Jakkapur
-
సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్‌పై టీఆర్ఎస్ నేతల దాడి
సాక్షి, సిద్ధిపేట జిల్లా: జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి జరిగింది. వర్షాలతో నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి సిరిసిల్ల జిల్లా వెళ్తున్న పాల్‌ను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. డీఎస్పీ ముందే కేఏ పాల్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పాల్ వస్తున్నారనే సమాచారంతో సిరిసిల్లా జిల్లా సరిహద్దులకు చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఆయనను అడ్డుకుని బూతులు తిడుతూ దాడికి దిగారు. పోలీసుల తీరుపై కేఏ పాల్ ఆగ్రహం టీఆర్ఎస్ నేతలు గూండాలలా వ్యవహరించారని, పోలీసుల సమక్షంలోనే తనపై దాడి జరిగిందని.. దీనికి పోలీసులే బాధ్యత వహించాలంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కరోనా: జాడ లేని సర్పంచ్!
సాక్షి, నిజాంసాగర్ (జుక్కల్): కొత్తగా ఏర్పాటైన జీపీ అభివృద్ధి కోసం ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్ జాడ లేకపోవడంతో శనివారం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. పల్లెని వదిలి పట్నంలో ఉంటున్న సర్పంచ్ బంజ కంశవ్వ మాకు వద్దు అంటూ నిజాంసాగర్ మండలం జక్కాపూర్‌లో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. మల్లూర్ జీపీ పరిధిలో ఉన్న జక్కాపూర్ గ్రామం ఏడాదిన్నర కిందట నూతన జీపీగా ఏర్పాటైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సర్పంచ్ హైదారబాద్‌కు పరిమితం అయ్యారని గ్రామస్తులు పేర్కొన్నారు. సర్పంచ్‌పై చర్యల కోసం మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలని తీర్మానం చేశామని తెలిపారు. సర్పంచ్ లేక పాలన అస్తవ్యస్తం మద్నూర్(జుక్కల్): మండలంలోని సోమూర్ సర్పంచ్ గంగుబాయి స్థానికంగా లేకపోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మార్చి 19న ఆమె అమెరికాలో బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే చిక్కుకున్నట్లు తెలిసింది. సర్పంచ్ విదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం కూడా అందించలేదని ఎంపీవో ఆర్వీఎస్ఎన్ రెడ్డి శనివారం తెలిపారు. -
నానో లచ్చమ్మ!
‘ఓటరుపండుగ’ డ్రాలో వరించిన నానో కారు సంగారెడ్డి, : మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం జక్కాపూర్ మదిరా గ్రామానికి చెందిన పరుస లచ్చమ్మను నానో కారు వరించింది. 95 శాతం ఓటింగ్ సాధించిన గ్రామాలకు ప్రకటించిన బహుమతుల బంపర్ డ్రాలో శనివారం కలెక్టర్ స్మితా సబర్వాల్ లచ్చమ్మకు కారును అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో గ్రామీణులే అధిక శాతం ఓటింగ్‌లో పాల్గొన్నారని, అక్షరాస్యులుగా భావించే పట్టణ ప్రజలు ఓటింగ్ నమోదులో వెనుకబడి ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని పాటించాలని కోరారు. ఈ సందర్భంగా 106 గ్రామాలకు చెందిన ఓటర్లకు గ్రామానికి పది మందికి చొప్పున బహుమతులను అందజేశారు. వేతనంతో కూడిన సెలవు ప్రకటించి అధిక ఓటింగ్ నమోదుకు సహకరించిన పరిశ్రమల ప్రతినిధులకు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు. అధిక శాతం ఓటింగ్ సాధించిన నర్సాపూర్ రిటర్నింగ్ అధికారికి రూ.50వేల నగదును, అందోల్ రిటర్నింగ్ అధికారికి రూ.25వేల నగదు బహుమతులను అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విశేష సేవలందించిన జిల్లా పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. 95 శాతం పైగా ఓటింగ్ సాధించిన 25 గ్రామాల సర్పంచ్‌లకు రూ. 2 లక్షల ప్రోత్సాహక నగదును అందజేశారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, ఏజేసీ మూర్తి, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.