ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీలుగా లక్నో, అహ్మదాబాద్ అవతరించిన సంగతి తెలిసిందే. కాగా ఇరు ఫ్రాంచైజీలకు మెగా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం బీసీసీఐ కల్పించింది. ఈ క్రమంలో ఎంపిక చేసుకునే ఆటగాళ్ల జాబితాను జనవరి 31లోపు సమర్పించాలి. ఇప్పటికే లక్నో ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అదే విధంగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో కూడా లక్నో ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రషీద్‌తో మరో ఫ్రాంచైజీ అహ్మదాబాద్ కూడా సంప్రదింపులు జరపుతున్నట్లు సమాచారం. ఒకవేళ లక్నో రషీద్ ఖాన్‌ను దక్కించుకోవడంలో విఫలమైతే.. మార్కస్ స్టోయినిస్, కగిసో రబడాలను మరో ఆప్షన్‌గా ఉంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్- 2022 సీజన్‌కు ముందు మెగా ఫిబ్రవరి లో జరగనున్నట్లు సమాచారం.
చదవండి: IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!
Comments
Please login to add a commentAdd a comment