గీతారెడ్డిని పరామర్శించిన జైపాల్‌రెడ్డి | jaipalreddy visitation to mla geethareddy | Sakshi
Sakshi News home page

గీతారెడ్డిని పరామర్శించిన జైపాల్‌రెడ్డి

Published Wed, Sep 28 2016 7:30 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

jaipalreddy visitation to mla geethareddy

జహీరాబాద్‌: స్థానిక శాసన సభ్యురాలు గీతారెడ్డిని డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఎం. జైపాల్‌రెడ్డి పరామర్శించారు. బుధవారం సికింద్రాబాద్‌లోని ఈస్ట్‌ మారేడ్‌పల్లిలోని గీతారెడ్డి నివాసానికి జైపాల్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లారు. నెల రోజుల క్రితం గీతారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు హెర్నియా ఆపరేషన్‌ జరిగింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

విషయం తెలుసుకున్న జైపాల్‌రెడ్డి గీతారెడ్డిని పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలసుకున్నారు. త్వరగా  కోలుకోవాలని ఆకాంక్షించారు. జైపాల్‌రెడ్డి వెంట న్యాల్‌కల్‌ మండల  కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు అడివిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ ఎం.బుచ్చిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు జి.భాస్కర్‌, శ్రీకాంత్‌రెడ్డి, రవి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement