నిద్ర లేపే కొత్త ఆప్...
బస్సు లేదంటే రైలు ఎక్కగానే గుర్రుపెట్టి నిద్రపోతారు కొందరు. గమ్యస్థానాన్ని దాటిపోయినా ఇంకా నిద్రలోనే జోగే వారికోసం గూగుల్ ఓ సరికొత్త అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. జెల్లీబీన్ లేదా అంతకంటే ఆధునికమైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పనిచేసే స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ నౌ పేరుతో ఓ ఫీచర్ ఉంటుంది. మ్యాపులతోపాటు అనేక గూగుల్ సర్వీసులు ఈ ఫీచర్‌లో అందుబాటులో ఉంటాయి. నిద్రలేపే ఆప్ కూడా దీని ఆధారంగానే పనిచేస్తుంది.
అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత మీరు ఎప్పుడు బస్సు లేదా రైలు ఎక్కినా... మీరు చేరాల్సిన గమ్యమేమిటో లోడ్ చేస్తే చాలు. గూగుల్ మ్యాప్ సాయంతో దూరాన్ని, ప్రయాణ కాలాన్ని లెక్కగట్టి గమ్యస్థానం మరో అయిదు నిమిషాల్లో చేరుతామనగా అలారం మోగుతుంది. ఎంత సమయం ముందు నిద్రలేపాలో కూడా మీరే నిర్ణయించుకోవచ్చు.