interest bussiness
-
చిన్న ఫైనాన్స్ బ్యాంకులు... కళకళ!
ముంబై: తానిచ్చే రుణాలపై రిటర్న్స్, తన వద్ద డిపాజిట్లపై చెల్లించే వడ్డీల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో పోల్చితే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీ) ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నాయి. రుణ నాణ్యత విషయంలోనూ వాటికి అవే సాటిగా కొనసాగుతున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ– కేర్ రేటింగ్స్ విడుదల చేసిన ఒక విశ్లేషణాత్మక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... -తానిచ్చే రుణాలపై 19.87 శాతం రిటర్న్స్‌ను చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పొందుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఈ రేటు 8.16 శాతంగా ఉంది. ప్రైవేటు రంగ బ్యాంకులు 10.10 శాతం రిటర్న్స్ పొందుతుండగా, ఫారిన్ బ్యాంకింగ్‌కు 8.45 శాతం వడ్డీ వస్తోంది. -నిధుల సమీకరణ వ్యయం మాత్రం చిన్న ఫైనాన్స్ బ్యాంకుల విషయంలో అత్యధికంగా 8.66 శాతంగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులపై నిధుల సమీకరణ భారం 4.92 శాతంగా ఉంటే, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల విషయంలో ఈ వడ్డీరేట్లు వరుసగా 5.41 శాతం, 3.73 శాతాలుగా ఉన్నాయి. -ఒక్క డిపాజిట్లపై ఎస్ఎఫ్బీలు చెల్లించే వడ్డీ 8.20 శాతం. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 4.96 శాతం వడ్డీని చెల్లిస్తుండగా, ప్రైవేటు రంగ బ్యాంకులు 5.26 శాతం ఇస్తున్నాయి. ఫారిన్ బ్యాంకుల విషయంలో మరీ తక్కువగా 3.65 శాతంగా ఉంది. -ఒక్క అసెట్స్ చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులకు రిటర్న్స్ మైనస్ 0.23 శాతంగా ఉంది. ప్రైవేటు బ్యాంకింగ్ విషయంలో ఇది 0.51 శాతం ఉంటే, ఎస్ఎఫ్బీలు మాత్రం అత్యధికంగా 1.70 శాతం రిటరŠస్న్ ఉన్నాయి. మల్టీ నేషనల్ కంపెనీ రుణదాతలు 1.55 శాతం రిటర్న్స్ పొందుతున్నారు. నగదు, ప్రభుత్వ బాండ్లు, తనఖాలు, లెటర్స్ ఆఫ్ క్రెడిట్, ఇంటర్ బ్యాంక్ రుణాలు అసెట్స్ విభాగం లోకి వస్తాయి. -ఈక్విటీ ఆదాయాలపై చెల్లింపుల విషయానికి వస్తే, 15 శాతంతో చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మైనస్ 4.16 శాతంతో ఉంటే, ప్రైవేటు బ్యాంకింగ్ ఆదాయం 3.30 శాతంగా ఉంది. ఫారిన్స్ బ్యాంకింగ్ తమ ఇన్వెస్టర్లకు 8.76 శాతం చెల్లిస్తోంది. -చిన్న ఫైనాన్స్ బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్ల విలువ 2019–20 ఆర్థిక సంవత్సరంలో 8.34 శాతం. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఫారిన్ బ్యాంకుల విషయంలో ఈ శాతాలు వరుసగా 2.27 శాతం, 3.42 శాతం, 3.26 శాతాలుగా ఉన్నాయి. -బ్యాంకింగ్ ప్రమాణాల విషయంలోనూ ఇవి మెరుగైన స్థానంలో ఉన్నాయి. క్యాపిటల్ అడిక్వెసీ రేషియో 20.2 శాతంగా ఉంటే, ఎన్పీఏల భారం 1.9 శాతంగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఫారిన్ బ్యాంకుల విషయంలో క్యాపిటల్ అడిక్వెసీ వరుసగా 12.9 శాతం, 16.5 శాతం, 17.7 శాతంగా ఉన్నాయి. ఇక ఎన్పీఏల విషయంలో ఈ రేట్లు వరుసగా 10.3 శాతం, 5.5 శాతం, 2.3 శాతాలుగా ఉన్నాయి. 