janaseena
-
జనసేన, బీజేపీకి షాక్ ఇచ్చిన టీడీపీ
సాక్షి, విజయవాడ: నామినేటెడ్ పోస్టుల భర్తీలో జనసే, బీజేపీకి చంద్రబాబు షాక్ ఇచ్చారు. 20 పదవుల్లో 3 జనసేనకి, బీజేపీకి ఒక్కటి మాత్రమే దక్కింది. బీజేపీ నుంచి మాజీ టీడీపీ నేత లంక దినకర్‌కి 20 సూత్రాల ఛైర్మన్ పదవి కేటాయించగా, ఒరిజినల్ బీజేపీ నేతలకు నామినేటెడ్ పదవులు దక్కలేదు. జనసేనకు పవర్ లేని డమ్మీ కార్పొరేషన్లను చంద్రబాబు అంటగట్టారు.కార్పొరేషన్ ఛైర్మన్ల వివరాలువక్ఫ్బోర్డు- అబ్దుల్ అజీజ్ (టీడీపీ)శాప్- ఏ. రవి నాయుడు (టీడీపీ)గృహనిర్మాణ సంస్థ- బత్తుల తాతయ్యబాబు (టీడీపీ)ఏపీ ట్రైకార్- బొరగం శ్రీనివాసులు (టీడీపీ)ఏపీ మారిటైం బోర్డు- దామచర్ల సత్య (టీడీపీ)సీడాప్- దీపక్‌రెడ్డి (టీడీపీ)20 సూత్రాల అమలు కమిటీ- లంకా దినకర్ (బీజేపీ)మార్క్‌ఫెడ్- కర్రోతు బంగార్రాజు (టీడీపీ)సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్- మన్నె సుబ్బారెడ్డి (టీడీపీ)ఏపీఐఐసీ- మంతెన రామరాజు (టీడీపీ)పద్మశాలి కార్పొరేషన్- నందం అబద్ధయ్య (టీడీపీ)ఏపీటీడీసీ- నూకసాని బాలాజీ (టీడీపీ)ఏపీఎస్ ఆర్టీసీ- కొనకళ్ల నారాయణ, వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం (టీడీపీ)పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్పొరేషన్- పీలా గోవింద సత్యనారాయణ (టీడీపీ)లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్- పిల్లి మాణిక్యాల రావు (టీడీపీ)వినియోగదారుల రక్షణ కౌన్సిల్- పీతల సుజాత (టీడీపీ)ఎంఎస్ఎంఈ- తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)పౌరసరఫరాల కార్పొరేషన్- తోట మెహర్ సీతారామ సుధీర్ (జనసేన)ఏపీటీపీసీ- వజ్జ బాబూరావు (టీడీపీ)ఏపీ టిడ్కో- వేములపాటి అజయ్‌కుమార్ (జనసేన) -
పొత్తు.. పార్టీ చిత్తుకేనా?
అనకాపల్లి (యలమంచిలి రూరల్)/కశింకోట/ అనకాపల్లి: టీడీపీ–జనసేన పార్టీల తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితా అనకాపల్లి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి రగిల్చింది. పదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను కాదని జనసేనకు టికెట్ కేటాయించడం గందరగోళానికి దారితీసింది. ఇప్పటి వరకూ చంద్రబాబే తమకు ఇంద్రుడు, చంద్రుడు అని మాట్లాడినవారు ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత వైఖరినే తప్పుబడుతున్నారు. జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు పార్టీ టికెట్ వస్తుందని ఆయన అనుచరగణం, టీడీపీ శ్రేణులు భావించాయి. కాని అనూహ్యంగా ఈ సీటును పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించడంతో ఆదివారం కశింకోట, అనకాపల్లి పట్టణాలలో తెలుగు తమ్ముళ్ల నిరసనలు పెల్లుబికాయి. చంద్రబాబు తీరుపై ఆ పార్టీ నేతలే తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. నెల రోజుల కిందట జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాలను ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలపడం సరికాదంటున్నారు. ఈ మేరకు ఆదివారం కశింకోట మండల టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. తామంతా పీలా వెంటే ఉంటామని, ఆయనకు టికెట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని అధినేతకు హెచ్చరికలు పంపారు. బాహాటంగానే విమర్శలు అనకాపల్లిలో కూడా టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇలాంటి పొత్తుల వల్ల పార్టీకి నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని, పార్టీకి అనుకూలంగా వున్న సీటును జనసేనకు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. నమ్మకాన్ని వమ్ము చేయడమే చంద్రబాబు నైజమని సొంత పార్టీ నేతలే విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహించడం, సామాజిక మాధ్యమాల్లో వీడియోలను పోస్టు చేయడం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యాన్ని తెచ్చింది. చంద్రబాబుకు మాటపై నిలబడే తత్వం లేదని, ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదని నియోజకవర్గ టీడీపీ ముఖ్యనాయకులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు టీడీపీ టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడిగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కశింకోట మండల టీడీపీ శ్రేణులు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం కశింకోటలోని గౌరమ్మ ఆలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో తీవ్ర నిరసన తెలిపారు. అనకాపల్లి పార్లమెంటు తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా కష్టపడి నియోజక వర్గంలో కార్యకర్తలను నిరంతరం ఉత్తేజపరిచి పార్టీని నిలబెట్టుకుంటూ పటిష్టవంతం చేసిన పీలా వంటి వ్యక్తికి సీటు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. పార్టీ శ్రేణులకు తెలియకుండా జనసేనకు టికెట్ కేటాయించడం శోచనీయమన్నారు. అధిష్టానం పునరాలోచించాలని కోరారు. పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు కేటాయిస్తే పనిచేస్తామన్నారు. అయితే ఎమ్మెల్యే సీటు మాత్రం పీలాకు ఇవ్వాలన్నారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పెంటకోట రాము, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు వేగి గోపీకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ సిదిరెడ్డి శ్రీనివాసరావు, కొత్తపల్లి మాజీ సర్పంచ్ బుదిరెడ్డి గంగయ్య పాల్గొన్నారు. గెలవలేని పార్టీతో మనకెందుకు పొత్తు ? గెలవలేని జనసేన పార్టీతో టీడీపీకి పొత్తు ఎందుకని, అన్ని స్థానాలకు టీడీపీ అభ్యర్థులను నిలబెట్టాలని టీడీపీ సీనియర్ నాయకుడు