IPL Governing Council meeting
-
ఐపీఎల్ 2022కి సంబంధించి కీలక అప్డేట్
IPL 2022 Stadium List: ఐపీఎల్ 2022కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. లీగ్ మ్యాచ్‌ల వేదికలు ఖరారైనట్లు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరగుతాయని, 55 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డివై పాటిల్ స్టేడియాల్లో నిర్వహించవచ్చని.. మిగిలిన 15 మ్యాచ్‌లు పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయని సదరు వెబ్సైట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ ప్రారంభ తేదీ విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. మార్చి 26 లేదా 27 తేదీల్లో సీజన్ 15 ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌ను మార్చి 27న మొదలుపెట్టాలని బీసీసీఐ తొలుత భావించినప్పటికీ.. లీగ్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా కోరిక మేరకు ఒక రోజు ముందుగానే (మార్చి 26) లీగ్‌ను ప్రారంభించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంతో పాటు లీగ్ షెడ్యూల్‌పై రేపు (ఫిబ్రవరి 24) జరగబోయే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. చదవండి: IND VS SL: అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన లంకేయులు -
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కీలక తేదీలు ఖరారు..!
IPL 2022 Auction Dates Confirmed Says Reports: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల(ఫిబ్రవరి) 12, 13 తేదీల్లో వేలం నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇవాళ నిర్ణయించింది. వేలానికి బెంగళూరు నగరం వేదికగా కానుంది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మీటింగ్‌లో వేలంతో పాటు పలు కీలక అంశాలపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. సంజీవ్ గోయెంకా ఆర్పీఎస్జీ గ్రూప్‌కు చెందిన లక్నో ఫ్రాంఛైజీ, సీవీసీ క్యాపిటల్‌కు చెందిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీలకు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను జారీ చేయాలని గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే షెడ్యూల్, వేదికల ఖరారు అంశం కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో తప్పుకోవడంతో టాటా ఆ హక్కులకు చేజిక్కించుకుంది. చదవండి: IND Vs SA 3rd Test: ద్రవిడ్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లి -
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక సమావేశం.. ఖరారు కానున్న షెడ్యూల్!
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం ముంబైలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఐపీఎల్-2022కు సంబంధించి వేదిక, షెడ్యూల్ గురించి కూడా చర్చించనున్నట్లు సమాచారం. "ప్రస్తుతం మా దృష్టి అంతా ఐపీఎల్ వేలాన్ని విజయవంతంగా నిర్వహించడంపైనే ఉంది. గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో ముందుకు వెళ్లే మార్గాలను చర్చిస్తాం" అని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ పేర్కొన్నారు. కాగా భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12,13, తేదిల్లో బెంగళూరులో నిర్ణయించాలని బీసీసీఐ భావించింది. కానీ బెంగళూరులో కోవిడ్ తీవ్రత దృష్ట్యా వేదికను తరలించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. చవవండి: IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్! -
నేడు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక భేటీ
-
అన్నీ చర్చిస్తారా... అంతా చెప్పేస్తారా!
ఇప్పటికే ఈ ఏడాది ఆలస్యమైన ఐపీఎల్ ముందుకు వెళ్లేందుకు రెండు అడుగులు పడ్డాయి. మొదటిది వేదిక. రెండోది షెడ్యూల్. ఇక ఆఖరి అడుగే మిగిలుంది. అదే విధి విధానాలు. ఎందుకంటే ఇన్నాళ్లు భారత్‌లో జరిగాయి. ఇంటాబయటా పోటీలుండేవి. కానీ ఇది కరోనా కాలం. జరిగేది యూఏఈ వేదికపై! దీంతో పెద్ద కసరత్తే అవసరమైంది. అందుకే నేడు జరిగే పాలకమండలి (గవర్నింగ్ కౌన్సిల్–జీసీ) సమావేశం అత్యంత కీలకమైంది. ఆదివారమే అన్నీ చర్చిస్తారు. అనంతరం అంతా చెప్పేస్తారు. అక్కడికి వెళ్లిన దగ్గరి నుంచి తిరిగి స్వదేశం చేరేదాకా చేయాల్సినవి... చేయకూడనివి అన్నీ కూలంకశంగా చర్చిస్తారు. ఒక్కో ఫ్రాంచైజీలో వెళ్లే ఆటగాళ్ల సంఖ్య, ఆడే మ్యాచ్‌లు... ఉండే పరిమితులు, ఏర్పాటు చేసే బుడగ, దాటితే వచ్చే సమస్యలు ఇలా ఒకటి రెండు కాదు... అన్నింటికీ సమాధానాలు ఈ సమావేశంలోనే వెల్లడవుతాయి. ముందు కావాల్సింది... ఆమోదం కరోనా వాయిదా వేసినా... వరల్డ్‌కప్‌తో కలిసొచ్చిన కాలంతో ఐపీఎల్‌కు రంగం సిద్ధమవుతోంది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చకచకా పనులు చక్కబెడుతున్నప్పటికీ భారత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కావాల్సిందే. యూఏఈలో నిర్వహించేందుకు, అక్కడికి భారత ఆటగాళ్లను, సిబ్బందిని చార్టెడ్ ఫ్లయిట్లలో తరలించేందుకు సర్కారు అనుమతి కావాలి. ఇప్పటికైతే కేంద్రం స్పందించలేదు. అయితే కరోనా ప్రొటోకాల్ పాటిస్తే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత ఉండదు. అందుకే ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ కేంద్ర ప్రభుత్వం ఆమోదం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేడు జరిగే సమావేశంలో బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జై షాలతో పాటు కోశాధికారి అరుణ్ ధుమాల్, ఐపీఎల్ జీసీ సభ్యులు, ఫ్రాంచైజీ యజమానులు పాల్గొంటారు. విదేశాల్లో కొత్త కాకపోయినా... ఐపీఎల్ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండుసార్లు (2009లో పూర్తిగా దక్షిణాఫ్రికాలో, 2014లో మరోసారి పాక్షికంగా యూఏఈలో) ఐపీఎల్ మ్యాచ్‌లు దేశం బయట జరిగాయి. అలాగని ఇది కూడా అంత సులభమే అనుకుంటే పొరపాటు. ఆ టోర్నీలకు ఇప్పటి టోర్నీకి చాలా తేడా. ఆటగాళ్లు, సిబ్బంది రక్షణే కత్తిమీద సాములా తయారైంది. అయితే ఇంగ్లండ్‌లో సాఫీగా జరిగిన విండీస్ పర్యటనతో ఎనిమిది ఫ్రాంచైజీలు ఆడే ఐపీఎల్‌ను పోల్చలేం. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)లోని నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. ఈ మీటింగ్ అనంతరం ఫ్రాంచైజీలకు ఎస్ఓపీ బుక్‌లెట్‌ను అందజేస్తారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ దరిచేరకుండా ఏర్పాటు చేసే జీవ రక్షణ వలయంపై చర్చిస్తారు. ఈ బుడగలో ఉంటే సరి... మరి గాయంతోగానీ, పొరపాటుగా కానీ బుడగ దాటితే ఎదురయ్యే పరిణామాలేంటి అనే అంశాలే అన్ని ఫ్రాంచైజీలను వేధిస్తున్నాయి. డివిలియర్స్ కష్టమేనా... దక్షిణాఫ్రికాలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సఫారీ ప్లేయర్లు ఈ సీజన్లో ఆడే అవకాశాలు క్లిష్టమవుతున్నాయి. దీంతో ‘మిస్టర్ 360’ డివిలియర్స్ మెరుపులు ఉండవేమో! అలాగే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, విండీస్ ఆటగాళ్లు తొలి రౌండ్ పోటీలకు అందుబాటులో ఉండరు. ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీగా ఉండటం వల్లే సెప్టెంబర్‌లో జరిగే పోటీల్లో ఆడకపోవచ్చు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ వల్ల విండీస్ ఆటగాళ్లు ఆలస్యంగా ఐపీఎల్ ఆడేందుకు వస్తారు. ఆటగాళ్ల వెంట భార్యలను, గర్ల్‌ఫ్రెండ్స్‌ను అనుమతించే అంశంపైనే పాలక మండలి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఒక్కో జట్టులోని గరిష్ట పరిమితికి లోబడి ఉండొచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి. -
ఐపీఎల్: ముందుగా యూఏఈకి చెన్నై జట్టు
చెన్నై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13వ సీజన్‌కు అందరికంటే ముందుగా సమాయత్తమవుతుంది. ఈసారి ఐపీఎల్ దుబాయ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.అందుకు సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్‌ను ఆగస్టు మొదటి వారంలోనే మొదలుపెట్టనుంది. ఆగస్టు 10నే యూఏఈకి వెళ్లేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని తమ ఆటగాళ్లకు తెలియజేసింది. అయితే చెన్నై జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ ముందుగా చెన్నైకు వచ్చి రిపోర్ట్ చేయనున్నట్లు సీఎస్కే యాజమాన్యం తెలిపింది. భారత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ప్రత్యేక చార్టర్ విమానంలో ఆటగాళ్లను దుబాయ్‌కు పంపనున్నట్లు తెలిపింది. కాగా కరోనా వైరస్‌కు ముందు ఐపీఎల్లో పాల్గొనేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు అందరికంటే ముందే ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించింది. జట్టులో సీనియర్ ఆటగాళ్లైనా సురేశ్ రైనా, ఎంఎస్ ధోని , అంబటి రాయుడు తమ ప్రాక్టీస్‌ను కూడా ప్రారంభించారు. అయితే కరోనా వైరస్ విజృంభించడంతో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కాస్త వాయిదా పడింది. ఒక దశలో ఐపీఎల్ జరగుతుందా అన్న అనుమానం కూడా కలిగింది. కానీ టీ20 ప్రపంచకప్ వాయిదా పడడంతో ఐపీఎల్‌కు మార్గం సుగమమయింది. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్‌ను నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ పేర్కొన్నారు. 53 రోజుల పాటు జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10వ తేదీన జరగనుంది. దుబాయ్‌లో జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్, మ్యాచ్‌ల వివరాలను ఆదివారం(ఆగస్టు 2) జరిగే ఐపీఎల్ గవర్నింగ్ సమావేశంలో ప్రకటించనున్నారు. దీంతో పాటు ఐపీఎల్ పాల్గొననున్న ఎనిమిది జట్లకు సంబంధించి ఎక్కడ ఉండాలనేదానిపై, లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు ఏ విధమైన భద్రత కల్పించాలనేదానిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. -
ఏమిటి.. ఎలా.. ఎందుకు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2020 ప్రకటన ఇప్పటికే వచ్చేసింది... సెప్టెంబర్ 19నుంచి యూఏఈ వేదికగా టోర్నీ జరగడం ఖాయమైంది. ప్రధానంగా టీవీ ద్వారానే వినోదాన్ని పొందే సగటు క్రికెట్ అభిమానికి ఇది ఒక సంబరంలాంటిదే. ఫోర్లు, సిక్సర్ల హోరు... విధ్వంసకర బ్యాటింగ్ గురించి ఇకపై ఎంత చర్చించినా తక్కువే. అయితే అభిమానులకు సంబంధం లేని మరో అంశం ఇప్పుడు ఐపీఎల్ విషయంలో కీలకంగా మారింది. అసలు మైదానంలో దిగే ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉండబోతోంది...ఫ్రాంచైజీలు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి...కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లీగ్ విజయవంతంగా పూర్తవుతుంది... ఇలాంటి సందేహాలన్నీ నిర్వాహకులు తీర్చాల్సి ఉంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ఖరారు చేసేందుకు బోర్డు ఆదివారం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణలో ఎదురు కానున్న సవాళ్లు ఏమిటి? వీటికి బీసీసీఐ సమావేశంలో సమాధానం లభిస్తుందా అనేది చూడాలి. పాజిటివ్‌గా తేలితే... ఐపీఎల్‌లోని ఎనిమిది జట్ల ఆటగాళ్లను బయో సెక్యూర్ బబుల్‌లో ఉంచడంలో ఫ్రాంచైజీలదే బాధ్యత కానుంది. టోర్నీకి కొద్ది రోజుల ముందునుంచీ వీరందరినీ క్వారంటీన్లో ఉంచుతారా అనేదానిపై స్పష్టత లేదు. ఒక వేళ టోర్నీ జరిగే సమయంలో ఎవరైనా ఒక ఆటగాడు ‘పాజిటివ్’గా తేలితే అప్పుడేం చేయాలని ఫ్రాంచైజీలు మరింత సమాచారం కోరుతున్నాయి. సదరు ఆటగాడి జట్టులోని సహచరులందరినీ మళ్లీ పరీక్షిస్తారా...అదే హోటల్లో మరో జట్టు ఉంటే జట్టు మొత్తాన్ని ఐసోలేట్ చేస్తారా తెలియదు. ఆ జట్టు తర్వాతి రోజు మ్యాచ్ ఆడాల్సి ఉంటే దానిని రద్దు చేస్తారా లేక వాయిదా వేస్తారా చూడాలి. ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ తరహాలో ఎవరైనా ‘బబుల్’ దాటి బయటకు వస్తే అప్పుడేం చేయాలనేది తెలియాలి. ఐపీఎల్ ఆడేవారికి ఎన్ని రోజులకు ఒకసారి టెస్టులు నిర్వహిస్తాలో కూడా నిర్ణయించాల్సి ఉంది. కొన్ని జట్లలోని ప్రధాన ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను కూడా తీసుకొస్తామని ఇప్పటికే ఫ్రాంచైజీలకు చెప్పేశారు. దీనిపై మరింత స్పష్టత అవసరం. అదనపు ఆటగాళ్లు ఎలా... కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఐపీఎల్లో ఆడటంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. అదే జరిగితే వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు ఎలా తీసుకోవాలనే విషయంపై బోర్డుకు స్పష్టత లేదు. ముఖ్యంగా బెంగళూరు జట్టులో గరిష్టంగా 21 మంది మాత్రమే ఉండగా...వారిలో ముగ్గురు సఫారీ ఆటగాళ్లు ఉన్నారు. ఇదే కాకుండా టోర్నీ మధ్యలో ఎవరికైనా గాయమైతే అప్పటికప్పుడు మరో ఆటగాడిని తీసుకునేవారు. ఇప్పుడు అలా చేయాలంటే మళ్లీ అతనికి కోవిడ్ పరీక్షలు, క్వారంటీన్‌లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. అలా కాకుండా ముందే సన్నద్ధమై పెద్ద సంఖ్యలో జట్టును తీసుకెళ్లే అవకాశం ఇస్తారా చూడాలి. యూఏఈ చేరడం, వసతి... తమ ఆటగాళ్లకు కనీసం మూడు వారాల ప్రాక్టీస్ ఉండాలంటూ, ఇందు కోసం ఆగస్టు 20 వరకే యూఏఈ వెళతామంటూ కొన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమాచారం అందించాయి. భారత క్రికెటర్లతో పాటు తమ జట్టులోని విదేశీ ఆటగాళ్లకు కూడా ఒకే చోటికి చేరేలా చేయడం కూడా జట్టు యాజమాన్యాలదే బాధ్యత. మ్యాచ్‌లు మూడు నగరాల్లో ఉన్నా...