JC.Prabhakar Reddy
-
అనంతలో మళ్లీ తమ్ముళ్ల మధ్య వర్గపోరు
అనంతపురం : అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ప్రభాకర్ చౌదరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ప్రభాకర్ చౌదరి ముఖ్య అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని.. ఆస్తుల విధ్వంసానికి పాల్పడతామని హెచ్చరిస్తున్నాడని డిప్యూటీ మేయర్ గంపన్న తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ సోదరుల బెదిరింపులపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. కాగా టీడీపీ నేత ప్రభాకర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిన జేసీ బ్రదర్స్‌కి మధ్య అధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదికాక అనంతపురం ఎంపీ అయిన తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డికి విషయంలో ప్రభాకర్ చౌదరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య వర్గపోరు మళ్లీ తారాస్థాయికి వెళ్లిందని సమాచారం. -
అనంత టీడీపీలో మళ్లీ రచ్చ
అనంతపురం : అనంతపురం జిల్లా టీడీపీలో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. అనంతపురం నగరంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ప్రారంభోత్సవంపై స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. నెలరోజుల్లో గాంధీ విగ్రహ ప్రారంభోత్సవంపై ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి... ప్రభాకర్ చౌదరికి హుకుం జారీ చేశారు.ఓ వేళ ఆయన ఆలా చేయకుంటే తామే ఆ విగ్రహాన్ని ప్రారంభిస్తామని జేసీ స్పష్టం చేశారు. అయినా ప్రభాకర్ చౌదరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత ప్రభాకర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిన జేసీ బ్రదర్స్‌కి మధ్య అధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదికాక అనంతపురం ఎంపీ అయిన తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డికి విషయంలో ప్రభాకర్ చౌదరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య వర్గపోరు మరో సారి తారాస్థాయికి వెళ్లిందని సమాచారం.