JD SILAM
-
మానసిక వికాసానికి క్రీడలు దోహదం
గుంటూరుస్పోర్ట్స్: క్రీడల్లో రాణించే విద్యార్థులు చదువులో కూడా ముందంజలో ఉంటారని రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి జె.డి.శీలం చెప్పారు. క్రీడలు మంచి ఆరోగ్యంతోపాటు, మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తాయన్నారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో శనివారం 60వ రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రోరల్ స్కేటింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల ఆసక్తి, ప్రతిభను గమనించి ఆ దిశగా క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి చుక్కా కొండయ్య మాట్లాడుతూ విజయనగరం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, గుంటూరు, వైజాగ్, కడప, చిత్తూరు జిల్లాల నుంచి 160 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు అండర్-11, 14, 17 బాలబాలికల విభాగాలలో పోటీలు జరుగుతాయని స్టేడియం స్కేటింగ్ కోచ్ సలామ్ చెప్పారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారును రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ పార్వతి, డీఈవో శ్రీనివాసరెడ్డి, డీఎస్డీవో వెంకటేశ్వరరావు, బాబురావు, పీఈటీలు, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక సువార్త బోధించాలి
బిషప్‌లకు కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపు సీఎస్ఐ-సినాడు కమిటీ బాధ్యతల స్వీకారం విజయవాడ, న్యూస్‌లైన్ : సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు సంఘాలకతీతంగా బిషప్‌లు సామాజిక సువార్త బోధించాలని కేంద్ర సహాయ మంత్రి జేడీ శీలం చెప్పారు. దక్షిణ ఇండియా సంఘం (చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా-సీఎస్ఐ) సినాడు నూతన కమిటీ బాధ్యతల స్వీకారోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. స్థానిక బిషప్ అజరయ్య గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో జేడీ శీలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బిషప్‌ల సందేశం గ్రామీణ ప్రాంతాలకు చేరాలన్నారు. గ్రామీణులను శక్తిమంతులుగా తీర్చిదిద్దేందుకు క్రైస్తవ మత గురువులు కృషి చేయాలని కోరారు. మంచి మనసున్న దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దేందుకు సువార్త ప్రచారం చే యాలన్నారు. క్రైస్తవ సంఘాలన్నీ కలిసి మంచి శక్తిగా ఎదగి సమర్ధ నాయకత్వాన్ని ఏర్పరచుకోవాలని చెప్పారు. సామాజిక సేవలో సైతం ముందుం డాలని ఆకాంక్షించారు. మోడరేటర్ (మహా పీఠాధిపతి)గా ఎన్నికైన కృష్ణా-గోదావరి అధ్యక్ష ఖండం బిషప్ గోవాడ దైవాశీర్వాదాన్ని దుశ్శాలువాతో సత్కరించారు. ఆర్సీఎం విశాఖపట్నం ఆర్చ్ బిషప్ మల్లవరపు ప్రకాష్ మాట్లాడుతూ మోడరేటర్‌గా ఎన్నికైన దైవాశీర్వాదంతో తనకు పదేళ్లుగా మంచి అనుబంధం ఉందన్నారు. ఆయన మోడరేటర్‌గా సీఎస్‌ఐని మరింత ముందుకు నడిపించగలరన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు మోడరేటర్‌గా వ్యవహరించిన ది మోస్ట్ రెవరెండ్ దైవకడాశం మాట్లాడుతూ సీఎస్ఐ ఆధ్వర్యాన విద్యాసంస్థలు, ఆస్పత్రుల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తాను మోడరేటర్‌గా వ్యవహరించిన రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలు సంతృప్తినిచ్చాయన్నారు. అనంతరం డెప్యూటీ మోడరేటర్ రైట్ రెవరెండ్ థామస్ కె.ఒమ్మెన్, జనరల్ సెక్రటరీ డానియేల్ రత్నాకర సదానంద, కోశాధికారి రాబర్ట్ బ్రౌన్లను ఘనంగా సత్కరించారు. చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా మహా పీఠాధిపతి పీసీ మరాండి, జబల్పూర్ బిషప్ పీసీ సింగ్, జాప్నా బిషప్ డాని యేల్ త్యాగరాజ్, సైప్రస్ బిషప్ మైకేల్ లూయిస్, నేషనల్ చర్చెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి తారానాథ్ సాగర్ ప్రసంగించారు. భక్తులు ఆలపించిన గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి 20 మంది బిషప్‌లు, 200 మందికి పైగా ప్రతినిధులు, నగర ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, వేలాది మంది భక్తులు హాజరయ్యారు.