10 ఎస్‌ఎఫ్‌బీల క్రియాశీలక పాత్ర 2016 తరువాత 10 చిన్న ఫైనాన్స్ బ్యాంకులు దేశంలో క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. రుణ లభ్యత సరిగా లేని రంగాలకు అలాగే చిన్న వ్యాపారాలు, రైతులకు సకాలంలో తగిన రుణ సౌలభ్యత కల్పించడం లక్ష్యంగా చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ 10 ఎస్‌ఎఫ్‌బీల మొత్తం బ్యాలెన్స్ షీట్ 2019–20 ఆర్థిక సంవత్సరానికి 1.33 లక్షల కోట్లు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో వీటి వాటా 0.7 శాతం. ఈ విషయంలో ఒక్క 2019–20 ఆర్థిక సంవత్సరంలో 58 శాతం వృద్ధి రేటు నమోదుకావడం గమనార్హం. మొత్తం బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లో వృద్ధి 8.5 శాతం మాత్రమే. ఇక మొత్తం 1.33 లక్షల కోట్ల బ్యాలెన్స్ షీట్లో రూ.5,151 కోట్లు మూలధనం. రూ.11,047 కోట్లు నిల్వలు. డిపాజిట్లు రూ.82,488 కోట్లు. వీటిలో టర్మ్ డిపాజిట్ల విలువ రూ.69,823 కోట్లు. రిటర్న్స్, చెల్లించే వడ్డీల విషయంలో అధిక ధర ఎందుకు ఉందన్న అంశాన్ని కూడా నివేదిక వివరించింది. ఈ బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో 60 శాతం ఏడాదికన్నా తక్కువ కాలానికి సంబంధించినవే. ఒకటి నుంచి మూడేళ్ల మధ్య డిపాజిట్లు 37.5 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇందుకు సంబంధించి శాతాలు వరుసగా 40.4 శాతం, 22.8 శాతాలుగా ఉన్నాయి. ఇక ఇచ్చే రుణాల విషయంలో ఏడాది కన్నా తక్కువ కాలానికి సంబంధించిన రుణాలు 38.1 శాతం. 1 నుంచి మూడేళ్ల మధ్య రుణాలు 42.4 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇవి వరుసగా 25.2 శాతం, 40.3 శాతాలుగా ఉన్నాయి. -
అన్నయ్యా.. చనిపోతున్నా..
జీవితాన్ని ఒకటిగా చేసుకున్నారు... ఒడుదొడుకులు వచ్చినా ఒరిగిపోబోమంటూ సాఫీగా జీవన గమనానికి దిక్సూచిగా నిలిచారు. అంతలోనే అప్పుల బాధ వెంటాడింది... కల్లోల హృదయాలకు కాస్త ఓదార్పు కూడా కరువైందేమో దంపతులిద్దరూ మృత్యువులోనూ మమేకమవుదాం అనుకున్నారు. నిద్రమాత్రలు మింగి శాశ్వత నిద్రలోకి జారుకుందామనుకున్నారు. చివరిలో బతకాలన్న ఆశ చిగురించిందో... మమకారం పంచిన అన్న అనునయం గుర్తుకొచ్చిందో వేకువజామున... అపస్మారక స్థితిలో విజయవాడలో ఉన్న అన్నయ్యకు ఫోన్ చేసి చనిపోతున్నట్టు అతి కష్టంగా చెప్పింది. వారు వచ్చి కాపాడేలోగానే భర్త మృతి చెందాడు... ఆమె మృత్యువుతో పోరాడుతోంది. మరో ఘటనలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తే కొరివిగా మారాడు. వేధింపులు తట్టుకోలేక కిరోసిన్‌ను శరీరంపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా ఇల్లాలు. ఆమె ప్రాణం కూడా ఆస్పత్రిలో విలవిల్లాడుతోంది. మంటలు ఆర్పబోయిన భర్త కూడా ఆస్పత్రి పాలయ్యాడు. గుడివాడ : అప్పుల బాధ భరించలేక దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుడివాడలో మంగళవారం జరిగింది. భర్త మృతిచెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం స్థానిక రత్నమాల వీధిలో నివాసముంటున్న కొత్త ప్రసాదరావుకు చంద్రశేఖర్, ప్రేమ్‌చంద్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ప్రేమ్‌చంద్‌కు 2000లో విజయవాడకు చెందిన మాధవితో వివాహమైంది. ఆ తర్వాత తండ్రి ప్రసాదరావు తనకున్న ఆస్తిని ఇద్దరు కుమారులకు పంచేశారు. వారికి ఉన్నది ఒకే భవనం కాగా, పైన పెద్ద కుమారుడు చంద్రశేఖర్‌తో తల్లిదండ్రులు నివసిస్తున్నారు. కింద చిన్న కుమారుడు ప్రేమ్‌చంద్ ఉంటున్నారు. రూ.10 లక్షల అప్పుతో వ్యాపారం... ప్రేమ్‌చంద్ వివాహానంతరం వడ్డీ వ్యాపారుల నుంచి రూ.10 లక్షలు రూ.5 చొప్పున వడ్డీకి అప్పుగా తీసుకుని కుసుమహరనాథ మందిరం సమీపంలో ‘గంగేశ ఎలక్ట్రానిక్స్’ అనే షాపు ఏర్పాటు చేసుకున్నాడు. నష్టాలు వస్తుండటంతో నాలుగేళ్ల క్రితం స్థానిక ఏలూరు రోడ్డులో అదే పేరుతో మరో షాపు ఏర్పాటు చేశాడు. వ్యాపార అవసరాల రీత్యా