
మృతుడు బోయ దేవేంద్ర
సాక్షి, కూడేరు: విషపురుగు కాటుకు గురై ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. ఉదిరిపికొండకు చెందిన దేవేంద్ర (17) ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి ఇంటి ముందు కట్టపై నిద్రకు ఉపక్రమించాడు. రాత్రి బాగా పొద్దుపోయాక చెవి వద్ద విషపురుగు కాటేయడంతో గట్టిగా అరిచాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే దేవేంద్ర మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నబిరసూల్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment