janapadam
-
ఓరుగల్లు సిగలో అద్భ్బుత పరిశోధనాలయం
‘జానపద గిరిజన విజ్ఞాన పీఠం’తెలుగు సంస్కృతికి వెలుగులద్దిన కాకతీయ చక్రవర్తుల రాజధాని ఓరుగల్లులో 1995లో జానపద గిరిజన విజ్ఞాన పీఠానికి అంకుర్పారణ జరిగింది. ఆదివాసీ గిరిజన తెగల జీవన పరిణామ క్రమంలో వారు ఉపయోగించిన ఎద్దుల బండ్లు, టంగాలు, సంగీత వాయిద్యాలు, సవారి కచ్చురం, పనిముట్లు, కీలు గుర్రాలు, వివిధ శుభకార్యక్రమాల్లో వాడే పల్లకీలు తదితర వస్తువులను జాగ్రత్తగా విజ్ఞాన పీఠం మ్యూజియంలో భద్రపరిచారు. గిరిజన కళారూపాలను భావి తరాలకు అందించాలనే లక్ష్యంతో విజ్ఞాన పీఠం ద్వారా వివిధ ప్రాంతాల్లో పరిశోధనలు నిర్వహిస్తున్నారు.నేడు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ‘ఓరుగల్లు జానపద గిరిజన విజ్ఞాన పీఠం’పై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. హన్మకొండ కల్చరల్: తెలంగాణ వాదం రగిల్చిన స్ఫూర్తితో జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఏర్పడింది. అప్పటి వైస్‌చాన్స్‌లర్ ఆచార్య పేర్వారం జగన్నాథం, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు, కాళోజీ రామేశ్వరరావు , కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ళ రామశాస్త్రి, కార్యదర్శి వీ.ఆర్ విద్యార్థి, పద్మశ్రీ నేరేళ్ళ వేణుమాధవ్ తదితర ప్రముఖుల ఆకాంక్షతో ఈ పీఠం రూపుదిద్దుకుంది. 1998 లో ఇక్కడ పీహెచ్డీ కోర్సులు, ఎంఫిల్ తరగతులు ప్రారంభమయ్యాయి. టూరిజం కేంద్రంగా రూపొందాలని.. 1999లో జానపద గిరిజన విజ్ఞాన పీఠం జిల్లాలో ప్రత్యేక సందర్శనీయ స్థలంగా అభివృద్ధి చెందనుందని భావించి అప్పటి కలెక్టర్ శాలినీమిశ్రా హంటర్‌రోడ్‌లో 3.7 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ పీఠం డీమ్డ్ యూనివర్సిటిగా అభివృద్ధి చెందాలని భావించిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఆచార్య సి. నారాయణరెడ్డి అందించిన రూ. 30 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో 2000 సంవత్సరంలో స్వంత భవనం నిర్మించారు. 2001లో దూరవిద్యాకేంద్రం ప్రారంభం కాగా దానికి అనుబంధంగా వరంగల్‌లో దూరవిద్యాకేంద్రం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 2009 లో రాణి రుద్రమదేవి పేరిణి కళా కేంద్రాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. జానపదుల కళలకు సజీవ రూపం పీఠానికి చెందిన పరిశోధన బృందం గ్రామాలకు వెళ్ళి అక్కడ రోజుల తరబడి ఉంటూ వారితో మాట్లాడుతూ జానపదుల విజ్ఞానాన్ని, కళలను భవిష్యత్ తరాలకు సజీవ రూపంలో అందించేలా కృషి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొడ, కృష్ణ, పశ్చిమగోదావరి, చిత్తూరు, కడపజిల్లాలో సర్వే నిర్వహించి.. ఆయా ప్రాంతాల్లోని కళా బృందాలను ప్రోత్సహించారు. జాతీయస్థాయి గుర్తింపు తెలుగు జానపద విజ్ఞానం మీద జరుగుతున్న అధ్యయనం మరింత అర్ధవంతంగా, వైవిధ్యంగా జరగడానికి గిరిజన పీఠం ఏర్పాటు చేసిన సదస్సులు జాతీయస్థాయిలో ప్రశంసలు పొందాయి. 1000 గంటల నిడివిగల వీడియోలు, 10వేల ఛాయాచిత్రాలు, 9000 పేజీల రాత ప్రతులు పీఠం మ్యూజియంలో నిక్షిప్తం చేశారు. 18 జాతీయ సదస్సులు జానపద గిరిజన íపీఠం ఆధ్వర్యంలో 18 జాతీయ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ రంగాల ప్రముఖులు సమర్పించిన పరిశోధనా పత్రాలను సమీకరించి.. ‘జానపద గిరిజన విజ్ఞానం జాతీయ సదస్సుల పత్రాలు’ అనే పుస్తకంగా ప్రచురించారు. జానపద గిరిజన విజ్ఞానంపైపలు పుస్తకాలు.. ఇప్పటివరకు జానపద విజ్ఞాన సమాలోచన, నల్గొండ రాష్ట్రస్థాయి జానపద కళోత్సవాలు ప్రత్యేక సంచిక, జానపద కిరణం త్రైమాసిక పత్రిక, మన పల్లెటూళ్ల పాటలు అమ్మాపురం, కొర్రాజుల కథలు, జానపద విజ్ఞానదర్శిని, చౌళ్లపల్లి, జానపదవిజ్ఞాన దర్శిని , విస్నూరు, వల్మిడి, ద్రౌపది తిరుణాళ్ళు (ధర్మరాజు తిరునాళ్ళు), తూర్పుగోదావరి జిల్లా జానపద ఆటలు, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, కొండరెడ్డి గిరిజ నుల జీవనవిధానం, బొడ్లంక పాటలు, పగటివేష కళా కారుల సాంస్కృతిక జీవనం (పార్వతీనగర్), మల్లన్న జాతర ఐనవోలు, బంజారాల తీజ్‌పండుగ పుస్తకాల ను ప్రచురించారు. అరుదైన జానపద కళారూపాలపై పరిశోధన.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రముఖంగా చిందుయక్షగానం, డక్కలి, గౌడశెట్టి, ఏనుటి, మందహెచ్చు, కాకిపడిగెల, మాసయ్య, గంజికూటి, కూజరి, డోలి, పట్టెడ, బాట్స్, దాడి, బైండ్ల, దూబ్బుల, బుడబుక్కల, ఒగ్గు, పంబాల, మొండి, గంగిరెద్దు, బాలసంతు, జంగాలు, శారద, డప్పు, పాములాట, చెక్కబొమ్మలాట, తోలుబొమ్మలాట, ఎరుకసోదే, పిట్టలదొర, లంబాడానృత్యం, కోయనృత్యం, కోర్రాజులు, కూనపులి, ఆద్దెపుసింగు, కాటిపాపల, హరిదాసులు, కడ్డీతంత్రి, కోలాటం, చెక్కభజ న, మాలభోగం, కిన్నెర, చిలుకపంచాంగం వంటి ఎన్నో కళారూపాలు దర్శనమిస్తాయి. జానపద గిరిజన విజ్ఞానపీఠం.. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సహకారంతో వారిజీవన విధానాలపై పరిశోధనలు జరిపి పుస్తకాలుగా వెలువరించనున్నారు. భవిష్యత్ తరాలకు వారధి జానపదగిరిజన విజ్ఞానపీఠాన్ని సందర్శించడం ఒక మధురానుభూతి. అంతరించిన , అంతరిస్తున్న అనేకానేక ఉపకరణాలను మ్యూజియంలో మళ్ళీ వీక్షిం చే అవకాశం కల్పించిన ఈ సంస్థకు అభినందనలు. – సిరికొండ మధుసూదనాచారి, శాసనసభాపతి ప్రతి కళారూపంపై పుస్తకం రాష్ట్ర సాంస్కృతికశాఖ సహకారంతో ఇటీవలే కొమ్ము, అద్దపుసింగు, కూనపులి, రుంజ, తోటి, గుర్రపు, తదితర కళారూపాలపై డాక్యుమెంటేషన్ నిర్వహించాం. త్వరలోనే పుస్తకం రూపొందిస్తాం. తెలంగాణ మాండలిక భాషాపదాలను కూడా 13వేల వరకు సేకరించాం. వచ్చే నెలలో జాతీయసదస్సు నిర్వహించనున్నాం. విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య ఆలేఖ్య పుంజాల మా పరిశోధనలను ప్రొత్సహిస్తున్నారు. – ఆచార్య భట్టు రమేష్, పీఠాధిపతి, జానపద గిరిజన విజ్ఞాన పీఠం, వరంగల్ -
ఆష్టా నుంచి లండన్ దాకా..
