నిజాంపేట ఘడీం చెరువులో జేసీబీతో అక్రమంగా మట్టిని తోడుతున్న దృశ్యం
నిజాంపేట(మెదక్): నిజాంపేటకు చెందిన ఘడీం చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. రెండు రోజులుగా చెరువులో జేసీబీతో మట్టి తీసి ట్రాక్టర్ల ద్వారా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేఉండా ఓ కాంట్రాక్టర్ చెరువు నుంచి మట్టిని తోడేస్తున్నారు. ఓ కాంట్రాక్టరు పగటి పూట అక్రమంగా మట్టిని తరలిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వింతగా ఉంది. గతంలో మట్టిని తీసిన గోతుల పక్కనే ప్రస్తు తం మట్టిని తవ్వి తీస్తున్నారు.
చెరువు చివరి భాగంలో మట్టిని తీసుకుపోయేందుకు తవ్వకాలు చేపట్టడంతో పెద్ద గోతులు ఏర్పడుతున్నా యి. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న నార్లాపూర్, వెంకటపూర్(కె) గ్రామంలోని ఉన్న చెరువులల్లో చాలా వరకు పెద్ద ప్రమాదకరమైన గోతులు ఏర్పడాయి. చెరువులో జేసీబీ గోతులలో ప్రమాదాలు జరిగి ప్రాణా లకు ముప్పు వాటిల్లుతున్నా ఏ శాఖ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదని స్థానికంగా ప్రజలు ఆరోపిస్తున్నారు.
అక్రమ తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం
మండల పరిధిలోని పలు గ్రామాల్లోని చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతులు లేకుండా చెరువుల్లో మట్టిని తోడితే అడ్డుకుంటాం. ఇప్పటి వరకు సమస్య మా దృష్టికి తీసుకురాలేదు. వెంటనే చర్యలు తీసుకుంటాం. – జైరామ్, తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment