Inter student killed
-
ప్రాణం మీదకు తెచ్చిన ‘చాక్లెట్ గొడవ’
హస్తినాపురం: నోరూరించే చాక్లెట్ ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలు పోవడానికి కారణమైంది. డీమార్ట్‌లో చాక్లెట్ తీసుకొని డబ్బులు చెల్లించలేదని, సెక్యూరిటీ సిబ్బంది అడగడంతో ఆదివారం సాయంత్రం షాపింగ్ వచ్చిన సతీష్ (18) భయంతో కుప్పకూలాడని ఆ సంస్థ చెబుతోంది. సెక్యూరిటీ సిబ్బంది దాడివల్లనే తమ కుమారుడు మృతి చెందాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హయత్‌నగర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది హత్యా?.. లేక ఆకస్మిక మరణమా అనేది తేలనుంది. డీమార్ట్‌లో షాపింగ్ చేసి బయటకు వచ్చేంత వరకు సీసీటీవీ కెమెరాల్లో రికార్డుకాగా, బయటకొచ్చాక అతడు కింద పడిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డీమార్ట్ ఎంట్రెన్స్‌కు 40 మీటర్ల దూరంలో పడిపోయిన సతీష్‌ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లుగా రాత్రి 10 గంటల ప్రాంతంలో నిర్ధారించారు. ఘటనాస్థలిని ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ సందర్శించారు. అసలేం జరిగిందంటే..: సూర్యాపేట జిల్లా జగ్గు తండాకు చెందిన లౌడ్య బాలాజీకి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సతీష్(18) హయత్‌నగర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతూ అదే హాస్టల్లో ఉంటున్నాడు. 10 మంది విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఔటింగ్‌కు వెళ్లారు. సతీష్ తన ఇద్దరు స్నేహితులతో కలసి రాత్రి 8.10కి వనస్థలిపురం డీమార్ట్‌లోనికి వెళ్లాడు. ఈ క్రమంలో సతీష్ డైరీ మిల్క్ చాక్లెట్ జేబులో వేసుకున్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. అప్పటికే ఎగ్జిట్ గేట్ దాటి బయటకు వచ్చిన సతీష్‌ను సెక్యూరిటీ సిబ్బం ది పిలవడంతో చాక్లెట్‌ను జేబులో నుంచి కిందపడేశాడు. అప్పటికే చెమటలు పట్టిన సతీష్ ఒక్కసారిగా కుప్పకూలడంతో మిగతా ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి పారి పోయారు. మరణవార్త తెలుసుకొని వచ్చిన సతీష్ తల్లిదండ్రులు మాత్రం కాలేజీ యజమాన్యం నిర్లక్ష్యం, డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బంది దాడివల్లనే తమ కుమారుడు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వి ద్యార్థి సతీష్‌ను బంధువుల అనుమతితోనే ఔటింగ్‌కు పం పామని కళాశాల ప్రిన్సిపల్ స్నేహలత తెలిపారు. ఇంటర్ విద్యార్థిని దొంగతనం నెపంతో కొట్టి హతమార్చిన డీమా ర్ట్ యాజమాన్యంపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్య కేసు నమోదు చేయాలని లంబాడ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆ సంస్థ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించా రు. డీమార్ట్‌ను మూసివేసి వారిపై హత్య కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. -
విషపురుగు కాటుతో విద్యార్థి బలి
సాక్షి, కూడేరు: విషపురుగు కాటుకు గురై ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. ఉదిరిపికొండకు చెందిన దేవేంద్ర (17) ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి ఇంటి ముందు కట్టపై నిద్రకు ఉపక్రమించాడు. రాత్రి బాగా పొద్దుపోయాక చెవి వద్ద విషపురుగు కాటేయడంతో గట్టిగా అరిచాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే దేవేంద్ర మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ నబిరసూల్ కేసు నమోదు చేశారు. -
బాయ్ ... అమ్మా, నాన్నా...
ఒంగోలు క్రైం: ఒక్కగానొక్క కుమారుడిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది. ఒంగోలు నగరంలోని భీమరాజువారివీధిలో నివాసం ఉంటున్న గోనుగుంట శ్రీనివాసులు, భవానీ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారిలో ఒకరు కుమార్తె, మరొకరు కుమారుడు. కుమారుడిని కుటుంబ సభ్యులు అల్లారుముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. కుమారుడు వంశీకృష్ణ (18) ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం కర్నూలు రోడ్డులోని ఫ్లయిఓవర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం అతడి ప్రాణాలు బలి తీసుకుంది. ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కావటంతో పేర్నమిట్టలోని ఓ ప్రైవేట్ కాలేజీలో మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష రాసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు నెలల క్రితం ఇంటిల్లిపాదీ వినియోగించుకునేందుకు కొత్త ద్విచక్ర వాహనాన్ని కొన్నారు. ఒక పక్క పరీక్షలు కావటం.. దీనికి తోడు పరీక్ష కేంద్రం పేర్నమిట్టలో ఉండటంతో బస్సుల్లో పోవటం, రావటం సమయం వృథా అవుతుందని భావించి ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని పరీక్ష కేంద్రానికి వేసుకొని వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు కిందపడి మృతి చెందాడు. తండ్రి శ్రీనివాసులు గంటాపాలెంలో శ్రీసాయి కృష్ణ ఎలక్ట్రికల్ షాప్ నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడని సమాచారం తెలియటంతో ఆ కుటుంబ రోదనలు మిన్నంటాయి. హుటాహుటిన ప్రమాదం జరిగిన స్థలానికి తండ్రి శ్రీనివాసులు, తల్లి భవానీతో పాటు కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరు చూసి చలించిపోయారు. తల్లి భవానీ ప్రమాద దృశాన్ని చూసి భీతిల్లి అక్కడే కుప్పకూలిపోయింది. ఆమెను సమీపంలోని ఓ హోటల్లోకి తీసుకెళ్లి సపర్యలు చేశారు. కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. కుమారుడు విగతజీవుడై రిమ్స్‌లో ఉండటాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. తాతా అమ్మమ్మలు వెంకటేశ్వర్లు, శ్రీదేవిలు కూడా రిమ్స్ వద్దకు వచ్చారు. ఆ వృద్ధ దంపతులను ఓదార్చటం ఎవరి తరం కాలేదు. -
కీచక గురువులకు రిమాండ్
చల్లపల్లి : జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించిన వక్కలగడ్డకు చెందిన ఇంటర్ విద్యార్థిని మృతికేసులో నిందితులైన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, ఇంగ్లిష్ టీచర్‌ను ఆదివారం అవనిగడ్డలోని ఏజేఎఫ్‌సీఎంఈ జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థిని రెండు నెలల కిందట అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై ఏబీవీపీ నేత ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మల్లుపెద్ది శివరామప్రసాద్, అదే గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్ చిరువోలు జనార్దనప్రసాద్‌ను లైంగికదాడి, పోస్కో చట్టాల కింద శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సెలవు కావడంతో అవనిగడ్డలో ని మేజిస్ట్రేట్ ఎదుట వీరిని హాజరుపరచగా, రిమాండ్ విధించినట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. మహిళా సంఘాల ఆగ్రహం కీచక గురువు అరెస్ట్ ఉదంతాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్ని పలువురు మహిళా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల మహిళా నేతలు అదివారం చల్లపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నిందితులిద్దరిపై వైఎస్సార్సీపీ మండల మహిళా కన్వీనర్ వల్లూరి ఉమ, నాయకురాలు బొందలపాటి లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కఠినంగా శిక్షించాలి విద్యార్థిని మృతికి కారకులైన ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు వల్ల విద్యార్థినులు చదువు కోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. - వల్లూరి ఉమ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, చల్లపల్లి అవార్డును వెనక్కి తీసుకోవాలి ఈ కేసులో తాతయ్య వయస్సు అయిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మల్లుపెద్ది శివరామ ప్రసాద్‌కు గతంలో వచ్చిన జాతీయ ఉత్తమ అవార్డును వెనక్కి తీసుకోవాలి. మరో ఉపాధ్యాయుడిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని జీవితాన్ని సగంలోనే బుగ్గిపాలు చేసిన ఈ ఇద్దరినీ కఠినంగా శిక్షించే విధంగా కేసు నమోదు చేయాలి. - బొందలపాటి లక్ష్మి,వైఎస్సార్సీపీ నాయకురాలు, చల్లపల్లి