Jelly Bean
-
నిద్ర లేపే కొత్త ఆప్...
బస్సు లేదంటే రైలు ఎక్కగానే గుర్రుపెట్టి నిద్రపోతారు కొందరు. గమ్యస్థానాన్ని దాటిపోయినా ఇంకా నిద్రలోనే జోగే వారికోసం గూగుల్ ఓ సరికొత్త అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. జెల్లీబీన్ లేదా అంతకంటే ఆధునికమైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పనిచేసే స్మార్ట్ఫోన్లలో గూగుల్ నౌ పేరుతో ఓ ఫీచర్ ఉంటుంది. మ్యాపులతోపాటు అనేక గూగుల్ సర్వీసులు ఈ ఫీచర్లో అందుబాటులో ఉంటాయి. నిద్రలేపే ఆప్ కూడా దీని ఆధారంగానే పనిచేస్తుంది. అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్న తరువాత మీరు ఎప్పుడు బస్సు లేదా రైలు ఎక్కినా... మీరు చేరాల్సిన గమ్యమేమిటో లోడ్ చేస్తే చాలు. గూగుల్ మ్యాప్ సాయంతో దూరాన్ని, ప్రయాణ కాలాన్ని లెక్కగట్టి గమ్యస్థానం మరో అయిదు నిమిషాల్లో చేరుతామనగా అలారం మోగుతుంది. ఎంత సమయం ముందు నిద్రలేపాలో కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. -
స్మార్ట్ఫోన్ల జోరు
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెట్టింపవుతుందని శామ్సంగ్ కంపెనీ అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 4 కోట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 8 కోట్లకు పెరుగుతాయని భావిస్తున్నామని శామ్సంగ్ మొబైల్ అండ్ ఐటీ ఇండియా హెడ్ వినీత్ తనేజా చెప్పారు. భారత వినియోగదారులు కూడా ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయనున్నారన్న అంచనాలున్నాయని వివరించారు. పెరుగుతున్న జనాభా, వినియోగదారుల అభిరుచులు, నెట్, డేటా నెట్వర్క్ విస్తరణ వంటి అంశాల కారణంగా మొబైల్, ఐటీ బిజినెస్‌ల జోరు పెరుగుతోందని వివరించారు. ఇక్కడ జరుగుతున్న శామ్సంగ్ సౌత్‌వెస్ట్ ఫోరమ్ 2014లో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఆయన గెలాక్సీ నోట్ 3 నియో స్మార్ట్‌ఫోన్‌ను, రెండు ట్యాబ్లెట్లు- గెలాక్సీ ట్యాబ్ 3 నియో, నోట్ ప్రోలను ఆవిష్కరించారు. వీటితో పాటు డిజిటల్ ఇమేజింగ్ కేటగిరీలో రెండు కొత్త ఉత్పత్తులు-ఎన్ఎక్స్30 (20.3 మెగా పిక్సెల్), గెలాక్సీ కెమెరా2(16.3 మెగా పిక్సెల్)లను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. కర్వ్ ఆల్ట్రా హై డెఫినేషన్(యూహెచ్డీ) టీవీని కూడా డిస్ప్లే చేసింది. ఈ టీవీ వచ్చే నెలలో అందుబాటులోకి రావచ్చు. దీంతో పాటు గెలాక్సీ గ్రాండ్ నియో స్మార్ట్‌ఫోన్‌ను, కస్టమైజ్డ్ వాషింగ్ మెషీన్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్సంగ్ కంపెనీదే అగ్రస్థానమని సీఎంఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్ రివ్యూ వెల్లడించింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి భారత్‌లో 1.11 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయని ఈ రివ్యూ పేర్కొంది. -
ఓప్లస్ నుంచి ఎక్స్ఆన్ప్యాడ్ 7 ట్యాబ్లెట్
హైదరాబాద్: ఓప్లస్ కంపెనీ కొత్తగా ఎక్స్ఆన్ప్యాడ్7 ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మల్టీ టాస్కింగ్‌కు వీలుగా ఉండేలా ఈ ట్యాబ్లెట్‌ను రూపొందించామని, ధర రూ.9,990 అని ఓప్లస్ కంపెనీ సేల్స్ డెరైక్టర్ రణదీప్ కుందు ఒక ప్రకటనలో తెలిపారు. 7 అంగుళాల మల్టీటచ్ ఐపీఎస్ డిస్ప్లే ఉన్న ఈ ట్యాబ్లెట్లో క్వాడ్‌కోర్ 1.2 గిగా హెట్స్ ప్రాసెసర్, 1జీబీ డీడీఆర్3 ర్యామ్, 16 జీబీ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3జీ కాలింగ్, వై-ఫై, హై స్పీడ్ 2.0 మైక్రో యూఎస్బీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. తమ ఉత్పత్తులన్నీ స్నాప్‌డీల్‌డాట్‌కామ్ ద్వారా విక్రయించడానికి ఆ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని వివరించారు.