ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం ముంబైలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఐపీఎల్-2022కు సంబంధించి వేదిక, షెడ్యూల్ గురించి కూడా చర్చించనున్నట్లు సమాచారం. "ప్రస్తుతం మా దృష్టి అంతా ఐపీఎల్ వేలాన్ని విజయవంతంగా నిర్వహించడంపైనే ఉంది. గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో ముందుకు వెళ్లే మార్గాలను చర్చిస్తాం" అని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ పేర్కొన్నారు.
కాగా భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12,13, తేదిల్లో బెంగళూరులో నిర్ణయించాలని బీసీసీఐ భావించింది. కానీ బెంగళూరులో కోవిడ్ తీవ్రత దృష్ట్యా వేదికను తరలించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
చవవండి: IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!
Comments
Please login to add a commentAdd a comment