Interior designer
-
హైదరాబాద్ లో ఇంటీరియర్ డిజైనర్ పై భర్త హత్యాయత్నం
-
కలల సౌధాన్ని డిజైన్ చేస్తాను!
‘ప్రతి ఇంటికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది.ఇంటి యజమానిప్రాధాన్యతలకు అనుగుణంగా ఆ ఇంటి డిజైనింగ్ ఉండాలి. వారి కలల సౌధాన్ని కళ్ల ముందు నిలపడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని తన గురించి, తన ప్రాజెక్ట్స్ గురించి వివరించారు ఇటీవల ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రోఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ షబ్నమ్ గుప్త. 48 ఏళ్ల షబ్నమ్ గుప్త 16 ఏళ్ల వయసు నుంచే ఈ రంగంలోకి వచ్చానని వివరించింది. ఆమె డిజైన్స్ సెలబ్రిటీల ఇళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. అపార్ట్మెంట్లు, ఫామ్‌హౌజ్‌లు, హాస్పిటల్స్ నుంచి మట్టితో కట్టిన చిన్న రూమ్‌లను కూడా తన విలక్షణమైన శైలితో ఆవిష్కరిస్తుంటారు. తనే ఇన్నేళ్ల ప్రయాణం గురించి షబ్నమ్ వివరిస్తూ.. ‘‘నా జీవితంలో అత్యంత ప్రభావాన్ని కలిగించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మానాన్నలు, మా వారు. వాళ్లతో చేసే చర్చలు నాలో ఇంకా స్థిరత్వానికీ, ఎదుగుదలకూ తోడ్పడుతుంటాయి. ఎందుకంటే వాళ్లే నా వర్క్‌లో మొదటి అతిపెద్ద విమర్శకులు. దేనినీ త్వరగా మెచ్చుకోరు. వాళ్లను మెప్పించడం అంటే నేను సూపర్ సక్సెస్ అయినట్టు అనుకుంటాను. అంతగా నా వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతాను. మొదటిసారి మా నాన్న ఇల్లు కట్టించినప్పుడు నేను చాలా ఆసక్తి కనబరిచాను. చాలా మార్పులు, చేర్పులు చేశాను. నాన్నగారు కూడా నా సూచనలను చాలా బాగా తీసుకున్నారు. అక్కడి నుంచి ఇంటీరియర్, ఆర్కిటెక్చర్ మీద ఇష్టం ఏర్పడింది. దీంతో ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లోమా పూర్తి చేశాను. ముంబయ్ ర హేజా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి కోర్స్ పూర్తి చేసుకున్నాక సొంతంగాప్రాక్టీస్ మొదలు పెట్టాను. దీనికి ముందు ప్రముఖ ఆర్కిటెక్ట్ తుషార్ దేశాయ్‌తో కలిసి పనిచేయడం ద్వారా డిజైనింగ్‌లో చాలా నైపుణ్యాలను నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫిల్మ్ప్రోడక్షన్ హౌజ్‌లో ఒక చిన్న పనితో నా లైఫ్ స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి నా సొంత లేబుల్ పెరుగుతూ వచ్చింది. నా ఖాతాలో ఆదిత్యా చోప్రా, రాణీ ముఖర్జీ, పరిణీతి చోప్రా.. వంటి చాలా మంది బాలీవుడ్ తారల ఇళ్లు, మీడియా హోజ్లు, హాస్పిటల్స్ డిజైన్ చేసినవి ఉన్నాయి. టీమ్ వర్క్.. డిజైనింగ్‌లో ఎప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలకు స్పేస్ ఉంటుంది. ఇందులో ప్రకృతి, మన సంప్రదాయం, కళలు అన్నింటినుంచి ప్రేరణ పొందవచ్చు. ఈ డిజైనింగ్‌లో ప్రకృతితో మనకు ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. ఏ ఒక్కరి జీవిత ప్రయాణం మరొకరితో పోల్చలేం. చాలామంది విజయాలకు వేర్వేరు అర్థాలు ఉంటాయి. మనం చేసే పనిలో సంతృప్తి పొందితే చాలు. మిగతా ట్యాగ్లు ఏవీ అక్కర్లేదు. వాటిని నేను సీరియస్‌గా తీసుకోను కూడా. ఇప్పటివరకు నా ప్రయాణం ప్రశాంతతను నేర్పింది. చాలా మందితో కలిసి టీమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మానవ సంబంధాలను తెలుసుకునే వీలుంటుంది. మా టీమ్‌తో పనిచేసే సమయంలో చాలా జోవియల్‌గా ఉంటాను. ఎలా అంటే ఒక మానసిక వైద్యుడిలా. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండటంతో పనిప్రదేశంలో ఉల్లాసంగా ఉంటాం. పట్టణ, నగర వాసాల నుంచి, గ్రామీణ ఇండ్ల వరకు డిజైన్ చేసినవన్నీ నా జాబితాలో ఉన్నాయి. ఈ రంగంలో మన చేత వర్క్ చేయించుకునేవారితో నమ్మకమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం ముఖ్యం. అలాగే, వ్యాపారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఇదే ఇన్నేళ్ల నా ప్రయాణంలో సాధించిన విజయం అనుకుంటాను. ప్రతిదీ సాధనే.. ఆర్కిటెక్చర్లో భాగంగా దేశమంతా తిరిగాను. ప్రముఖ ఆర్కిటెక్చురల్ప్రాధాన్యమున్న స్థలాలన్నీ సందర్శించాను. అవగాహన చేసుకున్నాను. విదేశాల్లోని కట్టడాలు, ఇంటీరియర్ వర్క్ చూస్తూ ప్రయాణించడంతో ప్రతిదానినీ అర్ధం చేసుకుంటూ, ఇంకాస్త మెరుగైన పనితనాన్ని నా వర్క్‌లో చూపించడం ఎప్పటికప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఏ ఒక్క రోజు ఇంకో రోజుతో పోల్చలేం. చేయాలనుకున్న పనుల జాబితాను టిక్ చేసుకుంటూ వెళ్లడమే. మొదట్లో గందరగోళంగా ఉండేది. తర్వాత ఏ రోజు పనులు ఆ రోజు చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. నా జీవనశైలిలో నా మైండ్ స్పేస్‌ను అర్థం చేసుకోవడం చాలా సవాల్‌గా ఉండేది. జీవితంలో ఏదైనా రూపొందించాలనుకున్నప్పుడు అదొకప్రాక్టీస్గా ఉండాలి. క్లయింట్స్ ఇళ్లను డిజైన్ చేయడంలో నా స్కిల్‌ని మాత్రమే చూపించాలి. ఇదీ ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగమే. ఇంటీరియర్ డిజైనర్‌గా, ఆర్కిటెక్ట్‌గా ఎక్కువ సమయం సిమెంట్, దుమ్ము కొట్టుకుపోయి పనిలో గడిచిపోతుంటుంది. అయినా నాకంటూ కొంత స్పేస్ ఉంచుకుంటాను. ప్రయాణాలు నాకు ఎప్పుడూ ఇష్టం. ఇది ఎల్లప్పుడూ నన్ను పునరుజ్జీవింపజేస్తుంది. చాలాసార్లు పని నుంచి రిలాక్స్ అవడానికి టూర్స్‌ని ఎంచుకుంటుంటాను. వందల ఇళ్లు డిజైన్ చేసి ఉంటాను. ఎన్నో అవార్డులు ఈ రంగంలో అందుకున్నాను. కానీ, నా ఇంట్లో ఏది ఎలా ఉండాలనే నియమం లేదు. అక్కడంతా నా పిల్లల ఇష్టమే. ఎందుకంటే వారి దగ్గర నేను తల్లిని మాత్రమే. భవిష్యత్తు తరాలకు.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ది ఆరెంజ్ లేన్ ఆ తర్వాత పీకాక్ లైఫ్ పేరుతో ఇంటీరియర్ స్పేస్‌లను క్రియేట్ చేశాను. హైదరాబాద్‌లో కోషా పేరుతో వింటేజ్ స్టైల్ ఫర్నీచర్‌ను లాంచ్ చేశాను. ఇంటీరియర్ డిజైనింగ్‌లో వింటేజ్ స్టైల్ ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉంది. దేశంలోని ఇతరప్రాంతాల నుంచి ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్‌లలోని అతిప్రాచీన కళా ఖండాలను సేకరించడం, వాటిని రీ మోడలింగ్ చేసి, నేటి తరానికి అందించడంలో నాటి కళను భవిష్యత్తు తరాలకు తీసుకెళుతున్నామనే సంతృప్తి కలుగుతుంది. ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే ప్రయాణాలు అంటే ఎంత ఇష్టమో వ్యక్తిగత అలంకరణ కూడా అంతే ఇష్టం. నా వ్యక్తిగత అలంకరణ కొంచెం బోహో స్టైల్లో ఉంటుంది. ఇది స్వేచ్ఛా, స్ఫూర్తిలకు ప్రతీకగా ఉంటుంది. ఎదుటివారు మనల్ని పరిశీలనగా గమనించేంత ప్రత్యేకంగా ఉంటాయి’ అని నవ్వుతూ వివరించారు షబ్నమ్. – నిర్మలారెడ్డి, ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
ఇంటివాడైన టాలీవుడ్ హీరో నాగశౌర్య
-
అదర్ సైడ్: స్టూడెంట్ నంబర్‌వన్
‘టైమెక్కడ ఉంది’ అని చీటికిమాటికి అంటే టైమ్ చిన్నబుచ్చుకుంటుందట. ‘టైమ్ నాతోనే ఉంటుంది’ అనుకుంటే బలాన్ని ఇస్తుందట. సినీ నిర్మాత, ఇంటీరియర్ డిజైనర్, కాలమిస్ట్, పుస్తక రచయిత్రి, గృహిణిగా రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్న ట్వింకిల్ ఖన్నా మరోసారి స్టూడెంట్‌గా మారబోతోంది. ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఫిక్షన్ రైటింగ్‌లో మాస్టర్స్ చేయడానికి రెడీ అవుతోంది... ‘అమ్మా, నీకు ట్వింకిల్ అని ఎందుకు పేరు పెట్టారు?’ అని అడిగింది నాలుగేళ్ల కూతురు. ‘నేను లిటిల్స్టార్ని కాబట్టి’ అని జవాబు చెప్పింది ట్వింకిల్. ఇది విని కూతురు నవ్వేసింది. ఇంట్లోనే కాదు పుస్తక ప్రపంచంలో కూడా నవ్వుల వెన్నెల కురిపిస్తుంది ట్వింకిల్‌ఖన్నా. కథానాయికగా మాత్రమే కాదు కాలమిస్ట్, పుస్తక రచయిత్రిగా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ట్వింకిల్ రాసిన ‘మిసెస్ ఫన్నీబోన్స్’ పుస్తకం బెస్ట్ సెల్లర్ చార్ట్‌లో నెంబర్‌వన్‌గా నిలిచింది. ‘అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న పుస్తకం ఇది’ అని ప్రశంసించారు పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఎడిటర్ ఇన్ చీఫ్ మిలీ ఐశ్వర్య. మరో పుస్తకం ‘పైజామాస్ ఆర్ ఫర్గివింగ్’ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ‘హైయెస్ట్–సెల్లింగ్ ఫిమేల్ ఆథర్’ సింహాసనంలో తనను కూర్చోబెట్టింది. నవ్వించడం ఎంత కష్టమో, నవ్వించడం ద్వారా వచ్చే కష్టాలు కూడా అంతే కష్టమని అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది ట్వింకిల్‌కు. ‘నన్ను ఉద్దేశించే రాసింది’ అని ఎంతోమంది భుజాలు తడుముకునేవారు! వినోదమాధ్యమాలు ఎన్ని పెరిగినప్పటికీ, ఇప్పటికీ పుస్తకాలు అంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టం. మనసు బాగలేనప్పుడు, ఉత్సాహం కావాలనుకున్నప్పుడు ట్వింకిల్ పుస్తకప్రపంచంలోకి వెళుతుంది. ప్రతి పుస్తకం ఒక నేస్తం అవుతుంది. తనలో కొత్త ఎనర్జీ, ఉత్సాహం వస్తాయి. ‘మహిళా రచయితలకు ఎదురయ్యే సవాలు ఏమిటి?’ అనే ప్రశ్నకు– ‘రచన గురించి ఆలోచించే క్రమంలో తనదైన ఊహాప్రపంచంలో, రకరకాల క్యారెక్టర్ల మధ్య ఉండాల్సి వస్తుంది. ఇదే సమయంలో వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఇంటిపనులు, పిల్లల బాధ్యత చూసుకోవాల్సి ఉంటుంది. రెండిటినీ సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు’ అంటుంది ట్వింకిల్. రచయిత్రిగా ట్వింకిల్ ఖన్నాకు బోలెడు పేరు వచ్చింది. ఈ దశలో ‘నాకు రాయడం వచ్చేసింది. ఏమీ నేర్చుకోనక్కర్లేదు’ అనుకుంటారు చాలామంది. అయితే ట్వింకిల్ అలా అనుకోవడం లేదు. ‘నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని మాత్రమే అనుకుంటుంది. అందుకే క్రియేటివ్ రైటింగ్‌లో శిక్షణ పొందడానికి ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లోకి స్టూడెంట్‌గా అడుగుపెట్టబోతుంది. ‘మరోసారి స్టూడెంట్‌గా మారుతున్నందుకు సంతోషంగా ఉంది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాను. చిన్నప్పటిలాగే శ్రద్ధగా క్లాసులు వినబోతున్నాను. నోట్స్ రాసుకోబోతున్నాను’ అంటూ అభిమానులతో తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది ట్వింకిల్. దీంతోపాటు హుషారెత్తించే, ఉత్సాహంతో జంప్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. నిజానికి ఆ వీడియోలో ట్వింకిల్‌ఖన్నా కనిపించడం లేదు. చదువు దాహంతో ఉన్న ఒక సిన్సియర్ స్టూడెంట్ కనిపిస్తుంది. ‘నేర్చుకోవాలనే తపన మనల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అనే మాట కాస్త గట్టిగానే వినిపిస్తుంది! -
Interior Decor: ఉట్టిపడే జీవకళ! ఇలా చేశారంటే లుక్‌తో పాటు ప్రశాంతత కూడా!
గదిలో కూర్చుున్నప్పుడు ప్లెయిన్‌గా కనిపించే గోడలు, ఫర్నిచర్కేసి దృష్టి సారిస్తే.. కొన్నిసార్లు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ, అదే రొటీన్ అయితే మాత్రం బోర్ అనిపిస్తుంది. ఏదో లోటు కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ‘ఇదిగో ఇలా జీవకళను ఇంటికి తీసుకొచ్చేయడమే’ అంటారు అమెరికా వాసి.. ఇంటీరియర్ డిజైనర్.. మిషెల్ విలియమ్స్. కలర్స్.. కలర్స్.. బయటి వాతావరణం డల్‌గా ఉన్నప్పుడు ఇల్లు బ్రైట్‌గా కనిపించాలి. అందుకు రంగులు ఎంతగానో సహకరిస్తాయి. ఇంట్లోకి పాజిటివిటీని కూడా మోసుకువస్తాయి. అందుకు గది గోడల రంగులు మార్చేయనక్కర్లేదు. కుషన్స్, రగ్గులు, కర్టెన్స్, కార్పెట్స్.. ఇతర ఫర్నిషింగ్ ఐటమ్స్ ఏవైనా ఇంద్రధనస్సు రంగులతో కాంతిమంతంగా ఉండేవాటిని ఎంపిక చేసుకోండి. వాటిలో ప్రధానంగా పసుపు, పింక్ రంగులు ఉంటే మీ చుట్టూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవరాశి డిజైన్లతో ఉన్న ప్రింట్లు, పెయింటింగ్స్నూ అలంకరణలో భాగం చేయొచ్చు. వాల్ ట్రీట్మెంట్ ఇంటికి అతిథులు ఎవరొచ్చినా వాళ్ల చూపులు ముందుగా గది గోడల మీదకే వెళతాయి. వాళ్ల కళ్లల్లో మన చాయిస్ పట్ల ప్రశంసలు చూడాలనుకుంటే ఫొటో ఫ్రేమ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. మన మదిలో పాత జ్ఞాపకాలను తట్టిలేపే ఫొటోలతో ఆ ఫ్రేమ్స్‌ను ఫిల్ చేయాలి. లైట్ల ఎంపిక ఇంట్లో కాంతి మన భావోద్వేగాలపై ప్రభావం చూపుతుంది. వర్క్‌ప్లేస్‌లో ఒక విధంగా, లివింగ్ రూమ్‌లో మరో విధంగా.. ఇలా ఒక్కో ప్లేస్‌కి తగినట్టు మనల్ని నార్మల్ మూడ్‌లో ఉంచే విధంగా లైటింగ్ ఉండాలి. అందుకు తగిన హ్యాంగింగ్ లైట్స్, టేబుల్ ల్యాంప్స్, ఫ్లోర్ ల్యాంప్స్‌ను సెట్ చేసుకోవాలి. వంటగదిలో కొత్త ప్రయోగం లాక్డౌన్ టైమ్‌లో చిన్నాపెద్దా తేడా లేకుండా వంట గదిలో కొత్త వంటకాల ప్రయోగాలు చేశారు. అప్పుడే వంటగది అలంకరణ పట్ల శ్రద్ధ పెరిగి ఉంటుంది. మన సౌకర్యం.. అభిరుచికి తగ్గట్టుగా కిచెన్ క్యాబినెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మైక్రోవేవ్, గ్యాస్ స్టవ్ వంటివి.. అటూ ఇటూ జరపడానికి వీలుగా ట్రాలీలుగా పెట్టుకోవాలి. శుభ్రతే ప్రధానం ఇంటి ఇంటీరియర్ ఎంత బాగున్నా శుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే పెట్టిన ఎఫర్ట్స్ అంతా వృథా అవుతాయి. అందుకని ఇల్లు ఎంత తక్కువ స్పేస్‌లో ఉన్నా శుభ్రంగా ఉంచుకుంటే మన మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ మ్యాట్స్, సోప్ డిస్పెన్సర్ సెట్స్.. వంటి వాటిని మరింత శుభ్రంగా.. పొడిగా ఉండేలా చూసుకోవాలి. చదవండి: హోమ్ క్రియేషన్స్; చీరంచు టేబుల్.. లుక్ అదుర్స్ -
లక్షల్లో డబ్బు ఖర్చు అవుతున్నా..ఇంటీరియర్ డిజైన్లతో నయా ట్రెండ్
జ్యోతినగర్: ఇంటికి అందం ఇంటీరియర్ డెకరేషన్. ప్రతీ ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఓ కల. ఆ ఇంటిని తమకు నచ్చేలా అందంగా తీర్చిదిద్దుకోవాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకునే వారు అందరిని ఆకట్టుకునేలా ఉండేలా డిజైన్ చేయించుకుంటారు. ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఇంటీరియర్ డిజైనింగ్‌పై దృష్టి సారిస్తున్నారు. ఇందుకు లక్షల్లో డబ్బు ఖర్చు అవుతున్నా వెనకాడడం లేదు. దీనికి అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో వివిధ రకాల ఇంటీరియర్ డిజైన్లతో నయా ట్రెండ్ కొనసాగుతుంది. ప్రతిఒక్కరూ స్థాయికి తగ్గట్టు ఇంటీరియర్ డెకరేషన్, సీలింగ్‌ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. గతంలో స్టార్ హోటళ్లు, పెద్ద దుకాణాలకు మాత్రమే పరిమితమయ్యే ఈ డిజైన్లు ప్రస్తుతం కొత్త ఇంటి నిర్మాణాలకు కూడా వ్యాపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాగా మారడం రియల్ ఎస్టేట్ వ్యాపారం అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖ పట్టడంతో కొత్త గృహ నిర్మాణాలకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల ఆసక్తిని గుర్తించిన కొందరు వ్యాపారులు పీవోపీతో వివిధ డిజైన్లలో గదులను తీర్చిదిద్దే కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. డెకరేషన్‌పై ఆసక్తి..వివిధ డిజైన్లతో ఇంటికి కొత్త కళ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో వివిధరకాల డిజైన్లతో సీలింగ్‌లను, ఇతర పనులను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో దగ్గర ఉండి పనులు చేయించుకుంటున్నారు. యజమానులు, నిపుణుల ద్వారా ఈ డిజైన్లను తయారు చేయించి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పీవోపీ, జిప్సం బోర్డులు, లైటింగ్, వాల్ పేయింట్స్, టెక్షర్ వాల్ పేపర్లు, ఫర్నిచర్, ఉడ్ వర్క్‌పై లామినేట్స్‌తో కంటికి అందంగా ఉండేలా తీర్చిదిద్దుకుంటున్నారు. ప్రస్తుతం డిజైన్లను బట్టి స్క్వేర్ ఫీట్ (మెటీరియల్, లేబర్చార్జి)కు రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ధర వేస్తున్నారు. ఇంటిని బట్టి కేవలం ఇంటీరియర్ కోసమే సుమారు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు వెచ్చిస్తున్నారంటే ఇంటీరియర్ ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతోంది. ఇంటీరియర్‌పై ఆసక్తి గతంలో చాలామంది కొత్త ఇళ్లు నిర్మించుకునే వారు ఎక్స్టీరియర్పై ఆసక్తి చూపేవారు. కానీ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, రామగుండం, సుల్తానాబాద్ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించుకునేవారు ఇంటీరియర్ డిజైన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. డిజైన్లకు కూడా చాలా డిమాండ్ ఉంది. ఇంటి యజమానుల, అభిరుచికి తగ్గట్లు విభిన్నంగా సీలింగ్ డిజైన్లు, ఇంటీరియర్ డెకరేషన్ చేస్తున్నాం. పీవోపీ ద్వారా చేసే డిజైన్లతో విద్యుత్ దీపాల వెలుగులో మరింత అందంగా కనిపిస్తుంది. –ఆర్.సాయితేజ, ఇంటీరియర్ డిజైనర్ జిల్లాలో ఆర్డర్లు వస్తున్నాయ్ అందరూ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో చాలా ఆర్డర్లు వస్తున్నాయి. ఇంటి యజమానులు కోరుకున్న రీతిలో వారికి డిజైన్చేసి చూపించిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. హైదరాబాద్‌లో ఎక్కువ ఇంటీరియర్ డిజైన్లు చేయించుకునే వారు. కానీ నేడు పెద్దపల్లి జిల్లాలో చాలామంది కొత్త ఇంటిని నిర్మించుకునే వారు ఇంటీరియర్ డిజైన్లను కోరుకుంటున్నారు. ఇంటి యజమాని కోరుకున్న రీతిలో డిజైన్ చేసి అందంగా ఇంటిని ముస్తాబు చేస్తాం. –ఎం.అక్షయ్‌కుమార్, ఇంటీరియర్ డిజైనర్ -
‘మా అమ్మాయికి చదువు అక్కర్లేదని గొడవలకు దిగేవారు’
బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్‌గా మంచి పేరున్న హర్‌సంజమ్‌కౌర్ వృత్తి నుంచి కాస్త విరామం కోసం మౌంట్‌కైలాష్‌లో నిర్వహించిన మెడిటేషన్ క్లాస్‌లకు హాజరయ్యారు. అయితే అక్కడ ఆమె జీవితం కొత్త మలుపు తీసుకుంది. ‘అంగన్’ అనే స్వచ్ఛందసంస్థతో పిల్లల చదువు నుంచి పేదల ఆకలి తీర్చడం వరకు ఎన్నోరకాల సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కౌర్.... నిత్యజీవిత పరుగులో పరుగుకే సమయం సరిపోతుంది. కొందరు మాత్రం ఆ పరుగుకు బైబై చెప్పి నిదానంగా కూర్చొని ‘ఆత్మసమీక్ష’ చేసుకుంటారు. కొత్త వెలుగుతో కొత్త దారిలో ప్రయాణిస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తి హర్‌సంజమ్‌కౌర్. ‘కోల్‌కత్తాలో ఒక సంపన్న కుటుంబం లో పుట్టాను’.. ‘యూకేలో ఏంబీఏ చేశాను’ ‘ఇంటిరీయర్ డిజైనర్‌గా నాకు మంచిపేరుంది’... ఇలా చెప్పుకోవడంలో కౌర్‌కు ఎక్కడా తృప్తి కనిపించలేదు. ‘ఆకలితో నకనకలాడుతున్న నలుగురు అభాగ్యులను ఇంటికి తీసుకెళ్లి కడుపునిండా భోజనం పెట్టాను’ అని చెప్పుకోవడంలో మాత్రం ఆమెకు గొప్ప తృప్తి లభించింది. రొటీన్ లైఫ్‌స్టైల్‌కు కాస్త విరామం ఇవ్వడానికి అన్నట్లుగా కౌర్ ‘అమ్ముకేర్’ అనే స్వచ్ఛందసంస్థ మౌంట్‌కైలాష్‌లో నిర్వహించిన మెడిటేషన్ ట్రిప్ కు వెళ్లారు. మన దేశంలోని అనేక ప్రాంతాలు, విదేశాల నుంచి అక్కడికి ఎంతోమంది వచ్చారు. ‘మీరు ఎంత సంపాదిస్తున్నారు?’ ‘ఎన్ని ఆస్తులు ఉన్నాయి?’... ఇలాంటి మాటలు అక్కడ మచ్చుకు కూడా వినిపించలేదు. క్షణభంగురమైన జీవితాన్ని వేదాంతకోణంలో దర్శించే మాటలు, పరులకు సేవ చేయడంలో లభించే ‘తృప్తి’ విలువను, ఆ శక్తి ముందుకు నడిపించే చైతన్యాన్ని విశ్లేషించే మాటలు వినిపించాయి. ‘మరి నా సంగతి ఏమిటీ?’ అని తనను తాను ప్రశ్నించుకున్నారు కౌర్. దానికి సమాధానమే ‘అంగన్’ అనే స్టడీసెంటర్. ‘అమ్ముకేర్’తో కలిసి పేదవిద్యార్థులకు ఈ స్టడీసెంటర్ ద్వారా వివిధరకాలుగా సహాయం చేయడం మొదలుపెట్టారు కౌర్. కూలీపనులకు వెళ్లే శ్రామికులు పిల్లలను ఇంట్లోనే వదిలేసి వెళుతుంటారు. అక్కడ కూలిపని చేస్తున్న మాటే గానీ వారి మనసంతా పిల్లలపైనే ఉంటుంది. పిల్లలు ఏ ప్రమాదం కొని తెచ్చుకుంటారో అని వారి భయం. ఇది గ్రహించిన కౌర్ అలాంటి పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పించడం, శుభ్రత, ఆరోగ్యాలను పట్టించుకోవడం ప్రారంభించారు. దీనివల్ల ఇటు పిల్లలకు, అటు తల్లిదండ్రులకు ఇద్దరికీ మేలు జరిగింది. ‘నా బిడ్డ స్కూల్లో భద్రంగా ఉన్నాడు’ అని వారిలో భరోసా వచ్చింది. ‘అంగన్’ స్టడీ సెంటర్ ద్వారా పిల్లలకు చిత్రకళ, సంగీతం లాంటివి నేర్పించారు. వారిలోని సృజనను వెలికి తీయడానికి రకరకాల పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి భుజం తట్టారు. ఇదంతా ఒక ఎత్తయితే కొందరు తల్లిదండ్రులు... ‘మా వాడికి చదువు ఎందుకమ్మా... ఇంకో రెండు సంవత్సరాలైతే పనిలోకెళతాడు’ ‘మా అమ్మాయికి చదువుకు అక్కర్లేదు. ఇంట్లో బోలెడు పని ఉంది’ అంటూ కౌర్‌తో గొడవకు దిగేవారు. అయితే ఆమె వారికి ఓపికతో సమాధానం