బొద్దపు ప్రసాద్ డిమాండ్ చేశారు. అనకాపల్లి గవరపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్తు కారణంగా టీడీపీ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని, అధిష్టానం పునరాలోచించాలని కోరారు. ఇలాంటి నిర్ణయాల వల్ల వైఎస్సార్సీపీకి విజయావకాశాలు పెరుగుతాయన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని, చంద్రబాబు, లోకేష్‌లు అనకాపల్లి వచ్చినప్పుడు పార్టీ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఇటీవల మునగపాక మండలం నాగులాపల్లిలో జరిగిన శంఖారావం సభలో అనకాపల్లి టికెట్ పీలాకే ఇస్తామని లోకేష్ పార్టీ శ్రేణులకు చెప్పిన విషయం గుర్తు చేశారు. తొలి నుంచి జనసేన నిర్మాణంలో పాల్గొన్న పరుచూరి భాస్కరరావుకు కాకుండా ఇటీవల పార్టీలో చేరిన కొణతాలకు టికెట్ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. పార్టీ నేతలు మళ్ల సురేంద్ర, కాయల ప్రసన్నలక్ష్మి, అధికసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
పైకి పొత్తులు కడుపులో కత్తులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికల్లో వైరి పార్టీలు పోటీ పడడం, ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవడం సహజం. కానీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పొత్తులు పెట్టుకున్న పార్టీలు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నాయి. టీడీపీ–జనసేన పరిస్థితి అలాగే ఉంది. అధికారం కోసం జత కట్టిన ఈ పార్టీ లు సీట్ల పంపకాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపేందుకు తెగ ప్రయతిస్తున్నాయి. జనసేన జిల్లాలో మూడు నియోజకవర్గాలపై కన్నేసింది. టీడీపీకి అది మింగుడు పడడం లేదు. పొత్తులో భాగంగా జిల్లాలోని ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాలను జనసేన అడుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో జనసేన వేలు పెట్టింది. ఈ నియోజకవర్గాల్లో తమకు పట్టు ఉందని, పొత్తులో భాగంగా వాటిని తమకు కేటాయించాలని కోరింది. క్షేత్రస్థాయిలో ఎవరికెంత పట్టు ఉందో జనాలకు తెలిసినప్పటికీ టీడీపీకి తమ మద్దతు కావాలంటే వీటిని తమకు ఇవ్వాల్సిందే అన్న ధోరణిలో జనసేన వెళ్తోంది. మండపేట, అరకు నియోజకవర్గాలకు టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించిన దగ్గరి నుంచి జనసేన వైఖరి మారింది. పొత్తు లేకపోతే టీడీపీ బలహీనమని, పొత్తులో ఉంటే కనీస సీట్లు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయంతో జనసేన గత కొన్ని రోజులుగా స్వరం పెంచింది. అడిగినవి ఇవ్వకపోతే టీడీపీకే నష్టమన్న ధోరణిలో మొండిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాలను డిమాండ్ చేస్తోంది. ఎచ్చెర్ల – పాతపట్నంలలో ఇలా.. ఎచ్చెర్లలో టీడీపీ విభేదాలు అందరికీ తెలిసిందే. ఒకవైపు కళా వెంకటరావు, మరోవైపు కలిశెట్టి అప్పలనాయుడు నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుని సీటు కోసం పైరవీలు చేస్తున్నారు. వీరిలో ఎవరికిచ్చినా మిగతా వారు సహకరించే పరిస్థితి లేదు. అవసరమైతే టిక్కెట్ దక్కని వారు ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితి అక్కడుంది. దీన్ని బూచిగా చూపించి జనసేన ఆ సీటును తమకివ్వాలని అడుగుతోంది. నియోజకవర్గంలో తమకు పట్టు ఉందని పట్టుబడుతోంది. పాతపట్నం నియోజకవర్గంలో అదే పరిస్థితి ఉంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మరో నాయకుడు మామిడి గోవిందరావు నియోజకవర్గంలో నువ్వానేనా..అనే రీతిలో ఉంటున్నారు. వీరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నాయో నియోజక వర్గ ప్రజలందరికీ తెలిసిందే. వీరిలో ఒకరికి టిక్కెట్ ఇచ్చినా మరొకరు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. టిక్కెట్ దక్కని నాయకుడు తిరుగుబావుటా ఎగురవేయనున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీన్ని అడ్వాంటేజ్‌గా జనసేన తీసుకుంటోంది. టీడీపీలో ఎవరికిచ్చినా ఓడిపోతారని, ఆ సీటు తమకిస్తే తప్పకుండా గెలుస్తామని జనసేన కోరుతోంది. పలాసలో ఇలా.. పలాసలో ప్రస్తుత టీడీపీ ప్రధాన ఆశావహులు గౌతు శిరీషపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అటు ప్రజల్లోనే కాదు పార్టీ కేడర్‌లోనూ అసంతృప్తి ఉంది. ఆమె అయితే కష్టమనే అభిప్రాయానికి దాదాపు పార్టీ శ్రేణులు వచ్చేశాయి. ఆమె తీరు వారికి నచ్చడం లేదు. ఆమెకు పోటీగా ఇద్దరు ముగ్గురు నాయకులు టిక్కెట్ ఆశిస్తున్నారు. శ్రీకాకుళానికి చెందిన ఓ వైద్యుడు టీడీపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లారు. ఒక పర్యాయం చర్చలు కూడా జరిగాయి. ఇలా ఎవరికి వారు లోపాయికారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఎన్నికల్లో కష్టమేనన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. దీంతో జనసేన కన్నేసింది. టీడీపీ నాయకులపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఆ సీటు తమకివ్వాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ద్విముఖ వ్యూహంలో జనసేన.. టీడీపీ గ్రూపులు, నాయకుల మధ్య విభేదాలను క్యాష్ చేసుకోవాలని జనసేన చూస్తోంది. అందులో భాగంగానే ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాలను అడుగుతోంది. అలాగని, ఆ సీట్లు వారికిస్తే ఇప్పుడున్న జనసేన నాయకులను పోటీలో దింపుతుందా అంటే డౌటే. పొత్తులో ఒప్పందం కుదిరితే ఆ సీట్లలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్లనో తటస్థులనో రంగంలోకి దించాలని చూస్తోంది. ఆ మేరకు ఇప్పటికే సంప్రదింపులు చేస్తోంది. ఆ మూడు సీట్లు వస్తాయనుకుంటే టీడీపీలో తమకు అనుకూలంగా ఉన్న ఒకరిని తమ పారీ్టలోకి తీసుకుని వారి చేత పోటీ చేయించాలన్నది ఒక ఆప్షనైతే, వైద్యులు, వ్యాపారులు, రిటైర్డు ఉద్యోగులను బరిలోకి దించాలన్నది మరో ఆప్షన్. పలాసలో పోటీ చేయించడానికి శ్రీకాకుళానికి చెందిన ఓ వైద్యుడితో సంప్రదింపులు చేస్తోంది. పాతపట్నంలో బరిలో దించడానికి మరో వ్యాపారితో మంతనాలు జరుపుతోంది. ఎచ్చెర్లలో కూడా అదే తరహాలో ఇప్పుడున్న నాయకులను కాకుండా కొత్త వారి కోసం అన్వేషణ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న జనసేన నాయకులకు అంత సీన్ లేదన్న అభిప్రాయంతో రెండు ఆప్షన్లు పెట్టుకుని ముందుకెళ్తోంది. జనసేన అనుకున్నట్టు జరిగితే ఎన్నాళ్లగానో టీడీపీ కోసం పనిచేస్తున్న నాయకుల ఆశలపై నీళ్లు జల్లినట్టే. -
టీడీపీలో నా పరిస్థితే ప్రశ్నార్థకంగా మారింది... ఇంక మీకేం చేయగలను?
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ – జనసేన పార్టీలకు సంబంధించినంత వరకూ రాజమహేంద్రవరం రూరల్ రాజకీయం రంజుగా మారుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న పీటముడి ఇంకా వీడటం లేదు. ఇక్కడి నుంచి తాను పోటీ చేస్తానని జనసేన నుంచి ఆ పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్.. కాదు కాదు.. ఈ సీటు తనదేనంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే ప్రకటించుకున్నారు. ఈ పరిస్థితుల్లో రూరల్ సీటు కేటాయింపుపై రెండు పార్టీల శ్రేణుల్లోనూ సస్పెన్స్ ఏర్పడింది. ముందుగా ప్రకటించుకున్నట్టు దుర్గేష్ పోటీ చేస్తారా.. లేక గోరంట్లకు వదిలేస్తారా అనే విషయం ఎటూ తేలడం లేదు. ఇటీవల మండపేటలో పోటీ చేస్తామని చంద్రబాబు ప్రకటించిన వెంటనే.. రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో పోటీపై పవన్ కల్యాణ్ కూడా హడావుడిగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, రాజమహేంద్రవరం రూరల్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు స్పష్టత ఇవ్వడం లేదు. పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదు. దీంతో