ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేసవి తరగతుల పేరిట విద్యార్థులను వేధిస్తున్న కార్పోరేట్ కళాశాలలకి ఇంటర్ బోర్డు కొమ్ముకాస్తుందని ఆరోపిస్తూ.. టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు సోమవారం నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టిడికి యత్నించారు. ఇది గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకోవడానికి యత్నించడంతో.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.