ఇదే నా చివరి సినిమా! | 'Jagga Jossus' will release on 14th of july. | Sakshi
Sakshi News home page

ఇదే నా చివరి సినిమా!

Published Thu, Jun 15 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

ఇదే నా చివరి సినిమా!

ఇదే నా చివరి సినిమా!

చాక్లెట్‌ బాయ్‌ రణబీర్‌ కపూర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఇది వినగానే, లేడీ ఫ్యాన్స్‌కి గుండె  ఆగినంత పనవ్వడం ఖాయం. అయితే రణబీర్‌ నటనకు కాదు.. నిర్మాణానికి రిటైర్మెంట్‌ చెప్పారు. అనురాగ్‌ బసు డైరెక్షన్‌లో రణబీర్‌ కపూర్, కత్రినాకైఫ్‌ జంటగా తెరకెక్కిన ‘జగ్గా జాసూస్‌’ చిత్రం వచ్చే నెల 14న రిలీజ్‌ కానుంది.

దీనికి రణబీర్‌ కో–ప్రొడ్యూసర్‌ కూడా. ఈ సినిమా రిలీజ్‌ అనేకసార్లు వాయిదా పడింది. అందుకేనేమో  ‘‘ప్రొడక్షన్‌ సులువు కాదని తెలుసు కున్నా. ఇక పై ప్రొడక్షన్‌ చేయాలనుకోవడంలేదు. నిర్మాతగా ‘జగ్గా జాసూస్‌’ నా చివరి సినిమా. నటుడిగా హ్యాపీ. నాలాంటి బద్ధకస్తులు నిర్మాతలుగా రాణించలేరేమో’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement