుసుకోవాలి. ఎండోమెంట్ ప్లాన్‌కు ప్రీమియం ఇక చెల్లించడం కష్టంగా ఉందని భావిస్తే అప్పుడు సరెండర్ చేస్తే ఎంతొస్తుంది? పెయిడప్‌గా మారిస్తే గడువు ముగిసిన తర్వాత ఎంతొస్తుందన్నది విశ్లేíÙంచుకోవాలి. సరెండర్ చేసినా లేక పెయిడప్ చేసినా.. అదే సమయంలో టర్మ్ ప్లాన్ తీసుకోవడం తప్పనిసరి. లేదంటే అసులు లక్ష్యమే దెబ్బతింటుంది. రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు ఏటా రూ.50,000 చొప్పున ప్రీమియం చెల్లించిన తర్వాత సరెండర్ చేసేయాలని నిర్ణయించారు. దీంతో అప్పటి నుంచి ఏటా రూ.50,000 ప్రీమియం రూపంలో ఆదా అవుతుంది. అప్పుడు ఏటా రూ.20,000 ప్రీమియంపై రూ.కోటి టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. మిగిలిన రూ.30వేలను ఇండెక్స్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ఇలా చేస్తే ఏటా 12 శాతం సగటు రాబడి అంచనా ఆధారంగా 15 ఏళ్ల తర్వాత రూ.12.50 లక్షలు సమకూరుతుంది. ఐదేళ్ల తర్వాత సరెండర్ చేయడం వల్ల వచి్చన మొత్తాన్ని తీసుకెళ్లి ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అది కూడా ఏటా 12 శాతం చొప్పున 15 ఏళ్లలో వృద్ధి చెందుతుంది. బీమా, పెట్టుబడిని కలిపి చూడకూడదు. అచ్చమైన బీమా రక్షణ ఏర్పాటు చేసుకోవడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి రాబడి కోసం మేలైన పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. పాలసీ కాల వ్యవధి ముగియకముందే దాన్నుంచి వైదొలగాలని అనుకుంటే, సరెండర్ వేల్యూని వెనక్కి పొందొచ్చు. అప్పటి వరకు ఎన్నేళ్లపాటు ప్రీమియం చెల్లించారు, ఎంత చెల్లించారు, బోనస్, పెయిడప్ వేల్యూ ఆధారంగా సరెండర్ వేల్యూ ఎంతన్నది ఉంటుంది. ఇందుకు సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ చార్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. సరెండర్ ఫ్యాక్టర్ 35 శాతం అనుకుంటే.. రూ.10 లక్షల పాలసీలో రూ.3.5 లక్షలు పాలసీదారునికి దక్కుతుంది. పాలసీ తీసుకుని కాల వ్యవధి పెరుగుతూ వెళుతున్న కొద్దీ, ఈ సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ 70 శాతం వరకు చేరుతుంది. ‘‘కాల వ్యవధికి ముందే పాలసీని సరెండర్ చేస్తే తీవ్రంగా నష్టపోవాలి. సరెండర్ ఫీజుల రూపంలో అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలో గణనీయమైన మొత్తాన్ని కోల్పోతారు. కొన్ని కేసుల్లో బోనస్ వంటివి కూడా రావు. కనుక పాలసీ నియమ, నిబంధనలను చదివి అర్థం చేసుకోవాలి’’అని ఫైనాన్షియల్ ప్లానింగ్ సంస్థ ‘ఫైనాన్షియల్ స్మార్ట్’ సీఈవో నీతా మెనెజెస్ సూచించారు. సరెండర్ వేల్యూ విషయంలో బీమా సంస్థల మధ్య ఏకరూపత కనిపించదు. కొన్ని బీమా సంస్థలు ప్రత్యేకమైన సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్చార్ట్లను ఉపయోగిస్తున్నాయి. కొన్ని సంస్థల్లో అయితే చాలా దారుణంగా, నామమాత్రంగా సరెండర్ వేల్యూని నిర్ణయిస్తున్నారు. అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం ఆధారంగా సరెండర్ వేల్యూని కొన్ని ఖరారు చేస్తున్నాయి. సరెండర్ చేస్తే ఎంతొస్తుంది? సమ్ అష్యూర్డ్: రూ.10లక్షలు పాలసీ కాల వ్యవధి: 20 ఏళ్లు వార్షిక ప్రీమియం: రూ.50వేలు బోనస్ అడిషన్ ఏటా: రూ.50వేలు సరెండర్ కాల వ్యవధి 5ఏళ్ల 10 ఏళ్ల 15 ఏళ్ల తర్వాత తర్వాత తర్వాత పెయిడప్ వేల్యూ (రూ.లక్షల్లో) 5 10 15 సరెండర్ వేల్యూ ఫ్యాక్టర్ (శాతంలో) 35 50 70 సరెండర్ వేల్యూ (రూ.లక్షల్లో) 1.75 5 10.50. -
Crime News: భార్య పేరిట రెండు కోట్ల ఇన్సూరెన్స్.. ఆపై..
శాలూ.. నా కోసం రోజూ ఒంటరిగా హనుమాన్ గుడికి వెళ్లి పూజలు చేస్తావా? అదీ స్కూటీ మీద! పదకొండు రోజులపాటు పూజలు చేయాలి.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. ఇలా గనుక చేస్తే.. మనకు అంతా మంచి జరుగుతుందట. అది పూర్తయితే నిన్ను ఇంటికి తెచ్చేసుకుంటా అంటూ భర్త చెప్పిన మాటలతో సంతోషపడిందా భార్య. రోజూ వేకువ ఝామునే లేచి.. భర్తను తలుచుకుంటూ పూజలు చేసుకుంటూ పోయింది . ఈ క్రమంలో.. ఓరోజు ఆమె తోడుగా తన బంధువు కుర్రాడిని కూడా గుడికి తీసుళ్లింది. మార్గం మధ్యలో పొగమంచు కారణంగా ఆమె ఎదురుగా వస్తున్న ఎయూవీని గుర్తించలేకపోయింది. వాహనం ఢీ కొట్టడంతో శాలూ అక్కడికక్కడే కన్నుమూసింది. రాజు చికిత్స పొందుతూ.. ఆస్పత్రిలో కన్నుమూశాడు. పుట్టింటికి వెళ్లిన భార్య.. రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని తెలియగానే కన్నీరు మున్నీరు అయ్యాడు మహేష్ చాంద్. ఆ కన్నీళ్లకు శాలూ కుటుంబం కూడా మోసపోయింది. అయితే.. యాక్సిడెంట్ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇన్సూరెన్స్ సొమ్ము కోసమే మహేష్ ఆమెను హత్య చేయించాడని తేలింది. జైపూర్ వెస్ట్ డీసీపీ వందితా రానా తెలిపిన వివరాల ప్రకారం.. శాలూ, మహేష్‌కు 2015లో వివాహం అయ్యింది. ఇద్దరికీ ఓ పాప కూడా ఉంది. అయితే గత రెండేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 2019లో అతనిపై గృహ హింస కేసు వేసింది కూడా. అప్పటి నుంచి భార్యకు అంటీముట్టనట్లు ఉంటూ వస్తున్నాడు మహేష్. అయితే.. ఈ మధ్య అతనికి ఆమెను వదిలించుకోవాలనే దుర్భుద్ధి పుట్టింది. ఆమె పేరిట భారీగా ఇన్సూరెన్స్ చేయించాడు. సహజంగా చనిపోతే కోటి రూపాయలు, ప్రమాదవశాత్తూ చనిపోతే రెండు కోట్ల దాకా ఇన్సూరెన్స్ సొమ్ము వస్తుంది అతనికి. ఆ సొమ్ము ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకున్నాడు. ముకేష్ సింగ్ రాథోడ్ అనే రౌడీ షీటర్‌తో పది లక్షల రూపాయల సుపారీ ఇచ్చి.. భార్యను హత్య చేయమని పురమాయించాడు మహేష్. అయితే ఆ హత్య ఎవరికీ అనుమానం రావొద్దని సూచించాడు. మరోవైపు భార్యకు ఫోన్ చేసి 11 రోజులు వరుసగా హనుమాన్ గుడికి వెళ్లి పూజలు చేయమని, తాను ఇలా చేయమన్నానని చెప్పినట్లు ఎవరితో చెప్పొద్దని బతిమాలాడు. దీంతో భర్త మనసు మారిందేమో అనుకుని ఆమె గుడికి వెళ్లడం ప్రారంభించింది. ఈ క్రమంలో.. రాథోడ్ మనుషులు వాహనంతో వచ్చి ఆమె వెళ్తున్న స్కూటీని ఢీకొట్టి ఆమెను హత్య చేశారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో.. మహేష్‌తో పాటు రాథోడ్‌ను, అతని ఇద్దరి అనుచరుల్ని, యాక్సిడెంట్ చేసిన వాహనం ఓనర్‌తో పాటు అతని సోదరుడిని అరెస్ట్ చేశారు జైపూర్పోలీసులు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. -
నిందితులు చిక్కినా న్యాయం జరగట్లే!
సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’... ఇన్సూరెన్స్ ఫాడ్స్ర్ చేసిన త్రయం విషయంలో ఈ ఆంగ్ల నానుడి సరిగ్గా సరిపోతుంది. నగరానికి చెందిన ఇద్దరు వృద్ధులను టార్గెట్‌గా చేసుకున్న ముగ్గురు నిందితులు రూ.6.74 కోట్లు కాజేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు తొలి కేసు నమోదైన మూడు రోజుల్లోనే ముగ్గురు నిందితులనూ అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు మోసం సొత్తుతో స్థిర, చరాస్తులు ఖరీదు చేసినట్లు గుర్తించారు. అయితే కథ ఇక్కడితో ఆగిపోవాల్సి వస్తోంది. ఈ రెండు కేసులూ మోసాన్ని సూచించే ఐపీసీలోని 420 తదితర సెక్షన్లతో నమోదు కావడంతో ఆ ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. పక్కాగా స్కెచ్ వేసి స్వాహా... కుత్భుల్లాపూర్‌లో నివసిస్తున్న పుల్లేటి సుబ్రహ్మణ్యం, బీరంగూడ వాసి ఉడుత మనోజ్‌కుమార్, గుర్రంగూడకు చెందిన బండారి మహేష్ గౌడ్లతో కూడిన ముఠా ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో మోసాలకు పథకం వేసింది. వివిధ కంపెనీలకు చెందిన పాలసీ హోల్డర్ల ఫోన్ నంబర్లు సేకరించి ప్రధానంగా వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని వారికి నమ్మకం కలిగించి నిండా ముంచింది. నగరానికి చెందిన ఇద్దరి నుంచి వేర్వేరుగా రూ.6.74 కోట్లు నగదు రూపంలో తీసుకుని నకిలీ బాండ్లు అంటగట్టి మోసం చేసింది. తన కుమారుడు విదేశాల నుంచి వచ్చి గుర్తించే వరకు ఒక బాధితుడు, వీరి అరెస్టు విషయం పత్రికల్లో చూసే వరకు మరో బాధితుడు తాము మోసపోయినట్లు గుర్తించలేకపోయారు. కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి... మొదటి బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు గత నెల ఆఖరి వారంలో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆపై న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే మోసం సొమ్మును ముగ్గురూ పంచుకున్నట్లు తేలింది. ప్రధాన నిందితుడు సుబ్రహ్మణ్యం తన స్వస్థలమైన గుడివాడలోని ఎస్ఎన్ పురంలో రూ.60 లక్షలు వెచ్చించి ఇల్లు నిర్మించాడని, కుత్భుల్లాపూర్‌లో రూ.కోటితో ప్లాట్ కొన్నాడని, తన కుమార్తె పేరుతో రూ.1.5 లక్షలు పోస్టాఫీస్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడని తెలుసుకున్నారు. మనోజ్‌కుమార్ బీరంగూడలో రూ.70 లక్షలతో ఫ్లాట్ ఖరీదు చేయగా, మహేష్ తన వివాహానికి డబ్బు ఖర్చు చేయడంతో పాటు భార్యకు పది తులాల బంగారం, తమ కోసం ఓ కారు ఖరీదు చేసుకున్నట్లు గుర్తించారు. స్వాధీనానికి ఆస్కారం లేకపోవడంతో... విలాసాలకు అలవాటుపడిన వీరు భారీ మొత్తాన్ని ఖర్చు చేసి విహారయాత్రలకు వెళ్లి వచ్చారు. వృద్ధుల నుంచి కొట్టేసిన సొమ్ముతోనే ఇవన్నీ చేశామంటూ వారు అంగీకరించినా... పోలీసులకు ఆధారాలు లభించినా వాటి జోలికి వెళ్లే ఆస్కారం లేకుండా పోయింది. ఈ కేసును పోలీసులు ఐపీసీలోని 420 తదితర సెక్షన్ల కింద నమోదు చేశారు. కేవలం డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద నమోదైన వాటిలోనే ఆస్తుల స్వాధీనానికి ఆస్కారం ఉంది. ఈ చట్టం వర్తించాలంటూ నిందితులు బాధితుల నుంచి డబ్బును డిపాజిట్ల రూపంలో తీసుకుని