చెప్పేవారు. కొందరు మనసు మార్చుకొని పిల్లలను స్కూలుకు పంపించేవారు. కొందరు ససేమిరా అనేవారు. అయితే ఈ రెండోకోవకు చెందిన వారు కూడా కొన్ని నెలల తరువాత చదువు విలువ గ్రహించి కౌర్ చెప్పిన మాటలు విన్నారు. రెండోసారి కరోనా విలయం మొదలైంది. బెంగళూరులోని చాలా ప్రాంతాల్లో కూలీలు, శ్రామికులు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. వారి ఆకలి ని తీర్చడానికి ప్రతిరోజూ ‘ఫుడ్సేవ’ కార్యక్రమంతో ముందుకు వచ్చి ఎంతోమంది ఆకలి తీర్చారు. మాస్క్‌లు, శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేశారు. ‘మంత్లీఫుడ్ కిట్’లు సరఫరా చేశారు. ‘డబ్బు విషయంలోనైనా ఇక చాలు అనే మాట వస్తుందేమోగానీ సేవ విషయంలో అది ఎప్పటికీ రాదు’ అంటున్న కౌర్ తన సేవాదృక్పథాన్ని మరింత విస్తరించడానికి భవిష్యత్ ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. చదవండి: కుకింగ్ క్వీన్ .. 50 ఏళ్ల వయసులో ఫుడ్ బ్లాగ్.. -
‘ప్రియుడి’ హత్య.. ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు
ముంబై: పుణెలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు.. 30 ఏళ్ల పీహెచ్డీ స్కాలర్ని హత్య చేశాడు. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. కారణం ఏంటంటే ఈ ఇద్దరు యువకులు కొద్ది నెలలుగా ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం పీహెచ్డీ స్కాలర్‌కి పెళ్లి కుదరడంతో.. తట్టుకోలేకపోయిన నిందితుడు అతడిని హత్య చేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు.. ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తోన్న రవిరాజ్ క్షీరసాగర్(24)కి, పుణె నేషనల్ కెమికల్ లాబొరేటరీలో పీహెచ్డీ స్కాలర్‌గా ఉన్న సుదర్శన్ బాబురావు పండిట్(30)తో ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ బంధం కొన్ని నెలల పాటు కొనసాగింది. ఇంతలో సుదర్శన్‌కి కుటుంబ సభ్యులు వేరే యువతితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం రవిరాజ్ చేవిన పడింది. తనను వదిలి పెట్టి మరోక యువతిని వివాహం చేసుకోవడానికి వీల్లేదని సుదర్శన్‌ని హెచ్చరించాడు రవిరాజ్. అయితే సుదర్శన్ ఈ బెదిరింపులను పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో గత నెల 27న రవిరాజ్, సుదర్శన్ పీహెచ్డీ చేస్తోన్న నేషనల్ కెమికల్ లాబొరేటరీకి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తాను వేరే యువతిని పెళ్లి చేసుకుంటానని సుదర్శన్ తేల్చి చెప్పాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన రవిరాజ్ అతడిని దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసి.. ముఖాన్ని రాళ్లతో కొట్టి గుర్తుపట్టరాని విధంగా మార్చాడు. ఆ తర్వాత రవిరాజ్ తన నివాసానికి వెళ్లి ఆత్మహత్యయాత్నం చేశాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇక నేషనల్ లాబొరేటరీలో హత్యకు గురైన సుదర్శన్ గురించి పోలీసులకు సమాచారం అందించారు. అతడి వద్ద లభించిన డాక్యుమెంట్స్‌ని బట్టి మరణించిన వ్యక్తిని సుదర్శన్‌గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. రవిరాజ్‌తో అతడికున్న ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు రవిరాజ్ గురించి వాకబు చేయగా.. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసింది. దాంతో పోలీసులు హస్పిటల్‌కి వెళ్లి రవిరాజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసుల దర్యాప్తులో తానే సుదర్శన్‌ని హత్య చేశానని అంగీకరించాడు రవిరాజ్. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చదవండి: డేటింగ్ యాప్: నగ్నంగా వీడియో కాల్.. ‘డేటింగ్ ఫ్రెండే’ దోచేసింది -
అర్నాబ్‌కు బెయిల్ నో
ముంబై/న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సోమవారం అర్నాబ్ బెయిల్ అర్జీని పరిశీలించిన డివిజన్ బెంచ్..బెయిల్ కోసం దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది. సెషన్స్ కోర్టు దీనిపై నాలుగు రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఓ ఇంటీరియర్ డిజైనర్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న 2018నాటి కేసులో ఆయన్ను ఈ నెల 4న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాయిగఢ్ జిల్లా కోర్టు అర్నాబ్‌కు 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రిపబ్లిక్ టీవీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలను టీవీ చానళ్లలో చూపడం, సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం ఆపివేస్తున్నామంటూ హామీ ఇవ్వాలని ఏజీఆర్ మీడియా, బెన్నెట్ కోల్మన్ కంపెనీలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తమపై బాధ్యతరాహితంగా వ్యాఖ్యలు చేస్తున్నాయంటూ ఈ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. సామాజిక మాధ్యమాలైన గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్లకు కూడా నోటీసులిచ్చింది. -
అర్నబ్ గోస్వామి అరెస్ట్
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని రాయగఢ్ జిల్లా అలీబాగ్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయిక్ (53) ఆత్మహత్యకు సంబంధించి అర్నబ్‌ను అరెస్టు చేసినట్టు అలీబాగ్ పోలీసులు పేర్కొ న్నారు. తననెందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నిస్తూ, అరెస్టువారెంటు చూపాలని అర్నబ్ వాదించారని పోలీసులు తెలిపారు. అరెస్టు వారంటును చూపించబోగా, అర్నబ్ భార్య ఆయా పేపర్లను చించేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత అర్నబ్‌ను అలీబాగ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచారు. గోస్వామిని అలీబాగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ ఆయనను కోర్టులో హాజరుపరచాలని చెబుతూ ఈనెల 18 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గోస్వామి ని పోలీసులు అరెస్టు చేసే సమయంలో పోలీసులు అర్నబ్‌పై చేయి చేసుకున్నారని, అర్నబ్‌తోపాటు ఆయన న్యాయవాది గౌరవ్ పార్కర్లు ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఆయన్ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసుల బృందంలో ఉన్న మహిళా పోలీసుపై అర్నబ్ చేయి చేసుకున్నారన్న అభియోగాలతో ఆయనపై మరో ఎఫ్ఐఆర్ దాఖలైంది. మహిళా పోలీసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. తన భర్తకు ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి ఉంటే నేడు తన భర్త బతికి ఉండేవారని అన్వయ్ నాయక్ భార్య అక్షతా పేర్కొన్నారు. చట్టం ముందు అంతా ఒక్కటే.. చట్టం ముందు ఎవరూ గొప్పవారు కాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. అన్వయ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకే ఈ కేసును తిరిగి విచారణ చేపట్టేందుకు కోర్టులో దరఖాస్తు చేసినట్టు చెప్పారు. అనంతరం కోర్టు అనుమతితోనే ఈ అరెస్టు జరిగిందని చట్టప్రకారం పోలీసులు తమ పని తాము చేస్తున్నారన్నారని అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. -
అక్కకి ప్రేమతో...
తన అక్క రంగోలి కోసం ఇంటీరియర్ డిజైనర్ అవతారం ఎత్తారు కంగనా రనౌత్. కంగనా డిజైన్ చేసిన వాటిని షేర్ చేశారు రంగోలి. ‘‘నీ ఇంట్లో నీకు ఎలాంటి ఇంటీరియర్ డిజైన్స్ కావాలని నన్ను కంగనా అడిగింది. నిజానికి నాకేం కావాలో నాకే తెలియదు. పాతకాలానికి చెందినవి, రొటీన్‌గా ఉండేవి మాత్రం వద్దని చెప్పాను. తను నా ఇంటిని బాగా అలంకరించింది. అది చూసి షాక్ అయ్యాను. నిజానికి ఇంటీరియర్ డిజైనింగ్ కంగనాకు కొత్త. కానీ తను నా కోసం ఇంటీరియర్ డిజైనింగ్ గురించి తెలుసుకుని నా ఇంటిని అందంగా తయారు చేసింది. అందుకే ఇప్పుడు నా ఇల్లు నాకో స్వర్గంలా అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు రంగోలి. ఈ లాక్డౌన్ సమయంలో కంగనా వంటలు నేర్చుకున్నారు, కవితలు రాశారు. పెయింటింగ్స్ వేశారు. తాజాగా ఇంటీరియర్ డిజైనర్‌గా మారారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కంగనా తాజా చిత్రం ‘తలైవి’ (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత బయోపిక్) షూటింగ్ లాక్డౌన్ వల్ల ఆగి పోయింది. ఇంకా ఆమె అంగీకరించిన హిందీ చిత్రాల్లో ‘తేజస్, థాకడ్’ కూడా ఉన్నాయి. -
ధీశాలి
స్త్రీ శక్తి స్వరూపిణి. ఆ శక్తికి రూపాలెన్నో. ఆ రూపాల్లో స్వాతి గార్గ్ ఒకరు. అగ్ని ప్రమాదం నుంచి తన అపార్ట్మెంట్లోని వారిని చివరి నిమిషం వరకు కాపాడుతూ ఉన్న స్వాతి.. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ శరన్నవరాత్రులు ముగిసేవరకు సాక్షి ‘ఫ్యామిలీ’.. శక్తికి ప్రతీకలైన నేటి మహిళల గురించి రోజుకొక స్వరూపంగా మీకు అందిస్తుంది. ‘‘ధైర్యానికి ప్రతీక అయిన సోదరీ నీ ఆత్మ శాంతించు గాక. ‘ప్రాణాలు పోసే శక్తి, ప్రాణాలను కాపాడే శక్తి మహిళల్లోనే ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాల’ని మన విద్యావిధానం బోధిస్తుంది. ఆ బోధనలకు ప్రతీకగా నిలిచిన నీకు నివాళులు’’.. ఇది దీపక్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్. తన అపార్ట్మెంట్లోని వాళ్లను అగ్ని ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన స్వాతి గార్గ్‌ను ఉద్దేశించిన పోస్ట్ ఇది. స్వాతి గార్గ్ 32 ఏళ్ల యువతి. ఇంటీరియర్ డిజైనర్. ఢిల్లీ సమీపంలో గుర్గావ్లో నివసించేది మొన్నటి ఆదివారం వరకు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు ఆమె నివసిస్తున్న తులిప్ ఆరెంజ్ బహుళ అంతస్తుల భవనంలో నిప్పు రాజుకుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. స్వాతి నివసించే ఐదవ ఫ్లోర్‌కు పొగలు వ్యాపించడాన్ని గమనించిందామె. వెంటనే తమ ఫ్లోర్లో అన్ని ఇళ్ల తలుపులు బాది వారిని అప్రమత్తం చేసింది. మంటలు చెలరేగుతున్నాయని తెలియగానే ఎవరికి వాళ్లు నేరుగా పైన టెర్రస్ మీదకు పరుగులు తీశారు. స్వాతి మాత్రం మెట్ల దారి నుంచి పరుగెత్తుతూ మిగిలిన ఫ్లోర్లకు వెళ్లి సమాచారమిస్తూ తొమ్మిదవ ఫ్లోర్‌కి చేరింది. అప్పటికే కారిడార్ మొత్తం పొగతో నిండిపోయింది. ఊపిరాడటం లేదు.