సౌకర్యాలను బట్టి చూస్తే దుబాయ్‌లో ఉండటాన్నే అన్ని జట్లు ఇష్టపడుతున్నాయి. కొందరు ఇప్పటికే హోటళ్ల ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే అవే హోటళ్లకు వచ్చే పర్యాటకులు, ఇతర అతిథుల విషయంపై వారూ కొంత ఆందోళనగానే ఉన్నారు. కనీసం 80 రోజులు ఉండాల్సి రావడంతో అన్ని రోజులు హోటళ్లలో సోషల్ డిస్టెన్సింగ్‌తో కొనసాగడం అంత సులువు కాదు. బయటివారిని అనుమతిస్తారా... ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రధానంగా యూఏఈ దేశపు నిబంధనలను పరిగణలోకి తీసుకుంటూ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్–విండీస్ టెస్టు సిరీస్ తరహాలో క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బంది, హోటల్, భద్రతా సిబ్బంది అంతా కరోనా టెస్టులు నెగిటివ్‌గా తేలిన తర్వాత బయో బబుల్‌లోకి వచ్చారు. సిరీస్ ముగిసే వరకు అంతా ఒకే చోట ఉన్నారు. ఇప్పుడు ఐపీఎల్లో ఎనిమిది జట్లతో పాటు ఇతరులంతా సుదీర్ఘ కాలం ఇలా ఉండటం సాధ్యమేనా. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆటగాళ్లను తీసుకువెళ్లే బస్సు డ్రైవర్ కూడా వరుసగా కోవిడ్ పరీక్షలకు హాజరు కావాలని నిబంధన పెట్టడంతోనే ఎవరూ ముందుకు రాలేదని తెలిసింది. అందువల్లే సౌతాంప్టన్ నుంచి మాంచెస్టర్ వరకు వారంతా సొంత కార్లలో ప్రయాణించగా ఆర్చర్ మధ్యలో ఇంటికి వెళ్లిన ఘటన మరచిపోవద్దు! -
షెడ్యూల్ ఖరారు చేసేందుకు...
న్యూఢిల్లీ: ఐపీఎల్ 13వ సీజన్‌కు తుది మెరుగులు ఇచ్చేందుకు లీగ్ పాలక మండలి వచ్చేనెల ఆగస్టు 2న సమావేశం కానుంది. కరోనా విలయంతో ఎక్కువగా ఇంటిపట్టునే ఉంటున్న భారత ప్రేక్షకులు మెరుపుల లీగ్ కోసం ఎన్నడూ లేనంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూఏఈలో జరుగనున్న ఈ టోర్నీ మొదలైతే టీవీలకే అతుక్కుపోవడం ఖాయం. ఇదివరకే సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు ఈవెంట్ నిర్వహిస్తామని లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం కూడా ఆయనే పాలక మండలి సమావేశంపై మీడియాకు తెలిపారు. 2న జరిగే మీటింగ్‌లో లీగ్‌పై తుదిరూపు ఖరారవుతుందని, ఎనిమిది ఫ్రాంచైజీలకు పూర్తి స్పష్టత వస్తుందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. -
ఏమీ తేల్చలేదు
లోధా తీర్పు అధ్యయనానికి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు ఆరు వారాల్లో ప్రతిపాదనలు ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రెండు ప్రధాన జట్లపై వేటు పడిన నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి (జీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఉత్కంఠగా ఎదురుచూసినా ప్రస్తుతానికి ఎటూ తేల్చలేదు. ఆదివారం జరిగిన ఈ సమావేశంలో చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లను శాశ్వతంగా నిషేధిస్తారా? లేక బోర్డే తమ చేతుల్లోకి తీసుకుని నిర్వహిస్తుందా? అనే అనుమానాలకు సమాధానం దొరుకుతుందని అంతా భావించారు. అయితే ఈ వ్యవహారంపై జీసీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన తీర్పును పూర్తిగా అధ్యయనం చేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఈ గ్రూప్ పనిచేస్తుంది. ఆరు వారాల్లోగా ఈ గ్రూప్ సభ్యులు తీర్పును చదివి ఐపీఎల్ పాలక మండలికి తగిన ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఇస్తారని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.