ఉండాలి. ఈ ఇన్సూరెన్స్ నేరం ఆ తరహాకు చెందినది కాకపోవడంతో అలా చేసే వీలులేదు. దీంతో ఈ వివరాలతో పాటు స్థిరచరాస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు న్యాయస్థానానికి అప్పగించాలని నిర్ణయించారు. కోర్టు నిర్ణయం మేరకే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. రెండో కేసులో వీరిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్నారు. అనివార్యంగా మారిన చట్ట సవరణ... కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు అనేక మోసాల కేసుల్లో బాధితుల పరిస్థితి ఇలానే ఉంటోంది. నిందితులు అరెస్టు అయినా వారికి న్యాయం అందడం లేదు. ఒకప్పుడు రూ.వేలు, రూ.లక్షలతో ముడిపడి ఉన్న మోసాల కేసుల ‘విలువ’ ఇప్పుడు రూ.కోట్లకు చేరుతోంది. ఈ నేపథ్యంలోనే చట్ట సవరణతోనే బాధితులకు న్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్. కేవలం పోలీసు విభాగంలోనే కాకుండా ఆయన డిప్యుటేషన్‌పై పని చేసిన ఎక్సైజ్, పౌరసరఫరాల శాఖల్లోనూ అనేక సంస్కరణలు తీసుకువచ్చి తన మార్కు చూపించారు. ఈ విషయంలోనే ఆయన స్పందించి భారీ మొత్తాలతో ముడిపడి ఉన్న మోసం కేసుల్లోనూ ఆస్తులు స్వాధీనం చేసుకునేలా సవరణకు ప్రతిపాదించాల్సిన అవసరం కనిపిస్తోంది. అప్పుడే మోసగాళ్లకు కళ్లెం పడటంతో పాటు బాధితులకు పూర్తి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది. (చదవండి: పోలీసునంటూ బెదిరింపులు...నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే జంటలే టార్గెట్) -
ఇన్సురెన్స్ డబ్బు కోసం భార్య హత్య
అహ్మద్ నగర్: ఇన్సురెన్స్ డబ్బుల కోసం ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. అనంతరం ఆమెపై ఉన్న రూ. 60 లక్షల బీమా డబ్బును క్లెయిమ్ చేసుకున్నాడు. పోలీసులు దర్యాప్తులో అసలు విషయం బయటపడటంతో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాకు చెందిన ఓ చర్టర్డ్ అకౌంటెంట్ లలిత్ టాంక్ భార్య దక్ష్‌బెన్ టాంక్ రోడ్డు ప్రమాదంలో గత ఏడాది డిసెంబర్ 26న మృతిచెందింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లు పోలీసులు కేసు సైతం నమోదు చేశారు. అయితే మృతురాలి కుటుంబసభ్యులు ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడం ఆరంభించారు. దక్ష్‌బెన్ కాల్ డేటాను సేకరించి పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఆమెను తన భర్త హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆమె భర్త లలిత్ టాంక్ ఓ వ్యక్తికి రూ. 2 లక్షలు ఇచ్చి ఓ వాహనంతో హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా నమ్మించినట్లు దర్యాప్తులో బయటపడింది. మూడు నెలల ముందు ఆమె పేరుతో తీసుకున్న బీమా పాలసీ నుంచి రూ. 60లక్షలు ఉప సంహరించుకోవాలని ప్రణాళిక రచించాడు. డిసెంబర్ 26న పథకం ప్రకారం ఆమెను గుడి తీసుకువెళ్లి మార్గ మధ్యలో మరో వ్యక్తితో ఆక్సిడెంట్ చేయించాడు. దీంతో ఆమె ఆక్కడికక్కడే మృతి చెందారు. ఇది సహజంగా జరిగిన రోడ్డు ప్రమాదం అని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు లలిత్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను హత్య చేసిన భార్య
-
ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ ఇల్లాలి ఘాతుకం
సాక్షి, హైదరాబాద్ : కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చడమే కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులకు చిక్కింది ఓ ఇల్లాలు. భర్త ఉద్యోగంతో పాటు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. మిర్యాలగూడకు చెందిన కేస్యా నాయక్, పద్మ భార్యాభర్తలు. ప్రభుత్వ ఉద్యోగి అయిన నాయక్ చనిపోతే, అతడి ఉద్యోగంతోపాటు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయనే దురాశతో భార్య పద్మ, మరో వ్యక్తి వినోద్ సాయంతో హత్య చేసింది. ముందుగా నాయక్‌కు ఊపిరాడకుండా చేసి, అనంతరం కారును ఓ ఎలక్ట్రిక్ పోల్‌కు ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పద్మతోపాటు వినోద్ కూడా నేరం చేసినట్లు అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
బంధాన్ని కాదని.. డబ్బుకు బందీయై!
♦ కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఇల్లాలు ♦ ఇన్సూరెన్స్ నగదు కోసం మేనల్లుడితో కలసి ఘాతుకం ♦ వీడిన కొత్తగంగుబూడి హత్యకేసు మిస్టరీ విజయనగరం: బంధం కన్నా.. ఆమెకు డబ్బే ఎక్కువైంది. రూ.లక్షలు వస్తాయన్న ఆశతో కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఎల్.కోట మండలం కొత్త గంగుబూడి సమీపంలో గత నెల 26న జరిగిన హత్యకేసు మిస్టరీ వీడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత భార్య, మేనల్లుడు, ఇతర కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. శుక్రవారం విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎల్.కాళిదాసు రంగారావు ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గండబోయిన శ్రీనివాస్ కాకినాడలో ఉన్న తన మేనమామ వై.నూకరాజు పేరున రూ.38 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు. మేనమామను హతమారిస్తే ఆ నగదును కాజేయవచ్చని పథకం పన్నాడు. కొంత సొమ్మును మేనత్తకిచ్చి మిగిలిన సొమ్మును తన సొంతం చేసుకోవచ్చని భావించాడు. ఇందుకు మేనత్త(నూకరాజు భార్య) వరలక్ష్మి కూడా సహకరించింది. గత నెల 26న మేనమామను తీసుకురమ్మని అత్తకు చెప్పాడు. ఆమె తన భర్తను విశాఖ తీసుకొచ్చింది. అక్కడి నుంచి కారు అద్దెకు తీసుకుని మేనమామ, అతని భార్య వరలక్ష్మి, సమీప బంధువులైన కట్టా రాము, గద్దాడ వెంకటరావు, వంక బంగార్రాజులతో కలిసి విశాఖ నుంచి ఎస్.కోట బయలుదేరారు. ఎల్.కోట మండలం గంగుబూడి సమీపంలో నూకరాజును రాయితో కొట్టి హతమార్చి పరారయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా.. ఎల్.కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే మేనమామను శ్రీనివాస్, మేనమామ భార్య వరలక్ష్మి, కట్టా రాము, వెంకటరావు, బంగార్రాజులు కుట్రపన్ని హతమార్చినట్లు వెల్లడైందని ఎస్పీ రంగారావు తెలిపారు. శ్రీనివాస్‌తోపాటు, వరలక్ష్మి, రాములను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. వెంకటరావు, వంక బంగర్రాజులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఎ.వి.రమణ, ఎల్.రాజేశ్వరరావు, ఎస్.కోట సీఐ బి.రమణమూర్తి, ఎల్.కోట ఎస్సై ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.