Java Sea
-
కూలిన విమానం?
జకార్తా: ఇండోనేసియాకు చెందిన ప్రయాణికుల జెట్ విమానం ఒకటి ఆచూకీ తెలియకుండా పోయింది. శ్రీవిజయ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంతన్ ప్రావిన్సు రాజధాని పొంటియానక్కు బయలుదేరింది. విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నారు. వీరంతా ఇండోనేసియన్లే. జకార్తా– పొంటియానక్ ప్రయాణ సమయం సుమారు గంటన్నర కాగా విమానం షెడ్యూల్ సమయానికి గంట ఆలస్యంగా బయలుదేరింది. 2.40 గంటల సమయంలో కంట్రోల్ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని ఇండోనేసియా రవాణా శాఖ మంత్రి బుది కార్య సుమది తెలిపారు. అంతకుముందే విమానాన్ని 29 వేల అడుగుల ఎత్తుకు తీసుకువస్తానంటూ పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడని తెలిపారు. గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే విమానం 11 వేల అడుగుల ఎత్తులో ఉండగా కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయాయన్నారు. దీంతో ఈ విమానం జావా సముద్రంలో కూలిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ శకలాలు దానివేనా? ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్న జకార్తాకు ఉత్తరంగా ఉన్న లంకాంగ్, లాకి ద్వీపాల మధ్య గాలింపు కోసం నాలుగు యుద్ధ నౌకలు సహా 12 ఓడలను ఆ ప్రాంతానికి పంపినట్లు మంత్రి సుమది తెలిపారు. ఆ విమానానివే అని అనుమానిస్తున్న కొన్ని శకలాలు, దుస్తులు జకార్తాకు ఉత్తరంగా ఉన్న థౌజండ్ ఐలాండ్స్ వద్ద మత్స్యకారులకు లభించగా వాటిని స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం పంపినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘మత్స్యకారులకు కొన్ని కేబుళ్లు, లోహపు ముక్కలు లభించాయి. సమీపంలో భీకర శబ్ధం, మిరుమిట్లు గొలిపే మెరుపు కనిపించిన కొద్దిసేపటికే వారున్న ప్రాంతంలో నీళ్లలో పడిపోయాయి. అదే ప్రదేశంలో నీటిపై విమాన ఇంధనం జాడలు మత్స్యకారులకు కనిపించాయి’ అని స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదం వల్లే కూలిందా అనేది నిర్ధారణ చేసుకునేందుకు ఉపయోగపడే అత్యవసర లొకేటర్ ట్రాన్స్‌మీటర్(ఈఎల్టీ) ఎందుకు పనిచేయలేదనే విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. జకార్తా, పొంటియానక్ విమానాశ్రయాల్లో ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్న బంధువులు, కుటుంబసభ్యులు, మిత్రులు దైవ ప్రార్థనలు చేస్తున్నట్లు, రోదిస్తున్నట్లు ఉన్న దృశ్యాలను స్థానిక టీవీలు ప్రసారం చేస్తున్నాయి. అతిపెద్ద ద్వీపసమూహ దేశమైన ఇండోనేసియాలో తరచూ రోడ్డు, నౌక, విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. -
కో పైలట్ వల్లనే ప్రమాదమా!
