iset results
-
ఐసెట్‌లో 71,647 మంది పాస్
సాక్షి, హైదరాబాద్ : మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మిని్రస్టేషన్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశపరీక్ష (టీజీఐసెట్) ఫలితాలను కాకతీయ విశ్వవిద్యాలయ వీసీ వాకాటి కరుణ శుక్రవారం విడుదల చేశారు. ఈ సెట్లో 91.92 శాతంమంది అర్హత సాధించారు. ఇందులోనూ మహిళలే పైచేయి సాధించారు. పురుషులు 33,928 మంది పాసయితే, మహిళలు 37,718 మంది ఉత్తీర్ణులయ్యాయి.ఒక ట్రాన్స్‌జెండర్ కూడా అర్హత సాధించింది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన ఫలితాల విడుదల కార్యక్రమంలో మండలిచైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్చైర్మన్లు వి.వెంకటరమణ, ఎస్కే.మహ్మమూద్,సెట్ కనీ్వనర్ ఎస్.నర్సింహాచారి పాల్గొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఐసెట్‌కు 11 వేల మంది అదనంగా హాజరైనట్టు లింబాద్రి తెలిపారు. రాష్ట్రంలో 272 ఎంబీఏ కాలేజీల్లో 35,949 సీట్లు, 64 ఎంసీఏ కాలేజీల్లో 6990 సీట్లు అందుబాటులో ఉన్నాయి. -
ఐసెట్, డీఈఈ సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈ సెట్–2024 (డైట్ సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. సెట్ కన్వీనర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మేరి చంద్రిక గురువారం విజయవాడలోని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 24న డైట్ సెట్ నిర్వహించగా.. ఆరు రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను ప్రకటించారు.ఈ పరీక్షకు 4,949 మంది అభ్యర్థులు హాజరవ్వగా, 3,191 మంది ఉత్తీర్ణులయ్యారు. మ్యాథమెటిక్స్ విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన బులుసు గ్రీష్మిత, ఫిజికల్ సైన్స్ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కేసన మీనాక్షి, బయోలాజికల్ సైన్స్ విభాగంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన షేక్ రుక్సానా, సాంఘిక శాస్త్ర విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన గుత్తా సునీల్‌కుమార్ మొదటి ర్యాంకులు సాధించి స్టేట్ టాపర్స్‌గా నిలిచారు.6 నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధనకు ఉద్దేశించిన రెండేళ్ల డీఈఈ కోర్సుకు ఎంతో డిమాండ్ ఉంది. రాష్ట్రంలో 14 ప్రభుత్వ డైట్ కాలేజీలు ఉండగా వాటిలో 1,650 సీట్లు ఉన్నాయి. మరో 15 ప్రైవేటు డైట్ కాలేజీల్లో 1,500 సీట్లు కలిపి మొత్తంగా 3,150 సీట్లున్నాయి. డైట్ సెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం కల్పించినట్టు కన్వీనర్ మేరీ చంద్రిక తెలిపారు. జూన్ 20వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆమె వెల్లడించారు.ఏపీ ఐసెట్‌లో 96.70 శాతం మంది ఉత్తీర్ణతఅనంతపురం: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్–2024 ఫలితాలను గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను ఎస్కేయూలోని వీసీ కాన్ఫరెన్స్ హాలులో విడుదల చేశారు. ఏపీఐసెట్ చైర్మన్ ప్రొఫెసర్ కె.హుస్సేన్‌రెడ్డి, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి.మురళీకృష్ణ, ఎస్కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య, ఐసెట్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సి.శోభాబిందు, ప్రొఫెసర్ కె.రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 48,828మంది ఏపీ ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 44,447 మంది పరీక్షకు హాజరుకాగా, 42,984 మంది (96.70 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పురుషులు 23,315మంది దరఖాస్తు చేసుకోగా, 21,033 మంది హాజరయ్యారు. వీరిలో 20,296 (97 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మహిళలు 25,513 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 23,414 మంది పరీక్షకు హాజరుకాగా, 22,688 మంది (97.48 శాతం) ఉత్తీర్ణత సాధించారు.పురుషుల కంటే మహిళల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉంది. తుది ‘కీ’లో కేవలం 2 ప్రశ్నలకు మాత్రమే 5 రకాల జవాబులు రావడంతో ఆ రెండు ప్రశ్నలు రాసినవారికి మార్కులు అదనంగా కలిపారు. 34 మంది అభ్యర్థులు స్క్రైబ్ సాయంతో పరీక్షలు రాశారు. ఫలితాల విడుదల అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీఈఏపీసెట్ ఫలితాలు జూన్ 5, 6 తేదీల్లో విడుదల చేస్తామని తెలిపారు.ఏపీ ఐసెట్‌లో టాప్ –10 ర్యాంకర్లు -
ఐసెట్‌లో 90.27 శాతం ఉత్తీర్ణత
