Intelligent Transport System
-
నగరంలో ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం ఏర్పాటవుతున్న తొలిన గరంగా హైదరాబాద్‌కు గుర్తింపు రానుంది. ప్రజా రవాణాలో కీలకంగా ఉన్న ఆర్టీసీ బస్సు ల నిర్వహణను క్రమబద్ధం చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ప్రజా రవాణా వ్యవస్థను గొప్పగా నిర్వహించటంలో ఫ్రాన్స్ దేశానికి మంచి పేరుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో తొలుత ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే అవకాశాన్ని ఆ దేశానికి చెందిన లూమీప్లాస్ కంపెనీకి అప్పగించారు. గతేడాది అక్టోబర్‌లో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ రమణారావు ఆ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. బుధవారం ఈ మేరకు నగరంలో ఆర్టీసీ బస్సులకు ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు నగరానికి వచ్చారు. ప్రయోగాత్మకంగా తొలుత ఓ మార్గాన్ని వారికి అప్పగించారు. అక్కడ తమ సాంకేతిక పరిజ్ఞానంతో దాని అమలును పరిశీలిస్తారు. అది సత్ఫలితాలనిస్తే నగరం మొత్తం ఏర్పాటు చేస్తారు. మొత్తం ఖర్చు ఫ్రాన్స్ కంపెనీదే ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు కోసం ఉప్పల్–కోఠి మార్గాన్ని ఫ్రెంచి కంపెనీ కి అప్పగించారు. ఆ మార్గంలోని 40 బస్సుల్లో దీన్ని ఏర్పాటు చేసి.. అవి తిరిగే బస్టాప్‌లతో అనుసంధానిస్తారు. ఇందుకు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తాన్ని ఫ్రెంచి కంపెనీనే భరి స్తుంది. మరో రెండు నెలల్లో ఈ వ్యవస్థ ప్రారం భమవుతుంది. 6 నెలలపాటు దాని ఫలితాలు పరిశీలిస్తారు. హైదరాబాద్ రోడ్లకు అనుకూలంగా ఉంటే మొత్తం నగరానికి విస్తరి స్తారు. అనుకూలంగా లేనిపక్షంలో.. ప్రయో గం కోసం అయిన ఖర్చుతో ఆర్టీసీకి సంబం ధం ఉండదు. ఇప్పటివరకు దేశంలో ఇలాంటి వ్యవస్థ మరే నగరంలోనూ ఏర్పాటు కాలేదు. దీన్ని మొబైల్ యాప్‌తో అనుసంధానించి అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు కూడా చేస్తు న్నారు. ఆ యాప్ వల్ల వచ్చే అరగంటలో బస్సుల గమనం కచ్చితంగా తెలుసుకునే అవ కాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఫ్రాన్స్‌తో కలసి పనిచేస్తాం: మేయర్ బొంతు రామ్మోహన్ హైదరాబాద్‌లో భూగర్భ పార్కింగ్ ఏర్పా టు, సబ్–వేల నిర్మాణం, గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ల అభివృద్ధికి ఫ్రాన్స్ సహాయం తీసుకుంటామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. నగరం లో ట్రామ్–వే ఏర్పాటుకు ఫ్రెంచ్ బృందం తో కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వ హిస్తున్న విషయాన్ని మేయర్ రామ్మోహన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏంటా పరిజ్ఞానం.. భాగ్యనగరంలో 4 వేల సిటీ బస్సులు తిరుగు తున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుని ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియని గందరగోళం నెలకొంది. బస్సు కోసం వేచి చూసి ఎప్పుడొస్తుందో తెలియక ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని నివారించి బస్సుల నిర్వహణను జీపీఎస్ పద్ధతితో క్రమబద్ధం చేయడమే ఈ విధానం. బస్సుల్లో జీపీఎస్‌ను ఏర్పాటు చేసి.. బస్టాప్‌లలో అనుసంధాని స్తారు. సౌర శక్తితో పని చేసే డిస్ప్లే బోర్డులను