మరికొన్ని అప్పులు కూడా చేశాడు. ఇక్కడ కూడా వ్యాపారం మందకొడిగా సాగడంతో మనస్థాపానికి గురయ్యాడు. భార్య వద్ద నిత్యం అప్పుల విషయాన్ని ప్రస్తావించేవాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కంటతడి పెట్టుకునేవాడు. అప్పులన్నీ కలిపి కోటిరూపాయలు పైనే ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వాటి వసూలు కోసం నిత్యం బాకీదారులు షాపు వద్దకు, ఇంటికి వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అన్నయ్యా మా ఆయన చనిపోయాడు.. నేనూ చచ్చిపోతున్నా.. దంపతులిద్దరూ తెల్లవారుజామున నిద్రమాత్రలు మింగగా ప్రేమ్‌చంద్ అక్కడికక్కడే మృతిచెందాడు. 4.30 సమయంలో భార్య మాధవి అపస్మారక స్థితిలో ఉండి విజయవాడలోని తన అన్నయ్య కందుకూరి హరిప్రసాద్‌కు ఫోన్‌చేసి ‘అన్నయ్యా నేనూ మీ బావగారూ ఆత్మహత్యకు పాల్పడ్డాం.. మా ఆయన చనిపోయారు.. నేనూ ఎక్కువ సేపు బతకను’ అని తెలిపింది. దీంతో ఆందోళనకు గురైన హరిప్రసాద్ ప్రేమ్‌చంద్ తండ్రి ప్రసాదరావుకు ఫోన్లో విషయం తెలిపాడు. వెంటనే పైన ఉంటున్న తండ్రి ప్రసాదరావు, అన్న చంద్రశేఖర్ కిందకి వచ్చి తలుపులు కొట్టారు. ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో వెనుక తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ప్రేమ్‌చంద్ మృతిచెందగా, మాధవి నురగలు కక్కుతూ కనిపించింది. వెంటనే ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అసహజ మరణం కింద వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ్‌చంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు.. పిల్లలు లేరనే బాధ.. ప్రేమ్‌చంద్ అప్పుల విషయంలో ఇంట్లో ఎప్పుడూ గొడవలు కూడా జరిగేవని స్థానికులు చెబుతున్నారు. దీంతోపాటు పెళ్లయి 14 ఏళ్లు అయినా పిల్లలు కలగకపోవడంపై దంపతులిద్దరూ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తన చెల్లి, బావలకు అప్పులున్న సంగతి తెలియదని, ఏరోజూ ఆ విషయాన్నే వారు ప్రస్తావించలేదని మాధవి అన్నయ్య కందుకూరి హరిప్రసాద్ వాపోయారు. చెల్లెలి ఫోన్ సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న ఆయన విగతజీవిగా ఉన్న ప్రేమ్‌చంద్‌ను చూసిన కుప్పకూలిపోయారు. బావా నాకు చెప్తే నీ అప్పు నేను తీర్చేవాడ్ని కదా... అంటూ భోరుమన్నారు. భర్త వేధింపులు తాళలేక... జమ్మవరం (వీరులపాడు/ కంచికచర్ల రూరల్) : భర్త తప్పతాగి రోజూ వేధిస్తున్నాడని మనస్తాపం చెందిన భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన వీరులపాడు మండలం జమ్మవరంలో మంగళవారం జరిగింది. మహిళ శరీరం ఎక్కువభాగం కాలిపోగా, మంటలను ఆర్పే ప్రయత్నంలో భర్తకూ తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం వీరులపాడు మండలం జమ్మవరానికి చెందిన మంగలపూడి గ్రేస్‌కుమారి భర్త వెంకటరత్నం వ్యవసాయ కూలీ. వారికి ఇద్దరు కుమారులు. భర్త రోజూ తాగి వచ్చి వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన గ్రేస్‌కుమారి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒక్కసారిగా ఒంటినిండా మంటలు వ్యాపించటంతో ఆ బాధ తాళలేక కేకలు వేసింది. సమీపంలో ఉన్న భర్త ఇంట్లోకి వెళ్లిచూడగా అప్పటికే కుమారి శరీరం ఎక్కువ భాగం కాలిపోయింది. మంటలను ఆర్పే ప్రయత్నంలో వెంకటరత్నం కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న కంచికచర్ల 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వారిద్దరినీ నందిగామ ఏరియా ఆస్పత్రికి, అక్కడినుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.