భైంసా(ముథోల్) : చదువుల తల్లి నిలయమైన ముథోల్ నియోజకవర్గంలో జానపద కళాకారులు ఎంతోమంది ఉన్నారు. బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి పాదాల చెంత పెరిగిన ఆష్టా గ్రామానికి చెందిన గంగా ధర్ జానపదంతో ప్రజలకు దగ్గరయ్యాడు. పుట్టిన ఊరిలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. ముథోల్‌లో ఇంటర్ పూర్తిచేశాడు. ఆ సమయంలోనే ముథోల్‌లోని గ్రామ సంస్థలో శిక్షణ పొందాడు. ఆ తర్వాత నిజామాబాద్‌లో డిగ్రీ చదువుతూ బతుకుదెరువు కోసం అదే జిల్లాలో ఉండిపోయాడు. ఆ సమయంలోనే శిక్షణ పొందిన గంగాధర్ జానపదంలో రాణించాడు. నవరసాల జానపదంతో పల్లె ప్రజలను ఆకట్టుకున్నాడు. నగర బాటలో గళం విప్పి... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో నగర బాట కార్యక్రమాన్ని చేపట్టాడు. భైంసా పట్టణంలోనూ నిజామాబాద్‌లోనూ సీఎం చేపట్టిన నగర బాటలో గంగాధర్ జానపదాలు పాడాడు. ప్రభుత్వ కార్యక్రమాలపై గళం విప్పిన గంగాధర్‌కు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పటి నిజామాబాద్ కలెక్టర్ బీవీ రాయుడు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం జిల్లా కల్చరర్ కో ఆర్డినేటర్‌గా గంగాధర్ పనిచేస్తున్నాడు. ఊరిపేరే ఇంటి పేరుగా.. అబ్బోల్ల వీరి ఇంటిపేరు అయినప్పటికీ ఆ పేరుతో ఎవరూ గంగాధర్‌ను పిలువరు. పుట్టిపెరిగిన ఆష్టా గ్రామమే గంగాధర్‌కు ఇంటి పేరు అయ్యింది. ఇప్పటికీ ఎవరైనా ఆష్టా గంగాధర్ అనే ఈ కళాకారున్ని పిలుస్తారు. రేలారేరేలాలో రషీదు, గంగా, రాజేశ్, గోదావరి, పూజతోపాటు ఎంతో మందిని పరిచయం చేసింది ఆష్టా గంగాధరే. ఎంతో మంది కళాకారులను శిక్షణ ఇచ్చి వేదికల్లో పరిచయం చేశాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా గజ్జెకట్టి జానపదం పాడిన గంగాధర్‌ను గోరేటి వెంకన్నతోపాటు ఎంతోమంది అభినందించారు. వివిధ దేశాల్లో ప్రదర్శనలు.. కాళ్లకు గజ్జెలు కట్టి పల్లె పుట్టుకను జానపదంతో వివరించే గంగాధర్ ఆష్టా గ్రామం నుంచి లండన్ వరకు వెళ్లగలుగుతున్నాడు. అక్టోబర్‌లో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు లండన్ రావాలంటూ యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆష్టా గంగాధర్‌కు ఆహ్వానం కూడా అందింది. ఇప్పటివరకు దుబాయ్, మలేషియా, సింగపూర్ దేశాల్లోనూ నిర్వహించిన జానపద వేదికలపై ఈ కళాకారుడు పాల్గొని జానపదం వినిపించాడు. అమ్మ ఆశీస్సులతోనే.. చదువుల తల్లి సరస్వతీ అమ్మ ఆశీస్సులు నాపై దండిగా ఉన్నాయి. అమ్మదయతో నేను ఆష్టా నుంచి లండన్వరకు వెళ్లగలుగుతున్నా. పల్లెపుట్టిన సమయంలో జానపదం పుట్టింది. ప్రజల జీవనశైలికి దగ్గరగా ఉన్నది ఉన్నట్లు చెప్పడమే జానపదం. జానపదమే ప్రజలకు ప్రాణప్రదమైంది. జానపద కళాకారుడిగా అభిమానిస్తున్న శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. జానపదం నాకు జీవనోపాధిని చూపింది. నలుగురిలో గౌరవం పెంచింది. మున్ముందు ఎంతోమంది కళాకారులను పరిచయంచేసే గొప్ప అవకాశం నాకు సరస్వతీ అమ్మ కల్పించింది. స్వీయరచనలతో పాటలు రాసి రికార్డింగ్ కూడా చేశాను. నన్ను ఆదరిస్తున్న ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. -
మలుపుతిప్పిన ‘జానపదం’
ఆదిలాబాద్: బుల్లితెర(టీవీ)పై నటించే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదనగలరు. ఇలాంటి అవకాశాన్ని పట్టణానికి చెందిన చిన్నారి ఆర్టిస్టులు అందుకోనున్నారు. ఇచ్చోడ మండలం అడెగామ–కె గ్రామానికి చెందిన న్యాయవాది సంగెం సుధీర్‌కుమార్, అమృతవాణి దంపతుల కూతుర్లు సుధాలహరి, సుధామాధురి ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఉంటున్నారు. ‘జానపదం..దుమ్మురేపు’ తో.. అక్కాచెల్లెలు సుధాలహరి, సుధామాధురి గతేడాది ఓ న్యూస్ చానల్లో నిర్వహించిన జానపదం–దుమ్మురేపు అనే కార్యక్రమానికి చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంపికయ్యారు. త్వరలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నారు. సుధాలహరి నాలుగోతరగతి చదువుతుండగా, మాధురి 3వ తరగతి చదువుతోంది. డాన్సులు, పాటలు అంటే ఎంతో ఇష్టపడే వీరికి అనుకోకుండా ఒక అవకాశం రావడంతో టీవీ కార్యక్రమాలకు ఎంపికయ్యారు. మొదటి అవకాశంతో.. న్యూస్ చానల్లో జానపదం–దుమ్మురేపు అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సమాచారం రావడంతో చిన్నారుల తండ్రి సుధీర్‌కుమార్ వారి పిల్లల ఫొటోలు, వివరాలు ప్రోగ్రాం కోడైరెక్టర్ వంశీకి పంపించారు. దీంతో అక్కడి నుంచి పిలుపు రావడంతో 2017 జనవరిలో ప్రిలిమినరీ సెలక్షన్స్ కోసం హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లోని సారథి స్టూడియోకు వెళ్లారు. ప్రోగ్రాంలో ఇద్దరు చిన్నారులు జానపదగేయంపై డ్యాన్సులు చేసి ఆకట్టుకోవడంతో టీవీషోకు ఎంపికయ్యారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఆర్పీ పట్నాయక్, వందేమాతరం శ్రీనివాస్, గోరటి వెంకన్న చిన్నారులను చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంపిక చేశారు. తర్వాత జూన్ నుంచి నవంబర్ వరకు ఈ షోకు సంబంధించిన షుటింగ్‌లో నటించారు. డాన్సులతో పాటు ఇద్దరు చిన్నారులు జానపద పాటలు ఆలపించనున్నారు. ఈ కార్యక్రమం షుటింగ్ జరుగుతున్న సమయంలో ప్రముఖ టీవీ చానల్లో ఓ సీరియల్లో నటించేందుకు వీరిద్దరికి అవకాశం వచ్చింది. త్వరలో ఈ సీరియల్ ప్రారంభం కానుంది. ఎంపికపై చిన్నారుల తల్లిదండ్రులు సుధీర్‌అమృతవాణి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
జనపదం బరువు మోస్తున్న బాటసారి
