Intercontinental missile launch
-
ఖండాంతర క్షిపణిని పరీక్షించిన చైనా
బీజింగ్: అమెరికాలోని నగరాలను తాకేంతగా సుదూరాలకు వెళ్లగల సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)ను చైనా విజయవంతంగా పరీక్షించింది. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటే ఉద్దేశంతోనే చైనా ఈ పరీక్ష జరిపిందని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర జలాల్లో బుధవారం ఉదయం 8.44 గంటలకు జరిపిన ఈ పరీక్ష తమ ఆయుధ పనితీరు, సైన్యం శిక్షణా సామర్థ్యాలను ప్రదర్శించి నిర్దేశిత లక్ష్యాన్ని చేధించిందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పొరుగు దేశాలు ఆందోళన చెందకుండా ముందే రాకెట్ ప్రయోగించే దిశ, గమ్యం తదితర వివరాలను వారితో చైనా పంచుకుంది. దశాబ్దాల కాలంలో చైనా బహిరంగంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారని చైనా అధికారిక ‘చైనా డైలీ’ వార్తాసంస్థ పేర్కొంది. ఈ క్షిపణి ఎంత దూరం వెళ్తుందో చైనా చెప్పలేదు. ఇది పలు అమెరికా నగరాలనూ తాకగలదని హాంకాంగ్ కేంద్రంగా నడిచే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. -
Ju Ae: కిమ్ వారసురాలు ఆమే? వయసు కేవలం పదేళ్లు మాత్రమే!
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ రెండో కుమార్తె జుయే తరచూ బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. కిమ్ వారసురాలు ఆమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. జుయే వయసు కేవలం పదేళ్లు మాత్రమే. తన తోటి వయసు పిల్లల కంటే పొడవుగా పెద్దదానిలా జుయే కనిపిస్తుందని గతంలోనే దక్షిణ కొరియా మీడియా వెల్లడించింది. అంత చిన్న వయసున్న జుయే ఖండాంతర క్షిపణి పరీక్షల ప్రయోగాలకు హాజరు కావడం విస్మయ పరుస్తోంది. ఆ ప్రయోగాల సమయంలోనే తొలిసారిగా మీడియా కంటపడింది. తాజాగా ఆదివారం కిమ్, తన కుమార్తెతో కలిసి శాస్త్రవేత్తలు, ఇతర అధికారులతో చర్చిస్తున్న ఫోటోలను అధికారిక మీడియా విడుదల చేసింది. -
ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం విఫలం
సియోల్: ఉత్తరకొరియా గురువారం తెల్లవారుజామున నిర్వహించిన మధ్య శ్రేణి ఖండాతర క్షిపణి ప్రయోగం విఫలమైందని దక్షిణకొరియా తెలిపింది. దీంతో రెండు వారాల వ్యవధిలో క్షిపణి ప్రయోగంలో రెండోసారి ఆ దేశం విఫలమైంది. దేశ తూర్పు తీరం నుంచి ప్రయోగించిన కొన్ని సెకన్లకే క్షిపణి భూమిపై పడిపోయిందని దక్షిణ కొరియా రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పసిఫిక్ సముద్రంలో ఉన్న గుయామ్లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఈ మధ్యశ్రేణి క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నారు. ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్ సంగ్-2 జయంతి సందర్భంగా ఈ నెల 15న నిర్వహించిన క్షిపణి ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్దిసేపటికే అది పేలిపోయిందని పెంటగాన్ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు మే 6 తేదీ నుంచి కిమ్ జోంగ్ ప్రభుత్వం ఐదో అణుపరీక్ష ప్రారంభిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉత్తరకొరియా వరుసగా నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి. క్షిపణుల్లో పట్టేందుకు వీలుగా చిన్నస్థాయి అణ్వాయుధాల్ని రూపొందించడంతో పాటు గత శనివారం సబ్మెరైన్ నుంచి ఖండాతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.