Internet center
-
వాట్స్‌యాప్‌లో హిందీ ప్రశ్నపత్రం
కడప ఎడ్యుకేషన్: విద్యాశాఖ ఆ«ధ్వర్యంలో 6 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న(ఆరు నెలల పరీక్షలు) సమ్మెటివ్ అసెస్మెంట్–2కు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు తెలిసింది. ఇందుకు సంబం«ధించిన ప్రశ్నపత్రాలు పలువురి మొబైల్ ఫోన్లలోని వాట్స్యాప్లలో హల్చల్ చేస్తున్నాయి. çసమ్మెటివ్ çపరీక్షలకు సంబంధించి సబ్జెక్టు పశ్నపత్రాలు పరీక్ష జరిగే ఒక రోజు ముందు వాట్స్‌యాప్‌లో హల్చల్ చేస్తున్నాయి. అలా వచ్చిన ప్రశ్నపత్రాల గురించి తెలుసుకున్న విద్యార్థులు తమ స్నేహితులకు సమాచారాన్ని చేరవేసి వాటినే ప్రిపేర్ అవుతున్నట్లు తెలిసింది. కొన్ని ప్రైవేటు పాఠశాలల యజమాన్యం కూడా ఆ పేపర్‌నే ప్రిపేర్ కావాలని సూచిస్తున్నట్లు సమాచారం. గతంలో జరిగిన సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా అప్పట్లో లీక్ అయినట్లు తెలుస్తోంది. 9వ తేదీ సోమవారం జరగనున్న పదో తరగతి హిందీ ప్రశ్నపత్రంతోపాటు బిట్‌పేపర్ కూడా ఆదివారం వాట్స్‌యాప్‌లో ప్రత్యక్షమైంది. ఈ ప్రశ్నపత్రాలు కడప నగరం నకాష్ ప్రాంతంలోని ఒక ఇంటర్నెట్ నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. ఈ నెట్ సెంటర్ యజమాని ఒక సెట్‌కు రూ.3500 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై డీసీఈబీ సెక్రటరీ నారాయణరెడ్డిని వివరణ కోరగా వాట్స్‌యాప్‌లో ప్రశ్నపత్రం వచ్చినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. ప్రశ్నపత్రాల ప్రిటింగ్ అంతా విజయవాడలో జరుగుతుందని అక్కడి నుంచి వచ్చిన ప్రశ్నపత్రాలను తాము చాలా భద్రంగా పాఠశాలలకు పంపుతామన్నారు. కానీ నిజానిజాలు పరిశీలించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. -
కదులుతున్న డొంక
నగర పాలక సంస్థలో నకిలీ డీడీల బాగోతం అనంతపురం న్యూసిటీ/క్రైం : నగర పాలక సంస్థలో నకి లీ డీడీల డొంక కదులుతోంది. ఈ నెల 8న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు జానకి, బోయ గిరిజమ్మ తమ డివిజన్లలో నకిలీ డీడీలు వేశారంటూ కమిషనర్ చల్లా ఓబులేసుకు ఫిర్యాదు చేశారు. రూ.10 లక్షల వర్కులకు సంబంధించి విజయబ్యాంకు పేరు మీద డీడీలు తీశారన్నారు. నకిలీ డీడీలు సృష్టించిన లక్ష్మినారాయణ, చంద్రశేఖర్, ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేయాలన్నారు. దానిపై ఎస్ఈ సురేంద్రబాబు విచారణ చేయగా నకిలీగా తేలాయి. దీంతో కమిషనర్ చల్లా ఓబులేసు.. టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితమే టూటౌన్ పోలీసులు నకిలీ డీడీలతో ప్రమేయం ఉన్న లక్ష్మినారాయణ, చంద్రశేఖర్, ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మేయర్ మదమంచి స్వరూప బావ రాజశేఖర్ ప్రమేయంతోనే ఈ వ్యవహారం చోటు చేసుకుందన్న వార్తలు వినబడుతున్నాయి. సోమవారం పోలీసులు మేయర్ బావను విచారించారని తెలియడం ఈ వార్తకు బలం చేకూరుస్తోంది. మేయర్ బంధువుపైనే విమర్శలు రావడంతో ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనిపై కలెక్టర్, ఎస్పీ చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నాయి. మేయర్ బావపై ఆరోపణలు వస్తుండడంతో ఇందులో మేయర్ పాత్ర ఏమైనా ఉందా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ విషయం నగరపాలక సంస్థలో చర్చనీయాంశమైంది. ఏదిఏమైనా నకిలీ డీడీల వ్యవహారం మేయర్ మెడకు చుట్టుకుంటోందన్న వార్తలు వినబడుతున్నాయి. పోలీసుల అదుపులో మేయర్ బంధువు నకిలీ డీడీల కుంభకోణంలో మేయర్ కుటుంబ సభ్యుడు రాజశేఖర్‌ను టూటౌన్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఇంటర్నెట్ సెంటర్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా వారు వెల్లడించిన వివరాల మేరకు... మేయర్ కుటుంబ సభ్యుడైన రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నప్పటి నుండి మేయర్ వర్గంలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. మరోవర్గం వారు సన్నిహితంగా ఉంటూనే ఈ వ్యవహారంలో రాజశేఖర్‌ను ఇరికించారని మేయర్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. -
రుణమాయేనా?
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణమాఫీ రుణాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చి అనేక మెలికలు విస్తుపోతున్న రైతాంగం మచిలీపట్నం : రైతు రుణాల మాఫీ ప్రక్రియలో ప్రభుత్వం అనేక గిమ్మిక్కులు చేస్తోంది. తాజాగా ఆన్లైన్లో ఉంచిన రుణమాఫీ జాబితాల్లో వివరాలను చూసిన రైతులు విస్తుపోతున్నారు. జాబితాల్లో ఆయా బ్యాంకులు, రైతుల ఖాతా నంబర్ల వారీగా ఆన్లైన్లో ఉంచారు. బ్యాంకులోని ఖాతాదారుల నంబరు, బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు నమోదు చేస్తేనే ఈ ఖాతాకు సంబంధించిన వివరాలు వెల్లడవుతున్నాయి. రూ.50 వేలకు పైబడి రుణం తీసుకుంటే సంబంధిత రైతు కుటుంబ సభ్యులు తీసుకున్న రుణం వివరాలు, వడ్డీ ఎంత అయ్యింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఎంత రుణమాఫీ జరిగే అవకాశం ఉంది వంటి వివరాలను చూపారు. ఎంత నగదు రుణమాఫీ అయ్యిందన్న కాలం వద్ద ఎలాంటి వివరాలూ చూపలేదు. దీంతో రైతుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు అందుబాటులో లేవు ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రుణమాఫీ జాబితాలకు సంబంధించి స్పష్టమైన వివరాలు ఎవరూ చెప్పలేకపోతున్నారు. జిల్లాలో ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది.. ఎంత నగదు జమ చేశారు.. తదితర వివరాలు తమ వద్ద లేవని అధికారులు చెబుతున్నారు. కలెక్టర్ ఎం.రఘునందన్‌రావుతో పాటు కలెక్టరేట్లోని ఎన్ఐసీ సెంటర్ డీఐవోను, లీడ్‌బ్యాంకు మేనేజరును, వ్యవసాయశాఖ జేడీ, కేడీసీసీ బ్యాంకు సీఈవోను, ఆయా బ్యాంకు మేనేజర్లను రుణమాఫీపై వివరాలు అడిగినా తమ వద్ద లేవని చెప్పడం గమనార్హం. కొలమానంతో కోత ప్రభుత్వం 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి 2013 డిసెంబరు 31 వరకు తీసుకున్న రుణాలను రుణమాఫీ కింద పరిగణిస్తామని ప్రకటించింది. గుట్టుచప్పుడు కాకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (కొలమానం) అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ లెక్కన 2007-08లో పంట రుణం తీసుకుంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఆ బకాయికి ఎకరానికి రూ.14 వేలు మాత్రమే వర్తింపజేసింది. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో 2007-08 సంవత్సరానికి సంబంధించి ఎకరానికి రూ. 14 వేలు మాత్రమే రుణమాఫీ జరుగుతుందని చూపింది. 2012-13లో తీసుకున్న రుణాలకు ఎకరానికి రూ.19 వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌గా నిర్ణయించింది. వాస్తవానికి ఆ ఏడాది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.23 వేలుగా ఉంది. రుణాలు మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రైతుల ఆశలను వమ్ము చేస్తూ స్కేల్ ఆఫ్ పైనాన్స్ ప్రకారం రుణమాఫీ చేయడం నిలువునా మోసం చేయడమేనని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం నాటి నుంచే రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని, కోటయ్య కమిటీ ఏర్పాటు దీనికి ఉదాహరణని రైతులు ఆవేదన చెందుతున్నారు. గుండెపగిలిన అన్నదాత... రుణమాఫీకి సంబంధించి ఆన్లైన్లో ఉంచిన జాబితాలో తన పేరు లేదనే బెంగతో గుడ్లవల్లేరు మండలం కట్టవానిచెరువుకు చెందిన అబ్ధుల్ బారీ అనే రైతు సోమవారం గుండెపోటుకు గురై మరణించడం గమనార్హం. రుణమాఫీ ద్వారా ఎంతో కొంత వెసులుబాటు లభిస్తుందని గత కొన్నిరోజులుగా పీఏసీఎస్, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరిగాడు. రుణమాఫీ జాబితాలో అతని పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పొలానికి వెళుతూ కుప్పకూలి మరణించాడు. . -
హైదరాబాద్ ఇంటర్నెట్ యూజర్స్ 22,00,000
హైదరాబాద్: మహానగరంలో ఇంటర్నెట్ వినియోగం అధికంగా పెరిగింది. నాలుగేళ్ల క్రితం వరకు ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి అంతర్జాలాన్ని వినియోగించేవారిలో మార్పు వచ్చింది. తమ ఇంటికే నేరుగా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటున్నారు. బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిల్టెల్ తదితర పెరొందిన కంపెనీలతో పాటు సుమారు 200 వరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. నెట్ కనెక్షన్‌దారుల సంఖ్య సుమారు 22 లక్షల వరకు ఉంటుందని అంచనా. మరోవైపు సుమారు 10 లక్షల వరకు మొబైల్ కనెక్షన్ దారులు ఇంటర్నెట్ యూజర్లుగా మారారు.