Intermediate marks
-
ఓసీలకు 75%, ఎస్సీ, ఎస్టీలకు 65% మార్కులు!
-
ఓసీలకు 75%, ఎస్సీ, ఎస్టీలకు 65% మార్కులు!
ఇంటర్లో నిర్ణీత మార్కులుంటేనే ప్రవేశాలు.. ఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల ప్రవేశాలపై సీబీఎస్ఈ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 2017 విద్యాసంవత్సరం నుంచి జాయింట్ ఎంట్రన్స ఎగ్జామినేషన్ (జేఈఈ)లో ర్యాంకుతోపాటు ఇంటర్ సెకండియర్‌లో 75 శాతం మార్కులు ఉండాలని సీబీఎస్ఈ(సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిబంధన విధించింది. 2017 నుంచి జేఈఈలో ఇంటర్ మార్కులకు వెయిటేజీని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే వెయిటేజీని రద్దుచేసినప్పటికీ నిర్ణీత శాతంలో మార్కులు సాధించిన వారికి మాత్రమే జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుందనే నిబంధన విధించింది. ఇంటర్ సెకండియర్‌లో ఓసీలకు 75 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం మార్కులు ఉండాలని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్సకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైనా వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తు ఓపెన్ కావడం లేదని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణలో ఆధార్ అనుసంధానాన్ని ఈసారి తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డు లేని విద్యార్ధులు వాటిని పొందేందుకు ప్రత్యేక కేంద్రాలను ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 7 పరీక్ష కేంద్రాలు ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా 103 కేంద్రాల్లో జరుగుతుంది. విదేశాల్లో పరీక్షలు రాసే వారి కోసం మరో 8 కేంద్రాలు ఆయా దేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం... తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని 31 ఎన్ఐటీలు, 20 ఐఐఐటీలు, మరో 19 జాతీయ విద్యాసంస్థల్లోకి ఈ పరీక్షల ఆధారంగా ప్రవేశాలు చేపట్టనున్నారు. రెండున్నర గంటలు ముందుగానే పరీక్షకేంద్రంలోకి.. జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ పరీక్ష 2017 ఏప్రిల్ 2న, ఆన్లైన్ పరీక్ష ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరగనుంది. పరీక్ష రోజున ఉదయం ఏడింటికి పరీక్ష కేంద్రంలోకి.. ఉదయం 9 గంటలకు పరీక్ష హాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. పరీక్ష హాల్లోకి ఉదయం 9:30 లోపు వచ్చే వారికి మాత్రమే అనుమతిస్తారు. 9:30 నుంచి 12:30 వరకు పరీక్ష జరుగుతుంది. పేపర్- 2 పరీక్షకు మధ్యాహ్నం ఒంటిగంటకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. 1: 30కు పరీక్షహాల్లోకి అనుమతిస్తారు. రెండుగంటల వరకు అభ్యర్థులకు అనుమతిస్తారు. పరీక్ష 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. పరీక్ష రోజున అడ్మిట్‌కార్డుతో పాటు నిర్ధేశిత పత్రాలను అభ్యర్థులు తమతో పాటు తీసుకువెళ్లాలి. -
ఐఐటీల్లో ప్రవేశాలకు ఇంటర్ వెయిటేజీ ఎత్తివేత
జేఈఈ రాయాలంటే ఇంటర్లో 75 శాతం మార్కులు ఉండాల్సిందే లేనిపక్షంలో టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం మార్కులు ఉంటే చాలు ఐఐటీల్లో భారీగా పెరిగిన ఫీజులు వార్షిక ఫీజు రూ.90 వేల నుంచి రూ.2 లక్షలకు పెంపు 2017 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి.. సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఇప్పటివరకూ అమలు చేస్తున్న ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీని రద్దు చేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ (హెచ్ఆర్డీ) ప్రకటించింది. 2017 నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే నేరుగా జేఈఈ ర్యాంకులను కేటాయించనున్నట్లు వెల్లడించింది. 2017 నుంచి జేఈఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇంటర్లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలని లేదా టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రం కనీసం 65 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొంది. ఇదే సమయంలో ఐఐటీల్లో ఫీజులను ఏకంగా 122 శాతం పెంచింది. వార్షిక ఫీజును రూ.90 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ గురువారం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పెంచిన ఫీజులు అమల్లోకి వస్తాయి. త్వరలోనే దీనికి సంబంధించి హెచ్ఆర్డీ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇక ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులతోపాటు కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉన్నవారికి పూర్తి ఫీజు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారికి మూడింట రెండు వంతుల ఫీజు మినహాయింపు ఇవ్వనున్నారు. ఈ కేటగిరీల పరిధిలో రాని వారికి ప్రభుత్వం తరఫున వడ్డీలేని విద్యా రుణాలు ఇప్పిస్తారు. పాత విద్యార్థులకు పాత ఫీజులే! ఇప్పటికే ఐఐటీల్లో చేరిన విద్యార్థులకు పాత ఫీజులే వర్తిస్తాయని హెచ్ఆర్డీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పెరిగిన ఫీజులు కొత్తగా ఐఐటీల్లో చేరే విద్యార్థులకే వర్తిస్తాయని తెలిపాయి. వాస్తవానికి ఐఐటీ రూర్కీ చైర్మన్ అశోక్ మిత్రా నేతృత్వంలోని ఉన్నతస్థాయి ఐఐటీ కమిటీ... ఐఐటీల్లో ఫీజులను రూ.90 వేల నుంచి రూ.3లక్షలకు పెంచాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులను పరిశీలించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ.. భారీ పెంపు సమంజసం కాదని భావించారు. మధ్యేమార్గంగా ఫీజును రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫీజుల పెంపు దేశంలోని 23 ఐఐటీ ల్లో అమలు కానుంది. కొత్తగా ఏర్పాటైన తిరుపతి ఐఐటీకి కూడా ఫీజుల పెంపు వర్తిస్తుంది. త్వరలో ఎన్ఐటీల్లోనూ పెంపు? ఐఐటీలతో పాటు దేశంలోని 31 ఎన్ఐటీల్లోనూ ఫీజులు పెంచాలని గతంలోనే ఎన్ఐటీల కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రూ.70 వేలుగా ఉన్న వార్షిక ఫీజును రూ.2 లక్షలకు పెంచాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖకు ప్రతిపాదనలు అందజేసింది. దీనిపైనా త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశముంది. -
ఇంటర్లో మార్కులకు స్వస్తి?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ మార్కుల్లో నెలకొన్న అనారోగ్యకర పోటీని తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంటర్లో మార్కుల విధానాన్ని తొలగించి, సీబీఎస్ఈ తరహాలో గ్రేడింగ్ విధానం అమలు చేసే దిశగా పరిశీలన జరుపుతోంది. వీలైతే 2016 మార్చిలో జరిగే పరీక్షల్లోనే దీన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధ్రువీకరించారు. పరీక్షల సంస్కరణలో భాగంగా గ్రేడింగ్ విధానంతోపాటు ఆన్లైన్లో జవాబు పత్రాల మూల్యాకనం పైనా అధ్యయనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీలైతే ఈ ఏడాది పరీక్షల్లోనే ఈ విధానాలను అమల్లోకి తెస్తామన్నారు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అధ్యయనం పూర్తయ్యాక దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. సీబీఎస్ఈలో ఇలా.. దేశవ్యాప్తంగా నడుస్తున్న పాఠశాలల్లోని విద్యార్థులందరిని పరిగణనలోకి తీసుకొని టాప్ మార్కులు సాధించినవారి సంఖ్య ఆధారంగా ‘9 పాయింట్ గ్రేడింగ్’ విధానాన్ని సీబీఎస్ఈ అమలు చేస్తోంది. విద్యార్థులకు గ్రేడ్లతోపాటు మార్కులను కూడా ఇస్తోంది. కానీ రాష్ట్రంలో మార్కులను వెల్లడించొద్దని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 9, 10 తరగతుల్లో గ్రేడింగ్ విధానాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రవేశ పెట్టింది. 6, 7, 8 తరగతుల్లోనూ ఇంటర్నల్స్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్లో గ్రేడింగ్ విధానంపై కసరత్తు చేస్తోంది.