jadhavpur university
-
చెదిరిన కల.. ర్యాగింగ్ రోగానికి బలి
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఒత్తిళ్లు, హోం సిక్ తదితర కారణాలతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. అదే సమయంలో విద్యాలయాల్లో ‘ర్యాగింగ్ విష పురుగులు’ రెచ్చిపోతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో ర్యాగింగ్ రోగం ఓ అమాయకుడి జీవితాన్ని చిదిమేసింది. సీనియర్లంతా కలిసి గే అని ప్రచారం చేయడంతో.. ఆ మరకను తట్టుకోలేకపోయాడతను. భరించలేక హాస్టల్ బిల్డింగ్ నుంచి దూకి ప్రాణం విడిచాడు. పశ్చిమ బెంగాల్ జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కలకలం రేపిన ర్యాంగింగ్ మరణంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు.. Jadavpur University ragging: కోల్‌కతా జాదవ్‌పూర్ యూనివర్సిటీలో బీఏ ఫస్ట్ ఇయర్లో చేరిన స్వప్నదీప్ కుండూ(18).. బుధవారం అర్ధరాత్రి హాస్టల్ బిల్డింగ్ రెండో ఫ్లోర్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెద్ద సౌండ్ రావడంతో విద్యార్థులు బయటికి వచ్చి చూడగా.. నగ్నంగా రక్తపు మడుగులో పడి కనిపించాడు. దీంతో కేపీసీ మెడికల్ కాలేజీకి తరలించగా.. గురువారం వేకువ ఝామున కన్నుమూశాడు. అదే రోజు అతని మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. నేను గే కాదు.. బిల్డింగ్ మీద నుంచి దూకే ముందు స్వప్నదీప్ ‘నేను గే కాదు.. నేను గే కాదు’’ అంటూ అరుస్తూ దూకినట్లు కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో స్వప్నదీప్‌ను హాస్టల్లో ఉన్న సీనియర్లు కొందరు ర్యాగింగ్ చేశారని.. ఫలితంగానే స్వప్నదీప్ బలవన్మరణానికి పాల్పడ్డాని పోలీసులు తేల్చారు. స్వప్నదీప్‌ను గేగా సీనియర్లు ప్రచారం చేశారని, తోటి విద్యార్థుల ముందు అవమానించారని.. ఘటన జరిగిన రాత్రి అతని దుస్తులిప్పించి మరో విద్యార్థి గదికి వెళ్లాలంటూ బలవంతం చేశారని ర్యాగింగ్ బాధితులు మరికొందరు పోలీసులకు చెప్పారు. కోర్సు ముగిసినా.. దేశంలోని చాలా యూనివర్సిటీల్లో ఉండే సమస్య జాదవ్‌పూర్ యూనివర్సిటీలోనూ ఉంది. తమ తమ కోర్సులు ముగిసినా.. కొందరు మాజీలు హాస్టల్లోనే కొనసాగడం!. ఎమ్మెస్సీ పూర్తి చేసిన సౌరభ్ చౌదరి ఇదే కోవకి చెందిన వ్యక్తి. బయట ఉద్యోగం చేస్తూ క్యాంపస్ హాస్టల్లో ఉండడమే కాకుండా.. జూనియర్ల మీద ర్యాగింగ్ పేరుతో ప్రతాపం చూపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే స్వప్నదీప్‌ను ర్యాగింగ్ చేయడంతో.. అతను అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. సౌరభ్ సైతం తాను నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు కూడా. దీంతో ఐపీసీ సెక్షన్ 302/34 కింద కేసు నేరాభియోగాలు నమోదు చేసిన పోలీసులు.. శనివారం(ఇవాళ) సౌరభ్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్‌కు తరలించారు. పుత్రశోకంలో.. నదియా బోగుల ఏరియాకు చెందిన స్వప్నదీప్ జాదవ్ అలియాస్ గోపాల్. స్వప్నదీప్ స్కూల్లో బ్రైట్ స్కూడెంట్. పాఠాన్ని ఒక్కసారి వింటే పట్టేస్తాడు. లక్షల్లో ఒక్కడు అనే ట్యాగ్ లైన్ ఉంది అతనికి. అంత బాగా చదివే విద్యార్థి ఇలా అర్థాంతంరంగా.. అదీ ర్యాంగింగ్ వల్ల చనిపోవడాన్ని