International experts
-
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణులు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్, యాఫ్రి సంస్థ ప్రతినిధులు ఆదివారం పరిశీలించారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) డైరెక్టర్ అశ్వనీకుమార్, జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, సీఈ నరసింహమూర్తి, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), వ్యాప్కోస్ అధికారులతో కలిసి అంతర్జాతీయ నిపుణులు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, లీకేజీలను నిశితంగా పరిశీలించారు.ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు కట్టడానికిముందు లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్ గ్రౌటింగ్ చేసిన విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.వరద ఉధృతి గరిష్ఠంగా ఉన్నప్పుడు, కనిష్ఠంగా ఉన్నప్పుడు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో లీకేజీల స్థాయి ఎంత ఉందని అడిగారు. కాఫర్ డ్యామ్‌ల లీకేజీలను తెలుసుకోవడానికి ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షల ఫలితాలపై ఆరా తీశారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను చూసి, మ్యాప్ ద్వారా పనుల వివరాలను తెలుసుకున్నారు.అనంతరం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పరిస్థితిపై జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, సీఈ నరసింహమూర్తి, అధికారులతో సమీక్షించారు. సోమవారం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లను పరిశీలించి, కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను నింపి వైబ్రోకాంపాక్షన్ ద్వారా యథాస్థితికి తెచ్చిన పనులను తనిఖీ చేయనున్నారు. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో కోతకుగురై దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌ను పరిశీలించనున్నారు. -
నేడు పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఎంపిక చేసిన అంతర్జాతీయ నిపుణులు యూఎస్ఏకు చెందిన డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్, కాంట్రాక్టు సంస్థ మేఘా నియమించిన యాఫ్రి (స్వీడన్) ప్రతినిధులు ఆదివారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. నాలుగు రోజులపాటు వారు అక్కడే మకాం వేసి, ప్రాజెక్టుపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ఆదివారం, సోమవారం ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని, డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2 డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్, స్పిల్ వే, స్పిల్ ఛానల్లను పరిశీలిస్తారు. మంగళవారం, బుధవారం డయాఫ్రమ్‌వాల్ పనులు చేసిన బావర్, జెట్ గ్రౌటింగ్ పనులు చేసిన కెల్లర్, ప్రాజెక్టు పనుల నాణ్యతను పర్యవేక్షించే సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్స్) నిపుణులు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, పీపీఏ సీఈవోతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్షేత్ర స్థాయి పరిశీలన, సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రాజెక్టులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే విధానాన్ని ఖరారు చేస్తారు. నిర్మాణాలకు డిజైన్లపై కసరత్తు చేస్తారు. నలుగురు అంతర్జాతీయ నిపుణులు, యాఫ్రి సంస్థ ప్రతినిధులతో సీడబ్ల్యూసీ సభ్యులు (డిజైన్ అండ్ రీసెర్చ్ వింగ్) ఎస్కే సిబల్ శనివారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ నిపుణులకు పోలవరం ప్రాజెక్టు పనులపై అవగాహన కల్పించేందుకు పీపీఏ సీఈవో అతుల్‌జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.ప్రాజెక్టును పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్లుపోలవరం ప్రాజెక్టు పనులను ట్రైనీ ఐఏఎస్‌ల బృందం శనివారం పరిశీలించింది. ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి పనులను వీక్షించారు. ప్రాజెక్టు ఈఈ వెంకటరమణ పనులు జరుగుతున్న తీరును వివరించారు. ఈ బృందంలో 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ట్రైనీలు సీహెచ్ కళ్యాణి, దామెర హిమ వంశీ, స్వప్నిల్ జగన్నాథ్, బొల్లిపల్లి వినూత్న, హెచ్ఎస్ భావన, శుభమ్ నోక్వాల్ ఉన్నారు. అనంతరం వీరు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. -
ఇంధన రంగంలో పెట్టుబడులపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అంతర్జాతీయ నిపుణులతో చర్చించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేసంలో బ్రిటన్ చమురు దిగ్గజం బీపీ గ్రూప్ సీఈవో బాబ్ డడ్లీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఈడీ ఫాతిహ్ బిరోల్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడుల రాకకు ఎదురవుతున్న నియంత్రణపరమైన అడ్డంకులను తొలగించాలని, సహజ వాయువు ధరలపై నియంత్రణలను ఎత్తివేయాలని నిపుణులు ఈ సందర్భంగా సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువగా క్రూడాయిల్ బ్యారెల్ రేటు 37 డాలర్లకు పడిపోవడంతో చమురు కంపెనీలు పెట్టుబడులను, సిబ్బందిని తగ్గించుకుంటున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భవిష్యత్‌లో వేలం వేసే క్షేత్రాల గ్యాస్‌కు మార్కెట్ ఆధారిత ధరను ఇచ్చే ప్రతిపాదన పరిధిలోకి ప్రస్తుత నిక్షేపాలకు కూడా వర్తింపచేసే అంశం ఇందులో చర్చకు వ చ్చినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. చమురు, గ్యాస్ రంగంలో టెక్నాలజీలను మెరుగుపర్చుకోవడం, మానవ వనరుల అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించడం తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోదీ చెప్పినట్లు వివరించింది. -
ఐఐటీ ఇక్కడే!
