Jackson City
-
అమెరికాలో కాల్పులు.. ముగ్గురు నల్లజాతీయులు మృతి
జాక్సన్‌విల్లె: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్‌విల్లెలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. ఎడ్వర్డ్ వాటర్స్ యూనివర్సిటీకి సమీపంలోని డాలర్ జనరల్ స్టోర్ వద్ద ఓ యువకుడు(20) జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్ల జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇది జాతి విద్వేష ఘటన అని పోలీసులు తెలిపారు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. నిందితుడు నల్ల జాతీయులను ద్వేషించే వాడని, ఇతర గ్రూపులతో అతడికి సంబంధాలున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. అతడు హ్యాండ్గన్తోపాటు, సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డాడన్నారు. ఒక తుపాకీపై స్వస్తిక్ గుర్తు ఉందని వివరించారు. పొరుగునే ఉన్న క్లె కౌంటీ నుంచి నల్లజాతీయులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతానికి వచ్చాడు. కాల్పులకు కొద్దిసేపటి ముందు తన తండ్రికి మెసేజీ పంపించాడని, దాని ప్రకారం నిందితుడి కంప్యూటర్ ఓపెన్ చేసి చూడగా విద్వేషపూరిత రాతలు కనిపించాయని పోలీసులు వివరించారు. -
70 ఏళ్ల తర్వాత మొదటిసారి...
అట్లాంటా: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో కెల్లీ జిస్సెండనర్(47) అనే మహిళకు బుధవారం మరణశిక్ష అమలు చేశారు. జాక్సన్ నగరంలోని డయాగ్నోస్టిక్ అండ్ క్లాసిఫికేషన్ కారాగారంలో ఆమెకు విషపు ఇంజక్షన్ చేసి మరణశిక్ష అమలు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు. జార్జియాలో 70 ఏళ్ల తర్వాత మహిళకు మరణశిక్ష అమలు చేయడం ఇదే మొదటిసారి అని స్థానిక మీడియా వెల్లడించింది. తన భర్తను హత్య చేసిన కేసులో కెల్లీ జిస్సెండనర్ కు కోర్టు మరణశిక్ష విధించింది. ఆమె భర్త డాగ్లస్ 1997లో హత్యకు గురయ్యాడు. కెల్లీ జిస్సెండనర్ కు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు మూడుసార్లు ఫెడరల్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. పోప్ లేఖ రాసినా ఆమెకు మరణశిక్ష తప్పలేదు. చనిపోయే ముందు కెల్లీ జిస్సెండనర్ పశ్చాత్తాపం వ్యక్తం చేసిందని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. తన కారణంగా చనిపోయిన భర్తకు క్షమాపణ చెప్పింది. మంచి కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకుంది.