Iran Navy
-
ఈఎన్సీ చీఫ్‌తో ఇరాన్ నేవీ బృందం భేటీ
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ నేవీ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ కమడోర్ ఫరామర్జి నసిరితో పాటు నలుగురు సభ్యుల బృందం గురువారం తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈఎన్సీలో వివిధ శిక్షణా కేంద్రాల పనితీరును ఆ బృందం సభ్యులకు వివరించారు. ఇరుదేశాల నావికాదళ సిబ్బంది శిక్షణకు సంబంధించిన అంశాలపై సహకారం అందించుకునే విషయంపై చర్చించుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 16న తూర్పు నావికాదళాన్ని సందర్శించిన ఇరాన్ నేవీ బృందం ఈఎన్సీలో శిక్షణా కేంద్రాల తీరుతెన్నులను పరిశీలించింది. -
సొంత నౌకను పేల్చేసిన ఇరాన్
టెహ్రాన్: నావికాదళాలు విన్యాసాలు చేస్తున్న సమయంలో ఇరాన్ పొరపాటున తన స్వంత నౌకను పేల్చేసింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శిక్షణలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం పర్షియన్ గల్ఫ్ జలాల ప్రాంతంలో ఇరాన్ యుద్ధ నౌక జమరాన్ క్షిపణిని ప్రయోగించింది. ఆ క్షిపణి సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న కొనరాక్ అనే నౌకను పొరపాటున టార్గెట్ చేసి పేల్చేసింది. ఈ దాడిలో గాయపడిన సిబ్బందిని సిస్తాన్, బలూచిస్తాన్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు ఫ్రావిన్స్ మెడికల్ యూనివర్సిటీ వైద్యుడు మహమ్మద్ మెహ్రాన్ తెలిపారు. (ఆ విమానాన్ని మా రెండు క్షిపణులు కూల్చాయి: ఇరాన్ ) అయితే ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో ఎంతమంది సిబ్బంది ఉన్నారనేది స్పష్టంగా తెలియరాలేదు. కాగా నెదర్లాండ్స్ తయారు చేసిన కొనరాక్ నౌకను 1979 సంవత్సరం కన్నా ముందే ఇరాన్ కొనుగోలు చేసింది. ఆ నాటి నుంచి దీని సేవలను వినియోగించుకుంటోంది. ఇదిలా వుండగా ఈ ఏడాది తొలినాళ్లలో టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్‌కు చెందిన ఎయిర్ లైన్స్ విమానాన్ని సైతం ఇరాన్ పొరపాటున పేల్చేసిన సంగతి తెలిసిందే. ఇక అమెరికా నౌకలకు అడ్డు తగిలితే ఇరాన్ నౌకలను కాల్చి పారేయాలంటూ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలివ్వగా ఇరాన్ తన సొంత నౌకపైనే క్షిపణి ప్రయోగించింది. (కాల్చిపారేయండి: ట్రంప్ వార్నింగ్) -
ఇరాన్ చెర వీడి విశాఖకు చేరిన నౌక
సాక్షి, విశాఖపట్నం: కొన్ని వారాలపాటు ఇరాన్ చెరలో చిక్కిన భారత ప్రభుత్వ నౌక ‘ఎంటీ దేశ్‌శాంతి’ ఎట్టకేలకు బుధవారం విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది. 140 టీఎంటీల ముడిచమురుతో ఈ నౌక ఇరాక్ నుంచి వస్తుండగా పర్షియన్ సింధుశాఖలో ఇరాన్ నౌకాదళం గత నెల 12న అడ్డుకుని బందర్ అబ్బాస్‌కు తరలించింది. నౌక నుంచి లీకవుతున్న చమురుతో సముద్రజలాలు కలుషితమయ్యాయంటూ అదుపులోకి తీసుకుంది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరాన్ నౌకను విడిచిపెట్టింది. నౌక బుధవారం విశాఖకు రాగానే ముంబై నుంచి వచ్చిన నౌకా రవాణా అధికారుల బృందం పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించింది. ‘దేశ్‌శాంతి’లోని రూ.160 కోట్ల విలువైన 40 టీఎంటీల ముడి చమురు విశాఖలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీకి అందాల్సి ఉంది.