Jain monk
-
జైనముని హత్య.. అట్టుడుకుతున్న కర్ణాటకం
శివాజీనగర(కర్ణాటక): బెళగావి జిల్లా చిక్కోడి వద్ద ఉన్న నంది ఆశ్రమం జైనముని కామకుమార నంది హత్యపై సోమవారం విధానసౌధలో ఉభయ సభల్లో తీవ్ర చర్చ జరిగింది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. విధానసభ మొదలు కాగానే బీజేపీ నేత బసవరాజ బొమ్మై వాయిదా తీర్మానం కింద జైనముని హత్యపై చర్చించాలని స్పీకర్ యూ.టీ.ఖాదర్‌కు విన్నవించారు. చివరకు జీరో అవర్‌లో చర్చ ఆరంభమైంది. బీజేపీ సభ్యులు అభయ్ పాటిల్, బసవనగౌడ పాటిల్ యత్నాళ్, శశికళా జొల్లె తదితరులు మాట్లాడుతూ జైనముని హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. చరిత్రలోనే మునుపెన్నడూ జరగని సంఘటన ఇదని అన్నారు. జైన సముదాయానికి భంగం వాటిల్లింది, పోలీసులు సక్రమంగా విచారణ జరపలేరు, సీబీఐకి అప్పగించాలని పట్టుబట్టారు. హత్యలో తొలి నిందితుడైన నారాయణ మాళియను అరెస్ట్ చేసి, రెండో నిందితుడు హసేన్‌ను తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యుడు లక్ష్మణ సవది ఈ హత్య కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి హంతకులకు మరణశిక్ష విధించాలన్నారు. డబ్బు కోసమే హత్య జరిగిందనేది అవాస్తవమని వీరందరూ అన్నారు. జైనముని హత్య జరిగి మూడు రోజులు గడిచినా కూడా ముఖ్యమంత్రి సంతాపం తెలపలేదు, వేరే మతాలవారైతే చూస్తూ మౌనంగా ఉండేవారా? హిందువులకు భద్రత లేదా అని యత్నాళ్ ఘాటుగా ప్రశ్నించారు. నిందితులను దాచిపెడుతున్నారు సభాపతి యూటీ ఖాదర్ జోక్యం చేసుకుంటూ, జైనముని హత్య భయంకరమైనది. నిందితులకు కఠిన శిక్ష విధించాలి. ఇందులో రాజకీయం చేయరాదని సలహానిచ్చారు. బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ భయంకరమైన హత్యతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ కేసులో మిగతా నిందితుల పేర్లను ఎందుకు బహిరంగపరచటం లేదు. ఎందుకు నిందితులను కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఇదే మాదిరిగా విధాన పరిషత్‌లో కూడా జైనముని హత్య కేసుపై గందరగోళం నెలకొంది. మంత్రులు హెచ్‌కే పాటిల్, ప్రియాంక్ ఖర్గేలు మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులే ఈ కేసును దర్యాప్తు చేస్తారని తెలిపారు. మరోవైపు హత్యను ఖండిస్తూ చిక్కోడిలో జైనసంఘాల వారు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీబీఐ దర్యాప్తు అవసరం లేదు: హోంమంత్రి హుబ్లీ: బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా హిరేకోడి ఆశ్రమం జైనముని కామకుమార నంది మహారాజ హత్యోదంతంపై రాజకీయ చేయరాదని, పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని హోంమంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. సోమవారం ఆయన నగర విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎవరూ కూడా పక్షపాతం చూపరని అన్నారు. జైనముని అదృశ్యంపై ఫిర్యాదు నమోదైన తక్షణమే పోలీసులు అన్వేíÙంచారన్నారు. బావిలో వేసిన మృతదేహాన్ని కనుగొని చర్యలు తీసుకున్నారన్నారు, పోలీసులు బాగా పనిచేశారని అభినందిస్తున్నానన్నారు. హత్యపై నిరసనకు దిగిన జైనమునితో తాను కూడా మాట్లాడానని, వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చానన్నారు. హత్య కేసును సీబీఐకు అప్పగించాలన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించామని, ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చదవండి: ఈ జైనమునిని ఎందుకింత కర్కశంగా హత్య చేశారు? -