ఇండోనేషియాలోని జావా సముద్రంలో గత నెల కూలిపోయిన ఎయిర్ ఆసియా విమాన ప్రమాదం కారణాలపై చిక్కుముడి ఇప్పుడిప్పుడే వీడిపోతోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానాన్ని కెప్టెన్ పైలట్ కాకుండా అంతగా అనుభవంలేని కో పైలట్ నడుపుతున్నాడని తేలిందని ఇండోనేషియా జాతీయ రవాణా భద్రతా కమిటీ తన ప్రాథమిక దర్యాప్తు నివేదికలో వెల్లడించింది. గత డిసెంబర్ 28వ తేదీన జరిగిన ఈ విమాన ప్రమాదంలో 162 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే. వారిలో ఇప్పటివరకు 70 మంది మృతదేహాలు మాత్రమే దొరికాయి. ఎయిర్ ఆసియాకు చెందిన క్యూజెడ్8501 విమానం ప్రమాదం జరిగిన సమయంలో గగనతలంలో 32 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోందని, అది హఠాత్తుగా 37, 400 అడుగుల ఎత్తుకు దూసుకెళ్లడమే కాకుండా అంతే వేగంతో హఠాత్తుగా 24 వేల అడుగుల దిగువకు పడిపోయిందని కమిటీలో దర్యాప్తు అధికారిగా ఉన్న సీనియర్ పైలెట్ ఎర్తాట లానంగ్ గురువారం నాడు ఇక్కడ వెల్లడించారు. 32 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని 38 వేల అడుగులకు తీసుకెళ్లడానికి విమానం పైలట్, గ్రౌండ్ కంట్రోల్ అనుమతి కోరారని, అయితే 34 వేల అడుగుల ఎత్తుకు తీసుకె ళ్లడానికి మాత్రమే గ్రౌండ్ కంట్రోల్ అనుమతించిదని ఆయన చెప్పారు. దీన్ని లెక్క చేయకుండా విమానాన్ని 37, 400 అడుగులకు తీసుకెళ్లారని, అది పైకి దూసుకుపోతున్నప్పుడు ఏటవాలుగా ఎడమ వైపుకు ఒరిగి పోవడమే కాకుండా వణుకుతున్నట్టు రేడార్లో కనిపించిందని ఆయన వివరించారు. విమానం 24 వేల అడుగులకు హఠాత్తుగా పడిపోయిన తర్వాత రేడార్ స్క్రీన్ నుంచి అద్యశ్యమైందని, ఆ తర్వాత సముద్రంలో కూలిపోయిందని ఆయన తెలిపారు. అసలు ఉరుములు, మెరుపులు ఎక్కువగా వున్న ప్రాంతంలోకి విమానం ఎందుకు దూసుకెళ్లిందో తమకు అంతుచిక్కడం లేదని, ఈ అంశంపై ఇంకా లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని దర్యాప్తు కమిటీలోని ఇతర సభ్యులు తెలిపారు. -
సముద్రంలో 92 మృతదేహలు... గాలింపు నిలిపివేత
జకార్తా: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమాన శకలాలు, మృతదేహల అన్వేషణను నిలివేస్తున్నట్లు ఇండొనేసియా మిలటరీ ఉన్నతాధికారులు ప్రకటించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు.... మృతదేహల కోసం అలుపెరగకుండా అన్వేషణ చేయడంతో విమానం అన్వేషణ బృందంలోని సభ్యులు తీవ్ర అనార్యోగానికి గురైయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిలటరీ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇప్పటి వరకు జావా సముద్రం నుంచి 70 మృతదేహలను వెలికితీయగా... మరో 92 మృతదేహలు బయటకు తీయవలసి ఉందని చెప్పారు. అలాగే ఎయిర్ ఏషియా విమానానికి చెందిన బ్లాక్ బాక్స్‌తోపాటు పలు శకలాలను అన్వేషణ బృందాలు వెలికి తీసిన సంగతిని మిలటరీ ఉన్నతాధికారి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతేడాది డిసెంబర్ 28వ తేదీన విమాన ప్రయాణికులు, సిబ్బందితో సహా162 మందితో ఎయిర్ ఏషియా విమానం ఇండోనేసియాలోని రెండో అతిపెద్ద నగరం సురబయ నుంచి సింగపూర్ బయలుదేరింది. ఆ క్రమంలో కొద్ది సేపటికే విమానం ఇండోనేసియా విమానాశ్రయ అధికారులతో సంబంధాలు తెగిపోయాయి. దాంతో విమాన ఆచూకీ కోసం ఇండోసియా ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అన్వేషణ ప్రారంభించారు. దాంతో ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కుప్పకూలి 162 మంది ప్రయాణికులు జల సమాధి అయినట్లు గుర్తించారు. నాటి నుంచి విమాన శకలాలు, మృతదేహల కోసం అన్వేషణ సాగుతున్న విషయం తెలిసిందే. -
