JCB operator
-
జోరుగా మట్టి దందా
నిజాంపేట(మెదక్): నిజాంపేటకు చెందిన ఘడీం చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. రెండు రోజులుగా చెరువులో జేసీబీతో మట్టి తీసి ట్రాక్టర్ల ద్వారా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేఉండా ఓ కాంట్రాక్టర్ చెరువు నుంచి మట్టిని తోడేస్తున్నారు. ఓ కాంట్రాక్టరు పగటి పూట అక్రమంగా మట్టిని తరలిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వింతగా ఉంది. గతంలో మట్టిని తీసిన గోతుల పక్కనే ప్రస్తు తం మట్టిని తవ్వి తీస్తున్నారు. చెరువు చివరి భాగంలో మట్టిని తీసుకుపోయేందుకు తవ్వకాలు చేపట్టడంతో పెద్ద గోతులు ఏర్పడుతున్నా యి. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న నార్లాపూర్, వెంకటపూర్(కె) గ్రామంలోని ఉన్న చెరువులల్లో చాలా వరకు పెద్ద ప్రమాదకరమైన గోతులు ఏర్పడాయి. చెరువులో జేసీబీ గోతులలో ప్రమాదాలు జరిగి ప్రాణా లకు ముప్పు వాటిల్లుతున్నా ఏ శాఖ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదని స్థానికంగా ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం మండల పరిధిలోని పలు గ్రామాల్లోని చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతులు లేకుండా చెరువుల్లో మట్టిని తోడితే అడ్డుకుంటాం. ఇప్పటి వరకు సమస్య మా దృష్టికి తీసుకురాలేదు. వెంటనే చర్యలు తీసుకుంటాం. – జైరామ్, తహసీల్దార్ -
మరో ఆపరేటర్ మృతదేహం లభ్యం
జయపురం ఒరిస్సా : కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి రాణిగుడ ప్రాంతంలో తెలింగిరి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో రాళ్ల క్వారీలో బండరాళ్లు విరిగిపడడంతో ఇద్దరు జేసీబీ ఆపరేటర్లు సజీవసమాధైన సంఘటనలో ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని సోమవారం వెలికితీశారు. మరో మృతదేహం జాడతెలియలేదు. 11 రోజులుగా యంత్రాంగం ఆపరేషన్ చేపడుతున్న నేపథ్యంలో మృతదేహాన్ని, మరో జేసీబీని రాంచీ నుంచి వచ్చిన రక్షణ దళ ఇంజనీరింగ్ బృందం వెలికితీసింది. తొలుత ఒక జేసీబీని వెలికి తీసిన సంగతి విదితమే. ఇంజినీరింగ్ బృందం బండరాళ్లను పేల్చుతున్న నేపథ్యంలో జేసీబీ కనిపించింది. దీని కిందన మృతదేహం చేయి కనిపించడంతో ఆపరేటర్ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. చేయి తప్ప మరో అవయవం కనిపించకపోవడంతో గాలింపును మరింత తీవ్రం చేసి మృతదేహాన్ని వెలికితీస్తున్నారు. అయితే రెండవ ఆపరేటర్ ఎక్కడ ఉన్నదీ ఇంతవరకు తెలియరాలేదు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. బండలను బ్లాస్ట్ చేయడంతో దరిదాపుల కు ఎవరినీ రానీయడం లేదు. కేవలం ఆపరేషన్ టీం, పోలీసులు, అధికారులు మాత్రమే పనుల ను పరిశీలిస్తున్నారు. జేసీబీ యంత్రం మట్టి, బండరాళ్ల కింద ఒక వ్యక్తి మృతదేహం కనుగొన్నారని అయితే ఆ మృతదేహం ఎవరిదో గుర్తించలేదని కొరాపుట్ కలెక్టర్ కె.సుదర్శన చక్రవర్తి వెల్లడించారు. మృతదేహాన్ని బయటకు తీసి న తరువాత ఆ మృతదేహాన్ని గుర్తించేందుకు బంధువులను అనుమతిస్తామని ఆయన వెల్లడిం చారు. సంఘటన స్థలంలో అంబులెన్స్‌తో పాటు డాక్టర్ల బృందం ఉంది. -
బైక్ ను ఢీకొన్న ట్రాక్టర్: వ్యక్తి మృతి
కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు వద్ద ఉన్న ఏషియన్ పెయింట్ షాపు వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇరిగేషన్ కాలువ పనుల్లో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్(30) అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నెల్లూరు జిల్లా కోట గ్రామానికి చెందినవాడు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.