Jawed Habib
-
హైదరాబాద్‌లో సందడి చేసిన పాపులర్ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ (ఫొటోలు)
-
న్యూ లుక్ హెయిర్ స్టైల్స్...
-
బీజేపీలో చేరిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్
న్యూఢిల్లీ : ప్రముఖ, సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్ బీజేపీలో చేరారు. సోమవారం ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో కషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘ ఇప్పటిదాకా నేను కేశాలకు(సంరక్షణ) చౌకీదారును. ఈరోజు నుంచి దేశానికి కాపలాదారుగా మారాను’ అంటూ చమత్కరించారు. ఇక దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 110 పట్టణాలలో సెలూన్లు కలిగి ఉన్న జావేద్ హబీబ్.. దేశంలోనే అత్యంత ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందారు. సుమారు 846 అవుట్లెట్లు కలిగి ఉన్న హబీబ్ బ్రాండుకు దాదాపు 15 లక్షలకు పైగా కస్టమర్లు ఉన్నారు. కాగా దేశవ్యాప్తంగా మంగళవారం మూడో విడత ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 రాష్ట్రాల్లోని 115 లోక్‌సభ స్థానాలకు రేపు పోలింగ్ జరుగనుంది. ఇక 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పలు దఫాలుగా జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల్లోకి చేరికలు, జంపింగ్‌లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అత్యంత జనాదరణ కలిగిన సెలబ్రిటీల చేరికలే లక్ష్యంగా పార్టీ అధినాయకత్వాలు పావులు కదుపుతున్నాయి. -
హిందూ దేవతలను అవమానించారని..
హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్‌పై పోలీసులకు ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: హిందూ దేవతలను కించపరిచేలా చిత్రీకరించిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు గురువారం రెండు ఫిర్యాదులు అందాయి. హిందూ దేవతలు తన జేహెచ్ సెలూన్లో క్షవరం చేయించుకుంటున్నట్లు ప్రకటనలు ఇచ్చిన జావేద్ హబీబ్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. సైదాబాద్ ఎస్‌ఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన న్యాయవాది కె కరుణసాగర్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అడ్మిన్ ఎస్సై వెంకటేశ్వరరావు స్పందిస్తూ... ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు చేపడతామని తెలిపారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) విద్యార్థి కుమార్ సాగర్ కూడా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హిందూ దేవతలను కించపరిచి, తమ మనోభావాలను దెబ్బతీసిన జావేద్ హబీబ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు స్వీకరించిన జనరల్ డైరీ(జీడీ)లో నమోదు చేశామని, న్యాయ సలహా తీసుకుంటున్నామని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్. చంద్రకాంత్ తెలిపారు. కోల్‌కతా దినపత్రికలో తమ సంస్థ ఇచ్చిన వాణిజ్య ప్రకటనపై విమర్శలు రావడంతో జావేద్ హబీబ్ క్షమాపణ చెప్పారు. తమ అనుమతి లేకుండా భాగస్వామ్య సంస్థ ఈ ప్రకటన ఇచ్చిందని, ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కొంతమంది స్థానికులు ఈ ప్రకటన ఇచ్చారని, దీన్ని వెంటనే మీడియా నుంచి తొలగించామని జావేద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ప్రకటన కారణంగా మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని వేడుకుంది.