ఎయిర్ ఏసియా బ్లాక్ బాక్స్ స్వాధీనం
జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విచారణ నిమిత్తం పంపినట్లు సార్ (ఎస్ఏఆర్) ఆపరేషన్స్ డైరెక్టర్ సుప్రియాది తెలిపారు. జాతీయ రవాణా భద్రతా కమిటీ చీఫ్ ద్వారా సమాచారం అందిందని, బ్లాక్ బాక్స్ తన చుట్టూ 20 మీటర్ల పరిధిలో జరిగిన విషయాలను రికార్డు చేస్తుందని ఆయన చెప్పారు. బ్లాకు బాక్సులో డాటా రికార్డర్, వాయిస్ రికార్డర్ అనే రెండు విభాగాలు ఉంటాయి. బాక్సుల బ్యాటరీల్లో 30 రోజుల వరకు సమాచారం నిల్వ ఉంటుంది. విమానం తోక భాగంలో ఉండే బ్లాక్ బాక్స్ లో పైలట్ల సంభాషణలు, ఇతర సమాచారం రికార్డు అవుతాయి. కనుక ప్రమాద వివరాలు త్వరలోనే వెలుగు చూస్తాయని అధికారులు భావిస్తున్నారు. విమానంలో ఉన్న మొత్తం 162 మంది ప్రయాణికుల్లో ఇంతవరకు 48 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాల ఆచూకీ కనుగొనేందుకు ఇండొనేషియా రవాణా మంత్రి ఇగ్నేసియస్ జోనన్ నిధులను కేటాయించారు. -
బ్లాక్ బాక్స్ కనిపించింది
-
బ్లాక్ బాక్స్ కనిపించింది
జకార్తా/సింగపూర్: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఆసియా విమానం బ్లాక్ బాక్స్‌ను ఎట్టకేలకు గుర్తించారు. సముద్రంలో 30 నుంచి 32 మీటర్ల దిగువన విమాన శకలాల మధ్య ఉన్న దీన్ని ఆదివారం డైవర్లు కనుగొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి వీలు కల్పించే ఈ కీలక పరికరాన్ని సోమవారం వెలికి తీయనున్నారు. ఇండోనేసియా నేవీ నౌకకు చెందిన డైవర్లు దీన్ని గుర్తించారని సముద్ర రవాణా డెరైక్టరేట్ జనరల్ సమన్వయకర్త టోనీ బుదియోనో తెలిపారు. శకలాల మధ్య చిక్కుకున్న బ్లాక్ బాక్స్‌ను ప్రతికూల వాతావరణం వల్ల వెలికితీయలేకపోయారని, సోమవారం శకలాలను పక్కకు తొలగించి దాన్ని బయటకు తీస్తారని తెలిపారు. శక్తిమంతమైన సంకేతాలు(పింగ్స్) వచ్చిన అనంతరం బ్లాక్ బాక్స్‌ను గుర్తించారు. విమానం తోకభాగాన్ని వెలికి తీసిన ప్రాంతంలో విమానం మధ్య భాగంగా భావిస్తున్న పెద్ద శకలాన్ని కూడా గుర్తించారు. విమానం తోక భాగంలో ఉండే బ్లాక్ బాక్స్‌లో పైలట్ల సంభాషణలు, ఇతర సమాచారం రికార్డు అవుతాయి కనుక ప్రమాద వివరాలు త్వరలోనే వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. ఎయిర్ ఆసియాకు చెందిన ఎయిర్‌బస్ క్యూజెడ్ 8501 విమానం గత నెల 28న 162 మందితో ఇండోనేసియాలోని సురబయ నుంచి సింగపూర్ వెళ్తూ కూలిపోవడం, ఇంతవరకు 48 మృతదేహాలను వెలికి తీయడం తెలిసిందే. -
ఎయిర్ ఏషియా 'తోక' కోసం ముమ్మర గాలింపు
జకార్తా: జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం తోక భాగాన్ని వెలికితీయడానికి ఇండోనేషియా అన్వేషణ, రక్షణ విభాగం సిద్ధమైంది. ఇండోనేషియా ప్రభుత్వం ప్రస్తుతం ఆ పనుల్లో నిమగ్నమైంది. ఇందులో భాగంగా 15 మంది గజ ఈతగాళ్లను సముద్రంలోకి పంపింది. డిసెంబరు 28న 162 మందితో వెళ్తున్న ఈ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా అదృశ్యమై, సముద్రంలో పడిపోయిన సంగతి తెలిసిందే. తేలియాడే బెలూన్లు, క్రేన్ల సాయంతో తోక భాగాన్ని వెలికితీస్తామని అధికారులు తెలిపారు. జావా సముద్రంలో కూలిన ఎయిర్ ఏషియా క్యుజడ్ 8501 విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు వస్తున్నట్లు ఇండోనేసియా ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్న బృందాలు తమ చర్యలను ముమ్మరం చేయగా వెలుతురు లేని కారణంగా పనిని మధ్యలోనే ఆపేశారు. ఇప్పటిదాకా సముద్రం నుంచి 46 మృతదేహాలను వెలికితీశారు. -