రంగస్థలం కవి, రచయిత, రంగస్థల దర్శకుడు, నటుడు శ్రీనివాస్ దెంచనాల తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ ఇరవై ఏళ్ల క్రితం శ్రీనివాస్ దెంచనాల వయసు అటూ ఇటుగా ఇరవై ఐదేళ్లు. అది మరీ చిన్న వయసేం కాదు కానీ, అప్పటికే అతడు ఓ తట్టెడు నాటకాల ప్రేక్షకుడు! ఒక్కటీ నచ్చడం లేదు! పక్కన థియేటర్లో సూపర్స్టార్ల సినిమా అడుతుంటే, ఈ పక్కన స్టేజి ఆర్టిస్టులు ఎవరికైనా ఎలా ఎక్కుతారు?! అది కాదు రీజన్. దెంచనాల యునీక్. అతడికి రంగస్థల నటులే అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ ‘మెగా’లు, ‘సూపర్’లు, ‘రైజింగ్’లు. అంతిష్టం నాటకం అంటే! కానీ తెలుగు నాటకమేంటీ ఇలా చివికి పోతోంది? మంచి బట్టలేవు. మంచి తిండి లేదు. మంచి ‘లుక్’ లేదు! నాటకం మధ్యలో బయటికొచ్చి సమోసా తిని, చాయ్ తాగి మళ్లీ లోపలకి వెళ్లేవాడే కానీ నీరసంగా వెళ్లేవాడు. ‘ఇలా కాదు’ అనుకున్నాడొక రోజు. అనుకుని.. ‘జనపదం’ థియేటర్ రిపర్టరీని స్టార్ట్ చేశాడు. టూరింగ్ టాకీస్లా.. జనం మధ్యలోకి వెళ్లి, జనం చేతే ప్రదర్శింపజేసే కళాసంస్థ అది! జనపదం రిపర్టరీ ఆవిర్భావానికి.. ముందు.. తర్వాత.. ప్రస్తుతం.. రంగస్థలం ఏమిటన్నది ఆయన మాటల్లోనే... కంగ్రాట్స్! రంగస్థలానికి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపును తెచ్చిపెట్టారు. ఆవిర్భావ వేడుకల్లో మా థియేటర్ రిపర్టరీ అందుకున్న అవార్డు గురించేనా? అవును. అది ప్రజా కళాకారుల ఘనత. కానీ ఆ ఘనత వెనుక ఉన్నది మీరే కదా! మీ దర్శకత్వం, స్టేజ్ ప్లే, రైటింగ్.. ఔట్‌స్టాండింగ్. మీరు అంటున్న ఔట్‌స్టాండింగ్ ఒక్కరి వల్ల వచ్చే ఫలితం కాదు. బాధితులనే నటులుగా చేయాలని ఎందుకనిపించింది? అనిపించడం కాదు. అది నాలో ఇన్‌బిల్ట్‌గా ఉన్నట్లుంది. హబీబ్ తన్వీర్ నాటకాలు చూశాక, నేను కోరుకుంటున్నది ఏదో తెలిసింది. ఆయన నాటకాలు ఆగ్రా బజార్, చరణ్‌దాస్ చోర్.. నన్ను ఇన్స్పైర్ చేశాయి. ఏమిటి ఆయన ప్రత్యేకత? బాధితులను నటులుగా చేసి చూపించడమేనా? అదొక్కటే కాదు. ఆయన నాటకాలు ఇంగ్లిషు నాటకాల్లా ఉండవు. మామూలు జానపద నాటకాల్లా ఉండవు. మోడర్న్‌గా ఉంటాయి. సంప్రదాయాన్ని వదలకుండానే నాటకాన్ని ఆధునీకరిస్తారు. హబీబ్ తన్వీర్.. ఉర్దూ నాటక రంగ ప్రముఖులు. తెలుగులో మిమ్మల్ని ఆయనతో పోల్చవచ్చా? రెండేళ్లు ఆయన దగ్గర పని చేశాను. ఆయన నాటక బృందంతో కలిసి దేశమంతా కలియదిరిగాను. బృందంతో చేరి వారికి కాస్ట్యూమ్స్, సెట్టింగ్స్ మోయడం, నాటకాలను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. హబీబ్ తన్వీర్‌తో పాటు బాదల్ సర్కార్, ధవళం నారాయణ ఫణిక్కర్, బీవీ కారత్ వంటివారు ఆధునిక నాటకాన్ని తమదైన శైలిలో అప్పటికే ప్రదర్శిస్తున్నారు. కానీ నన్ను గట్టిగా పట్టుకుంది మాత్రం హబీబ్ తన్వీర్. తెలుగులో ఆధునిక నాటకం లేదనేనా అంతదూరం వెళ్లారు? అంత దూరం అంటే..? ఖమ్మంలోని మీరు పుట్టిన పెద్దకిష్టాపురం తండా నుంచి.. ఛత్తీస్‌గఢ్‌లో హబీబ్ పుట్టి పెరిగిన గిరులలోకి! అది దూరం వెళ్లడం కాదు. ఆధునిక నాటకానికి దగ్గరగా వెళ్లడం. తెలుగు నాటకం ఇంతకాలానికీ ఆధునికతను చేరుకోలేకపోయిందని మీరు అంటున్నారు! అనడం కాదు. అసలు తెలుగులో ఆధునిక నాటకం లేనే లేదు. ఇది చాలా మంది అంగీకరించరు. అధునికం అంటే? భారతదేశంలోకి బ్రిటిషర్స్ ద్వారా వచ్చిన ఇంగ్లీషు నాటకానికీ, జానపద నాటకాలకూ భిన్నమైన శాస్త్రీయ సంప్రదాయక ప్రభావంగల నాటకం. అది 1950–55 మధ్యలో మన దేశంలో ప్రారంభమైంది. దానికి ఆద్యులు హబీబ్ తన్వీర్. కానీ ఆయన విదేశాలలో కదా శిక్షణ పొంది వచ్చారు?! అవును. లండన్‌లోని రాయల్ ఎకాడమీ ఆఫ్ డ్రమెటిక్ ఆర్ట్ (రాడా)లో శిక్షణ పొందారు. అయితే ఆ ధోరణి మన దేశానికి సరిపోదని ఆయనకు అనిపించి, తన సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో నిరక్షరాస్యులైన ఆదివాసీ ప్రజల స్థానిక సంప్రదాయాన్ని తన నాటకాల్లోకి తీసుకున్నారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని, షేక్స్పియర్ నాటకాలను వేశారు. మీరు ఆదివాసీ కళాకారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లున్నారు..? వాళ్ల సమస్యల్ని వాళ్లైతేనే చక్కగా ప్రజెంట్ చెయ్యగలరని నా నమ్మకం. ఆదివాసీల అతి ముఖ్యమైన సమస్య మైగ్రేషన్. అటవీశాఖ అధికారుల దౌర్జన్యాలూ, అటవీ సంపద, తమదైన సంస్కృతి నుంచి వారు దూరం కావడం, ఆదివాసీ ఉపాధ్యాయులే వారిని మోసం చేయడం.. ఇవన్నీ నా జీవితంలోని చిన్ననాటి చేదు జ్ఞాపకాలే. ఆ అనుభవాలతో ‘మావా నాటే మావా రాజ్’ (మా వూళ్ళో మా రాజ్యం) ఉట్నూర్‌లో ప్రదర్శించాం. మూడు వేల మంది ఆదివాసీలు ఆ నాటకాన్ని చూసారు. 1994లో ఈ నాటకం చూసిన ప్రభుత్వాధికారులు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని విమర్శించామన్న నెపంతో తదుపరి ప్రదర్శనలను నిషేధించారు. అయినా మా ప్రయత్నం ఆగలేదు. సెప్టెంబర్‌లో ‘కుమ్రుం భీము కల’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాం. మీ ‘జనపదం’ రిపర్టరీకి సపోర్ట్ లభిస్తోందా? కేంద్రప్రభుత్వం, మిత్రులు, ప్రేక్షకులు అందించే ఆర్థిక సాయంతో నడుపుతున్నాం. అప్పుడప్పుడూ సాయం చేసే రాష్ట్రప్రభుత్వాల మద్దతు కూడా ఉంది. అంటే.. నెట్టుకొస్తున్నాం అంటున్నారా? ఒకవిధంగా నెట్టుకు రావడం. ఇంకోవిధంగా ఎదురీదడం. ‘తెలుగు ప్రజల సంస్కృతీ సాంప్రదాయాలనూ నాటకం ద్వారా దశదిశలా వ్యాపింపజేయడం మా లక్ష్యం. అయితే అందుకు ప్రభుత్వం కూడా తన సహకారం అందించవలసి ఉంటుంది. కేవలం వ్యక్తుల వల్ల జరిగే పని కాదు ఇది. ఒక రిపర్టరీ వ్యవస్థాపకులుగా రంగస్థల అభివృద్ధికి ఇంకా జరగలవలసింది ఏమైనా ఉందా? రెండు తెలుగు రాష్ట్రాలు తక్కిన రాష్ట్రాల్లో ఆధునిక నాటక పరిస్థతిపై అధ్యయనం చేసి, ప్రతి జిల్లాలో రాష్ట్ర నాటక పాఠశాలలు స్థాపించి రంగస్థల నాటకానికి ప్రభుత్వం ప్రాణంపోయాలి. అలాగే నైపుణ్యంగల దర్శకులైన తెలుగు వారు, తెలుగేతరులను కూడా పిలిచి నాటకాసక్తి కలిగిన యువతకు శిక్షణా శిబిరాలు నిర్వహించాలి. యూనివర్సిటీల్లో ఉన్న నాటక శాఖలను శిక్షణా శిబిరాల ద్వారా పునరుద్ధరించాలి. థియేటర్‌ను అభ్యసించిన విద్యార్థులకు కర్ణాటకలో మాదిరిగా బిఇడి, ర్యాంక్ ఇచ్చి, ప్రభుత్వ పాఠశాలల్లో నాటక విద్యాబోధనను ప్రోత్సహించాలి. బాధితులే నటులు ప్రపంచంలో బ్రెజిలియన్ నాటక కర్త, దర్శకుడు అగస్టోబోల్ తొలిసారిగా విక్టిమ్ థియేటర్ (బాధితుల నాటకం) అనే కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టి బాధితులతోనే నాటకం వేయించాడు. ఈ నాటక ప్రక్రియ ద్వారా చాలా మంది స్ఫూర్తి పొందినప్పటికీ.. తెలుగులో తొలిసారి పసుపులేటి పూర్ణచందర్రావు అనే దర్శకుడు రెండు దశాబ్దాల పాటు ఇదే పద్ధతిలో నాటకాలు ప్రదర్శించారు. తర్వాత శ్రీనివాస్ దెంచనాల కూడా ఇదే పద్ధతిలో గోండులతో, లంబాడీలతో ఇంకా కొందరు బహుజనులతోటి కలిసి ఈ నాటక ప్రక్రియను అనుసరించారు. అయితే కళాత్మకత లేమివల్ల కొన్ని ప్రదర్శనలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని దెంచనాల అన్నారు. క్షత్రియుడైన నపుంసక రాజుకూ, హిందూ బలి సంప్రదాయానికీ మధ్య నలిగిపోయి రాజును చంపి, తను చనిపోయిన జైన ధర్మచారిణి అమృతలత. పద్మభూషణ్ గిరీష్ కర్నాడ్ నాటకం ‘బలి’లోని దృశ్యం ఇది. అనుసృజన, పరికల్పన, దర్శకత్వం : శ్రీనివాస్ దెంచనాల ప్రదర్శన : జనపదం ఆధునిక సంచార నాటక రిపర్టరీ. అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరస్పాండెంట్ -
అద్భుతః
విశాఖ–కల్చరల్ ః భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలిపే భారతీయ సంస్కృతిని ప్రతిబింభించే విధంగా ప్రదర్శించిన పలు ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పలు నాట్య సౌరభాలు రంజింప చేశాయి. దేభక్తిని చాటే వివిధ గీతాలు, భారతీయ జానపద నాట్యాలు చిన్నారులు ఓలాడించారు. వివిధ పాఠశాలలో చదువుతున్న చిన్నారులు జానపద కళారూపాలతో ఆకర్షణీయమైన డ్రెస్‌లు ధరించి ఉత్తరాంధ్ర యాసతో జానపద పాడుతూ ప్రదర్శించిన నాట్యాలు అలరించాయి. -
జానపద జాతర
-
కళాపర్వం
పనితోపాటే పుట్టింది పాట. పనీపాటా జతకట్టింది జన పదం. అదే జాన పదం. అచ్చమైన పల్లె సంస్కృతికి దృశ్యరూపం. ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేనన్ని భిన్న కళలు, విభిన్న సంస్కృతులు మన సొంతం. ఈ కళాకృతులన్నింటికి వేదికయ్యింది శిల్పారామం. ‘పర్వ పూర్వోత్తర్’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంత ఆహూతులను అలరించింది... - ఎస్. శ్రావణ్‌జయ ఆనందమైనా.. విషాదమైనా... సంబరమైనా.... పాండిత్యానికి అతీతంగా పరవశమే పరమపద సోపానంగా సాగే కళ జానపదం. అచ్చమైన గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబం. భిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశంలో ప్రాంతానికో ఆటపాటా. అఖిల భారత రంగస్థల ఉత్సవం సందర్భంగా సంగీత నాటక్ అకాడమీ, భారత్ ఫోక్ ఆర్ట్ అకాడమీ సంయుక్తంగా ఈశాన్య రాష్ట్రాల జానపద నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శిల్పారామంలో శుక్రవారం ప్రారంభమయిన ఈ అద్భుత నృత్య ప్రదర్శన ఆదివారం వరకు కొనసాగనుంది. రాధాకృష్ణుల నృత్యం... ‘ఏడే ళ్ల వయసులో ఈ నృత్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాను. ప్రతి రోజూ ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటల పాటు క్రమం తప్పకుండా నేర్చుకోవాలి. ఇప్పుడు నా వయసు 38. కొన్ని సార్లు ఈ నాట్యం గంట పాటు ఉంటుంది. బృందంలో ఏ ఒక్కరూ అలసిపోయినా ప్రమాదమే. మా మణి పూర్ రాష్ట్రంలో ప్రతి యాసాంగ్(హోలీ) పండుగకి మా బృందం ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తుంది. హోలీ పండుగ సందర్భంగా రాధాకృష్ణులు చేసే నృత్యమే ఈ డోల్ చోలమ్కి ప్రధాన నేపథ్యం’ అన్నారు డోల్ చోలమ్ కళాకారుడు జ్ఞానేశ్వర్. నవ వసంత వేడుక... ‘అసోంలో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తాం. అసోం మహిళలు ఈ నాట్యాన్ని ఎంతో ఇష్టపడి చేస్తారు. దేశ వ్యాప్తంగా మా బృందం చాలా చోట్ల ప్రదర్శన ఇచ్చింది’ అంటోంది బిహు నృత్య దళం. వీటితోపాటు మణిపూర్‌కే చెందిన ‘థాంగ్ థా’, మిజోరం నృత్యం చెరా, బెంగాల్ - బౌల్ గాన్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. -
‘నేనూ హీరోగా నటించా’
అమలాపురం : ఆధునిక కాలంలో కూడా జానపదానికి ప్రాణం పోస్తున్నారు జానపద వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్. ‘ఏం పిల్లో, ఎల్దామొస్తవా..’ అంటూ తన పాటతో తెలుగు వారిని ఉర్రూతలూగించారు. కోనసీమలో షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అమలాపురంలో మాట్లాడారు. ప్రశ్న : ఉద్యమకారునిగా మీరు? జవాబు : 47 ఏళ్లుగా ఎన్నో ఉద్యమాల్లో పాలుపంచుకున్నాను. సమైక్యాంధ్ర ఉద్యమం, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపైన ప్రజలతో కలిసి పదం కలిపి ఉద్యమించాను. ప్రజాఉద్యమాల్లో పాటలు పాడాను. ఇలాంటి పాటలు సుమారు 300 రచించాను. రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ప్ర: మీ పాట గురించి..! జ : ముఖ్యంగా ‘ఏం పిల్లో, ఎల్దామొస్తవా..’ అనే పాట 50 భాషల్లో అనువాదమైంది. అలాగే ‘యంత్రమెట్ట నడుస్తున్నదంటే..’ పాట లండన్, అమెరికాలో ఇంగ్లిష్‌లో అనువాదం చేసుకుని పాడారు. ప్ర : సినీ రంగానికి రావడం? జ : ఇప్పుడు కాదు, 80వ దశకంలోనే నేను హీరోగా ఓ సినిమాలో నటించాను. అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమాలో నలుగురు హీరోల్లో నేను ఒకడిని. ఆ తర్వాత అంతగా నచ్చిన పాత్రలు రాకపోవడంతో నటించలేదు. ‘సూరి’ చిత్రంలో ఉద్యమకారుడి పాత్ర ఉందని డెరైక్టర్ ఈఎస్ వెంకట్ చెప్పారు. నాకు నచ్చడంతో చేస్తున్నాను. ప్ర : మరి పాటలు రాయడానికి విరామమిస్తారా? జ : లేదు. ఇక మీదట కూడా జానపదాన్ని, జానపద సంస్కృతిని బలపరిచే పాటలు రాస్తా. ప్ర : రాజకీయాల్లోకి? జ : ప్రజా రాజకీయాలు చేస్తాను. ప్రజల కష్టసుఖాల్లో ఉండడమే రాజకీయం. ప్రజా పోరాటాలు ఎవరు చేసినా బలపరుస్తాను. ప్ర : జానపద సంస్కృతిని కాపాడాలంటే? జ : జానపదాన్ని ఆధునికీకరించి, ప్రజా సమస్యలను అందులో చొప్పించి ప్రజల్లోకి తీసుకువెళ్లడమే నా ఉద్దేశం. జానపదాన్ని నవతరం అర్ధం చేసుకుని జానపదతత్వం పోకుండా యువకులు ఆధునికీకరించాలి. యువత జానపదాన్ని కాపాడితేనే విషసంస్కృతిని ఆపగలం. -
