Irrigation se
-
హైడ్రామాకు తెర
ఇరిగేషన్ ఇన్చార్జి ఎస్ఈగా కోటేశ్వరరావు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : జిల్లా ఇరిగేషన్ ఇన్చార్జి ఎస్ఈగా కె.కోటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ ఇన్చార్జి ఎస్ఈ నియామకంపై వారంరోజులుగా సాగిన హైడ్రామాకు తెరపడింది. సోమశిల ప్రాజెక్ట్, ఇరిగేషన్ ఇన్చార్జి ఎస్ఈ వ్యవహరిస్తున్న పీవీ సుబ్బారావును ఇరిగేషన్ ఎస్ఈ అదనపు బాధ్యతల నుంచి తప్పించి ఆ బాధ్యతలను ప్రస్తుతం తెలుగుగంగ ఇన్చార్జి ఎస్ఈగా పనిచేస్తున్న కోటేశ్వరరావుకు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్ఈ కోటేశ్వరరావు హరనాథపురంలోని ఇరిగేషన్ కార్యాలయంలో శనివారం ఈఈలు, డీఈలు, నీటియాజమాన్య సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సోమశిల జలాశయంలో ఉన్న 12.2 టీఎంసీల నీటితో 2.20 లక్షల ఎకరాల్లో వేసిన రెండో పంటకు నీరు అందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. వీలైనంతవరకు డెడ్‌స్టోరేజ్ నీటిని వినియోగించకుండా వారాబంధి నిర్వహించి ఒక ఎకరా సైతం ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని నెల్లూరు, సంగం బ్యారేజీలను వచ్చే ఏడాది అక్టోబర్‌కు పూర్తిచేసేందుకు కృషిచేస్తామని తెలిపారు. నీరు – చెట్టుపై జరిగిన అవినీతి ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా సంబంధిత అధికారులతో చర్చలు జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. -
రూ.25 కోట్లతో సెంట్రల్ డెల్టా కాలువల మరమ్మతులు
ఆత్రేయపురం : సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువల అభివృద్ధి పనులకు రూ.25 కోట్లు మంజూరైనట్టు ఇరిగేషన్ ఎస్ఈ సుగుణాకరరావు వెల్లడించారు. పేరవరం, ఉచ్చిలి ఎత్తిపోతల పథకాలను ఆయన శనివారం పరిశీలించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ సెంట్రల్ డెల్టా పరిధిలోని పేరవరం, ఉచ్చిలి ఎత్తిపోతల పథకాలు శిథిలావస్థకు చేరాయన్నారు. సెంట్రల్ డెల్టాలో రూ.25 కోట్లతో పనులు చేసేందుకు నిర్ణయించామన్నారు. మార్చి 31 నాటికి కాలువ ద్వారా నీటిని నిలుపుదల చేసి పనుల అనంతరం జూన్ 15న నీరు విడుదల చేస్తామన్నారు. వైఎస్ హయాంలోనే డెల్టా ఆధునికీకరణ : చిర్ల ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.3300 కోట్లతో గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు ప్రారంభించామన్నారు. జిల్లాకు రూ. 1685 కోట్లు మంజూరు చేయించానన్నారు. ఆయన హయంలో కొన్ని పనులు చురుకుగా పూర్తి కాగా అనంతరం నత్తనడకన సాగుతున్నాయన్నారు. తాను గత ఏడాది అక్టోబర్ 22న లొల్ల లాకులవద్ద నిపుణుల కమిటీ బృందం సభ్యులు రిటైర్డు సీఈలు రోశయ్య, సుబ్బారావు, వీరయ్య చౌదరి తదితరులతో పర్యటించి పనుల మంజూరుకు కృషి చేసినట్టు తెలిపారు.