ఎయిర్ ఆసియా విమానం తోక లభ్యం
జకార్తా/సింగపూర్: ప్రమాదానికి గురైన ఎయిర్ ఆసియా విమానం వెనుకభాగం(తోక) జావా సముద్రంలో గుర్తించామని ఇండోనేషియా రక్షక, దర్యాప్తు బృందాల అధికారి భంబంగ్ శోలిస్త్యో తెలిపారు. బ్లాక్ బాక్స్‌ను కూడా త్వరలో కనుగొనగలమన్నఆశాభావంవ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు వివరించే బ్లాక్‌బాక్స్ సాధారణంగా విమానం వెనుక భాగంగా అమరుస్తారు. 11 రోజులుగా జావా సముద్రంలో శకలాలు, మృతదేహాల కోసం అన్వేషిస్తున్నారు. గజ ఈతగాళ్లని అక్కడికే మళ్లీపంపించి ఇతర భాగాల కోసం అన్వేషిస్తామనిచెప్పారు. రెండు కొత్త బలగాల్ని ప్రవేశపెట్టి అన్వేషణ పరిధిని విస్తృతం చేశామని మలేసియా నేవి అధికారి అబ్ధుల్ అజీజ్ జాఫర్ చెప్పారు. 162 మందితో డిసెంబర్ 28న ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళుతున్నక్యూజడ్ 8501 విమానం జావా సముద్రంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 40 మృతదేహాలు గుర్తించారు. -
ప్రతికూల వాతావరణమే ముంచింది!
జకార్తా: ప్రతికూల వాతావరణం కారణంగానే ఎయిర్ ఆసియా విమానం కూలిపోయిందని ఇండోనేసియా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ భయానక ఘటన గల కారణాన్ని ఇండోనేసియా తొలిసారి అధికారికంగా ప్రకటించింది. విమానం అదృశ్యమవడానికి ముందున్న సమాచారం ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చింది. ప్రతికూల వాతారణ ప్రభావం విమాన ఇంజిన్ పై పడడంతో ప్రమాదం జరిగివుండొచ్చని ఇండోనేసియా మెటరాలజీ, క్లైమటాలజీ, జియోఫిజిక్స్ ఏజెన్సీ(బీఎంకేజీ) పేర్కొంది. కాగా, జావా సముద్రం నుంచి ఆదివారం నాలుగు మృతదేహాలు వెలికితీశారు. ఇప్పటివరకు 34 మృతదేహాలు వెలికితీశారు. గత ఆదివారం నుంచి ఇండోనేసియాలోని సురయ నుంచి 162 మందితో సింగపూర్ వెళుతూ ఎయిర్ ఆసియా విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. -
సముద్రంలో 'ఎయిర్ ఏషియా' భారీ శకలాలు
జకార్తా: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియాకు చెందిన రెండు భారీ శకలాలను గత అర్థరాత్రి గుర్తించినట్లు ఇండోనేసియా ఉన్నతాధికారి శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. సముద్రంలో దాదాపు 90 మీటర్ల అడుగు భాగంలో వీటిని గుర్తించినట్లు తెలిపారు. వాటిని వెలికి తీసేందుకు ఈ రోజు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గత ఆదివారం 162 మంది ప్రయాణికులతో ఇండోనేసియాలోని రెండో అతిపెద్ద నగరం సురబయ్య నుంచి సింగపూర్ బయలుదేరిన విమానం జావా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 162 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో 155 మంది ప్రయాణికులు కాగా, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 30 మృతదేహలను సముద్రం నుంచి వెలికితీశారు. -
'సీటు బెల్టు కారణంగానే...'
