Jagga Jassus
-
మాజీ లవర్‌తో మళ్లీ చేయను!
‘అవును.. ఇదే నా ఆఖరి చిత్రం.. ఇకపై తనతో ఎప్పుడూ నటించను’ అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు కత్రినాకైఫ్. అంతగా ఆమె ద్వేషిస్తున్న ఆ హీరో ఎవరు? అంటే.. ఇంకెవరూ.. ఒకప్పటి కత్రినా లవర్ రణబీర్ కపూర్. ఈ మాజీ లవర్స్ తాజాగా నటించిన ‘జగ్గా జాసూస్’ ప్రమోషన్లో రణబీర్‌తో కలిసి నటించనని కత్రినా స్పష్టం చేశారు. ‘‘రణబీర్‌తో పనిచేయడం కష్టంగా అన్పించింది. నాతో మరో సినిమాలో నటించనని రణబీర్ ‘జగ్గా జాసూస్’ సినిమా చిత్రీకరణ టైమ్‌లో చెప్పాడు. అందుకే, నేను కూడా అతనితో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నా. రణబీర్‌తో ఇదే నా చివరి చిత్రం’’ అన్నారు. -
ఇదే నా చివరి సినిమా!
చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది వినగానే, లేడీ ఫ్యాన్స్‌కి గుండె ఆగినంత పనవ్వడం ఖాయం. అయితే రణబీర్ నటనకు కాదు.. నిర్మాణానికి రిటైర్మెంట్ చెప్పారు. అనురాగ్ బసు డైరెక్షన్లో రణబీర్ కపూర్, కత్రినాకైఫ్ జంటగా తెరకెక్కిన ‘జగ్గా జాసూస్’ చిత్రం వచ్చే నెల 14న రిలీజ్ కానుంది. దీనికి రణబీర్ కో–ప్రొడ్యూసర్ కూడా. ఈ సినిమా రిలీజ్ అనేకసార్లు వాయిదా పడింది. అందుకేనేమో ‘‘ప్రొడక్షన్ సులువు కాదని తెలుసు కున్నా. ఇక పై ప్రొడక్షన్ చేయాలనుకోవడంలేదు. నిర్మాతగా ‘జగ్గా జాసూస్’ నా చివరి సినిమా. నటుడిగా హ్యాపీ. నాలాంటి బద్ధకస్తులు నిర్మాతలుగా రాణించలేరేమో’’ అన్నారు.