గదిలో కూర్చుున్నప్పుడు ప్లెయిన్‌గా కనిపించే గోడలు, ఫర్నిచర్‌కేసి దృష్టి సారిస్తే.. కొన్నిసార్లు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ, అదే రొటీన్ అయితే మాత్రం బోర్ అనిపిస్తుంది. ఏదో లోటు కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ‘ఇదిగో ఇలా జీవకళను ఇంటికి తీసుకొచ్చేయడమే’ అంటారు అమెరికా వాసి.. ఇంటీరియర్ డిజైనర్.. మిషెల్ విలియమ్స్.
కలర్స్.. కలర్స్..
బయటి వాతావరణం డల్‌గా ఉన్నప్పుడు ఇల్లు బ్రైట్‌గా కనిపించాలి. అందుకు రంగులు ఎంతగానో సహకరిస్తాయి. ఇంట్లోకి పాజిటివిటీని కూడా మోసుకువస్తాయి. అందుకు గది గోడల రంగులు మార్చేయనక్కర్లేదు. కుషన్స్, రగ్గులు, కర్టెన్స్, కార్పెట్స్.. ఇతర ఫర్నిషింగ్ ఐటమ్స్ ఏవైనా ఇంద్రధనస్సు రంగులతో కాంతిమంతంగా ఉండేవాటిని ఎంపిక చేసుకోండి.
వాటిలో ప్రధానంగా పసుపు, పింక్ రంగులు ఉంటే మీ చుట్టూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవరాశి డిజైన్లతో ఉన్న ప్రింట్లు, పెయింటింగ్స్‌నూ అలంకరణలో భాగం చేయొచ్చు.
వాల్ ట్రీట్మెంట్
ఇంటికి అతిథులు ఎవరొచ్చినా వాళ్ల చూపులు ముందుగా గది గోడల మీదకే వెళతాయి. వాళ్ల కళ్లల్లో మన చాయిస్ పట్ల ప్రశంసలు చూడాలనుకుంటే ఫొటో ఫ్రేమ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. మన మదిలో పాత జ్ఞాపకాలను తట్టిలేపే ఫొటోలతో ఆ ఫ్రేమ్స్‌ను ఫిల్ చేయాలి.
లైట్ల ఎంపిక
ఇంట్లో కాంతి మన భావోద్వేగాలపై ప్రభావం చూపుతుంది. వర్క్‌ప్లేస్‌లో ఒక విధంగా, లివింగ్ రూమ్‌లో మరో విధంగా.. ఇలా ఒక్కో ప్లేస్‌కి తగినట్టు మనల్ని నార్మల్ మూడ్‌లో ఉంచే విధంగా లైటింగ్ ఉండాలి. అందుకు తగిన హ్యాంగింగ్ లైట్స్, టేబుల్ ల్యాంప్స్, ఫ్లోర్ ల్యాంప్స్‌ను సెట్ చేసుకోవాలి.
వంటగదిలో కొత్త ప్రయోగం
లాక్‌డౌన్ టైమ్‌లో చిన్నాపెద్దా తేడా లేకుండా వంట గదిలో కొత్త వంటకాల ప్రయోగాలు చేశారు. అప్పుడే వంటగది అలంకరణ పట్ల శ్రద్ధ పెరిగి ఉంటుంది. మన సౌకర్యం.. అభిరుచికి తగ్గట్టుగా కిచెన్ క్యాబినెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మైక్రోవేవ్, గ్యాస్ స్టవ్ వంటివి.. అటూ ఇటూ జరపడానికి వీలుగా ట్రాలీలుగా పెట్టుకోవాలి.
శుభ్రతే ప్రధానం
ఇంటి ఇంటీరియర్ ఎంత బాగున్నా శుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే పెట్టిన ఎఫర్ట్స్ అంతా వృథా అవుతాయి. అందుకని ఇల్లు ఎంత తక్కువ స్పేస్‌లో ఉన్నా శుభ్రంగా ఉంచుకుంటే మన మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ మ్యాట్స్, సోప్ డిస్పెన్సర్ సెట్స్.. వంటి వాటిని మరింత శుభ్రంగా.. పొడిగా ఉండేలా చూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment