interface
-
హలో.. ఆస్ట్రోనాట్..!
అంతరిక్షంలో విధినిర్వహణలో ఉండే వ్యోమగాములు ఇకపై తమకు ఏదైనా సమాచారం, సాయం కావాలంటే భూమిపై అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. తాము ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌకను అడిగితే చాలు.. కావాల్సిన సమాచారం దొరుకుతుంది. అది కూడా సంభాషణల రూపంలోనే. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ తరహాలో పనిచేసే ఇంటర్ఫేస్ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. ఇతర గ్రహాలపై అన్వేషణ కోసం వెళ్లే వ్యోమగాములు తాము ప్రయాణించే అంతరిక్ష నౌకలతో సంభాషించడానికి ఈ ఇంటర్ఫేస్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వ్యోమగాములకు అంతరిక్ష నౌకలు తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా భూమిపై ఉండే మిషన్ కంట్రోలర్లు ఇతర గ్రహాలపై పనిచేసే ఏఐ ఆధారిత రోబోలతో సులభంగా మాట్లాడొచ్చని అంటున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసింది. చంద్రుడి కక్ష్యలో ‘లూనార్ గేట్‌వే’ పేరిట ఒక అంతరిక్ష కేంద్రాన్ని సైతం నిర్మించాలని భావిస్తోంది. ఈ స్పేస్ స్టేషన్లో ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ సేవలు ఉపయోగించుకోవాలని నాసా నిర్ణయానికి వచి్చనట్లు ఇంజనీర్ డాక్టర్ లారిస్సా సుజుకీ చెప్పారు. అంతరిక్ష నౌకలతో నేరుగా సంభాషించడం, వాటి నుంచి వెనువెంటనే ప్రతిస్పందనలు అందుకోవడమే దీని ఉద్దేశమని వివరించారు. అంతరిక్షంలో గమనించిన విషయాలను సంభాషణల రూపంలో భూమిపైకి చేరవేస్తాయని, ప్రమాదాలు ఎదురైనప్పుడు హెచ్చరికలు జారీ చేస్తాయని అన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అంతరిక్ష నౌకల్లో కృత్రిమ మేధ ఆధారిత గ్రహాంతర సమాచార వ్యవస్థను నిక్షిప్తం చేయడం తప్పనిసరి అవుతుందని వెల్లడించారు. అంతరిక్ష నౌకలతో సంబంధాలు తెగిపోయినప్పుడు, వాటిలో లోపాలు తలెత్తినప్పుడు, పనిచేయకుండా పోయినప్పుడు, ఇంజనీర్లను అంతరిక్షంలోకి పంపించలేమని చెప్పారు. ఏఐ ఆధారిత సంభాషణ వ్యవస్థతో అంతరిక్ష నౌకల్లోని లోపాలు వెంటనే తెలిసిపోతాయని వివరించారు. ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను అంతరిక్ష వాహనాల్లో అమర్చడం ద్వారా ఇతర గ్రహాలపై ఉండే ఖనిజ లవణాలు, వాతావరణ పరిస్థితులు గురించి కచి్చతమైన సమాచారం పొందవచ్చని డాక్టర్ లారిస్సా సుజుకీ అభిప్రాయపడ్డారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
అద్భుత విజయం: పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి..
కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన ఘనత సాధించారు. పక్షవాతానికి గురై పూర్తిగా మాట్లాడే శక్తిని కోల్పోయిన వాళ్ల నుంచి.. చెప్పదల్చుకున్న విషయాల్ని బయటకు రప్పించే టెక్నాలజీని రూపొందించారు. ‘స్పీచ్ న్యూరోప్రోస్థెసిస్’ Speech Neuroprosthesisతో అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ.. బ్రెయిన్ నుంచి గొంతు ద్వారా సిగ్నల్స్ సేకరించి, అటుపై పేషెంట్లు చెప్పదల్చుకున్న విషయాన్ని ఎదురుగా ఉన్న తెరపై వేగంగా డిస్ప్లే చేస్తాయి. ఫ్లోరిడా: కాలిఫోర్నియా యూనివర్సిటీ(UCSF) న్యూరోసర్జన్ డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ నేతృత్వంలోని బృందం పదేళ్ల పరిశోధనల తర్వాత ఈ విజయాన్ని సాధించింది. ఇంతకు ముందు ఇలాంటి పరిశోధనలే జరిగినప్పటికీ.. చేతి కండరాల కదలికల ద్వారా చెప్పదల్చుకున్న విషయాన్ని రాబట్టడం లాంటి ఫలితాలొచ్చాయి. కానీ, కాలిఫోర్నియా బృందం సాధించిన విజయంలో.. నేరుగా స్వర వ్యవస్థకే అనుసంధానమై ఉండడం వల్ల ఒక్కో అక్షరం కాకుండా, ఒకేసారి ఎక్కువ పదాలను తెరపై చూపించేందుకు ఆస్కారం ఏర్పడింది. తద్వారా సాధారణ వ్యక్తి మాట్లాడగలిగినట్లే.. పెరాలసిస్ బారినపడ్డ వ్యక్తి నుంచి(75 శాతం) సందేశాలను ఆశించొచ్చు. పైగా ఇది సంక్లిష్టమైన పద్ధతి కాదని, పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని డాక్టర్ ఎడ్వర్డ్ ఛాంగ్ వెల్లడించారు. ‘స్టెనో’ పేరుతో కొనసాగిన ఈ ప్రాజెక్ట్‌కు ఫేస్బుక్ స్పాన్సర్ చేసింది. పక్షవాతానికి గురైన వ్యక్తి నుంచి సహజంగా పదాలను బయటకు తెప్పించడం నిజంగా ఓ అద్బుత విజయంగా పేర్కొంటూ న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో బుధవారం ఈ పరిశోధనకు సంబంధించిన విషయాల్ని ప్రచురించింది. కేవలం పక్షవాతానికి గురైమాత్రమే కాదు.. ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో, షాక్‌లతో మాట్లాడలేని స్థితికి చేరుకుంటుంటారు. వాళ్ల కోసం ఈ న్యూరాల్ టెక్నాలజీ ఉపయోగపడొచ్చని ఆ జర్నల్‌లో పలువురు వైద్యు నిపుణులు అభిప్రాయపడ్డారు. జుకర్‌బర్గ్ ఖుష్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా(సిగ్నల్స్ చేరివేత ద్వారా) పేషెంట్ చెప్పాలనుకున్న విషయం తెరపై దానికదే టైప్ కావడం ఈ న్యూరల్ టెక్నాలజీ ప్రత్యేకం. ఇక తమ సౌజన్యంతో రూపొందించిన ఈ న్యూరల్ టెక్నాలజీ ఘన విజయంపై ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘బ్రావో’ పేరుతో జరిగిన ఈ అధ్యయనంలో 15 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో గాయపడి కదల్లేని స్థితికి చేరుకున్న ఓ వ్యక్తిపై కాలిఫోర్నియా ప్రొఫెసర్లు పరిశోధనలు చేశారు. ‘నాకేం దాహంగా లేదు, నా వాళ్లను పిలవండి, బాగానే ఉన్నా’ లాంటి పదాల్ని ఆ వ్యక్తి వ్యక్తం చేశాడు. -
ఎసూస్ నుంచి కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘ఎసూస్’ తాజాగా ‘జెన్‌ఫోన్ గో 4.5’ అనే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.6,999గా ఉంది. ఆండ్రాయిడ్ మార్‡్షమాలో 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో జెన్‌యూఐ ఇంటర్ఫేస్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వివరించింది. -
పోలీసుల బదిలీలలో పొరుగుపెత్తనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ పోలీస్ రేంజ్ పరిధిలో ఇటీవల జరిగిన ఇనస్పెక్టర్ల బదిలీలు ఆ శాఖలో ఇప్పటికీ చర్చలకు తావిస్తున్నాయి. పనితీరు, సీనియారిటీ, ట్రాక్ రికార్డు ప్రామాణికంగా కాకుండా.. కులాల ప్రాతిపదికన ఈ బదిలీలు జరగడం వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు తెచ్చుకున్న వారిని అందలమెక్కించడం.. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతలతో పైరవీలు చేయించుకున్న వారికి కోరుకున్న చోటుకు బదిలీ చేయడం కలకలం రేపుతోంది. అధికారం దన్నుతో నోటికొచ్చినట్టు మాట్లాడి దురుసుగా వ్యవహరించే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి సీఐల బదిలీల్లో తన వర్గం మార్కు చూపించారు. తన సామాజికవర్గానికి చెందిన సీఐలను రేంజ్లో కీలకమైన పోలీస్‌స్టేన్లలో పోస్టింగులు ఇప్పించుకున్నారు. సిక్కోలు నేత సిత్రాలు ఇవే.. విశాఖ వన్‌టౌన్ ట్రాఫిక్ పోలీస్స్టేన్లో పని చేస్తున్న ఇన్స్పెక్టర్.. ఎంవీపీ సీఐగా బదలీ కావడం వెనుక సదరు నేత సిఫారసు గట్టిగా పనిచేసిందని తెలుస్తోంది. విశాఖ మెరైన్ పోలీస్ విభాగంలో ఉన్న ఓ సీఐని ఇచ్ఛాపురం పోలీస్‌స్టేçÙన్కు బదలీ చేయించుకున్నారు. పరవాడలో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ను ఎస్కోటకు, స్టీల్‌ప్లాంట్ పోలీస్‌స్టేçÙన్ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న సీఐని శ్రీకాకుళం విజిలెన్స్‌కు బదలీ చేయించడం వెనుక సదరు ప్రజాప్రతినిధి సిఫారసు లేఖలు, పైరవీలు, ఒత్తిళ్లు పనిచేశాయనేది పోలీసువర్గాలే అంగీకరిస్తున్న వాస్తవం. అందుకే ఆ వర్గానికి చెందిన పోలీసులందరూ సదరు ప్రజాప్రతినిధి విశాఖ సర్కూ్యట్ హౌస్‌లో బస చేయడానికి వస్తే చాలు అక్కడ వాలిపోయి బారులు తీరుతుంటారు. పోలీసుశాఖలో వర్గ ప్రాబల్యం కోసం, విశాఖలో కూడా తనవాళ్లు ఉండాలన్న ఉద్దేశంతో ఆయన ఈసారి సీఐల బదిలీల్లో చక్రం తిప్పేశారు. ఇప్పటికే రేంజ్లో సబ్ డివిజనల్ స్థాయిలో ఉన్న సదరు ప్రజాప్రతినిధి సోదరుడు ఆవర్గ పోలీసులకు, ఆయనకు మధ్య వారధిలా పనిచేస్తున్నాడనేది పోలీసుశాఖలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఖాకీ బాస్‌లపై ఒత్తిళ్లు ఇక శ్రీకాకుళం జిల్లాకే చెందిన మరో ప్రజాప్రతినిధి కూడా తన సామాజికవర్గ పోలీసుల బదిలీల్లో కీలకపాత్ర పోషించారు. ఎంవీపీలో పనిచేసిన ఓ సీఐ అనకాపల్లికి బదలీ కావడం, విశాఖ ట్రాఫిక్‌లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ నగరంలోని నాలుగోటౌన్కు బదలీ కావడం, విజయనగరం జిల్లా గజపతినగరంలో పని చేసిన అధికారి యలమంచిలికి బదలీ కావడం వెనుక సదరు నేత పైరవీలు, సిఫారసులే కారణమని అంటున్నారు. వాస్తవానికి ఒక నియోజకవర్గ పరిధిలోని పోలీస్‌స్టేçÙన్ల సీఐలు, ఎస్ఐల బదలీలకు మాత్రమే అక్కడి ఎమ్మెల్యే సిఫారసు లేఖలు ఇవ్వొచ్చు. కానీ సామాజికవర్గమే నేపథ్యంగా తమవారు విశాఖలో కీలక పోస్టుల్లో ఉండాలన్న ఉద్దేశంతో సదరు ఎమ్మెల్యేలు పొరుగు జిల్లాల్లోని పోలీసుల బదలీల్లో కూడా జోక్యం చేసుకున్నారు. కోరుకున్న చోటకు బదిలీలతో పాటు ఇష్టం లేని చోట నుంచి కూడా ట్రాన్స్ఫర్ అయ్యేందుకు కూడా పోలీసులు సదరు శ్రీకాకుళం ఎమ్మెల్యేనే ఆశ్రయిస్తున్నారు. మల్కాపురంలో సీఐగా పనిచేసి ఆరోపణల్లో కూరుకుపోయిన ఓ అధికారిని ఉన్నతాధికారులు మొదట జీకేవీధికి బదిలీ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వర్తించడం ఇష్టం లేని ఆ సీఐ దీర్ఘకాల లీవు పెట్టేసి తన సామాజికవర్గానికి చెందిన శ్రీకాకుళం ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఆ సీఐ తరఫున వకాల్తా పుచ్చుకున్న సదరు ఎమ్మెల్యే ఇప్పుడు ఆ అధికారి బదలీ కోసం రేంజ్ ఉన్నతాధికారిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది. పోస్టింగ్ పొందిన స్టేషన్లో ఉద్యోగం చేయకుండా లీవు పెట్టేసి ఆనక ఎమ్మెల్యేతో ఒత్తిడి చేయించిన ఆ సీఐ పట్ల ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు ఇలా రేంజ్ పరిధిలోని పోలీస్ బదిలీల్లో ఇష్టారాజ్యంగా జోక్యం చేసుకుంటుంటే విశాఖ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులు చేష్టలుడిగి చూస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సిఫార్సు లేఖలతో బదలీలు ఎలా? మునుపెన్నడూ లేని విధంగా జరుగుతున్న సిఫారసు లేఖల పోస్టింగులతో వర్గ ప్రాబల్యం, రాజకీయ పలుకుబడి లేని పోలీసులు బలవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ట్రాక్రికార్డు బాగున్నప్పటికీ కేవలం ఎమ్మెల్యే లెటర్ లేక పోవడం వల్ల పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న పోలీసుల జాబితా చాలానే ఉంది. పోలీసుల బదిలీల్లో ఎమ్మెల్యే లేఖలతో పాటు కొన్ని సందర్భాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీల సిఫారసులు కూడా పనిచేస్తున్నాయంటే బదిలీల ఫార్సు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సిఫారసు లేఖల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పోలీసులు పోస్టింగ్ తర్వాత ఆ ప్రజాప్రతినిధిని కాదని అక్కడ పార్టీలు, రాజకీయాలకతీతంగా ఏవిధంగా పని చేస్తారన్న ప్రశ్నలకు ఉన్నతాధికారుల వద్ద కూడా సరైన సమాధానం దొరకడం లేదు.