సాక్షి, విశాఖపట్నం: ఐఐఐటీ, ఐఐటీ, ఐఎస్బీ, నిఫ్ట్, ఐఐఎస్టీ, ఐఐసీటీ, నైపర్.. ఇవన్నీ ప్రఖ్యాత ఇంజినీరింగ్, సైన్స్ క్యాంపస్‌లు. ఇందులో సీటు వస్తే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయమైపోతుంది. అందుకే వీటిలో సీటు కోసం లక్షలాది మంది విద్యార్థులు ఏటా పోటీపడుతుంటారు. ఇకపై ఇక్కడి విద్యార్థులు నగరంలోనే కోరుకున్న క్యాంపస్‌లో చదువుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితమైన కీలక వర్సిటీలను విభజన కారణంగా సీమాంధ్రలోనూ స్థాపించేందుకు కేంద్రంకసరత్తు చేస్తోంది. సీమాంధ్రలో సకల వసతులున్న ప్రాంతంలో వీటిలో కొన్ని నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత జాతీయస్థాయి క్యాంపస్‌ల స్థాపనకు పూర్తి అర్హత ఉన్న ఏకైక నగరంగా విశాఖ అందరి దృష్టి ఆకర్షిస్తోంది. అన్నీ అనుకూలాంశాలే... సువిశాల క్యాంపస్‌లకు కావలసిన వందలాది ఎకరాల భూములు, ఎయిర్‌పోర్టు, రైలు కనెక్టవిటీ, క్యాంపస్ విద్యార్థుల ప్రయోగాలకు వేదికగా చెంతనే రకరకాల పరిశ్రమలు..ఇవన్నీ ఏ యూనివర్సిటీ స్థాపనకైనా అవసరం. ఇవన్నీ కలబోతగా ఉన్న విశాఖను క్యాంపస్‌ల స్థాపనకు అర్హతల పరంగా ముందువరుసలో ఉండేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా విశాఖకు ప్రముఖ క్యాంపస్‌లు వచ్చే అవకాశం ఉంది. ఐఐటీ, ఐఐఐటీ, ఐఎస్బీ తదితర క్యాంపస్‌ల కోసం కేంద్రం ఇప్పుడు అనువైన ప్రాంతాలను అన్వేషిస్తోంది. తొలి ప్రాధాన్యం విశాఖకే ఇచ్చే వీలుంది. ఒక్కో వర్సిటీకి కనీసం 500 ఎకరాలు అవసరం. అంతర్జాతీయ నిపుణులు, ప్రాజెక్టుల ప్రతినిధులు, గెస్ట్, రీసెర్చ్ ఫ్యాకల్టీ తదితరులు రావడానికి అనువుగా అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఉండాలి. విద్యార్థులు రీసెర్చ్, ప్రాజెక్టు వర్క్, క్యాంపస్‌లు, పరిశ్రమలు కలిసి పరిశోధనలు చేయడానికి అనువుగా నగరం చుట్టుపక్కల కంపెనీలుండాలి. రీసెర్చ్‌కు ల్యాబ్లుండాలి. ఈ సదుపాయాలన్నీ విశాఖలోనే ఉన్నాయి. తక్షణమే భూ లభ్యత కూడా ఉండడంతో కేంద్రం విశాఖనే ప్రాథమ్యంగా ఎంచుకునే అవకాశం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. త్వరలో విశాఖకు ప్రతిష్టాత్మక క్యాంపస్‌లు వచ్చే వీలుందని అంటున్నారు. ఇప్పటికైనా రావలసిందే... వాస్తవానికి విశాఖకు ప్రఖ్యాత క్యాంపస్‌లు ఎప్పుడో మంజూరు కావలసి ఉంది. కానీ ఆచరణలో అనేక ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉంది. గతంలో నగరానికి ఐఐఎఫ్‌టీ, ఐఐటీ, ఐఐఐటీ, ఇన్నోవేషన్ వర్సిటీ, ఐఐఎం వచ్చే అవకాశం ఏర్పడింది. ఆ సమయంలో ఎంపీగా ఉన్న పురందేశ్వరితో పాటు ఇతర నేతలు వీటిని విశాఖకు తీసుకువచ్చేందుకు పూర్తిస్థాయిలో మనసు పెట్టలేదు. కనీసం విశాఖలో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ ప్రతిపాదనలు పంపడంలో విఫలమయ్యారు. దీంతో హైదరాబాద్ తర్వాత విశాఖలో కొత్త, అదనపు వర్సిటీల ఏర్పాటుకు ఎన్నో అవకాశాలున్నా నేతల గట్టి ప్రయత్నాలు లేక ఏ ఒక్కటీ ఇక్కడికి రాలేదు. వాస్తవానికి ఇన్నోవేషన్ యూనివర్సిటీ విశాఖకు మంజూరైందని ప్రకటించారు. భూ సేకరణ చేయాలని కలెక్టర్ ప్రయత్నించారు. కానీ దానికి అతీగతి లేదు. యూజీసీ కొత్త పాలసీ ప్రకారం ఇన్నోవేషన్ యూనివర్సిటీలను దేశవ్యాప్తంగా 10 చోట్లకుపైగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో భూముల లభ్యత సమస్య కారణంగా విశాఖకు ఇది వచ్చే వీలు ఏర్పడింది. విశాఖకు కావాలి అని అడిగేవారు లేక ఇదికాస్తా పోయింది. ఐఐఐటీ విశాఖకు వచ్చేస్తోందని ఎప్పటినుంచో నేతలు ప్రచారం చేశారు. అది కూడా కాకినాడకు పోయింది. ఇప్పుడు గట్టిప్రయత్నం జరిగితే నగరానికి క్యాంపస్‌లు క్యూకట్టడం ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు.