సియోల్: ఉత్తరకొరియా గురువారం తెల్లవారుజామున నిర్వహించిన మధ్య శ్రేణి ఖండాతర క్షిపణి ప్రయోగం విఫలమైందని దక్షిణకొరియా తెలిపింది. దీంతో రెండు వారాల వ్యవధిలో క్షిపణి ప్రయోగంలో రెండోసారి ఆ దేశం విఫలమైంది. దేశ తూర్పు తీరం నుంచి ప్రయోగించిన కొన్ని సెకన్లకే క్షిపణి భూమిపై పడిపోయిందని దక్షిణ కొరియా రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పసిఫిక్ సముద్రంలో ఉన్న గుయామ్‌లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఈ మధ్యశ్రేణి క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నారు. ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్ సంగ్-2 జయంతి సందర్భంగా ఈ నెల 15న నిర్వహించిన క్షిపణి ప్రయోగం విఫలమైంది.
ప్రయోగించిన కొద్దిసేపటికే అది పేలిపోయిందని పెంటగాన్ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు మే 6 తేదీ నుంచి కిమ్ జోంగ్ ప్రభుత్వం ఐదో అణుపరీక్ష ప్రారంభిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉత్తరకొరియా వరుసగా నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి. క్షిపణుల్లో పట్టేందుకు వీలుగా చిన్నస్థాయి అణ్వాయుధాల్ని రూపొందించడంతో పాటు గత శనివారం సబ్‌మెరైన్ నుంచి ఖండాతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.
ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం విఫలం
Published Fri, Apr 29 2016 4:36 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM
Advertisement