సీబీఐ దర్యాప్తు అవసరం లేదు: హోంమంత్రి
కర్ణాటక: బెళగావి జిల్లా చిక్కోడి వద్ద ఉన్న నంది ఆశ్రమం జైనముని కామకుమార నంది హత్యపై సోమవారం విధానసౌధలో ఉభయ సభల్లో తీవ్ర చర్చ జరిగింది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. విధానసభ మొదలు కాగానే బీజేపీ నేత బసవరాజ బొమ్మై వాయిదా తీర్మానం కింద జైనముని హత్యపై చర్చించాలని స్పీకర్ యూ.టీ.ఖాదర్‌కు విన్నవించారు. చివరకు జీరో అవర్‌లో చర్చ ఆరంభమైంది. బీజేపీ సభ్యులు అభయ్ పాటిల్, బసవనగౌడ పాటిల్ యత్నాళ్, శశికళా జొల్లె తదితరులు మాట్లాడుతూ జైనముని హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. చరిత్రలోనే మునుపెన్నడూ జరగని సంఘటన ఇదని అన్నారు. జైన సముదాయానికి భంగం వాటిల్లింది, పోలీసులు సక్రమంగా విచారణ జరపలేరు, సీబీఐకి అప్పగించాలని పట్టుబట్టారు. హత్యలో తొలి నిందితుడైన నారాయణ మాళియను అరెస్ట్ చేసి, రెండో నిందితుడు హసేన్‌ను తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యుడు లక్ష్మణ సవది ఈ హత్య కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి హంతకులకు మరణశిక్ష విధించాలన్నారు. డబ్బు కోసమే హత్య జరిగిందనేది అవాస్తవమని వీరందరూ అన్నారు. జైనముని హత్య జరిగి మూడు రోజులు గడిచినా కూడా ముఖ్యమంత్రి సంతాపం తెలపలేదు, వేరే మతాలవారైతే చూస్తూ మౌనంగా ఉండేవారా? హిందువులకు భద్రత లేదా అని యత్నాళ్ ఘాటుగా ప్రశ్నించారు. నిందితులను దాచిపెడుతున్నారు సభాపతి యూటీ ఖాదర్ జోక్యం చేసుకుంటూ, జైనముని హత్య భయంకరమైనది. నిందితులకు కఠిన శిక్ష విధించాలి. ఇందులో రాజకీయం చేయరాదని సలహానిచ్చారు. బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ భయంకరమైన హత్యతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ కేసులో మిగతా నిందితుల పేర్లను ఎందుకు బహిరంగపరచటం లేదు. ఎందుకు నిందితులను కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఇదే మాదిరిగా విధాన పరిషత్‌లో కూడా జైనముని హత్య కేసుపై గందరగోళం నెలకొంది. మంత్రులు హెచ్‌కే పాటిల్, ప్రియాంక్ ఖర్గేలు మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులే ఈ కేసును దర్యాప్తు చేస్తారని తెలిపారు. మరోవైపు హత్యను ఖండిస్తూ చిక్కోడిలో జైనసంఘాల వారు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీబీఐ దర్యాప్తు అవసరం లేదు: హోంమంత్రి హుబ్లీ: బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా హిరేకోడి ఆశ్రమం జైనముని కామకుమార నంది మహారాజ హత్యోదంతంపై రాజకీయ చేయరాదని, పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని హోంమంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. సోమవారం ఆయన నగర విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎవరూ కూడా పక్షపాతం చూపరని అన్నారు. జైనముని అదృశ్యంపై ఫిర్యాదు నమోదైన తక్షణమే పోలీసులు అన్వేషించారన్నారు. బావిలో వేసిన మృతదేహాన్ని కనుగొని చర్యలు తీసుకున్నారన్నారు, పోలీసులు బాగా పనిచేశారని అభినందిస్తున్నానన్నారు. హత్యపై నిరసనకు దిగిన జైనమునితో తాను కూడా మాట్లాడానని, వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చానన్నారు. హత్య కేసును సీబీఐకు అప్పగించాలన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించామని, ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. -
సన్యాసం తీసుకున్న ముఖేశ్ అంబానీ స్నేహితుడు
ముంబై: రిలయన్స్ పరిశ్రమల అధినేత ముఖేశ్ అంబానీ వెన్నంటి ఉండే తన బాల్య మిత్రుడు.. కుడిభుజంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా సన్యాసం స్వీకరించాడు. కోట్ల ఆదాయం వదులుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి పయనించారు. ఆయన సన్యాసం తీసుకుని చాలా రోజులైనా ఇప్పటికీ ఆ విషయం బహిర్గతమైంది. అయితే ఆయన ఎందుకు సన్యాసం స్వీకరించాడో.. ఎందుకు ఆ మార్గంలోకి వెళ్లారో చదవండి. ముఖేశ్ అంబానీకి ప్రకాశ్ షా (64) బాల్య మిత్రుడు. రిలయన్స్ పరిశ్రమల వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తుండేవాడు. ముఖేశ్ అంబానీకి కుడి భుజంలాంటివాడు. అతడి జీతం సంవత్సరానికి రూ.70 కోట్ల పైమాటే. అలాంటి ప్రకాశ్ షా ఏప్రిల్ 25వ తేదీన జైన మత సంప్రదాయం ప్రకారం గచ్చిధిపతి పండిత్ మహారాజ్ సమక్షంలో మహావీరుడి జన్మ కల్యాణ దినాన సన్యాస దీక్ష తీసుకున్నారు. ఇప్పుడు ఆయన నూతన్ మునిరాజుగా మారిపోయారు. ఆయన భార్య నయనా బెన్ కూడా సన్యాసం స్వీకరించారు. వాస్తవంగా జైన మతంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు సన్యాసం స్వీకరించడం సహజమే. ఆయన స్వచ్ఛందంగా సన్యాసం పొందారు. అయితే ఆయన సన్యాసం స్వీకరించిన విషయం వ్యాపార వర్గాల్లో కానీ జాతీయ మీడియాలో కానీ ఎలాంటి వార్తలు కనిపించలేదు. ఈ సన్యాస దీక్షపై ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. ప్రకాశ్ షాకు కోట్ల జీతం రాదని.. ముఖేశ్ అంబానీకి కుడి భుజం కాదని ఆ సందేశంలో వివరించారు. ప్రకాశ్ షా కెమెకల్ ఇంజనీరింగ్ చేశారు. ఐఐటీ బాంబేలో పీజీ చదివారు. రిలయన్స్ సంస్థల పనుల్లో ప్రకాశ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సన్యాస దీక్ష గతేడాదే స్వీకరించాల్సి ఉండగా కరోనా వలన ఆలస్యమైందని సమాచారం. ఆయన భార్య నయన్ కామర్స్‌లో పట్టభద్రురాలు. వీరికి ఇద్దరు కుమారులు. వీరిలో ఒక కుమారుడు కొన్నేళ్ల కిందట సన్యాసం స్వీకరించగా మరో కుమారుడు వివాహం చేసుకున్నాడు. భార్య, ఒకరు సంతానం. చదవండి: తీరని విషాదం.. తొక్కిసలాటలో 44 మంది మృతి చదవండి: సీఎం వెంట నిత్యం ఉండే ప్రభుత్వ ప్రతినిధే కరోనాకు బలి Mukesh Ambani’s right hand man Prakash Shah, Vice President of Reliance Industries, with an annual salary of Rs 75 crore, renounced the materialistic world and took sanyas on 25/04/21 and became Nutan Muniraj in Mumbai. Real renunciation. pic.twitter.com/5gSFb8S6yj — Rakesh Thiyyan (@ByRakeshSimha) April 27, 2021 -
ముక్తి కోసం అన్నీ విడిచి..
అహ్మదాబాద్ : సూరత్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక భౌతిక ప్రపంచానికి దూరంగా జైన సన్యాసినిగా మారాలని నిర్ణయం తీసుకుంది. బాలిక నిర్ణయాన్ని ఆమె కుటుంబం స్వాగతిస్తూ తమ కుమార్తె నిర్ణయం తమకు సంతోషం కలిగిస్తోందని చెప్పారు. ఈ ప్రపంచం తాత్కాలికమని, ఇక్కడ మనం అనుభవించే సుఖాలన్నీ అశాశ్వతమని, నిరాడంబర జీవనంతోనే శాంతి, ముక్తి సాధ్యమని బాలిక ఖుషీ షా చెబుతున్నారు. తన కుటుంబం నుంచి తాను ఒక్కరినే ఈ నిర్ణయం తీసుకోలేదని, శాంతియుత జీవనం కోసం గతంలో తమ కుటుంబంలో నలుగురు సన్యసించారని తెలిపారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రతిఒక్కరూ ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలని సిమంధర్ స్వామీజీ చెబుతారని, తాను 12 ఏళ్ల వయసులో సత్వరమే దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నానని అన్నారు. చిన్న వయసులోనే తమ కుమార్తె ఖుషీ తీసుకున్న నిర్ణయం అసాధారణమని, దీనికి తాము గర్వపడుతున్నామని బాలిక తండ్రి, ప్రభుత్వోద్యోగి వినీత్ షా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె సన్యాసినిగా మారిన తర్వాత లక్షలాది మంది జీవితాల్లో వెలుగునింపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరవ తరగతిలో 97 శాతం మార్కులు సాధించిన ఖుషీ గత ఏడాది నవంబర్‌లో నిరాడంబర జీవనం గడిపేందుకు పాఠశాల విద్యకు దూరమైందని చెప్పారు. తమ కుమార్తె ఇప్పటికే కాలినడకన వేల కిలోమీటర్లు నడిచిందని, దీక్షానంతర జీవితంపై అవగాహన పెంచుకుందని తెలిపారు. ఖుషీని డాక్టర్‌గా చూడాలని తాను కోరుకున్నా ఆమె ఆకాంక్షలు ఫలించాలని తన దీక్షకు తల్లితండ్రులుగా తామిద్దరం అంగీకరించామని చెప్పారు. -
జైన గురువు తరుణ్ కన్నుమూత
న్యూఢిల్లీ: జైన మత గురువు తరుణ్ మహరాజ్ (51) శనివారం ఢిల్లీలోని రాధాపురి జైన దేవాలయంలో తుదిశ్వాస విడిచారు. ‘తరుణ్ మహరాజ్‌కు కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగాలేదు. ఇటీవల రాధాపురి ఆలయానికి వచ్చి అక్కడే ఉంటున్నారు. తెల్లవారుజామున 3.18కి ఆయన మరణించారు’ అని భారతీయ జైన్ మిలాన్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మోదీనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘ఉదయం 6 గంటలకు ఆయన మరణ వార్త తెలిసింది. దీంతో దేవాలయమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది’ అని అన్నారు. తరుణ్ మహరాజ్ మృతిపై ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహరాజ్ మృతికి సంతాపం ప్రకటించారు. -
జైన సాధువు తరుణ్ సాగర్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ జైన సాధువు తరుణ్ సాగర్(51) శనివారం ఉదమం కన్నుముశారు. గత కొంత కాలంగా కామెర్లు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని రాధాపురి జైన ఆలయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆయన కొద్ది రోజుల క్రితం హాస్పిటల్లో చేరారు. ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో మందులు తీసుకోవడం మానేశారు. సల్లేఖిని వ్రతం స్వీకరించి (ఆహారం ముట్టుకోకుండా ఉండడం) ఆయన ప్రాణత్యాగం చేశారని తెలుస్తోంది. ఆయన మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి బాధను కలిగిస్తుందన్నారు. సమాజానికి తరుణ్ సాగర్ చేసిన బోధనలు మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. తరుణ్ సాగర్ జీ మహారాజ్ బోధనలు ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తున్నాయని ప్రధాని ట్వీట్ చేశారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సురేశ్ ప్రభు,, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే , హర్యానా సీఎం ఖట్టర్ తదితరులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 1967 జూన్ 26న మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో తరుణ్ సాగర్ జన్మించారు. ఆయన అసలు పేరు పవన్ కుమార్ జైన్. 