రెండు పార్టీల్లోనూ గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓసారి సై.. మరోసారి నైనై.. ఇదిలా ఉండగా జనసేన నేత దుర్గేష్ ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాసేపు పోటీ చేస్తానని, మరికాసేపు పోటీ చేయనని ఆయన సంకేతాలిస్తున్నారు. జనసేన – టీడీపీ పొత్తులో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ స్థానం నుంచి దుర్గేష్ బరిలోకి దిగడం ఖాయమని తొలుత సంకేతాలు వెలువడ్డాయి. ఆయన సైతం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి తానే అభ్యర్థినని ప్రకటించుకుని, ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. అంతలోనే ఆయన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత సమస్యల కారణంగా రానున్న ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారని చెబుతున్నారు. దీంతో రూరల్ రాజకీయం తాజాగా మరో మలుపు తిరిగింది. వాస్తవానికి రూరల్ సీటు మరోసారి ఆశిస్తున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల, దుర్గేష్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈ ఇద్దరు నేతలూ రహస్యంగా కలిసి చర్చించుకుని, ఓ నిర్ణయానికి వచ్చారని, అప్పటి నుంచే ఎన్నికల్లో పోటీకి దుర్గేష్ సుముఖంగా లేరన్న వాదన వినిపిస్తోంది. ఇదే అదునుగా బుచ్చయ్య చౌదరి తన ఎమ్మెల్యే స్థానం తనకే పదిలమని, రూరల్ సీటును తన నుంచి దూరం చేసే దమ్ము ఎవరికై నా ఉందా? అంటూ ఆవేశంతో ప్రకటనలు కూడా చేశారు. తాను ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొంది, మంత్రి కావడం ఖాయమనే లెక్కలు వేసుకునేంత వరకూ వెళ్లారాయన. నేతల ఒత్తిడితో మళ్లీ సై పోటీకి దుర్గేష్ దూరమవుతున్న సంగతి తెలుసుకు న్న రూరల్ నియోజకవర్గ జనసేన నేతలు ఆయనపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సువర్ణ అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారని వాదనకు దిగారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలన్న మీ కలను మీ రే నాశనం చేసుకుంటారా?’ అని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకులు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా దుర్గే ష్ ససేమిరా అని భీష్మించారు. ‘మీరు చేయకపోతే మరో నేతను రంగంలోకి దింపుతాం. అంతే కానీ సీటు మాత్రం త్యాగం చేసుకునే పరిస్థితి తీసుకురాం’ అని స్పష్టం చేశారు. స్వపక్ష నేతల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయిన దుర్గేష్ ఆత్మరక్షణలో పడ్డారు. పార్టీ శ్రేణులను విస్మరిస్తే రాజకీయ భవిష్యత్తు సమాధి అయ్యే ప్రమాదం ఉండటంతో దిక్కు తోచని పరిస్థితిలో చేసేది లేక పోటీకి సై అన్నారు. సిటీపై గోరంట్ల కన్ను దుర్గేష్ తాజా నిర్ణయంతో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్టయ్యింది. ఈ పరిస్థితుల్లో ఆయన ప్రత్యమ్నాయ ఆలోచనలో పడ్డారు. రూరల్ చేజారిన పక్షంలో తనకు అనువైన రాజమహేంద్రవరం సిటీలోనైనా పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు అవసరమైన వ్యూహరచన చేస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు వద్ద తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమవుతున్నారు. ఆదిరెడ్డి వర్గంలో అలజడి ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు.. రూరల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తమ ఆశలకు ఎసరు పెడుతుందేమోనని మరోసారి రాజమహేంద్రవరం సిటీ సీటు ఆశిస్తున్న ఆదిరెడ్డి అప్పారావు వర్గం ఆందోళన చెందుతోంది. తన కుమారుడు వాసును ఎమ్మెల్యేగా చూడాలన్నది ఆదిరెడ్డి అప్పారావు కల. దీనికోసమే ఆయన తన కోడలు, ప్రస్తుత ఎమ్మెల్యే భవానీని ప్రజలకు దూరం పెట్టారు. ఆమె బదులు ఆమె భర్త, తన తనయుడు వాసు ప్రజల్లో ఉండేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కలను గోరంట్ల నాశనం చేస్తారేమోనని అప్పారావు అంతర్మధనం చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ స్థానంపై ఏదో ఒకటి తేల్చుకునేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు వద్ద పంచాయతీ పెట్టారు. ‘టీడీపీలో నా పరిస్థితే ప్రశ్నార్థకంగా మారింది. ఇంక మీకేం చేయగలను? మీ స్థాయిలో మీరు చూసు కోండి’ అంటూ అచ్చెన్నాయడు చేతులెత్తేయడంతో ఆదిరెడ్డి వర్గం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ప్రస్తుతం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టయి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి ఆదిరెడ్డి కుటుంబం వెన్నంటి నిలిచింది. లోకేష్‌తో ఆదిరెడ్డి వాసు సన్నిహిత సంబంధాలు నెరిపి, ఆయన దృష్టిలో పడ్డారు. ఆ నేపథ్యంలో ఇక తనకు ఎవరూ అడ్డురానన్న ధైర్యంతో సిటీలో పర్యటనలు మొదలు పెట్టారు. ఇటువంటి సమయంలో బుచ్చయ్య ప్రయత్నాలు ఆదిరెడ్డి కుటుంబంలో అలజడి రేపుతున్నాయి. ఈ పరిణామం ఎటువైపు దారితీస్తోందనని, చివరకి తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని ఆదిరెడ్డి వర్గం ఆందోళన చెందుతోంది. రాజమహేంద్రవరం రూరల్, సిటీ నియోజకవర్గాల్లో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితులపై కాతేరులో సోమవారం నిర్వహించిన రా.. కదలిరా సభలో సైతం చంద్రబాబు ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఆయన ఉదాశీన వైఖరితో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరింతగా భగ్గుమంటున్నాయి. -
జనసేనపై టీడీపీ సెటైర్లు
సాక్షి, తిరుపతి : ఆ సామాజిక వర్గం నేతలకు టికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీలోని కమ్మ, కాపు, యాదవ సామాజిక వర్గం వారు విడిపోయి కుమ్ములాడుకుంటున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తే ఊరుకునేది లేదని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తిరుపతి, వెంకటగిరి అసెంబ్లీ టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీలో కులాల కుమ్ములాట తారాస్థాయికి చేరింది. తిరుపతి జిల్లాలో కీలకమైన తిరుపతి, వెంకటగిరి టికెట్ల విషయంలో ఇటు టీడీపీలోని కమ్మ, అటు జనసేన నుంచి కాపు సామాజిక వర్గం మధ్య విభేదాలు అధినేతలకు తలనొప్పిగా మారాయి. తిరుపతి అసెంబ్లీ టికెట్ జనసేన కోరుకుంటున్న విషయం తెలిసిందే. చిరంజీవి గతంలో తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. పొత్తులో భాగంగా జనసేన ఇదే స్థానాన్ని అడుగుతోంది. టీడీపీ అధినేత కూడా తిరుపతి టికెట్ జనసేనకే కేటాయిస్తానని పవన్‌కు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాబు హామీ ఇవ్వడంతో పసుపులేటి హరిప్రసాద్, కిరణ్‌రాయల్ ఎవరికి వారు తనకే టికెట్ అని ధీమాగా ఉన్నారు. మరో వైపు చంద్రబాబు తిరుపతి లాంటి కీలకమైన టికెట్ జనసేనకు కేటాయించడం ఇష్టం లేక మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఇప్పించేందుకు పథకం రచించారు. సుగుణమ్మకు జనసేన కండువా కప్పించి తన మనిషి అయిన ఆమెనే అభ్యర్థిగా ప్రకటించాలని బాబు ప్లాన్. ఈ పరిస్థితుల్లో తిరుపతి జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గం నేతలు జనసేనకు షాక్ ఇచ్చారు. జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు బాగానే ఉన్నాయని, ఈ సారైనా తిరుపతి అసెంబ్లీ టికెట్ తమ వారికే కేటాయించాలని చంద్రబాబుని కలిసి డిమాండ్ చేసినట్లు సమాచారం. వెంకటగిరి సభ అయ్యాక కమ్మ సామాజిక వర్గం నేతలంతా కలిసి పరిస్థితిని బాబుకు వివరించినట్లు తెలిసింది.తిరుపతిలో జనసేనకు కేడర్ లేదని, కేవలం నలుగురైదుగురు మాత్రమే ఉన్నారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఏ రోజూ కమ్మ సామాజిక వర్గం వారికి విలువ ఇచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఆమెకే టికెట్ ఇస్తే తమని మతించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఆమెకు ఇస్తే ఎట్టిపరిస్థితుల్లో తామెవ్వరూ పనిచేయమని కమ్మ సామాజిక వర్గం నేతలు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఎలాగైనా ఈ సారి తిరుపతి టికెట్ కమ్మ వారికే ఇవ్వాలని ఆ సామాజిక వర్గం నేతలంతా డిమాండ్ చేసినట్లు తెలిసింది. మరో వైపు యాదవ సామాజిక వర్గం నేతలు తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్‌ను తిరుపతి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నరసింహయాదవ్ మొదటి నుంచి టీడీపీ జెండా మోస్తున్న వ్యక్తి అని గుర్తు చేసినట్లు సమాచారం. వెంకటగిరి కోటలో రచ్చ తిరుపతి జిల్లా వెంకటగిరిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చంద్రబాబు సమక్షంలోనే ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డిని అవమానించిన విషయం తెలిసిందే. వెంకటగిరిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణకే టికెట్ కేటాయించాలనే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అయిన ఆనం రాంనారాయణరెడ్డిని ప్రసంగించకుండా మాజీ ఎమ్మెల్యే అనుచరులు కేకలు వేస్తూ శుక్రవారం నాటి సభలో అడుగడుగునా అడ్డుపడిన విషయం తెలిసిందే. మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన మస్తాన్ యాదవ్ వెంకటగిరి టికెట్ ఆశిస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు సభకు మస్తాన్ యాదవ్ భారీ ఏర్పాట్లు చేశారు. తమ సామాజిక వర్గం వారందరినీ వాహనాల్లో తరలించి బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. శ్రీఏడుకొండల స్వామి పాదపద్మాల కింద ఉన్న తిరుపతి జిల్లాలో యాదవ సామాజిక వర్గం ఓట్లు అధికంగానే ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా తిరుమలలో సన్నిధి గొల్లకు ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి లేదా వెంకటగిరిలో ఏదో ఒక స్థానాన్ని యాదవ సామాజిక వర్గం వారికి కేటాయించాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. లేకపోతే ఎన్నికల్లో పనిచేయలేమని తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. -
బాబు సభకు ముందే.. ఆళ్లగడ్డలో భగ్గుమన్న టీడీపీ, జనసేన విభేదాలు
సాక్షి, నంద్యాల: అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని చూస్తున్న టీడీపీ- జనసేన.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్‌పై పెదవి విరుస్తున్నారు. ఇటు బాబుకు సైతం వర్గపోరు, పొత్తుల పొట్లాటతో మళ్లీ పాత కథే పునరావృతమవుతందనే బెంగ పట్టుకుంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఎడమొహం, పెడమొహం పెడుతున్నారు. తాజాగా బాబు చేపట్టిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభ సాక్షిగా టీడీపీ, జనసేన వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంగళవారం ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు ముందే టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు సభకు రాకూడదని ఏవీ సుబ్బారెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి వస్తే తాను సైలెంట్‌గా ఉన్నా తన అనుచరులు ఊరుకోరని చెప్పిందట అఖిల ప్రియా.. దీంతో రేపటి చంద్రబాబు సభకు వెళ్లకూడదని ఏవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు బాబు సభకు జనసేన నేతలు కూడా వేదికపైకి రాకూడదని అఖిల ఆంక్షలు విధించారని ప్రచారం జరుగుతోంది. ‘మీ సభ మీ ఇష్టం, మేం ఎందుకు వస్తాం’ అని జనసేన నేతలు చెప్పేశారట. దీంతో ఆళ్లగడ్డలో చంద్రబాబు సభకు జనసేన సైడ్ అయిపోయింది. ఈ మేరకు ఆళ్లగడ్డ జనసేన ప్రకటన విడుదల చేసింది. ‘టీడీపీ సభకు జనసేన పార్టీకి ఆహ్వానం లేదు. రేపు జనసైనికులు, నేతలు టీడీపీ సభకు వెళ్లొద్దు’అని ఆదేశించింది. -
వివాదాల విష్ణుకుమార్ రాజు.. మాటలు ఎప్పుడు కోటలు దాటాల్సిందేనా?
