jeedimetla Police
-
భార్య బాగోతం.. చెడు వ్యసనాలకు బానిసగా మారి, కట్టుకున్న భర్తనే!
సాక్షి, హైదరాబాద్: భర్తను చున్నీతో ఉరిబిగించి హతమార్చిన భార్యను, ఆమెకు సహకరించిన బాలికను జీడిమెట్ల పోలీసులు బుధవారం రిమాండుకు తరలించారు. సీఐ పవన్ వివరాల ప్రకారం.. సంజయ్‌గాంధీనగర్‌లో నివాసముండే సంతోష్(28), అతని భార్య రేణుక(24)లు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేష్ ఆటో నడుపుతుండగా రేణుక ఇంట్లోనే ఉండేది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెళ్లయిన సంవత్సరం తర్వాత రేణుక చెడు వ్యసనాలకు బానిసయ్యింది. రేణుక తరచూ కుల్లు దుకాణానికి వెళ్లేది. అక్కడ రేణుకకు దుండిగల్ తాండాకు చెందిన బాలిక(17) పరిచయం అయ్యింది. ఆమెను తనతో పాటు ఇంటికి తీసుకువచ్చి తనతో పాటే అక్కడే ఉంచుకుంది. ఈనెల 6వ తేదీన రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. రేణుక చేసే కొన్ని పనులకు సురేష్ అడ్డు చెప్పేవాడు. దీంతో రేణుక ఎలాగైన భర్త సురేష్‌ను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. అదే రోజు రాత్రి రేణుక, భర్త సురేష్, బాలికలు పూటుగా మద్యం సేవించారు. మత్తులోకి జారుకున్న సురేష్ మెడకు చున్నీ బిగించి బాలిక సహాయంతో హత్య చేసింది. అనంతరం ఏమి తెలియనట్లు సురేష్ మృతదేహాన్ని సంచిలో ఉంచి ఇంటి బయట పడేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణలో భార్య రేణుక, బాలిక కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. బుధవారం రేణుక, బాలికను రిమాండ్‌కు తరలించారు. చదవండి: Old City: బామ్ ఫ్యామిలీ అరాచకాలు.. యువకుడి బట్టలు తొలగించి దాడి! -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరు మహిళలను రెడ్‌హ్యండెడ్‌గా
సాక్షి, జీడిమెట్ల: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సంజయ్ గాంధీనగర్‌కు చెందిన కటకం సాయి కుమార్ ఓ గదిని అద్దెకు తీసుకొని ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సాయికుమార్‌తో పాటు ఇద్దరు మహిళలను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం సాయికుమార్‌ను రిమాండ్‌కు పంపి మహిళలిద్దరిని రెస్క్యూ హోంకు తరలించారు. చదవండి: దీపావళి ఎఫెక్ట్.. బాణాసంచా పేలుస్తూ 31 మందికి గాయాలు -
అక్క కోసం చెల్లించింది!
జీడిమెట్ల: అక్కకు నాలుగుసార్లు అబార్షన్ అయి పిల్లలు పుట్టకపోవడంతో ఆమె బాధకు చలించిన ఓ చెల్లి రాష్ట్ర ప్రభుత్వ దత్తత నియమాలు అనుసరించకుండా రూ.22 వేలకు మగ శిశువును కొన్న వ్యవహారం జీడిమెట్ల ఠాణా పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకున్న ఇద్దరితో పాటు మధ్యవర్తులు ఇద్దరిపై, మగ శిశువును అమ్మిన తల్లిదండ్రులపై జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లోని 80, 81 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్ జిల్లా కాచీపుట్లకు చెందిన దంపతులు మదన్‌సింగ్, సరిత 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి గాజులరామారం బతుకమ్మబండ ప్రాంతంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు (6 ఏళ్లు, 2 నెలలు). అడ్డా కూలి అయిన మదన్‌సింగ్ మద్యానికి అలవాటుపడ్డాడు. లాక్డౌన్ సమయంలో పని దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అయితే ఇదే సమయంలో వీరి ఇంటి పక్కనే ఉండే మహేష్, యాదమ్మలు వీరి పరిస్థితిని ఎల్లమ్మబండలో ఉంటున్న శేషు అనే మహిళకు వివరించారు. అంతకుముందే శేషు తన అక్క దేవీ పెంచుకునేందుకు ఓ బాబు కావాలని.. ఎవరన్నా ఉంటే చెప్పమని.. వీరికి చెప్పింది. అయితే మధ్యవర్తిత్వం వహించిన మహేశ్, యాదమ్మలకు కొంత డబ్బు ఇచ్చిన శేషు... మదన్ సింగ్ దంపతులకు కూడా రూ.22 వేలు చెల్లించింది. అలాగే దత్తత తీసుకున్నట్లు బాండ్ పేపర్ రాయించుకున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో వారికి 2 నెలల బాబును ఇచ్చిన సరిత.. ఆదివారం ఉదయం ఏడుస్తూ ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందని అడిగారు. దీంతో ఆమె జరిగిన విషయమంతా చెప్పడంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆ బాబును తీసుకొని వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటకు శేషు, అరవింద్ (శేషు అన్న కొడుకు) వాహనంలో వెళుతుండగా బోయిన్పల్లి, సికింద్రాబాద్ మధ్యలో జీడిమెట్ల పోలీసులు వెంబండించి పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో తన అక్కకు నాలుగుసార్లు అబార్షన్ అయిందని, పిల్లలు పెంచుకోవాలన్న ఉద్దేశంతో కొనుక్కొని తీసుకెళుతున్నామని చెప్పింది. ఆ తర్వాత మదన్‌సింగ్, సరితను కూడా జీడిమెట్ల ఠాణాకు తీసుకొచ్చారు. చట్టవిరుద్ధంగా దత్తత తీసుకున్నారని, ఇందుకు మధ్యవర్తిత్వం వహించారని, అలాగే బాబును అమ్మారని... ఇలా ఆరుగురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాబును శిశువిహార్‌కు తరలించారు. అయితే బాబును అమ్మేందుకు మధ్యవర్తిత్వం వహించిన మహేశ్, యాదమ్మలు గతంలో ఇలాంటివి ఏమైనా చేశారనే దిశగా విచారణ సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా ఇటువంటి ఉదంతాలపై కఠినంగా వ్యవహరించాలని బాలల హక్కుల సంఘం చైర్మన్ అచ్యుతారావు.. బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డిని డిమాండ్ చేశారు. -
'ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయండి'
హైదరాబాద్: తెనాలి ఎమ్మెల్యే అలపాటి రాజేంద్రప్రసాద్‌తోపాటు మరో నలుగరిపై కేసు నమోదు చేయాలని మేడ్చల్ కోర్టు జీడిమెట్ల పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వారిపై 420, 458, 471, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొంది. అలాగే కుత్బుల్లాపూర్ మాజీ కార్పొరేటర్‌తోపాటు మున్సిపల్ మాజీ కమిషనర్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఎన్నారై కాలేజీ అక్రమ అనుమతుల నేపథ్యంలో మేడ్చల్ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. -
గర్భిణిని హతమార్చిన భర్త
-
రూ.4 కోట్ల ప్రభుత్వ భూమిపై సాదత్ కన్ను
పోలీసుల విచారణలో వెలుగులోకి.. కుత్బుల్లాపూర్: హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎస్ఏ) పేరుతో అక్రమాలకు పా ల్పడిన మహ్మద్ సాదత్ అహ్మద్‌ను ఇటీవల జీడిమెట్ల పోలీసులు కస్టడీలోకి తీసుకొని భూదందాలకు పాల్పడ్డన్న ఆరోపణలపై విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జీడిమెట్ల పారిశ్రామికవాడలో సుమారు రూ.4 కోట్ల విలువ చేసే 4 వేల గజాల స్థలానికి ఎసరు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ స్థల విషయమై అప్పట్లో మండల డిప్యూటీ కలెక్టర్‌ను సైతం హ్యుమన్‌రైట్స్, యాంటీ కరప్షన్ ఆర్గనైజేషన్ పేర్లతో సాదత్ బెదిరించాడన్న విషయంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. 200 గజాల స్థలాన్ని ఓ వ్యక్తి తన భార్య పేరుపై కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి పక్కనే ఉన్న 4వేల గజాల ప్రభుత్వ స్థలంపై కన్నేశాడు. ఈ తతంగానికి సాదత్ సాయం అందించడంతో అప్పట్లో అతని వెంట తిరిగి దూరమైన కొంత మంది ఎదురు తిరిగి మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి స్థలం కబ్జా కాకుండా చూశారు. అప్పటి నుంచి వివాదాస్పదంగా ఉన్న ఈ స్థలం తనదే అంటూ తన అనుచరులతో సాదత్ పలుమార్లు అక్కడికి వెళ్లి హల్చల్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. నగరంలోని బేగంపేటకు చెందిన ఓ వ్యక్తి ఇందులో కీలక పాత్ర వహించగా అతనికి సాదత్ బాసటగా నిలిచాడని సమాచారం. మూడు రోజుల కస్టడీలో సాదత్ తాను ఎవరెవరిని ఏ విధంగా మోసగించిన విధానంతో పాటు అక్రమంగా పొందిన పట్టాల గురించి వివరించినట్టు తెలిసింది.