తోటి విద్యార్థులు, అతనికి పాఠాలు నేర్పిన గురువులు తట్టుకోలేకపోతున్నాయి. పైగా యూనివర్సిటీలో స్వప్నదీప్ చేరి వారం కూడా కాలేదు. ఆగష్టు 6వ తేదీన తండ్రి హాస్టల్లో దిగబెట్టి వచ్చాడు. ఈ వారంరోజుల్లో.. క్లాసులు జరిగిన మూడు రోజులూ హాజరయ్యాడు. ఈలోపే ఆ తల్లిండ్రుల కలలు చెల్లాచెదురు అయ్యాయి. కొడుకు జీవితంలో ఎదిగి తమకు ఆసరాగా ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులకు శోకమే మిగిలింది. తల్లి స్వప్న కొడుకు చిన్ననాటి ఫొటోలు పట్టుకుని గుండెలు బద్ధలయ్యేలా ఏడుస్తోంది. కొడుకు కానరాని లోకాలకు వెళ్లాడనే నిజాన్ని.. కన్నీళ్లను దిగమింగుకుని స్వప్నదీప్ తండ్రి రాంప్రసాద్.. భార్యను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అగ్నిగుండంగా జేయూ.. ప్రెషర్ స్టూడెంట్ స్వప్నదీప్ ఆత్మహత్య ఘటన ఉదంతంతో జాదవ్‌పూర్ యూనివర్సిటీ ఉలిక్కి పడింది. సీనియర్ల ఘాతుకాలను బయటపెడుతూ మరికొందరు ముందుకు వచ్చారు. విద్యార్థి సంఘాలు ఘటనను ఖండిస్తూ ధర్నాలు, ర్యాలీలు చేపట్టాయి. ఓ విద్యార్థి బంగారు భవిష్యత్తును చిదిమేసిన ర్యాంగింగ్ భూతాన్ని అణచివేయాలని.. ఘటనకు కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌తో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీనికి ప్రొఫెసర్లు సైతం మద్దతు ప్రకటించడం గమనార్హం. మరోవైపు ర్యాంగిగ్ ఫ్రీ క్యాంపస్‌గా జాదవ్‌పూర్ యూనివర్సిటీని తీర్చిదిద్దాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అక్కడ. ఇక.. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సైతం క్యాంపస్‌ను సందర్శించి విద్యార్థులతో చర్చలు జరిపారు. దర్యాప్తు పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారాయన. అంతేకాదు స్వప్నదీప్ కుటుంబాన్ని ఫోన్లో సైతం పరామర్శించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడి.. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. -
ఒక్క నిమిషం ఆగండి అంటూ..
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న వేళ ఓ విద్యార్థిని వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేశారు. పట్టా పుచ్చుకున్న అనంతరం వేదిక మీదే సీఏఏ కాపీని చింపివేశారు. వివరాలు.. పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ స్నాతకోత్సవం మంగళవారం జరిగింది. ఇందులో భాగంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వివిధ విభాగాల విద్యార్థులకు పట్టాలు, పతకాలు ప్రదానం చేశారు. ఈ క్రమంలో డెబోస్మిత చౌదరి అనే విద్యార్థినిని వేదిక మీదకు పిలిచారు. ఎమ్ఏ పట్టాను ఆమెకు ప్రదానం చేశారు. అయితే ఒక్క నిమిషం ఆగాల్సిందిగా వేదిక మీద ఉన్న పెద్దలను కోరిన డెబోస్మిత.. తన చేతిలో ఉన్న సీఏఏ కాపీను ముక్కముక్కలుగా చింపివేశారు. ‘మేం కాగితాలు చూపించము. ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. (చదవండి : పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) ఈ విషయం గురించి డెబోస్మిత మాట్లాడుతూ... ‘ఇందులో తికమకపడాల్సింది ఏమీ లేదు. జాదవ్‌పూర్ యూనివర్సిటీపై నాకు గౌరవం ఉంది. నా అభిమాన విద్యా సంస్థ నుంచి పట్టా అందుకోవడం గర్వంగా ఉంది. అయితే సీఏఏపై నాకు, నా స్నేహితులకు ఉన్న వ్యతిరేకతను చాటేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాను’ అని పేర్కొన్నారు. ఇక డెబోస్మితతో పాటు మరికొంత మంది విద్యార్థులు సైతం ఇదే విధంగా నిరసన తెలిపారు. ‘ కాన్వొకేషన్ గౌన్లు వేసుకున్నాం. కానీ మా పేర్లు పిలిచినపుడు స్టేజీ మీదకు వెళ్లం. ఇలా మా నిరసనను తెలియచేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
అమ్మాయిల కన్యత్వంపై ఫ్రొఫెసర్ అభ్యంతరకర వ్యాఖ్యలు
కోల్‌కతా : అమ్మాయిల కన్యత్వంపై ఓ ఫ్రొఫెసర్ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ‘అబ్బాయిలు.. సీల్ ఊడిన కూల్ డ్రింక్స్ కొంటారా? అలాంటప్పుడు కన్యత్వం కోల్పోయిన అమ్మాయిలను ఎలా పెళ్లి చేసుకుంటారు? అబ్బాయిలు కన్యత్వం కలిగిన యువతుల విషయంలో మోసపోతున్నారు. వర్జినిటీ కలిగిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే లభించే లాభాల గురించి వారికి అవగాహన లేదు. కన్యత్వం కలిగిన అమ్మాయిలు దేవదూతలు’ అంటూ కోల్‌కతాలో జాధవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన కనక్ సర్కార్ అనే ఫ్రొఫెసర్ ఫేస్బుక్లో వరుసగా పోస్ట్‌లు చేశాడు. ఈ పోస్ట్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంకావడంతో ఫ్రొఫెసర్ ఆ పోస్ట్‌లను తొలిగించాడు. మరో పోస్ట్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు విలువలకు పాతరేస్తూ పెళ్లికి ముందే తమ వర్జినిటీని కోల్పోతున్నారని, దీంతో అబ్బాయిలు అమ్మాయిల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అమ్మాయిలు తమ లైఫ్ పార్టనర్‌కు వర్జినిటీ విషయం తెలియజేస్తే వారు గౌరవిస్తారని, ప్రతి పురుషుడు వర్జినిటీ కలిగిన భార్యను గౌరవిస్తారని మరో పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ విషయం అమ్మాయిలకు కూడా బాగా తెలుసని చెప్పుకొచ్చాడు. జపాన్‌లో 99 శాతం యువతులు పెళ్లి అయ్యేవరకు కన్యత్వాన్ని కోల్పోరని, అందుకే వారి సమాజం బాగుందని, జపాన్ అభివృద్దిలో దూసుకుపోతుందని ఓ ఉదాహరణ కూడా చెప్పాడు. అయితే ఓ ఫ్రొఫెసర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. -
లంకను ఆడుకున్నారు!
కోల్‌కతా: శ్రీలంక క్రికెట్ జట్టుకు భారత గడ్డపై రాబోయే ‘సీన్’ అర్థమైంది. భారత ‘తృతీయ శ్రేణి’ జట్టు బ్యాట్స్‌మెన్ కూడా లంక బౌలర్లను అలవోకగా ఆడుకున్నారు. ఏమాత్రం పదును లేని లంకను ఎదుర్కొని బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శామ్సన్ (143 బంతుల్లో 128; 19 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... రోహన్ ప్రేమ్ (39; 5 ఫోర్లు), జీవన్‌జ్యోత్ సింగ్ (35; 3 ఫోర్లు), బావనక సందీప్ (33 నాటౌట్; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్లో జరిగిన ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆదివారం ‘డ్రా’గా ముగిసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే తిరిమన్నె వరుస ఓవర్లలో తన్మయ్ అగర్వాల్ (16; 3 ఫోర్లు), ఆకాశ్ భండారి (3)లను అవుట్ చేసి లంకకు శుభారంభం అందించాడు. అయితే శామ్సన్, జీవన్‌జ్యోత్ లంక రెగ్యులర్ బౌలర్లు హెరాత్, దిల్రువాన్ పెరీరా, లక్మల్లను సమర్థంగా ఎదుర్కొని మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఆ తర్వాత కూడా శామ్సన్... రోహన్ ప్రేమ్‌తో 71 పరుగులు, సందీప్‌తో 85 పరుగులు జత చేశాడు. చివరకు 75 ఓవర్ల తర్వాత మ్యాచ్‌ను నిలిపివేసేందుకు ఇరు జట్ల కెప్టెన్లు అంగీకరించారు. జట్టు సభ్యులందరికీ ప్రాక్టీస్ ఆశించిన శ్రీలంక ఏకంగా 14 మందితో బౌలింగ్ చేయించడం విశేషం. భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఈ నెల 16 నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. స్కోరు వివరాలు శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 411/9 డిక్లేర్డ్; బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (ఎల్బీ) (బి) తిరిమన్నె 16; జీవన్‌జ్యోత్ సింగ్ (సి) డిక్వెలా (బి) పెరీరా 35; ఆకాశ్ భండారి (సి) షనక (బి) తిరిమన్నె 3; శామ్సన్ (సి) డిక్వెలా (బి) సమరవిక్రమ 128; ప్రేమ్ (ఎల్బీ) (బి) డి సిల్వ 39; సందీప్ (నాటౌట్) 33; జలజ్ సక్సేనా (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (75 ఓవర్లలో 5 వికెట్లకు) 287. వికెట్ల పతనం: 1–27; 2–31; 3–99; 4–170; 5–255. బౌలింగ్: కరుణరత్నే 4–2–7–0; తిరిమన్నె 6–0–22–2; మాథ్యూస్ 5–2–21–0; షనక 8–0–36–0; హెరాత్ 6–0–15–0; కుషాల్ పెరీరా 9–1–22–1; లక్మల్ 4–1–11–0; గమగే 5–1–19–0; సందకన్ 12–1–54–0; ధనంజయ డి సిల్వా 7–1–35–1; విశ్వ ఫెర్నాండో 1–0–16–0; సమరవిక్రమ 4–0–13–1; రోషన్ సిల్వ 3–1–3–0; చండిమాల్ 1–0–3–0. -
ఈ పిల్లలకు చదువు తప్ప అన్నీ వచ్చు: ఎంపీ
బెంగాల్ యూనివర్సిటీలలోని కొంతమంది విద్యార్థులకు చదువు తప్ప అన్నీ వచ్చని బీజేపీ రాజ్యసభ సభ్యురాలు, మాజీ నటి, గాయని రూపా గంగూలీ మండిపడ్డారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ సెమినార్ సందర్భంగా కొందరు విద్యార్థులు నిరసన తెలుపుతూ దేశవ్యతిరేక నినాదాలు చేయడంతో ఆమె మండిపడ్డారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల స్థితగతులపై చర్చించేందుకు యూనివర్సిటీలో ఈ సెమినార్ ఏర్పాటుచేశారు. దానికి బంగ్లాదేశ్, భారతదేశాల నుంచి పలువురు నాయకులు వచ్చారు. త్రిపుర గవర్నర్ తథగాత రాయ్ కూడా హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నియంత్రణ గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సెమినార్ దాదాపు ముగుస్తోందనగా కొందరు విద్యార్థులు వచ్చి అక్కడ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 'ఆజాదీ' అని నినాదాలు చేశారు. బెంగాలీ విశ్వవిద్యాలయాల్లో చదువు తప్ప అన్నీ ఉంటున్నాయని రూపా గంగూలీ అన్నారు. వాళ్లు పేరు తెచ్చుకోవాలనుకుంటే మంచి పనులు చేయాలని, వాళ్లు మంచి శాస్త్రవేత్తలయితే అది బెంగాల్‌తో పాటు దేశానికి కూడా మేలు చేస్తుందని చెప్పారు. స్వాతంత్ర్యం కావాలని అంతగా కోరుకునేవాళ్లు ప్రభుత్వం తమకిస్తున్న డబ్బు నుంచి ఎందుకు స్వాతంత్ర్యం అడగట్లేదని ప్రశ్నించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను పెంచుతున్నారని, దాన్నుంచి ఎందుకు స్వాతంత్ర్యం కోరుకోవట్లేదని అన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో దాదాపు ఏడాది కాలం నుంచి ఇలా జాతివ్యతిరేక ఆందోళనలు ఎక్కువవుతున్నాయి.