ఏర్పా టు చేస్తారు. ఏ నంబరు బస్సు ఎంత సేపట్లో ఆ బస్టాప్‌నకు వస్తుందో డిస్ప్లే బోర్డుల్లో కనిపిస్తుంది. ఏ బస్సు ఎక్కడుందో మ్యాప్‌లో కనిపిస్తుంది. వచ్చే బస్టాప్ పేరు, ఎంత సేపట్లో అక్కడికి బస్సు చేరుకుంటుందనేది బస్సుల్లో ముందుగా ప్రకటి స్తారు. బస్టాప్‌లలో ఆగకుండా వెళ్లిన బస్సులు, వాటి వేగం, ఎన్ని బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఉన్నా యి, ఎన్ని బస్సులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయనే వివరాలన్నీ కంట్రోల్ రూమ్‌లో తెలిసిపోతాయి. పరిశీలించిన మంత్రి మహేందర్‌రెడ్డి సీఎం చంద్రశేఖర్‌రావు విశ్వనగర ఆలోచనకు ఇది ప్రతిరూపమని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నా రు. ఫ్రెంచి కంపెనీ ప్రతినిధులు, ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, జీహెచ్ ఎంసీ మేయర్ రామ్మోహన్, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఇతర అధికారులతో కలసి బస్‌భవన్‌లో ఆయన ఈ విధానాన్ని పరిశీ లించారు. ఏ బస్సు ఎక్కడుంది.. ఎంత సేపటిలో వస్తుంది.. తదితర కచ్చిత వివ రాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, వచ్చే స్టాపుల వివరాలు ముందే తెలుసుకునే అవకాశం కలుగు తుందని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ఫ్రెంచి ప్రతినిధులు సీఎస్ ఎస్పీ సింగ్‌కు సచివాలయంలో ఈ విధానం గురించి వివరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు ఇలాంటి విధానం చాలా అవసరమని సీఎస్ అభిప్రాయపడ్డారు. -
తెలంగాణకు ‘బస్సు ప్రాజెక్టు’
* జేఎన్ఎన్యూఆర్ఎం కింద రూ.267.86 కోట్లు మంజూరు * 4 నగరాలకు 552 బస్సులు.. హైదరాబాద్‌కు 80 ఏసీబస్సులు * కరీంనగర్ నగరానికి బస్సు డిపో సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) కిం ద కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలోని నాలుగు నగరాలకు 552 కొత్త బస్సులతో పాటు ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (ఐటీఎస్)లను మంజూరు చేసింది. వీటికి తోడు కరీంనగర్ జిల్లాకు ఓ బస్సు డిపోను సైతం కేటాయించింది. మంజూరైన బస్సుల్లో 80 అధునాతన ఏసీ బస్సులున్నాయి. రూ.267.86 కోట్ల విలువజేసే ఈ ‘బస్సు ప్రాజెక్టు’ వ్యయంలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.113.02 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.52.44 కోట్లు, టీఎస్ఆర్టీసీ రూ. 102.40 కోట్లను భరించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ ప్రాజెక్టును మంజూరు చేసిన నేపథ్యంలో ఈ మేరకు పరిపాలనాపర అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం తనను కలవడానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి వెంకయ్య నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. హైదరాబాద్‌కు 422 బస్సులు రాష్ట్రానికి మంజూరైన 552 బస్సుల్లో 422 బస్సులు హైదరాబాద్‌కు మంజూరయ్యాయి. వీటిలో 80 ఏసీ బస్సులు, 342 నాన్ ఏసీ బస్సులున్నాయి. ఖమ్మంకు 30, మహబూబ్‌నగర్‌కు 30, కరీంనగర్‌కు 70బస్సులు మంజూరయ్యా యి. బస్సులతోపాటే ఐటీఎస్లను కేంద్రం మంజూరు చేసింది. ఐటీఎస్‌లో భాగంగా జీపీఎస్ సహాయంతో బస్సుల ఉనికిని తెలుసుకుని ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. కరీంనగర్లో రూ.4.95 కోట్లతో బస్సు డిపోను నిర్మించనున్నారు. -
ఐటీఎస్ అమలుపై స్టడీ
సాక్షి, సిటీబ్యూరో: వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థపై ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. ఆగస్టు నుంచి అమల్లోకి రానున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రాథమికంగా వెయ్యి బస్సులను ఎంపిక చేశారు. వివిధ రూట్లలో తిరుగుతున్న సిటీ శీతల్ (ఏసీ), లో ఫ్లోర్ నాన్ ఏసీ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు జీపీఆర్ఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఇంటలిజెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (ఐటీఎస్)గా వ్యవహరిస్తున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలుకు బస్సుల రూట్లు, సమయపాలన, ఇతర అంశాలపై అధ్యయనం చేపట్టినట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు ‘సాక్షి’తో చెప్పారు. ఈ అధ్యయనం ఆధారంగా ఐటీఎస్ పరిధిలోకి వచ్చే బస్సుల నిర్వహణలో లోపాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. వారం, పది రోజుల్లో అధ్యయనం పూర్తవుతుందని, ఆపై ఎంపిక చేసిన బస్సులన్నింటిలోనూ ఐటీఎస్ పరికరాలను ఏర్పాటు చేస్తామన్నారు. మొదట లాంగ్ రూట్లలో... ఐటీఎస్ ప్రాజెక్టు మొదట లాంగ్ రూట్లలో అమల్లోకి రానుంది. 30-40 కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే బస్సుల్లో మొదట ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం గ్రేటర్లో 1,050 రూట్లలో సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఇందులో దిల్సుఖ్నగర్-పటాన్చెరు, ఉప్పల్-కొండాపూర్, కోఠి-హైటెక్‌సిటీ, ఎల్బీనగర్-మెహదీపట్నం, ఎల్బీనగర్-సికింద్రాబాద్, ఉప్పల్-లింగంపల్లి వంటి 500కు పైగా లాంగ్ రూట్లు ఉన్నాయి. ప్రధాన మార్గాల్లో రాకపోకలు సాగించే ఈ బస్సుల్లో ఐటీఎస్‌ను అమల్లోకి తీసుకొస్తే ఎక్కువ మంది ప్రయాణికులకు ప్రయోజన ం కలుగుతుందని ఆర్టీసీ భావిస్తోంది. పైగా ఐటీఎస్ అమలు కూడా తేలిగ్గా ఉంటుంది. ప్రారంభ స్టేజీ నుంచి చివరి స్టేజీ వరకు అరగంట కూడా పట్టని రూట్లలో ఐటీఎస్ ఏర్పాటు చేయడం కంటే లాంగ్ రూట్లలోనే ఆశించిన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. లాంగ్ రూట్లలో వచ్చే ఫలితాలను బట్టి మిగతా అన్ని రూట్లకు దశలవారీగా ఐటీఎస్ విస్తరణకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. వేళల్లో మార్పులు... హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు అమలుపై ఆర్టీసీ సీరియస్‌గానే దృష్టి కేంద్రీకరించింది. ఎంపిక చేసిన వెయ్యి బస్సుల్లో బంచింగ్, ఒకే రూట్లో ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ బస్సులు వెళ్లకుండా చర్యలు తీసుకొంటారు. ఒకే రూట్లో వెళ్లే బస్సుల సమయపాలనలో తగిన మార్పులు చేస్తారు. ఉదాహరణకు దిల్సుఖ్నగర్ నుంచి పటాన్‌చెరుకు, వనస్థలిపురం నుంచి కేపీహెచ్‌బీకి బయలుదేరిన బస్సులు ఒకేసారి లక్డీకాపూల్ చేరుకోవడం వల్ల ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ రెండింటి మధ్య కనీసం 5-10 నిమిషాల తేడా ఉన్నా మరింత మంది ప్రయాణికులకు అదనపు రవాణా సదుపాయం లభిస్తుంది. ఇలా ఎంపిక చేసిన వెయ్యి బస్సుల సమయపాలన, రూట్ల నిర్వహణను క్రమబద్ధీకరించడం వల్ల కనీసం 2 లక్షల మంది ప్రయాణికులకు అదనపు రవాణా సదుపాయం లభించే అవకాశం ఉంది.