Jaipalreddy
-
తెలంగాణ కాంగ్రెస్‌కు కష్టాలు
-
కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలి
సాక్షి, కోస్గి (కొడంగల్): నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ మోసపూరిత మాటలను నమ్మి మొదటిసారి అవకాశం ఇస్తే పాలించడం చేతకాక ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు. కేసీఆర్ గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యారు. ముఖ్యంగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని రాష్ట్ర ప్రజలను నమ్మించి అధికారంలోకి రాగానే మాటమార్చి అధికార దాహంతో సీఎం పదవి అధిష్టించారు. యువత ఎన్నో ఆశలతో ఉద్యోగాలు వస్తాయని భావిస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం అలా చేయలేకపోయింది. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం మాటలకే పరిమితమైంది. ఎల్లప్పుడూ నిరుపేదల అభివృద్ధి కోసం కృషిచేసే కాంగ్రెస్ పార్టీకే ప్రజలంతా ఓటువేసి కేసీఆర్ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. వెనకబడ్డ పాలమూరు జిల్లాలో భాగమైన కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా నది నీరు తెస్తే సాగునీరు పారడం ద్వారా రైతులు ఎంతో లాభదాయకంగా వ్యవసాయం చేసుకునే వారు. సాగునీరు నియోజకవర్గానికి తేవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. – కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి 14 స్థానాలు గెలవబోతున్నాం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ 14 స్థానాలు గెలవబోతుంది. డిసెంబర్ 12న పీఫుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుంది. నాలుగున్నరేళ్ల పాటు తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్న కేసీఆర్, కేటీఆర్ బట్టేబాజ్ మాటలతో మరోసారి తెలంగాణను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు తీసుకురాలే, ఉద్యోగాల ఇయ్యలే. నిధులు వారి జేబుల్లో నింపుకున్నరు. మహబూబ్‌నగర్ జిల్లాలో రైతాంగానికి మోసం జరిగింది. వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకకాలంలో రూ.2లక్షల రుణ మాఫీ చేస్తాం. పండే ప్రతీ పంటకు మంచి గిట్టుబాటు ధర ఇవ్వబోతున్నాం. రాబోయే ప్రజాఫ్రంట్ ప్రభుత్వంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. మెగా డీఎస్సీ నిర్వహించి 20వేల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా పింఛన్లు ఇవ్వబోతున్నాం. – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు -
నల్లధనంపై నాటకాలొద్దు...
నారాయణపేట: దేశానికి ఆర్థిక రంగమనేది చాలా సున్నితమైందని, నల్లధనాన్ని వెలికి తీస్తున్నామంటూ నాటకాలు, రాజకీయాలు చేయడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తే నల్లధనం బయటికి వస్తుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పడం చూస్తూంటే.. నష్టం ఎవరికి జరుగు తుందో ఆలోచించడం లేదన్నారు. నల్లకుబే రులకు నష్టం జరగదని, ఇప్పటికే కొంత మంది వజ్రాలు, వైఢూర్యాలు, భూములు తదితర రూపంలో ఆస్తులను కూడగట్టుకున్న వారు ఉన్నారన్నారు. ప్రస్తుతం నోట్ల రద్దు నూతన నోట్ల విధానంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీలు, వ్యాపారస్తులు వివిధ రూపాల్లో డిపాజిట్లు, వ్యాపార లావాదేవీలు చేస్తున్నారని చెప్పారు. కానీ, ప్రభుత్వం నల్లధనం బయటికి తీస్తున్నమంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప మరి ఏమీ కనిపించడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు వైట్ మనీ ఎంత ఖర్చు చేస్తున్నారో వారే చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాటల మనిషి తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని జైపాల్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మాటల మనిషి అని.. మాట మనిషి కాదని విమర్శిం చారు. రాష్ట్రాన్ని తానే సాధించుకు వచ్చానని చెబుతున్న కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ఎవరు బిల్లు పెడితే.. ఎవరు మద్దతిస్తే రాష్ట్రం ఏర్పడిందో ప్రజలకు తెలుసునన్నారు. తెలంగాణ తెచ్చింది నేనే అంటూ తెలంగాణ వెంచర్ పెట్టుకున్న మహనీయుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. బిట్లు బిట్లుగా చేసి కుటుంబంతో నిరంకుశత్వ పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటుకు పునాది వేసిన తమనే మాయం చేసిన ఘనుడని ఎద్దేవా చేశారు. -
గీతారెడ్డిని పరామర్శించిన జైపాల్‌రెడ్డి
జహీరాబాద్: స్థానిక శాసన సభ్యురాలు గీతారెడ్డిని డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం. జైపాల్‌రెడ్డి పరామర్శించారు. బుధవారం సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలోని గీతారెడ్డి నివాసానికి జైపాల్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లారు. నెల రోజుల క్రితం గీతారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు హెర్నియా ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న జైపాల్‌రెడ్డి గీతారెడ్డిని పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జైపాల్‌రెడ్డి వెంట న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడివిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఎం.బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జి.భాస్కర్, శ్రీకాంత్‌రెడ్డి, రవి ఉన్నారు. -
కాంగ్రెస్‌తో కేసీఆర్ శాంతి బంధం
టీడీపీ శిథిలభవనంలో బీజేపీ ఇరుక్కుంది: జైపాల్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ‘తెలంగాణలో టీఆర్ఎస్ గెలవదని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అర్థం చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్‌తో శాంతి బంధాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం ఇదే’ అని కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ, టీడీపీ నడుమ ఎన్నికల అవగాహన కుదరక ముందు బీజేపీతో పొత్తుకు కేసీఆర్ ప్రయత్నించారు. ఆయన ప్రతిపాదనను బీజేపీ జాతీయ నాయకత్వం తిరస్కరించి టీడీపీతో పొత్తు కుదుర్చుకుంది. కూలిపోతున్న టీడీపీ భవనంలో పొత్తుల పేరిట బీజేపీ ఇరుక్కుపోయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ పలుమార్లు మాట తప్పి విశ్వసనీయతను తగ్గించుకున్నారు.. ఇప్పటికైనా తన మాటలతో విశ్వసనీయత పెంచుకునే ప్రయత్నం చేయాలి’ జైపాల్‌రెడ్డి సూచిం చారు. ‘తెలంగాణ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేశామని చెప్తున్నా సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని ప్రజలు విశ్వసిస్తున్నారు. సీమాంధ్రలో సోనియా తన బలాన్ని కోల్పోయి మూల్యం చెల్లించినా తెలంగాణ ఇచ్చిందని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ విషయంలో సోనియాకు అందరికంటే ఎక్కువగా తానే ప్రభావితం చేశానన్నారు. -
దిగ్విజయ్ సింగ్ బుజ్జగింపుల పర్వం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి , పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ బుజ్జగింపు పర్వం మొదలైంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడుగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియామకంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలలో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో దిగ్విజయ్ సింగ్ ఈరోజు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఆ తరువాత ఆయన పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి జానా రెడ్డిలను కూడా కలుస్తారు. ఇదిలా ఉండగా, తెలంగాణ పీసీసీ ఎలక్షన్ కమిటీ సమావేశం గాంధీభవన్‌లో ప్రారంభమైంది. దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా టిఆర్ఎస్తో పొత్తు, అభ్యర్థుల ఎంపికపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. దిగ్విజయ్ సింగ్ మార్గదర్శకాలను సూచిస్తారు.