జానపదానికి గ్లామర్ రావాలి: అశోక్‌తేజ
- యాస అమ్మలాంటిది... నల్లగా ఉందని అమ్మని తరిమేస్తామా? - మట్టి చరిత్రను ఆవిష్కరిస్తేనే ఆవిర్భావానికి అర్థం - ఊరూవాడా వీధులన్నింటికీ త్యాగధనుల పేర్లు పెట్టాలి - సాక్షికి సుద్దాల అశోక్‌తేజ ఇంటర్వ్యూ... మన కల్చర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి... మన పూర్వీకులను కన్నీళ్లతో పునశ్చరణ చేసుకోవాలి.. నిన్నటి సంస్కృతి దీపాలను రేపటి పౌరులకు అందజేయాలి.. బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్: పుష్కరాలను ఎలా నిర్వహిస్తారో సమ్మక్క సారక్క జాతరను కూడా అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. బతుకమ్మ, బోనాల పండుగలు కూడా తెలంగాణ సంస్కృతికి ఐకా న్ వంటివి. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించి ఘనంగా నిర్వహించాలి. తెలంగాణలో జాన పదం ఎక్కువగా ఉంటుంది. ఆట-పాట- మాట ఎవరికివారే రాసుకొని ట్యూన్ చేసుకుని ఆడుతూ పాడతారు. వీరినే వాగ్గేయకారులం టారు. వీటిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర జానపద సాంస్కృతిక అకాడమీని ఏర్పాటు చేయాలి. ఆ రంగంలో కృషిచేస్తున్న వారిని ఏడాదికి నాలుగుసార్లకు తగ్గకుండా కార్య క్రమాలను రూపకల్పన చేయాలి. అన్నమయ్య పీఠంలా జానపద పీఠాన్ని ఏర్పాటు చేయాలి. వృత్తికళాకారులను చేరదీయాలి. వారికి వేతనాలు ఇవ్వాలి. గౌరవ పారితోషకాలు అందజేయాలి. కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. సినిమాకు ఇస్తున్న ప్రాధాన్యంలో 25 శాతం వీటికి అన్ని ఛానళ్లలో ప్రాముఖ్యం ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. అప్పుడుగానీ వీటికి గ్లామర్ రాదు. ప్రభుత్వం ఆదరిస్తే జానపద కళలకు కూడా గ్లామర్ వస్తుంది. ఒక రంగాన్ని పెంచిపోషి ంచాలంటే ముందుగా దాన్ని ఫోకస్‌లోకి తీసుకురావాలి. గ్లామర్ ఇవ్వాలి. టీఆర్ఎస్ ఉద్యమంతో వేలాదిమంది కళాకారులు పుట్టుకొచ్చారు. అలాగే కొన్ని టీవీల్లో జానపద కళారూపాలను ప్రదర్శించడం వల్ల ఆ కళాకారులకు గ్లామర్ పెరిగింది. అనేకమంది అమెరికా వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రదర్శనలు ఇచ్చారు. పాలకుర్తి సోమనాథుడు, పోతన, వేముల వాడ భీమకవి పేరుమీద పరిశోధనాలయాలు నిర్మించా లి. వారి పేర్లతో కళాపీఠాలు ఏర్పాటు చేయాలి. సుద్దాల హన్మంతు పేరుతోనూ కళాపీఠం ఏర్పాటు చేయాలి. కొమురం భీం, చాకలి ఐలమ్మ పేర్లమీద జిల్లాల్లో స్మారక మందిరాలు నిర్మించాలి. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారు, తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన వారి విగ్రహాలను ప్రతిష్టించాలి. వీధులకు, గ్రామాలకు, కూడళ్లకు వారి పేర్లు పెట్టాలి. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నేటితరానికి తెలియనే తెలియదు. దాన్ని సిలబస్‌లో పెట్టాలి. అమెరికాకు వెళ్లి వివేకానందుడు ఎంతో గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. అతను ఉపన్యాసం ఇచ్చిన హాలును జ్ఞాపకార్థంగా పర్యాటక క్షేత్రంగా అమెరికా ప్రభుత్వం ఉంచి గౌరవిస్తోంది. దాన్ని వేలాది మంది సందర్శిస్తుంటారు. పరాయి దేశ వ్యక్తిని ఒక అగ్రరాజ్యం అలా గుర్తించినప్పుడు మన వీరులను మనం ఎందుకు గుర్తుంచుకోకూడదు? వరంగల్ జిల్లాలో బైరాన్‌పల్లిలో మరో జలియన్‌వాలాబాగ్ వంటి సంఘటన జరిగింది. వందల మంది తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా అక్కడ చనిపోయా రు. ఈ విషయం ఎందరికి తెలుసు? తెలంగాణ వంటకాలను హోంసైన్స్‌లో పాఠ్యాంశాలు చేయాలి... తెలంగాణలో శిలాశాసనాలను వెతికి పట్టుకుని వాటిని గ్రంథాలుగా చేయాలి. పుస్తకాలు, సీడీలుగా మార్చాలి. తాళపత్ర గ్రంథాలను సీడీలుగా మార్చాలి. వెబ్సైట్లలో పెట్టాలి. వందలాదిగా ఉన్న ప్రజల ఆచారాలను బయటకు తీయాలి. జొన్న, సజ్జ రొట్టెలకు ఉన్న విలువెంతో తెలుసా? పచ్చి పులుసు, అరిసెలు, గారెలు వంటివాటిని తెలంగాణ సృష్టించింది. వాటిలో ఉన్న ఆరోగ్య రహస్యాలను హోంసైన్స్‌లో సిలబస్‌గా పెట్టాలి. కల్చర్ అంటే మనం వేసుకునే బట్టలు, మనం నివసించే ఇళ్లు, మన ఆహారం, మన కళలు, మన భాష, మన సాహిత్యం, మన వ్యవసాయం, దాన్ని కాపాడుకునే విధానం, ఒక పద్ధతి కలిస్తేనే కల్చర్. దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మన పూర్వీకులను కన్నీళ్లతో పునశ్చరణ చేసుకోవాలి. నిన్నటి సంస్కృతి దీపాలను రేపటి పౌరులకు అందజేయాలి. యాసను కాపాడుకోవాలి... తెలంగాణ మాట్లాడే విధానంలోని యాసల సోయగాన్ని సొంపులను పట్టుకొని కాపాడుకోవాలి. యాసను వెక్కిరించొద్దు. యాస అమ్మలాంటిది. అమ్మ నల్లగా ఉందని వెళ్లగొడతామా? యాసలోని సొంపు సోయగాలను సీడీలుగా మార్చాలి. గిరిజన సంస్కృతిని కాపాడుకోవాలి. వాటిని ధ్వంసం చేయొద్దు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడమంటే సీఎం పదవి తెలంగాణ వారికి రావడమేనా? గద్దెల మీద మనుషులను మార్చడం కాదు. తెలంగాణ మట్టి చరిత్రను ఆవిష్కరించాలి. అధికార మార్పిడి కాదు కావాల్సింది. సినిమా రంగం తెలుగు సంస్కృతికి దూరమైంది. సహజత్వానికి దూరమైంది. తెలుగు అనుబంధాలకు ఇంకా దూరమైంది. పురిటి నొప్పులను కూడా సెక్సీగా చూపించే దుస్థితి సినిమాల్లో దాపురించింది. తెలంగాణ కళాకారులను సినిమా రంగంవైపు ప్రోత్సహించేందుకు ఫిల్మ్‌లో శిక్షణ ఇవ్వాలి. అందుకు ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలి. బాలచందర్, గిరీష్కర్నాడ్ వంటి వారిని తీసుకొచ్చి శిక్షణ ఇప్పించాలి. ఈ పనిని ప్రభుత్వమే చేయాలి. -
యువత ఉద్యోగాల కు నాదీ భరోసా
వైఎస్ నుంచి వచ్చిన విశ్వసనీయతతో ఈ మాట ఇస్తున్నా: జగన్ విభజనతో హైదరాబాద్ మహా నగరాన్ని మనకు కాకుండా చేశారు. మనమంతా ఒక్కటవుదాం.ఆ హైదరాబాద్, సింగపూర్‌లకు నాయనలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా.. ఎయిర్‌పోర్టు నిర్మిస్తా.. పెద్దపెద్ద పోర్టులు నిర్మిస్తా. మనమందరం ఒక్కటై మన రాష్ట్రాన్ని మనమే పునర్నిర్మించుకుందాం. కాకినాడ: ‘‘కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతీశాయి. యువతను రోడ్డున పడేశాయి. కానీ, మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నేను కల్పిస్తానని చెబుతున్నా. అందుకోసం ప్రతి రోజూ కష్టపడతానని నమ్మకంగా చెబుతున్నాను. నిరుద్యోగులకు అండగా ఉంటాను. ఉద్యోగాల విషయంలో మీ అందరికీ ఒక మంచి అన్నయ్యగా ఉంటానని మాట ఇస్తున్నా. ఇవన్నీ పెద్ద పెద్ద మాటలుగా కన్పించవచ్చు. కానీ దివంగత మహానేత రాజశేఖరరెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిన విశ్వసనీయతతో ఈ మాట చెబుతున్నా..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ‘‘చంద్రబాబు పాలనలో విద్యార్థుల కోసం కానీ, వారి భవిష్యత్ కోసం కానీ పట్టించుకోలేదు. పిల్లల చదువుల కోసం వారి తల్లిదండ్రులు ఏరకంగా ఇబ్బందిపడుతున్నారని ఆయన ఏనాడూ తెలుసుకోలేదు. ఆ రోజు ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పొలాలు, ఇళ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఈనాటికీ నాకు గుర్తున్నాయి. అటువంటి చంద్రబాబు ఇప్పుడు ఇంటికొక ఉద్యోగం చొప్పున రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఉద్యోగాలిస్తానంటూ దొంగ హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు’’ అని జగన్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోటలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం పెద్దాపురం ఆంజనేయస్వామి ఆలయ జంక్షన్లో శనివారం రాత్రి జరిగిన వైఎస్సార్ జనభేరి సభకు అశేషంగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థిగా తోట సుబ్బారావు నాయుడు, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్‌ను ప్రకటించి, వారిని గెలిపించాలని కోరారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. చంపేసి.. ఫొటోకు దండా తానే వేస్తానన్నట్టుంది ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ర్టం ముక్కలవడం అన్యాయమంటూనే విభజనకు అనుకూలంగా తన ఎంపీలతో ఓటువేయించారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రాన్ని ఇదే చంద్రబాబు సింగపూర్ చేస్తానంటున్నారు. ఇదెలా ఉందంటే.. ‘ఒక మనిషిని చంపేసి ఆ ఫోటోకు నేనే దండ కూడా వేస్తా’నన్నట్టుగా ఉంది. తన రాజకీయ స్వార్థం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆ తర్వాత ఎన్నికలొచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుంటారు.. ఓట్లు అడుగుతారు.. నోటికొచ్చినట్టల్లా అబద్ధాలు ఆడతారు. చెప్పిందే చెప్పి అబద్ధాలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. నాడు పిల్లను ఇచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలను మోసం చేయరని గ్యారంటీ ఎక్కడుంది? ఇంతలా అబద్ధాలా? చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పినప్పుడు చాలా మంది పార్టీ కార్యకర్తలు వచ్చారు. మీరు కూడా రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పేయండి, ఆ తర్వాత చూద్దామని చెప్పారు. నిజంగా ఆ రుణాల మాఫీ కోసం ఏం చేయాలి.. చేయగలుగుతామా అని బడ్జెట్‌ను అధ్యయనం చేశాను. చూస్తే రైతుల రుణాలు ఏకంగా లక్షా 27 వేల కోట్లున్నాయి. డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలు 20 వేల కోట్లు ఉన్నాయి. 2008లో రుణాలు చెల్లించలేక రైతులు చేతులెత్తేసిన పరిస్థితుల్లో కేంద్రం 65 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తే మన రాష్ట్రానికి కేవలం 12 వేలకోట్లు వచ్చింది. అలాంటిది చంద్రబాబు ఏకంగా 1.47 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తానంటున్నారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా.. ఈ స్థాయిలో అబద్ధాలు ఆడడం ఎక్కడైనా ఉందా? నాకు ఇలా మోసం చేయడం చేతకాదు. విశ్వసనీయత నాకు వారసత్వంగా వచ్చింది.. చంద్రబాబు వయసు 65 సంవత్సరాలు. ఆయన కంటే నేను 25 ఏళ్లు చిన్నవాడిని. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఆయన పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు. అందుకని ఆయన ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. కానీ వైఎస్సార్ నుంచి నాకు వారసత్వంగా వచ్చిందేదైనా ఉంది అంటే అది విశ్వసనీయత అని గర్వంగా చెబుతున్నా. నేను మాట ఇస్తే తప్పను. ఐదు సంతకాలతో రాష్ట్ర రూపురేఖలు మారుస్తాను.. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈ రాష్ర్ట రూపురేఖలు మార్చే విధంగా ఐదు సంతకాలు చేస్తాను. తొలి సంతకం అమ్మ ఒడి పథకంపై పెడతాను. తమ పిల్లలను బడులకు పంపిస్తే చాలు.. ఒకరికైతే 500, ఇద్దరైతే రూ.1,000 వారి త ల్లుల అకౌంట్లలో జమచేస్తాను. వారి పిల్లలను ఇంజనీర్లుగానో.. డాక్టర్లుగానో చదివిస్తాను. ప్రతీ స్కూల్లోనూ ఇంగ్లిష్ మీడియం పెడతా. రెండో సంతకం అవ్వాతాతల కోసం పెడతాను. వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ.200 పింఛన్‌ను రూ.700కు పెంచుతాను. రైతన్నకు మద్దతు ధర సమస్య రాకుండా ఉండేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ మూడో సంతకం చేస్తాను. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు తీసుకున్న రూ.20 వేల కోట్ల రుణాలు మాఫీ చేసేందుకు నాలుగోసంతకం చేస్తాను. ప్రతీ వార్డులో ఒక ఆఫీస్ తెరిచి ఏ కార్డు కావాలన్నా 24 గంటల్లో వచ్చేలా చూస్తాను. ఇందుకోసం ఐదో సంతకం చేస్తాను. అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్‌హయాంలో నిర్మించిన 48 లక్షల ఇళ్లకు ఒక లక్షయినా అదనంగా ఇళ్లు నిర్మిస్తానని మాట ఇస్తున్నా.’’ వైఎస్సార్ సీపీలోకి నర్సీపట్నం ఎమ్మెల్యే విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే బొళెం ముత్యాలపాప శనివారం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సామర్లకోటలో వైఎస్సార్ సీపీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో తరలివచ్చిన ముత్యాలపాపతోపాటు ఆమె అనుచరులకు కండువాలు వేసి జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ర్ట విభజన ఎంతగానో బాధించిందని, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా విభజనకు పాల్పడిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలనే ఆలోచనతోనే నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు తాను వైఎస్సార్సీపీలో చేరానన్నారు. -
రాష్ట్రాన్ని శ్మశానం చేశావ్
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనపై నిప్పులు చెరిగిన వైఎస్ విజయమ్మ తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల్ని ఆత్మహత్యలపాలు చేసి రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తానంటే నమ్మడానికి ప్రజలు పిచ్చివాళ్లు కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిప్పులు చెరిగారు. ‘‘అది చేస్తా.. ఇది చేస్తానంటూ చంద్రబాబు ఇప్పుడు దొంగ హామీలిస్తున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల పాలనలో బాబూ నువ్వు ఏం చేశావా అని చూస్తే.. ప్రభుత్వం ఇచ్చే జనతా వస్త్రాల పథకాన్ని తీసేసి ఆప్కోను నిర్వీర్యం చేశావు. అందులో పనిచేసే కార్మికుల ఆత్మహత్యలకు ప్రధాన కారకుడవయ్యావు. మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగులకు మూడు నెలలకొకసారో, ఆరు నెలలకొకసారో జీతాలు ఇచ్చి.. వారి కుటుంబాలను ఇబ్బందులు పెట్టావు. ఎన్టీ రామారావు కిలో రూ.2 కే ఇచ్చిన బియ్యం ధరను రూ.5.25కు పెంచావు. జన్మభూమి, శ్రమదానం అంటూ జనం చేతే పనులు చేయించి రాష్ట్రాన్ని శ్మశానాంధ్రప్రదేశ్‌గా చేశావు’’ అని విజయమ్మ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ చేపట్టిన పర్యటన మూడో రోజు శనివారం కర్నూలు జిల్లాలో కొనసాగింది. నంద్యాల నుంచి బండి ఆత్మకూరు, వెలుగోడు, నల్లకాల్వ, ఆత్మకూరు, కరివేన, పాములపాడు, జూపాడుబంగ్లా, నందికొట్కూరు పట్టణాల్లో విజయమ్మ రోడ్‌షో నిర్వహించి, బహిరంగ సభల్లో ప్రసంగించారు. మహానేత సతీమణిని చూసేందుకు ప్రజలు వేలాదిగా తరలిరావడంతో ఆయా ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. విజయమ్మ కన్నీరు స్మృతివనంలో వైఎస్ విగ్రహం వద్ద నివాళి గద్గద స్వరంతో ప్రసంగం ‘‘మనసుకు కష్టంగా అని పిస్తుంది. ఆత్మకూరును తలచుకుంటేనే ఏదోలా ఉంటుంది. ఇక్కడకు రావాలన్నా బాధేస్తోంది’’ - మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అమరుడైన కర్నూలు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని నల్లకాల్వ వద్దకు చేరుకున్నపుడు.. ఆయన సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆవేదన ఇది. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ శనివారం ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఆమె రాకతో ఇక్కడి ప్రజల గుండెలు ఒక్కసారిగా బరువెక్కాయి. బండిఆత్మకూరు, వెలుగోడు, నల్లకాల్వ, ఆత్మకూరు పరిధిలోని దారుల్లో జనం బారులుతీరారు. నల్వకాల్వలో రెండు నిముషాలు మాట్లాడాలని స్థానికులు పట్టుబట్టడంతో మైక్ అందుకున్న ఆమె కొంత సేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆ ప్రాంతమంతా మూగబోయింది. కళ్లల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. తేరుకున్న స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ పాలనను గుర్తు చేస్తూ.. ఆయన తదనంతర పాలనను ఎండగడుతూ.. మాట్లాడారు. స్మృతివనంలోని మహానేత భారీ విగ్రహం వద్ద ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. బండిఆత్మకూరు, వెలుగుడులో గద్గద స్వరంతో మాట్లాడిన తీరు అందరినీ కలచివేసింది. -
తాడిపత్రిలో విజయమ్మ వైఎస్ఆర్ జనభేరి
-
జనహోరు
కదిరి జనసముద్రంగా, పుట్టపర్తి జనపర్తిగా, హిందూపురం జనపురంగా మారింది. కనుచూపు మేర జనం.. కదిలి వచ్చిన మహిళాలోకం.. జననేతకే మా మద్దతు అంటూ యువతరం నినదించింది. ఆదివారం వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనకు ‘అనంత’ నీరాజనం పలికింది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె చేపట్టిన ‘జనపథం’ తొలిరోజు విజయవంతమైంది. అడుగడుగునా జనం అభిమానంతో అడ్డుపడటంతో పర్యటన షెడ్యూలు కంటే ఆలస్యమైనా ప్రజలు పోటెత్తారు. సాక్షి ప్రతినిధి, కదిరి/పుట్టపర్తి/హిందూపురం : యువ జనం కదం తొక్కింది. మహిళా లోకం కడలిలా కదలి వచ్చింది. పండుటాకులు పోటెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకొని చేపట్టిన ‘జనపథం’ కార్యక్రమంలో భాగంగా కదిరి, పుట్టపర్తి, హిందూపురం మున్సిపాలిటీలలో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్ షోలకు జనసంద్రం పోటెత్తింది. యువతీ యువకులు, మహిళలు, వృద్ధులు నీరాజనాలు పలకడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో ఐదు రోజుల మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం కదిరిలో ప్రారంభించారు. ఆదివారం ఉదయం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ సమాధిని దర్శించుకొని నివాళులర్పించిన వైఎస్ విజయమ్మ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. షెడ్యూలు సమయం కన్నా మూడు గంటలు ఆలస్యంగా వచ్చిన విజయమ్మకు కదిరి శివార్లలోని కుటాగుళ్ల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మధ్యాహ్నం 12.24 గంటలకు కదిరిలోని బస్టాండ్ సర్కిల్‌కు చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. సభకు హాజరైన వారిలో సింహభాగం మైనార్టీ వర్గాలకు చెందిన మహిలే కావడం గమనార్హం. వైఎస్ విజయమ్మ ప్రసంగానికి జనం నుంచి విశేష స్పందన లభించింది. వైఎస్ జగన్ సీఎం కాగానే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని వైఎస్ విజయమ్మ హామీ ఇవ్వగానే మహిళలు కరతాళ ధ్వనులతో అభినందించారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లను రూ.200 నుంచి రూ.700లకు పెంచుతామని ఇచ్చిన హామీకి జనం కేరింతలు కొట్టారు. అమ్మఒడి పథకం ద్వారా ఇద్దరు పిల్లలను చదివించే ప్రతి అమ్మకూ నెల నెలా రూ.1000 ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతూ వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగం ఆద్యంతం జనాన్ని ఆకట్టుకుంది. కదిరి బస్టాండ్ సర్కిల్ నుంచి మార్కెట్, జీమాను సర్కిల్, నరసింహ స్వామి దేవాలయం మీదుగా వేమారెడ్డి సర్కిల్ వరకు నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బారులు తీరి వైఎస్ విజయమ్మపై బంతిపూల వర్షం కురిపించారు. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన వైఎస్సార్సీపీ కదిరి సమన్వయకర్త ఇస్మాయిల్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ విజయమ్మ పుట్టపర్తికి బయల్దేరారు. పుట్టపర్తికి చేరుకొనే మార్గమధ్యలో ప్రతి పల్లెలోనూ జనమంతా రోడ్లపైకొచ్చి వైఎస్ విజయమ్మకు మద్దతు పలికారు. రెడ్డిపల్లి, నల్లమాడ, చెర్లోపల్లి, వెంగలమ్మ చెరువు గ్రామాల్లో వైఎస్ విజయమ్మపై బంతిపూల వర్షం కురిపించారు. మహిళలు అడుగడుగునా హారతులు పట్టి నీరాజనాలు పలికారు. భారీ జనసందోహం మధ్య పుట్టపర్తి శివారుకు చేరుకున్న వైఎస్ విజయమ్మకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. షెడ్యూలు సమయం కన్నా 3.30 గంటలు ఆలస్యంగా పుట్టపర్తికి చేరుకున్న వైఎస్ విజయమ్మకు ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. సత్యమ్మ దేవాలయం వద్ద బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు, కిరణ్‌లపై పదునైన విమర్శలు చేశారు. అత్యంత అవినీతి సీఎం చంద్రబాబేనని తెహల్కా డాట్కాం 2002లోనే తేల్చిందని, అలాంటి చంద్రబాబు ఈ రోజున వేదాలు వల్లిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యం రామలింగరాజు ఇచ్చిన నగదు మూటలతోనే చంద్రబాబు కుమారుడు లోకేశ్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారని దుయ్యబట్టారు. అయితే చంద్రబాబు మాత్రం ఏ ఒక్క విద్యార్థికీ ఫీజు రీయింబర్స్‌మెంటు ఇచ్చిన పాపాన పోలేదంటూ వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. పుట్టపర్తిలో సత్యమ్మ గుడి నుంచి వైఎస్ విజయమ్మ ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించి, నివాళులర్పించారు. సత్యసాయిని ప్రేమించే ప్రతి హృదయం వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. ప్రశాంతి నిలయం నుంచి ఎనుములపల్లి సర్కిల్ వరకు విజయమ్మ రోడ్‌షో నిర్వహించారు. రోడ్డుకిరువైపులా జనం బారులు తీరి వైఎస్ విజయమ్మకు సంఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచి హిందూపురానికి బయల్దేరారు. హిందూపురం చేరుకొనే మార్గమధ్యలో పెడపల్లి, గోరంట్ల క్రాస్, పాలసముద్రం క్రాస్ వద్ద ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి వైఎస్ విజయమ్మకు మద్దతు ప్రకటించారు. షెడ్యూలు సమయం కన్నా 2.54 గంటలు ఆలస్యంగా హిందూపురం శివారులోని కొట్టూరు క్రాస్ వద్దకు చేరుకున్న వైఎస్ విజయమ్మకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆర్టీసీ బస్టాండు, ఎన్టీఆర్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ సర్కిల్‌వరకు రోడ్డుషో నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగాన్ని మళ్లీ చూడగలుగుతామని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే అమ్మ ఒడి పథకంపై తొలి సంతకం, వృద్ధులకు, వికలాంగులకు రూ.700, వికలాంగులకు రూ.1000 పింఛన్‌గా ఇచ్చేందుకు రెండో సంతకం, రైతులకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధికి మూడో సంతకం, డ్వాక్రా రుణాల మాఫీపై నాలుగో సంతకం చేస్తారని భరోసానిచ్చారు. 34 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ అమలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలను, చేయని వాగ్దానాలను కూడా ఐదు సంవత్సరాల పాలనలో అమలు చేసి చూపారన్నారు. వైఎస్ నుంచి విలువలను, విశ్వసనీయతను పుణికిపుచ్చుకున్న జగన్.. చేసిన ప్రతి వాగ్దానాన్నీ అమలు చేసి విశ్వసనీయతను నిలబెట్టుకుంటారంటూ వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి రోజున టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న కదిరి, పుట్టపర్తి, హిందూపురంలో వైఎస్ విజయమ్మ ‘జనపథం’ విజయవంతమవడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. నేడు వైఎస్ విజయమ్మ పర్యటన ఇలా.. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన జనపథం కార్యక్రమం సోమవారం మడకశిర, ధర్మవరం, అనంతపురం మున్సిపాలిటీలలో జరగనుంది. ఉదయం 9 గంటలకు మడకశిరలో రోడ్‌షో కార్యక్రమంలో పాల్గొననున్న విజయమ్మ.. అక్కడి నుంచి పెనుకొండ, సీకేపల్లి క్రాస్, ఎన్ఎస్ గేటు మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు ధర్మవరం చేరుకుంటారు. అక్కడ రోడ్ షో నిర్వహించిన అనంతరం బత్తలపల్లి, ఎస్కేయూనివర్సిటీ మీదుగా సాయంత్రం 5 గంటలకు అనంతపురం నగరానికి చేరుకొని రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం నగరంలో బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి విజయమ్మ ప్రసంగించనున్నారు.