![Interior designer committed suicide In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/28/suicide1.jpg.webp?itok=rjZ-KZ58)
అమ్రిన్ (ఫైల్)
మాదాపూర్: మానసిక సమస్యలతో బాధపడుతూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమ వారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాదాపూర్‌లోని జైహింద్ ఎన్‌క్లేవ్‌లో తన స్నేహితురాలితో కలిసి ఉంటున్న అమ్రిన్ (23) ఇంటిరీయర్ డిజైనర్‌గా పని చేస్తోంది. కొద్ది రోజులుగా ఆమె తన కుటుంబానికి దూరంగా ఉంటోంది. ఆదివారం రాత్రి గదిలో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆమెను మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment