Interview dates
-
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు వెల్లడి
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రధాన పరీక్ష ఫలితాలను గురువారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి దేశ రాజధానిలోని యూపీఎస్సీ కార్యాలయంలో ప్రారంభమయ్యే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు తమ వయస్సు, విద్యార్హతలు, కుల ధ్రువీకరణ తదితర అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అందజేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది ఎంపికైనట్లు శిక్షణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మెయిన్స్‌లో అర్హత పొందని వారి మార్కులను ఇంటర్వ్యూలు పూర్తయిన 15 రోజుల్లోగా యూపీఎస్సీ వెబ్సైట్లో ఉంచుతుంది. -
ఇంటర్వ్యూ తేదీలు
* ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) హాస్పిటల్లో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు: జూన్ 20 * హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్స్ పోస్టులకు: జూన్ 27 * రూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రాజెక్ట్ అటెండెంట్ (టెక్నికల్) పోస్టులకు: జూన్ 27 -
ఇంటర్వ్యూ తేదీలు
* హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)లో ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు: మే 24 * సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో యంగ్ ప్రొఫెషనల్-1 పోస్టులకు: మే 25 * ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్, క్లినికల్ అండ్ టెక్నికల్ పోస్టులకు: మే 25, 26, 30, 31, జూన్ 1, 2