
IPL 2022 Stadium List: ఐపీఎల్ 2022కి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. లీగ్ మ్యాచ్‌ల వేదికలు ఖరారైనట్లు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొంది. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరగుతాయని, 55 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డివై పాటిల్ స్టేడియాల్లో నిర్వహించవచ్చని.. మిగిలిన 15 మ్యాచ్‌లు పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయని సదరు వెబ్‌సైట్ వెల్లడించింది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ ప్రారంభ తేదీ విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. మార్చి 26 లేదా 27 తేదీల్లో సీజన్ 15 ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌ను మార్చి 27న మొదలుపెట్టాలని బీసీసీఐ తొలుత భావించినప్పటికీ.. లీగ్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా కోరిక మేరకు ఒక రోజు ముందుగానే (మార్చి 26) లీగ్‌ను ప్రారంభించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంతో పాటు లీగ్ షెడ్యూల్‌పై రేపు (ఫిబ్రవరి 24) జరగబోయే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
చదవండి: IND VS SL: అభిమాన క్రికెటర్ కోసం రోడ్డెక్కిన లంకేయులు