సాక్షి, విశాఖపట్నం: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్‌రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పారీ్టలోనూ, అటు ఇతర పారీ్టల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అంతేకాదు సాక్షాత్తూ సొంత పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ఆ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లు సరి చేసుకుంటుందని భావిస్తున్నాను అనడం, ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేమని ప్రధాని మోదీ చెప్పినట్లు పేర్కొనడం వంటివి అధిష్టానం సీరియస్ అవడానికి కారణమయ్యాయి. దీంతో ఆయనకు రాష్ట్ర పార్టీ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయింది. ఎందుకు మీపై చర్యలు తీసుకోరాదో చెప్పాలంటూ ఆ నోటీసులో పేర్కొంది. ఇది పారీ్టలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఆ కుతూహలం వల్లే..? : ఇప్పటికే విష్ణుకుమార్‌రాజు టీడీపీకి అనుకూలంగా ఉన్నారన్న ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. టీడీపీకి చేరువ కావడం ద్వారా ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలన్న కుతూహలం ఆయనకు ఎప్పట్నుంచో ఉందని బీజేపీలోనే పలువురు చర్చించుకుంటున్నారు. అదే ఉద్దేశంతో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం కూడా పార్టీ అధిష్టానం దృష్టిలో ఉందని చెబుతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ వ్యతిరేకమన్న విషయం తెలిసి కూడా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుని వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విష్ణుకుమార్‌రాజు అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా అధిష్టానానికి రుచించలేదని అంటున్నారు. షోకాజ్ నోటీసు జారీ : ఒకపక్క పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడుతుండడం, టీడీపీ అధినేత చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడం, మరోపక్క తాజాగా టీవీ ఇంటర్వ్యూలో పార్టీని ఇరకాటంలో పెట్టేలా వ్యాఖ్యలు చేయడం వెరసి అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీస్‌పై విష్ణుకుమార్‌రాజు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. టీవీ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పటి పరిస్థితులకనుగుణంగా చేసినవి కావని, 2019 ఎన్నికలకు ముందు మోదీ చేసినవని అందులో పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని ఇతర పార్టీల నాయకులకంటే సొంత బీజేపీ నాయకులే ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. పార్టీ నేతల్లోనూ అసంతృప్తే.. విష్ణుకుమార్‌రాజు వైఖరిపై బీజేపీలోని కొంతమంది ముఖ్య నాయకులు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై లోలోన సంతోస్తున్నారు. గతంలో పార్టీని బ్లాక్మెయిల్ చేసే ధోరణిలో తనకు టీడీపీ, మరికొన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని, ఏ పార్టీలోకి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నానంటూ ప్రకటనలు చేశారని గుర్తు చేస్తున్నారు. పార్టీలో కీలక పదవిలో ఉంటూ ఇలా తరచూ బహిరంగంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విష్ణుకుమార్‌రాజుపై తాజా టీవీ ఛానల్ ఇంటర్వ్యూ వ్యాఖ్యల నేపథ్యంలోనైనా చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు. విష్ణుకుమార్‌రాజుపై చర్యలుంటాయా? షోకాజ్తోనే సరిపెడతారా? అన్నది వేచి చూడాలి. -
జనసేన నేతల ఎంపికకు దరఖాస్తులకు ఆహ్వానం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన తెలంగాణ జిల్లాల్లో ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల స్వీకరించనున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు, కడప, కర్నూలు, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులు పంపాలని పేర్కొన్నారు.