Iv Palace
-
కన్హయ్య సభ వద్ద తీవ్ర ఉద్రిక్తత
బీజేపీ, వామపక్ష నేతల మధ్య వాగ్వాదం, తోపులాట సభలో భజరంగ్‌దళ్ కార్యకర్తను కొట్టిన వామపక్ష కార్యకర్తలు బీజేవైఎంకు చెందిన 51మందిపై కేసు విజయవాడ: జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ విజయవాడలోని ఐవీ ప్యాలెస్‌లో నిర్వహించిన విద్యార్థి యువజన శంఖారావం సభ తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. కన్హయ్య పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచే నగరంలో బీజేవైఎం నేతలు, అనుబంధ విభాగాల నాయకులు నిరసనలు నిర్వహించడంతో వాతావరణం వేడెక్కింది. కన్హయ్య వస్తే అడ్డుకుంటామని బీజేపీ అనుబంధ విభాగాల నేతలు ప్రకటించారు. అడ్డుకుంటే తీవ్రపరిణమాలు ఉంటాయని ఏఐఎస్ఎఫ్ నేతలు హెచ్చరించారు. తొలుత సిదార్థ కళాశాల ఆడిటోరియంలో కన్హయ్య సభ నిర్వహించాలని ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు అనుమతి నిరాకరించారు.దీంతో ఐవీ ప్యాలెస్‌లో ప్రైవేట్ కార్యక్రమంగా సభ నిర్వహించారు.సభ ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచే హడావుడి మొదలై చివరకు తోపులాట, భజరంగ్‌దళ్ కార్యకర్తపై దాడికి దారితీసింది. పోలీసు బందోబస్తు నడుమ కన్హయ్య సభకు చేరుకున్నారు. కన్హయ్య పూర్తి ప్రసంగం, సభ జరిగిన తీరును పోలీసులు వీడియో తీశారు. పరస్పర నినాదాల హోరు.. కన్హయ్య గోబ్యాక్ అంటూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు చూపుతూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఐవీ ప్యాలెస్ సెంటర్‌కు చేరుకున్నారు. దీనికి ప్రతిగా ఏఐఎస్ఎఫ్, వామపక్ష నాయకులు బీజేపీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పరస్పరం దూషణలు చేసుకున్నారు. ఇరువర్గాలను పోలీసులు వారించినా ఆగకుండా, తోపులాటకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడిపై ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు దాడిచేశారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా మహిళా మెర్చా నాయకురాలు కర్రి నాగలక్ష్మి సమావేశ మందిరంలోకి వెళ్లి కూర్చున్నారు. వామపక్ష కార్యకర్తలు ఆమెను గుర్తించి దాడికి యత్నించేలోగా పోలీసులు అమెను బయటకు తీసుకువచ్చి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సమావేశ మందిరం బయట బీజేపీ రాష్ట్ర నాయకులు లక్ష్మీపతితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో 300 మంది పోలీసులతో సమావేశం మందిరం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలీసులతో పాటు ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు కూడా కర్రలు చేతబూని బందోబస్తు నిర్వహించారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయం మొదలుకొని ఐవీ ప్యాలెస్ వరకు భారీగా పోలీసు పికెట్లు ఏర్పాటుచేశారు. సభలో భజరంగ్‌దళ్ కార్యకర్త నినాదాలు.. అనంతరం సభ ప్రారంభిస్తున్న సమయంలో జాతీయ జెండాతో భజరంగ్ దళ్ నాయకుడు సమావేశ మందిరంలో భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేయడంతో ఏఐఎస్ఎఫ్, వామపక్ష కార్యకర్తలు తీవ్రస్థాయిలో దాడి చేశారు. గుంటూరు భజరంగ్‌దళ్ కార్యకర్త దేవర వెంకట అనిల్‌ను తీవ్రంగా కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్లారు. పోలీసులు అడ్డుకుని అనిల్‌ను ఆస్పత్రికి తరలించారు. ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు కర్రలతో సమావేశ మందిరంలో రక్షణగా నిలవడంతో సమావేశం మొదలైంది. 51 మంది బీజేవైఎం కార్యకర్తలపై కేసు సమావేశాన్ని అడ్డుకోవడానికి యత్నించారని భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు 51మందిపై విజయవాడ పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 151 కింద కేసులు నమోదు చేశారు. పూర్తి వీడియో రికార్డులు పరిశీలించిన అనంతరం దాడిచేసిన వారి అందరిపైనా కేసులు నమోదు చేయనున్నారు. -
కన్హయ్య అంటే అంత భయమెందుకు?
- సిద్దార్థ కళాశాల వేదిక రద్దుపై మండిపడ్డ వామపక్షాలు - ఐవీ ప్యాలెస్ వద్ద నిర్వహించేందుకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థిసంఘ నాయకుడు కన్హయ్య కుమార్ పర్యటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) లోనికి అనుమతి నిరాకరించిన పాలకవర్గం యూనివర్శిటీ ప్రాంగణాన్ని పోలీసు మయంగా మార్చి వేసింది. బుధవారం సాయంత్రం ఆయన్ను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంది. ఈ తరహాలోనే విజయవాడ సభకూ పాలకులు ఆటంకాలు కల్పించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ సిద్దార్థ ఆడిటోరియంలో సభకు స్థానిక పోలీసు యంత్రాంగం అనుమతి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయించింది. రాజకీయ వత్తిళ్లే ఈ అనుమతి రద్దుకు కారణమని విద్యార్థి, యువజన, మేథావుల విశాల వేదిక ఆరోపించింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మీటింగ్‌కు అనుమతి నిరాకరించడం ఏమి ప్రజాస్వామికమని ప్రశ్నించింది. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా కన్హయ్య మీటింగ్ జరిపి తీరుతామని ప్రకటించింది. సభా వేదికను ఇండోర్‌లో నిర్వహించేకన్నా బహిరంగంగా జరపడమే ఉత్తమమని భావించి కన్హయ్య మీటింగ్ వేదికను ఆంధ్రా హాస్పిటల్స్‌కు సమీపంలోని ఐవీ ప్యాలెస్ సెంటర్‌కు మార్చింది. సాయంత్రం 5.30 గంటలకు అక్కడ సభను నిర్వహించాలని తలపెట్టింది. ఇదిలా ఉంటే, కన్హయ్య సభకు ఆటంకాలు కల్పించడాన్ని పది కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఓ విద్యార్ధి సంఘ నాయకుణ్ణి చూసి పాలకులు ఇంతగా బెంబేలు ఎత్తాలా? అని ప్రశ్నించాయి. ప్రజాస్వామ్యంలో మీటింగ్ జరుపుకునే స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించాయి. ఐవీ ప్యాలెస్ సెంటర్లో జరిగే సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయి పాలకులకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశాయి. కాగా, అనంతపురం ఎస్కే యూనివర్శిటీలో అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. -
టీడీపీ జిల్లా, నగర సారథులు..
- జిల్లా ఉదయం బందరులో, సాయంత్రం నగరంలో ఎన్నిక - తెలుగు యువతకు కొత్తముఖం? - కొత్త అధ్యక్షులకు అభినందనలు సాక్షి, విజయవాడ : టీడీపీ జిల్లా, అర్బన్ అధ్యక్షుల ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. ఉదయం బందరులో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా బచ్చుల అర్జునుడు, సాయంత్రం నగరంలోని ఐవీ ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో అర్బన్ అధ్యక్షుడిగా బుద్దా వెంకటేశ్వరరావు (వెంకన్న)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో పార్టీ పరిశీలకుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు 33వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు నామినేటెడ్ పోస్టు ఇస్తామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారని చెప్పారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్ష అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రకటించాలని చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ నూతన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కృషిచేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి నాగుల్‌మీరా, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, ఫ్లోర్‌లీడర్ హరిబాబు, టీడీపీ నాయుడు ముష్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా, అర్బన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్నను పలువురు నేతలు కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. కార్యదర్శి ఎన్నిక వాయిదా అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పదవికి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేరు వినిపించినా ఆదివారం అనూహ్యంగా ఆ పేరు పక్కన పెట్టారు. అయితే, పార్టీలో దీర్ఘకాలం పనిచేస్తున్న వారిని పక్కనపెట్టి కొత్తవారికి కీలక పదవులు ఇవ్వడంపై కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. దీనికితోడు ఎస్సీ నేతలు కూడా రహస్య సమావేశం నిర్వహించి పార్టీ పరిశీలకులను నిలదీయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశంలో పట్టాభిరామ్ పేరు ప్రకటిస్తే కార్యకర్తల నుంచి నిరసన వస్తుందని భావించిన నేతలు మిన్నకుండిపోయారు. దీనికితోడు కార్యదర్శి పదవికి గన్నె వెంకటనారాయణ ప్రసాద్ (అన్నా), పట్టాభిరామ్, సోంగా రవీంద్రవర్మ, కోట్టేటి హనుమంతరావు, చెన్నుపాటి గాంధీ తదితరులు పోటీపడ్డారు. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ పార్టీలో కొంతమంది ముఖ్యనేతలు అన్నాకు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఎన్నికను వాయిదా వేశారు. ఒకటి రెండు రోజుల్లో నేతలంతా చర్చించి అన్నా పేరు ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుయువత పైనా దృష్టి తెలుగు యువత అధ్యక్ష పదవికి కాట్రగడ్డ శ్రీనివాస్ పేరు వినిపించింది. అయితే, పార్టీలోని కొంతమంది నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ పేరును పక్కన పెట్టారని సమాచారం. ఎంఎస్ (కంప్యూటర్స్) చదివిన జీఎన్ఆర్ కోటేశ్వరరావు (కోటి) అనే నాయకుడి పేరును తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సిఫారసు చేశారని తెలిసింది.