కస్టమర్‌కు రెడ్‌కార్పెట్
‘కొనుగోలుదారుని మించిన అతిథులు లేరు..’ అన్నట్టుగా సిటీలోని షాపర్స్ కోసం బిజినెస్ వర్గాలు అందిస్తున్న ఆతిథ్యం కొత్త పుంతలు తొక్కుతోంది. శనివారం.. 6 డిగ్రీస్ అనే సంస్థ బ్రాండెడ్ దుస్తుల కంపెనీలతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నం.36లో ఉన్న వయా మిలానో రెస్టారెంట్‌లో వినూత్న డిజైనర్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఛాయిస్ ఆఫ్ ది సిటీగా నిలిచింది.
నగరంలో ఇంటీరియర్ డిజైనర్‌గా పేరొందిన రమా భట్ ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. తనకు నచ్చిన డ్రెస్ ఎంచుకున్నారు. ట్రయల్‌రూమ్‌లోకి వెళ్లి దానిని ధరించారు. తర్వాత మేకప్ ఆర్టిస్ట్ ఆమెకి మేకోవర్ పూర్తి చేశారు. అనంతరం రెడ్‌కార్పెట్‌పై రమాభట్ ఒక మోడల్ తరహాలో ర్యాంప్ వాక్ చేశారు. సిద్ధంగా ఉన్న ముగ్గురు ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్లు క్లిక్ క్లిక్ మనిపించారు. వెంటనే ఫొటోలు సిస్టమ్‌లోకి అప్‌లోడ్ చేసి చూపించారు. ఫొటోలు చూసి ఆమె...‘వావ్’ అని అప్రయత్నంగానే అనేశారు. తగిన మొత్తాన్ని చెల్లించి స్వంతం చేసుకున్నారు. ‘ఈ ఎక్స్‌పీరియన్స్ అమేజింగ్. ఒక సెలబ్రిటీ ఫీల్ వచ్చింది’ అంటూ ఆమె ‘సిటీప్లస్’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఆనందం రమాభట్ ఒక్కరిదే కాదు అక్కడికి హాజరైన డాక్టర్ సుమేధ, సుమలత... తదితరులెందరిదో!
కొనేవారికి కొత్త అనుభవం ఇవ్వాలని...
ఏ మాత్రం సందేహం లేకుండా తమకు నప్పే డ్రెస్ కొన్నామనే సంతృప్తితో పాటు, వినూత్నమైన అనుభవాన్ని అందించాలని ఈ కాన్సెప్ట్‌కు రూపకల్పన చేశామని 6 డిగ్రీ నిర్వాహకులు అమిత్, కౌముది బ్రాండ్ దుస్తుల ఉత్పత్తిదారు షర్మిలా నాగరాజ్‌లు వివరించారు. జైపూర్‌కి చెందిన కాస్సా, ముంబయికి చెందిన బ్రహ్మ కర్మ, హైదరాబాద్‌కు చెందిన కౌముది బ్రాండ్స్ ఉత్పత్తి చేసిన పురుషులు, మహిళల దుస్తులను ప్రదర్శనలో ఉంచారు. మేకోవర్‌తో మెరిపించి మరీ కస్టమర్ల చేత వీరు కొనిపించిన తీరు సిటీలో సరికొత్త బిజినెస్ కాన్సెప్ట్‌గా మారితే... ఇక సిటీజనులంతా ర్యాంప్‌వాక్‌కు రెడీ అవ్వాల్సిందే.
- ఎస్.సత్యబాబు