సాక్షి, అమరావతి: ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఐసెట్–2019 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయరాజు, ఎస్వీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వీవీఎస్ రాజేంద్రప్రసాద్ ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. కార్యక్రమంలో ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, ప్రొఫెసర్ బి.సుధీర్ పాల్గొన్నారు. 43 పట్టణాల్లోని 98 పరీక్ష కేంద్రాల్లో గత నెల 26న ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 52,736 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 48,445 మంది పరీక్ష రాశారు. వీరిలో 43,731 (90.27 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో పురుషులు 26,002, మహిళలు 22,443 మంది ఉన్నారు. ఉత్తీర్ణతలో మహిళలు 90.50 శాతం, పురుషులు 90.07 శాతం సాధించారు. గుంటూరుకు చెందిన కె.నాగసుమంత్ మొదటి ర్యాంక్ సాధించగా, తునికి చెందిన కె.కావ్యశ్రీ రెండో స్థానంలో నిలిచారు. ఫలితాలను ‘హెచ్‌టీటీపీఎస్://ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఐసీఈటీ’లో చూసుకోవచ్చు. ర్యాంకు కార్డులను ఈనెల 15వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టాప్ టెన్ ర్యాంకర్లు వీరే ర్యాంక్ పేరు ఊరు 1 కె.నాగసుమంత్ గుంటూరు 2 కె.కావ్యశ్రీ తుని 3 ఎన్ఎన్వి శివసాయిపవన్ విజయవాడ 4 వై.మునిచంద్రారెడ్డి వేంపల్లె (కడప) 5 ఓ.భానుప్రకాశ్ పుత్తూరు (చిత్తూరు) 6 ఎం.వెంకట నాగేంద్ర విశాఖపట్నం 7 పీవీ లక్ష్మీకిరణ్మయి రాజమండ్రి 8 కె.భానుప్రకాశ్‌రెడ్డి పి.నాయుడుపేట (చిత్తూరు) 9 అనెమ్ అఖిల్ మల్కాజ్గిరి (హైదరాబాద్) 10 ఎ.సురేంద్రరెడ్డి (బేతంచర్ల, కర్నూలు) సీట్లు ఇలా.. ఎంబీఏ కాలేజీలు 354 ఉండగా 43,809 సీట్లు ఉన్నాయి. ఎంసీఏ కాలేజీలు 131 ఉండగా 8,665 సీట్లు ఉన్నాయి. ఎంసీఏలో రెండో సంవత్సరం సీట్లు 4,412 ఉన్నాయి. ఐపీఎస్ కావడమే లక్ష్యం మాది గుంటూరు నగర శివారు గోరంట్ల. మా నాన్నగారు చిన్నప్పస్వామి పంచాయతీరాజ్ శాఖలో డివిజినల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేస్తూ మరణించారు. నాన్న లక్ష్యం మేరకు మా అమ్మ బసవ సరోజిని ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చా. 2017లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఆరు నెలలపాటు ఆంధ్రాబ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేశాను. ఐపీఎస్‌గా ఎదగాలనే లక్ష్యంతో రాజీనామా చేశాను. ఏయూలో ఎంబీఏలో చేరతాను. తరువాత సివిల్స్ లక్ష్యంగా ఐపీఎస్ సాధిస్తాను. – కారుమూరి నాగసుమంత్, ప్రథమ ర్యాంకర్ నా గోల్ సివిల్స్ సివిల్ సర్వీసెస్ నా లక్ష్యం. ఇంటివద్దే ప్రిపేరయ్యాను. ఎలాంటి కోచింగ్ తీసుకోని నాకు ‘సాక్షి’ ఎడ్యుకేషన్ వెబ్ పోర్టల్ బాగా ఉపయోగపడింది. మంచి కాలేజీలో ఎంబీఏ జాయిన్ అవుతాను. బీటెక్ పూర్తిచేసి విజయవాడ రైల్వే స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నాను. మా తండ్రి ఎన్ఎం రామయ్య గన్నవరం మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. మా అమ్మ పద్మజ గృహిణి. వీరి ప్రోత్సాహం వల్లే నేను అనుకున్న టార్గెట్లను చేరుకోగలుగుతున్నాను. – నరహరిశెట్టి ఎన్వీ శివసాయిపవన్, మూడో ర్యాంకర్ -
సిరిసిల్ల విద్యార్థికి ఐసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు
సిరిసిల్ల: కార్మిక క్షేత్రంలోని ఓ పేదింట్లో విద్యాకుసుమం విరిసింది. మంగళవారం విడుదలైన ఐసెట్ ఫలితాల్లో సిరిసిల్లలోని బీవై నగర్‌కు చెందిన గాజుల వరుణ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. గాజుల నిరంజన్, చంద్రకళ దంపతులకు కొడుకులు ఆదిత్య, వరుణ్, జయంత్. నిరంజన్ వార్పన్ కార్మికుడు. బీములు పోస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. 2005లో అనారోగ్యంతో నిరంజన్ మరణించాడు. బీడీ కార్మికురాలైన చంద్రకళ భర్తలేని లోటు రాకుండా పిల్లలను కష్టపడి చదివిస్తోంది. పెద్దాబ్బాయి ఆదిత్య ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా.. వరుణ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో ఇటీవలే బీఎస్సీ డిగ్రీ పూర్తిచేశాడు. చిన్నాబ్బాయి జయంత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తయింది. వరుణ్ చదువులో ఫస్ట్ వరుణ్ చదువులో మొదటి నుంచి ముందుండేవాడు. సిరిసిల్ల శాంతినగర్ శ్రీసిద్ధార్థ స్కూల్లో పదోతరగతి చదివి 563 మార్కులు సాధించాడు. కరీంనగర్ సీవీ.రామన్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివి 979 మార్కులు సాధించాడు. చదువులో ఎప్పుడూ ముందుండే వరుణ్‌కు కరీంనగర్లో ఇంటర్ ఫ్రీ సీటు లభించింది. ప్రస్తుతం ఐసెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. దీంతో అతడి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. సివిల్స్ సాధించడమే లక్ష్యం ఐసెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో సివిల్స్ లో ర్యాంకు సాధించి ఐఏఎస్ కావాలని ఉంది. ఫస్ట్ ర్యాంకు రావడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇదే పట్టుదలతో సివిల్స్ లక్ష్యంగా ముందుకెళ్తా.