ఎన్ఎస్జీ డెరైక్టర్‌గా జేఎన్ చౌదరి
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ) నూతన డెరైక్టర్ జనరల్‌గా అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి జేఎన్ చౌధురి గురువారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఉగ్రవాద నిరోధకం, హైజాకర్ల ఆటకట్టించడం సహా వీవీఐపీల భద్రతను పర్యవేక్షించే ‘బ్లాక్ క్యాట్’(ఎన్ఎస్జీ) కమెండోలకు 28వ డీజీగా 2015 మే వరకు ఈయన వ్యవహరిస్తారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీజీ చేసిన చౌధురి 1978లో ఐపీఎస్‌కు ఎంపికై అస్సాం డీజీపీగాను తర్వాత ఇంటిలిజెన్స్ బ్యూరోలోనూ విధులు నిర్వహించారు.