జకార్తా: ఎయిర్ ఆసియా విమాన ప్రమాదంలో మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. శుక్రవారం 30 మృతదేహాలు వెలికి తీశారు. సీటు బెల్టు పెట్టుకుని కూర్చున్నవారు కూర్చున్నట్టుగా మృతి చెందిన వారి ఐదు మృతదేహాలు వెలికితీసిన వాటిలో ఉన్నాయి. ప్రతికూల వాతావరణంతో జావా సముద్రం నుంచి మృతదేహాలు వెలికితీయడం కష్టసాధ్యమవుతోంది. మరోవైపు సీటు బెల్టు కారణంగా మృతదేహాలు నీటిపైన తేలడం లేదని సహాయక సిబ్బంది తెలిపారు. సీటు బెల్టు పెట్టుకుని మృతిచెందిన వారిని వెలికి తీయడానికి కష్టపడాల్సివస్తోందని పేర్కొన్నారు. సహాయక సిబ్బంది ముందు ప్రధానంగా రెండు సవాళ్లు ఉన్నాయి. ముందుగా విమాన ప్రధాన శకలాన్ని కనుగొనడం, బ్లాక్ బాక్స్ లేదా ఫ్లైట్ రికార్డర్ ను గుర్తించడం. ఇండోనేసియా సురయ నుంచి సింగపూర్ వెళుతూ ఎయిర్ విమానం ఆదివారం జావా సముద్రంలో కూలిన సంగతి తెలిసిందే. ఇందులో ఉన్న 162 మంది జలసమాధి అయ్యారు. -
బ్లాక్ బాక్స్ కోసం మరో వారం అగవలసిందే!
జకార్తా/సింగపూర్: సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్ కోసం మరో వారం రోజులు ఆగవలసిందేనని ఇండోనేషియా అధికారులు చెప్పారు. ఆ బ్లాక్ బాక్స్ లభిస్తే ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. మలేసియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం క్యుజడ్ 8501 కూలిపోయిన ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవని అధికారులు తెలిపారు. విమాన ప్రయాణికుల మృతదేహాల కోసం ఐదో రోజు గురువారం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రెస్క్యూ టీమ్స్ సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. విమానంలో 162 మంది ఉండగా, ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు సాధ్యం కావడంలేదు. భారీ వర్షం, పెనుగాలులు, దట్టమైన మేఘాల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బలమైన అలల వల్ల విమాన శకలాలు ప్రమాద స్థలి నుంచి కొట్టుకుపోయాయి. -
‘విమానం’.. విషాదాంతం
-
‘విమానం’.. విషాదాంతం
* సముద్రంలో కూలిన ఎయిర్ ఆసియా విమానం * తేలుతూ కనిపించిన మృతదేహాలు, విమాన శకలాలు * మూడు మృతదేహాల వెలికితీత * అలలతో గాలింపునకు ఆటంకం జకర్తా/సింగపూర్: ఎయిర్ ఆసియా విమాన అదృశ్య ఉదంతం విషాదాంతమైంది. అందులో ప్రయాణిస్తున్నవారి కుటుంబ సభ్యులు, బంధువుల ప్రార్థనలు ఫలించలేదు. ఆ విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లు మంగళవారం నిర్ధారణ అయింది. గాలింపు సిబ్బందికి జావా సముద్రజలాలపై బోర్నియోకు దగ్గరలో ఆ విమాన శకలాలు, ఉబ్బిపోయిన కొన్ని మృతదేహాలు కనిపించాయి. ఆదివారం ఉదయం ఇండోనేసియా నుంచి సింగపూర్‌కు వెళ్తున్న ఎయిర్‌బస్ సురబయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కాసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయి అదృశ్యవడం తెలిసిందే. ఏడుగురు సిబ్బంది సహా మొత్తం 162 మంది ఆ విమానంలో ఉన్నారు. వారిలో 149 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఇండోనేసియా వారే. అప్పటినుంచి మలేసియా, సింగపూర్, ఆస్ట్రేలియాల సహకారంతో ఇండోనేసియా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. గాలింపులో 30 నౌకలు, 15 విమానాలు, 7 హెలికాప్టర్లు పాలు పంచుకున్నాయి. అయితే, ఇప్పటికీ ప్రమాద కారణం మిస్టరీగానే ఉంది. ఇప్పటివరకు 3 మృతదేహాలను(ఇద్దరు పురుషులు, ఒక మహిళ) మాత్రమే వెలికితీశామని, అంతకుముందు ఇండోనేసియా నేవీ ప్రకటించినట్లుగా 40 మృతదేహాలను కాదని గాలింపు, సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న ఇండోనేసియా గాలింపు, సహాయక సంస్థ చీఫ్ బాంబంగ్ సొలిస్టో తెలిపారు. మరిన్ని మృతదేహాల కోసం గాలింపు కొనసాగిస్తున్నామన్నారు. ప్రతికూల వాతావరణంతో పాటు 2, 3 మీటర్ల ఎత్తున ఎగుస్తున్న అలలు గాలింపు చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. మృతదేహాల వెలికితీత కోసం ఘటనాస్థలంలోకి ఇండోనేసియా యుద్ధనౌక, అమెరికాకు చెందిన మరో విమాన విధ్వంసక నౌకలు వెళ్తున్నాయి.అంతకుముందు, ఇండోనేసియా వైమానిక దళ విమానం సెంట్రల్ కాళిమంథన్ సమీపంలోని కరిమట సంధి వద్ద జావా సముద్ర అడుగుభాగంలో విమాన ఆకారంలో ఉన్న ఒక నీడను గుర్తించింది. అక్కడే విమాన శకలాలనూ గుర్తించడంతో దాంతో ఆ ప్రాంతంలో గాలింపును కేంద్రీకృతం చేశామని తెలిపారు. అదే ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ శబ్దాన్ని, కొన్ని పేలుళ్లను విన్నామని స్థానిక జాలర్లు కూడా చెప్పారన్నారు. విషాదంలో కుటుంబ సభ్యులు ఏటీసీతో సంబంధాలు తెగిన సమయంలో విమానం ఉన్న ప్రాంతానికి దగ్గరలోని సముద్ర జలాల్లోనే విమాన శకలాలు కనిపించాయి. వాటిలో విమాన అత్యవసర ద్వారం, కార్గో డోర్, లగేజ్ బ్యాగ్ ఉన్నాయి. ఈ సమాచారం తెలియగానే మృతుల బంధువులు విషాదంలో మునిగిపోయారు. సాగరంపై తేలుతున్న మృతదేహాలను టీవీల్లో చూస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. వారికి ఇండోనేసియా అధ్యక్షుడు విడొడో, ఎయిర్ ఆసియా గ్రూప్ సీఈఓ ఫెర్నాండెజ్ సానుభూతిని వ్యక్తం చేశారు. మరో విమానానికి తప్పిన ముప్పు కాగా, మనీలా నుంచి 159 మంది ప్రయాణికులతో ఫిలిప్పీన్స్‌లోని సెంట్రల్ ప్రావిన్స్‌కు వచ్చిన ఎయిర్ఆసియా జెస్ట్ విమానం మంగళవారం బలమైన గాలుల వల్ల రన్ వే నుంచి పక్కకు వెళ్లింది. అయితే ఎలాంటి ప్రమాద ప్రమాదం జరగలేదు. సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి హొబ్బర్ట్కు వెళ్తున్న ఓ చిన్న ఓ విమానం సముద్రంలో కూలిన ఘటనలో గల్లంతైన ఇద్దరి జాడ తెలియరాలేదు. యుద్ధవిమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ జైపూర్: భారత వాయుసేన చెందిన ఓ యుద్ధవిమానం అత్యవసర పరిస్థితుల్లో మంగళవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో సంగానర్ విమానాశ్రయంలో దిగింది. ఆగ్రా నుంచి జోధ్‌పూర్‌కు వెళుతున్న ఐఎల్-76 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ ఏటీసీ అనుమతితో విమానాన్ని సంగానర్ విమానాశ్రయంలో సురక్షితంగా దించేశారు.