13వ ఏటే ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు. ‘కడ్వే ప్రవచన్’ పేరిట ఆయన ఇచ్చే ప్రసంగాలు ప్రాచుర్యం పొందాయి. హర్యానా అసెంబ్లీలో ప్రసంగించడానికి ఆహ్వానం రావడంతో ఆయన పేరు వార్తల్లో నిలిచింది. ఆయన ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతుండటం, పాకిస్థాన్ వ్యవహార శైలి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడారు. రేపిస్ట్ బాబాలను ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చారు. -
వజ్రాల వ్యాపారి కుమారుడు అన్నీ వదిలేసి..
సాక్షి, సూరత్ : కోట్ల రూపాయల సంపద, సకల సౌకర్యాలను విడిచిపెట్టి భవ్య షా అనే 12 ఏళ్ల బాలుడు జైన సన్యాసిగా మారిపోయాడు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కుమారుడు షా నిర్ణయంతో కుటుంబసభ్యులు గర్వపడుతున్నామని చెప్పారు. తమ కుమారుడు గురువారం జైన సన్యాసిగా మారడాన్ని వారు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆథ్యాత్మిక బాటలో జీవితాన్ని అంకితం చేయాలన్న నిర్ణయంపై బాలుడు స్పందిస్తూ భగవంతుడు చూపిన సత్యమార్గంలో పయనించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. తాను తల్లితండ్రులను విడిచి వెళుతున్నానని, భవిష్యత్‌లో వారు సైతం ఇదే బాటలో పయనిస్తారని చెప్పాడు. భవ్య జైన దీక్ష స్వీకరించడం పట్ల తామెంతో సంతోషంగా ఉన్నామని డైమండ్ వ్యాపారి అయిన భవ్య తండ్రి దీపేష్ షా సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కుమారుడు తమను విడిచివెళుతున్నాడన్న బాధ తమకు లేదని, నాలుగేళ్ల కిందట 12 ఏళ్ల వయసులో తమ కుమార్తె సైతం జైన సన్యాసినిగా మారిందని చెప్పుకొచ్చారు. జైన సన్యాసులు భౌతిక వాంఛలు, వస్తువులను వీడటంతో పాటు భావోద్వేగాలు, కోరికలకు మూలమైన కర్మలను కూడా విడిచిపెట్టి ప్రశాంత జీవనం గడుపుతారు. -
ఇంటర్ టాపర్ అసాధారణ నిర్ణయం
అహ్మదాబాద్ : సాధారణంగా పరీక్షల్లో టాపర్‌గా నిలిచే విద్యార్థులు భవిష్యత్ కోసం ఎన్నో కలలు కంటారు. ఉన్నత చదువుల కోసం ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఇటీవల నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో ఏకంగా 99.99 శాతం మార్కులు సాధించిన గుజరాత్ యువకుడు (17) వర్షిల్ షా మాత్రం విభిన్న మార్గాన్ని ఎంచుకున్నాడు. చదువులు పక్కన పెట్టి గురువారం సూరత్ పట్టణంలో సన్యాసం స్వీకరించాడు. కళ్యాణ్ మహరాజ్ అనే జైన సన్యాసిని స్ఫూర్తిగా తీసుకొని షా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరో విశేషం ఏంటంటే, కరెంటు ఉత్పత్తి చేసే ప్రక్రియలో అనేక జలచరాలు చనిపోతాయని భావించి కరెంట్ వాడకాన్ని షా కుటుంబం బాగా తగ్గించింది. అందుకే ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్ వంటి పరికరాలు లేవు. ప్రతిభావంతురాలు అయిన షా అక్క కూడా చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతూ మధ్యలోనే చదువు మానేసింది. షా కుటుంబానికి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువని పొరుగువారు తెలిపారు. -
33సార్లు క్షమాపణ చెప్పాడు!
న్యూఢిల్లీ: జైన దిగంబార సాధువు తరుణ్ సాగర్ హర్యానా అసెంబ్లీలో ప్రసంగించడంపై ట్విట్టర్లో విమర్శలు చేసిన బాలీవుడ్ సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ ఊహించనిరీతిలో వివాదాలకు కేంద్రమయ్యాడు. ట్విట్టర్లో అతడి విమర్శలు దుమారం రేపాయి. జైన దిగంబర బాబాను విమర్శిస్తావా? అంటూ చాలామంది ఆయనను వేలెత్తిచూపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం విశాల్ విమర్శలను ఖండించారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ సహా చాలామంది నెటిజన్లకు ఆయన క్షమాపణ చెప్పారు. ఏ మతం వారిని కించపరచడం, ఏ మతవిశ్వాసాలను గాయపరచడం తన ఉద్దేశం కాదని, మతాన్ని పరిపాలనను జోడించకూడదనే ఉద్దేశంతోనే తాను వ్యాఖ్యలు చేశానని విశాల్ వివరణ ఇచ్చుకున్నాడు. తన వ్యాఖ్యలు జైనుల మనోభావాలను దెబ్బతీస్తే.. అందుకు మనస్ఫూర్తిగా క్షమించాలని వినమ్రంగా కోరాడు. ట్విట్టర్లో తనను విమర్శించిన చాలామందికి విశాల్ క్షమాపణలు చెప్తూపోయారు. తాను చేసిన ఒక్క ట్వీట్ మీదనే ఆయన ఏకంగా 33సార్లు క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా తాను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు విశాల్ ప్రకటించాడు. ఇన్నాళ్లు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారుడిగా, కార్యకర్తగా విశాల్ దద్లానీ కొనసాగారు. ఏకంగా కేజ్రీవాల్ తనను తప్పుపట్టడంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడమే కాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటానని విశాల్ తెలిపారు. మరోవైపు ప్రముఖ జైన దిగంబర ముని తరుణ్ సాగర్ విశాల్ దద్లానీ విమర్శలపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అసమ్మతి తెలిపే హక్కు ఉంటుందని, విమర్శలను తాను పట్టించుకోబోనని తెలిపారు. -
నడిచి వచ్చేందుకు 8 నెలల గడువు కావాలట!
ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం కోర్టు ముందు హాజరు కావడానికి నిందితుడు అడిగిన గడువును చూసి, హైకోర్టు జడ్జిలే విస్తుపోయారట. చివరికి గడువు లేదు గిడువు లేదు... చట్ట ప్రకారం కోర్టు ముందు హాజరు కావాల్సిందేనంటూ ఆదేశించారు. ఇంతకీ సదరు వ్యక్తి అడిగిన గడువు, దాని కథా కమామిష్షు ఏంటంటే.. 'బాలదీక్ష' అనే తప్పుడు ప్రభుత్వ పథకాన్ని ప్రకటించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలను మభ్య పెట్టి, మోసగించారనే ఆరోపణలపై జైన్ గురువు ఆచార్య కీర్తి యశురిష్వరాజి మహారాజ్ సహా మరో అయిదుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే తమకు కోర్టు ముందు హాజరు కావడానికి ఎనిమిది నెలల గడువు కావాలని జైన్ గురువు తదితరులు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే కోల్‌కతా నుండి అహ్మదాబాద్‌కు నడిచి రావడానికి ఎనిమిది నెలల సమయం పడుతుందంటూ లెక్కలు చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా తాను జైన్ మత సంప్రదాయం ప్రకారం వాహనాలను వాడరాదని, కాలి నడకన రావడానికి తనకు ఇంత సమయం పడుతుందని యశురిష్వరాజి సెలవిచ్చారు. తన అనారోగ్య కారణాల రీత్యా గంటకు 10- 12 కి.మీ కంటే ఎక్కువ దూరం నడవలేనని అతడు తన పిటిషన్ లో పేర్కొన్నాడు. సుమారు 2,200 కి.మీ నడిచి కోర్టుకు హాజరు కావాలంటే ఆ మాత్రం సమయం కావాలన్నాడు. ఈ పిటిషన్ చాలా వింతగా, విచిత్రంగా ఉందంటూ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా యశురిష్వరాజి మహారాజ్ పిటిషన్‌ను తిరస్కరించారు. ఒక క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్నారన్న సంగతిని వారు మర్చిపోతున్నారని మండిపడ్డారు. నిర్దేశిత సమయానికి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
కోర్టుకు రావాలంటే 2,200 కి.మీ నడవాలి!
కోల్‌కతాకు చెందిన ఓ జైనమత సాధువు గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టుకు హాజరయ్యేందుకు 8 నెలల గడువు కోరారు. జైనమత విశ్వాసం ప్రకారం సర్వసంగ పరిత్యాగం చేసిన తాను వాహనాన్ని ఉపయోగించకూడదని, ఈ నేపథ్యంలో తాను ఉంటున్న కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు వచ్చేందుకు 2,200 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుందని, ఇందుకు తనకు 8 నెలల గడువు ఇవ్వాలని ఆయన కోరారు. ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. వచ్చే నెలలోగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. జైనమఠాల్లో చిన్నారులను చేర్చుకోవడం చట్టబద్ధమేనని పేర్కొంటూ ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసినట్టు ఆచార్య కీర్తి యషురిష్వర్జీ మహారాజ్ (60) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనకు కోర్టు సమన్లు జారీచేసింది. అయితే, వృద్ధాప్యం, వెన్నెముకలో గాయం కారణంగా తాను రోజుకు 10-12 కిలోమీటర్లకు మించి నడవలేనని, కాబట్టి తాను కోర్టుకు హాజరయ్యేందుకు 8 నెలల గడువు కావాలని కోరారు. తాను కోర్టుకు రాకపోయినప్పటికీ, న్యాయవిచారణకు ఎలాంటి భంగం వాటిల్లదని.. కాబట్టి తనకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఆయన అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు తాజాగా ఆయనకు వ్యతిరేకంగా మరో వారెంట్‌ను జారీచేసింది. అహ్మదాబాద్‌కు చెందిన హక్కుల కార్యకర్త జాస్మిన్ షా మహారాజ్‌పై కోర్టులో కేసు వేశారు. జైనమతం ప్రకారం 'బాలదీక్ష' తీసుకోవడం చట్టబద్ధమేనంటూ ఆయన కేంద్రప్రభుత్వ గెజిట్ ఉత్తర్వులను ఫోర్జరీ చేశారని, అందుకే ఆయనను కోర్టుకు లాగామని జాస్మిన్ తరఫు న్యాయవాది తెలిపారు. 'బాలదీక్ష' లాంటి చర్యలను నియంత్రించాలని గుజరాత్ హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. భారత్‌లో దాదాపు 40 లక్షల వరకు జైనమతస్తులు ఉన్నారు. వీరిలో అత్యధికం గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో నివసిస్తున్నారు.