ఊపిరితిత్తులు పొగచూరి పోయి ఉక్కిరిబిక్కిరైంది. పదవ ఫ్లోర్ మెట్ల దగ్గరకు వచ్చింది. ఆ మెట్లు ఎక్కితే టెర్రస్ మీదకు చేరుతుంది. ఎలా పడిందో తెలియదు డోర్ లాక్ పడిపోయింది. సహాయం కోసం ఎవరినైనా పిలుద్దామంటే నోరు పెగల్లేదు. మెట్ల దగ్గరే కుప్పకూలిపోయింది స్వాతి. రక్షించేలోపే..! అపార్ట్మెంట్ నుంచి అగ్నిమాపక శాఖకు 2.28 గంటలకు ఫోన్‌కాల్ వెళ్లింది. మూడు గంటలకు పోలీసులు వచ్చారు. మూడుంపావుకు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు మొదలయ్యాయి.మూడున్నరకంతా అపస్మారక స్థితిలో ఉన్న స్వాతిని గుర్తించారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని చెప్పారు డాక్టర్లు. స్వాతి అపస్మారక స్థితిలో గుర్తించిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అగ్నిమాపక సిబ్బంది చెప్పిన విషయం అపార్ట్మెంట్ వాసులందరినీ కంట నీరు పెట్టించింది. పొగచూరిన గోడల మీద... కారిడార్‌లో నుంచి బయటపడటానికి దారి కోసం వెతికిందనడానికి చిహ్నంగా ఆమె చేతి వేళ్ల ముద్రలు స్పష్టంగా ఉన్నాయి. బయటపడే దారి కోసం వెతుకుతూనే అపస్మారక స్థితిలోకి జారిపోయింది స్వాతి. తన ప్రాణాలను రక్షించుకుంటే చాలనుకోకుండా అందరినీ కాపాడాలనే ఆకాంక్షే స్వాతి ప్రాణాలను బలిగొన్నది. ఆమె భర్త గిరీష్ హనీవెల్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. వాళ్లకు నాలుగేళ్ల కూతురు ఉంది. స్వాతి ఇటీవల ఆమె తల్లిని కూడా తన దగ్గరకు తెచ్చుకుంది. ఆమె ఇప్పుడు కాలిన గాయాలతో హాస్పిటల్లో ఉంది. – మను -
ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య
మాదాపూర్: మానసిక సమస్యలతో బాధపడుతూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమ వారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాదాపూర్‌లోని జైహింద్ ఎన్‌క్లేవ్‌లో తన స్నేహితురాలితో కలిసి ఉంటున్న అమ్రిన్ (23) ఇంటిరీయర్ డిజైనర్‌గా పని చేస్తోంది. కొద్ది రోజులుగా ఆమె తన కుటుంబానికి దూరంగా ఉంటోంది. ఆదివారం రాత్రి గదిలో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆమెను మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామిపై కేసు
ముంబై: ఇద్దరిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్ణబ్ గోస్వామి సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ ఎండీ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి శనివారం ముంబై సమీపంలోని వారి ఫాం హౌస్‌లో ఆత్మహత్య చేసకుని చనిపోయారు. అన్వయ్ సూసైడ్ నోట్ రాస్తూ అర్ణబ్ గోస్వామితోపాటు ఫెరోజ్ షేక్, నితీశ్ సర్దా అనే వ్యక్తులు తనకు రూ. 5.4 కోట్లు చెల్లించాలనీ, కానీ వాళ్లు ఆ డబ్బు ఇవ్వకుండా వేధిస్తూ తమ ఆత్మహత్యలకు కారణమయ్యారని పేర్కొన్నారు. అన్వయ్ ఆరోపణలు అవాస్తవాలంటూ ఆదివారం రిపబ్లిక్ టీవీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
కస్టమర్‌కు రెడ్‌కార్పెట్
‘కొనుగోలుదారుని మించిన అతిథులు లేరు..’ అన్నట్టుగా సిటీలోని షాపర్స్ కోసం బిజినెస్ వర్గాలు అందిస్తున్న ఆతిథ్యం కొత్త పుంతలు తొక్కుతోంది. శనివారం.. 6 డిగ్రీస్ అనే సంస్థ బ్రాండెడ్ దుస్తుల కంపెనీలతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో ఉన్న వయా మిలానో రెస్టారెంట్లో వినూత్న డిజైనర్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఛాయిస్ ఆఫ్ ది సిటీగా నిలిచింది. నగరంలో ఇంటీరియర్ డిజైనర్‌గా పేరొందిన రమా భట్ ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. తనకు నచ్చిన డ్రెస్ ఎంచుకున్నారు. ట్రయల్రూమ్లోకి వెళ్లి దానిని ధరించారు. తర్వాత మేకప్ ఆర్టిస్ట్ ఆమెకి మేకోవర్ పూర్తి చేశారు. అనంతరం రెడ్‌కార్పెట్‌పై రమాభట్ ఒక మోడల్ తరహాలో ర్యాంప్ వాక్ చేశారు. సిద్ధంగా ఉన్న ముగ్గురు ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్లు క్లిక్ క్లిక్ మనిపించారు. వెంటనే ఫొటోలు సిస్టమ్‌లోకి అప్లోడ్ చేసి చూపించారు. ఫొటోలు చూసి ఆమె...‘వావ్’ అని అప్రయత్నంగానే అనేశారు. తగిన మొత్తాన్ని చెల్లించి స్వంతం చేసుకున్నారు. ‘ఈ ఎక్స్పీరియన్స్ అమేజింగ్. ఒక సెలబ్రిటీ ఫీల్ వచ్చింది’ అంటూ ఆమె ‘సిటీప్లస్’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఆనందం రమాభట్ ఒక్కరిదే కాదు అక్కడికి హాజరైన డాక్టర్ సుమేధ, సుమలత... తదితరులెందరిదో! కొనేవారికి కొత్త అనుభవం ఇవ్వాలని... ఏ మాత్రం సందేహం లేకుండా తమకు నప్పే డ్రెస్ కొన్నామనే సంతృప్తితో పాటు, వినూత్నమైన అనుభవాన్ని అందించాలని ఈ కాన్సెప్ట్‌కు రూపకల్పన చేశామని 6 డిగ్రీ నిర్వాహకులు అమిత్, కౌముది బ్రాండ్ దుస్తుల ఉత్పత్తిదారు షర్మిలా నాగరాజ్‌లు వివరించారు. జైపూర్‌కి చెందిన కాస్సా, ముంబయికి చెందిన బ్రహ్మ కర్మ, హైదరాబాద్‌కు చెందిన కౌముది బ్రాండ్స్ ఉత్పత్తి చేసిన పురుషులు, మహిళల దుస్తులను ప్రదర్శనలో ఉంచారు. మేకోవర్‌తో మెరిపించి మరీ కస్టమర్ల చేత వీరు కొనిపించిన తీరు సిటీలో సరికొత్త బిజినెస్ కాన్సెప్ట్‌గా మారితే... ఇక సిటీజనులంతా ర్యాంప్‌వాక్‌కు రెడీ అవ్వాల్సిందే. - ఎస్.సత్యబాబు -
గృహాలంకరణ కళాకారుడు.. ఇంటీరియర్ డిజైనర్
అప్‌కమింగ్ కెరీర్: గృహమే కదా స్వర్గసీమ! ఆనందాల పొదరిల్లును నయనానందకరంగా తీర్చిదిద్దుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. ఇంటి లోపలి అలంకరణ కనువిందుగా ఉంటే అలసిన మనసులు సేదతీరుతాయి. ఆనందం, సంతృప్తి కలుగుతాయి. అలాంటి అలంకరణ చేసిపెట్టి, గృహస్థుల మదిని దోచే నిపుణుడు... ఇంటీరియర్ డిజైనర్. మన దేశంలో క్రమంగా డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. ఇంటీరియర్ డిజైనింగ్! నగరాలతోపాటు పట్టణాల్లోనూ ఆధునిక గృహాల నిర్మాణం వేగంగా సాగుతోంది. క్లయింట్ల అభిరుచుల్లో మార్పు వస్తోంది. ఇంటి నిర్మాణంతో పాటు లోపలి అలంకరణకూ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇందుకోసం నిపుణులను సంప్రదిస్తున్నారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ఇంటీరియర్ డిజైనింగ్ చేయిస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులను అభ్యసిస్తే ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదు. ఇంటీరియర్ డిజైనింగ్ రంగం నానాటికీ వృద్ధి చెందుతోంది. వ్యక్తిగత నివాస గృహాలతోపాటు కార్పొరేట్ కార్యాలయాల్లోనూ ఇంటీరియర్ డిజైనర్లకు డిమాండ్ పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా డిజైనర్లను విరివిగా నియమించుకుంటున్నాయి. అపార్టుమెంట్లు, విల్లాల్లో అలంకరణ బాధ్యతలను వారికి అప్పగిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే.. ఇంట్లో ఫర్నీచర్‌ను, వస్తువులను అటూఇటూ మార్చేయడం కాదు. ఇది సృజనాత్మకతతో కూడిన వృత్తి. ఇది ఒక కళ. ఇంటీరియర్ డిజైనర్‌గా వృత్తిలో రాణించాలంటే.. సృజనాత్మకత, కష్టపడేతత్వం తప్పనిసరిగా ఉండాలి. క్లయింట్ల అభిరుచులను, అవసరాలను గ్ర హించే నేర్పుతో పనిచేస్తే మెరుగైన ఆదాయం ఆర్జించొచ్చు. అర్హతలు: ఇంజనీరింగ్/ఆర్కిటెక్చర్ కోర్సులను చదివినవారు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సును కూడా పూర్తిచేస్తే కెరీర్ మెరుగ్గా ఉంటుంది. ఇంటర్, డిగ్రీ తర్వాత కూడా 6, 12 నెలల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇలాంటి వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. డిజైన్ స్కూల్స్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులను, ఇంటీరియర్ డిజైనింగ్ స్పెషలైజేషన్‌గా మాస్టర్స్(ఫైన్ ఆర్ట్స్) కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వేతనాలు: ఇంటీరియర్ డిజైనర్లకు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత సీనియారిటీని బట్టి వేతనం పెరుగుతుంది. సొంతంగా డిజైనింగ్ సంస్థను ఏర్పాటు చేసుకుంటే నెలకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల దాకా ఆదాయం కళ్లజూడొచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు 1. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్-న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.iiiddelhi.org/ 2. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ-న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.nift.ac.in/delhi/ 3. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ-న్యూఢిల్లీ వెబ్సైట్: http://www.iiftindia.net/ సృజనాత్మకతే కెరీర్‌కు ప్రాణం ‘‘విభిన్నమైన వృత్తి ఇంటీరియర్ డిజైనర్. నిర్మాణ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవలేదు. ఆసక్తి, సృజనాత్మకంగా ఆలోచించే నేర్పు ఉంటే చాలు. ఐదేళ్ల బీఆర్క్తో అందమైన కెరీర్‌ను నిర్మించుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ తర్వాత కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు సమయంలోనే చిన్నపాటి ప్రాజెక్టులతో నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సమాజంలో పరిచయాలు, పలుకుబడి పెరిగేకొద్దీ ప్రొఫెషనల్‌గా స్థిరపడవచ్చు. ఉద్యోగిగా సీనియారిటీ ఆధారంగా వేతనాలు పెరుగుతాయి. ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం అందుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇంటీరియర్ డిజైనర్లకు మరింత డిమాండ్ ఉంటుంది’’ -ఎస్.శ్రీకర్, ఇంటీరియర్ డిజై నర్, బంజారాహిల్స్